తనను పట్టించుకోవట్లేదని.. సవతి తండ్రి | father murdered the little boy | Sakshi
Sakshi News home page

తనను పట్టించుకోవట్లేదని.. సవతి తండ్రి

Published Tue, Jun 27 2017 6:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

తనను పట్టించుకోవట్లేదని.. సవతి తండ్రి - Sakshi

తనను పట్టించుకోవట్లేదని.. సవతి తండ్రి

న్యూఢిల్లీ: తనను భార్య పట్టించుకోవటం లేదని, తన కొడుకుకే ప్రాధాన్యం ఇస్తోందని కోపం పెంచుకున్న ఓ సవతి తండ్రి   ఆ బాలుడిని నిర్ధాక్షణంగా చంపేశాడు. ఈ ఘోరం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. కరావల్ నగర్ కు  చెందిన మహేష్(30) ఏడాది క్రితం కిరణ్ అనే మహిలను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇది రెండో వివాహం. మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు తండ్రి వద్దకు వెళ్లిపోగా, మూడేళ్ల వాడైన అర్జున్ కిరణ్‌తోనే ఉంటున్నాడు. రెండో భర్త మహేష్ తాగుడుకు బానిసై కుంటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. నిత్యం భార్యను హింసించేవాడు. అంతేకాక భార్య కుమారుడి బాగోగుల కోసమే సమయమంతా వెచ్చిస్తోందని, తన మాట వినటం లేదని అసంతృప్తితో ఉన్నాడు. రోజు రోజుకు అర్జున్ పై కోపం పెంచుకున్నాడు.
 

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అర్జున్‌ను తనతోపాటు బయటకు తీసుకెళ్లాడు. ఎవరు లేని ఓ ఫ్యాక్టరీ ఆవరణలో బాలుడిని తీవ్రంగా కొట్టి, ఉరి వేసి చంపాడు. మృతదేహాన్ని గుంతతీసి అందులో పాతి పెట్టి ఇంటికి తిరిగి వెళ్లాడు. భార్యతో అర్జున్ తప్పిపోయాడని చెప్పాడు. తను అర్జున్ చంపి ఫ్యాక్టరీ ఆవరణలో పాతి పెట్టిన విషయాన్ని తన బంధువు రింకుతో చెప్పి పరారయ్యాడు. వెంటనే రింకు కిరణ్ ను తీసుకుని ఫ్యాక్టరీ ఆవరణలో వెతకగా చిన్నారి మృతదేహం కనిపించింది. కిరణ్  పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆనంద్ విహార్ బస్ టెర్మినస్ వద్ద ఉన్న మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement