సచిన్కే బ్యాటింగ్ టిప్స్ చెప్పిన బుడతడు | Sachin Tendulkar gets batting tips from little boy | Sakshi
Sakshi News home page

సచిన్కే బ్యాటింగ్ టిప్స్ చెప్పిన బుడతడు

Published Fri, Sep 2 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

సచిన్కే బ్యాటింగ్ టిప్స్ చెప్పిన బుడతడు

సచిన్కే బ్యాటింగ్ టిప్స్ చెప్పిన బుడతడు

సచిన్ టెండూల్కర్.. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకరు. అభిమానులకు క్రికెట్ దేవుడు. సచిన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో యువకులు అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు. సచిన్ ఎందరో క్రికెటర్లకు, చిన్నారులకు బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్తో తన అనుభవాలు పంచుకుంటుంటాడు. ఇవి చాలామందికి తెలిసిన విషయాలే. ఇటీవల బ్యాటింగ్ దిగ్గజానికి వింత అనుభవం ఎదురైంది. ఓ బుడతడు మాస్టర్కే బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు!

ఆ బాలుడు సచిన్కు విలువైన సలహాలు ఇచ్చాడట. బంతిపైనే మీ దృష్టి పెట్టండి.. అంటూ ఆ బుడతడు చెప్పడంతో ఆశ్చర్యపోవడం సచిన్ వంతైంది. ఈ విషయాన్ని సచినే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. ఆ బాలుడితో కలసి సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పటి ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా ఈ బాలుడు ఎవరు? అతనితో కలసి సచిన్ ఎప్పుడు బ్యాటింగ్ చేశాడు? వంటి విషయాలను వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement