stepfather
-
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్‌దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్‌దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్‌దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్‌కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్‌కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్‌కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్‌దాస్ కోసం గాలిస్తున్నారు. -
మా అమ్మ ముందే ఒళ్లంతా వాతలు పెట్టాడు.
హిందూపురం అర్బన్: ‘మా అమ్మ ముందే అతను ఇనుప కడ్డీలతో నాకు ఒళ్లంతా వాతలు పెట్టాడు టీచర్... చాలా నొప్పిగా ఉంది. కూర్చోలేకపోతున్నా...’ అంటూ ఆరేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. చిన్నారిని బుజ్జగించి వివరాలు ఆరా తీయగా... ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక (6) అనే కుమార్తె ఉంది. కొంతకాలంగా అమృతకు భర్త దూరంగా ఉంటుండగా, ఆమె మణికంఠ అనే ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది.బుధవారం రాత్రి చిన్నారి చంద్రిక పరుపుపై మూత్రం పోసిందన్న కారణంతో మారుతండ్రి మణికంఠ ఇనుప చువ్వలు కాల్చి తల్లి అమృత చూస్తుండగానే బాలిక మూతి, తొడ, ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు. బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ చిన్నారి గాయాలతోనే గురువారం ఉదయం బసవేశ్వర కాలనీలోని పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న చంద్రికను గుర్తించిన ఉపాధ్యాయురాలు శిల్ప దగ్గరికి తీసుకుని పరిశీలించగా... శరీరమంతా వాతలు కనిపించాయి. టీచర్ వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హిందూపురం రూరల్ ఏఎస్ఐ జయరామిరెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మణికంఠ తనకు వాతలు పెట్టినట్లు చిన్నారి పోలీసులకు తెలిపింది. దీంతో మణికంఠపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాలికకు వాతలు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
సవతి తండ్రి పాడుపని.. బాలికను భయపెట్టి.. లొంగదీసుకుని..
సబ్బవరం (పెందుర్తి)విశాఖపట్నం: బాలికపై మారటి తండ్రే లైంగికదాడికి పాల్పడిన ఘటన సబ్బవరంలో వెలుగు చూసింది. గురువారం బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సబ్బవరం సీఐ సీహెచ్ చంద్రశేఖరరావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. చదవండి: తహసీల్దార్ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి.. సబ్బవరానికి చెందిన బాధితురాలి తల్లికి ఇద్దరు ఆడ సంతానం. తొమ్మిదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం ఆమె సబ్బవరానికి చెందిన రేషన్ డీలర్ త్రినాథ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఆమెకు మరో ఆడపిల్ల జన్మిచింది. వీరు ఐదేళ్ల క్రితం వరకు కోటపాడులో నివాసం ఉండేవారు. ఆ తరువాత సబ్బవరంలోని భర్త త్రినాథ్ సొంత ఇంట్లోకి వచ్చేశారు. ఈనేపథ్యంలో పెద్ద కుమార్తె అయిన బాలిక (13)ను పలుమార్లు భయపెట్టి తన భర్త త్రినాథ్ లొంగదీసుకున్నాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. కొంతకాలంగా.. బాలికను భయపెట్టి కొంతకాలంగా త్రినాథ్ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఏడవ తరగతి చదువుతున్న బాలికను త్రినాథ్ వేరొకచోట హాస్టల్లో చేర్పించాడు. ఆమె ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక విజయనగరంలో పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. సెలవులు పూర్తయిన తరువాత బాలిక సబ్బవరంలోని సొంతింటికి వెళ్లేందుకు భయపడుతూ నిరాకరించింది. దీంతో ఆమెను పెద్దమ్మ నిలదీయడంతో విషయం నేరుగా చెప్పలేకపోయింది. చీటిపై రాసి ఇంట్లోని ఫ్రిజ్‌పై పెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్దమ్మ వెంటనే చెల్లెలకు (బాలిక తల్లి) తెలియజేసింది. దీంతో వారు గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌కు బాలికను తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మారటి తండ్రి త్రినాథ్‌పై ఐపీసీ 376, 354 సెక్షన్ 5 (హెచ్ఎల్ఎన్),రెడ్ విత్–6, పోక్సో కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనకాపల్లి దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ మళ్ల మహేష్ కేసు విచారణ చేపట్టారు. పరిచయం ఇలా.. బాధితురాలైన బాలిక తండ్రి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. సబ్బవరంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న త్రినాథ్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. ఇలా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇంతలో బాధితురాలి తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో త్రినాథ్‌కు బాలిక తల్లితో ఏర్పడిన పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలను ఉన్న ఆమెను త్రినాథ్ వివాహం చేసుకున్నాడు. మరో ఆడ పిల్ల జన్మించడంతో వీరికి ముగ్గురు సంతానం ఉన్నారని స్థానికులు తెలిపారు. -
మైనర్‌ను గర్భవతి చేసి అబార్షన్ చేయించిన మారు తండ్రి
సాక్షి, దుండిగల్: మైనర్ బాలికని గర్భవతి చేసి అబార్షన్ చేయించిన మారు తండ్రిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్‌లో పదేళ్లుగా ఓ జంట సహజీవనం చేస్తోంది. కాగా సదరు మహిళ కుమార్తె(12)పై మారు తండ్రి కన్నేశాడు. ఈ క్రమంలో బాలికను లోబర్చుకుని గర్భవతి చేశాడు. విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని ఓ ఆర్ఎంపీ ద్వారా నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. అయితే బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బొల్లారంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అయితే విషయాన్ని గుర్తించిన సదరు ఆర్ఎంపీ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బాలికకు అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు ఇంకేమైనా చోటు చేసుకున్నాయా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
తల్లి ప్రియుడిని చంపిన యువకుడు
న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో తండ్రిలా వచ్చిన వ్యక్తి... కూతురు వరుసయ్యే తన చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండడం చూడలేకపోయిన ఓ యువకుడు... మారుతండ్రిని హత్యచేశాడు. స్థానికంగా కలకలం క్రియేట్ చేసిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. న్యూఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్లో 20 ఏళ్ల కొడుకు, 15 ఏళ్ల కూతురితో నివాసం ఉంటోంది ఓ మహిళ. ఆమె భర్త 2012లో ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఆ తర్వాత అదే ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందామె. ఫలితంగా వీరికి ఓ ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భర్తకు పుట్టిన పిల్లలతో ఆమె ఓ ఇంట్లో నివసిస్తుంటే... ఏడేళ్ల కుమారుడితో కలిసి ప్రియుడు మరో ఇంట్లో ఉండేవాడు. అయితే ప్రియురాలి ఇంటికి సమీపంలో ఓ షాపు నడిపిస్తున్న అతను, అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. బుధవారం ఆమె ఇంటికి వెళ్లిన అతను... ఒంటరిగా ఉన్న బాలికను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆమె అన్న... కూతురు వయసయ్యే బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూసి షాకయ్యాడు. తీవ్ర ఆవేశంతో అక్కడే ఉన్న కత్తిని తీసుకుని దాడి చేసి... అతన్ని కసి తీరా పొడిచి చంపాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే దాకా వేచి చూసి... తర్వాత లొంగిపోయాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో వారి తల్లి, పని మీద బయటికి వెళ్లడం విశేషం. చెల్లెలిపై అత్యాచారానికి యత్నిస్తున్న తల్లి ప్రియుడిని చూడగానే ఆవేశానికి లోనై, కత్తితో పొడిచి చంపేసినట్టు ఒప్పుకున్నాడు సదరు యువకుడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
హైదరాబాద్‌లో మారు తండ్రి పైశాచికం
-
తనను పట్టించుకోవట్లేదని.. సవతి తండ్రి
న్యూఢిల్లీ: తనను భార్య పట్టించుకోవటం లేదని, తన కొడుకుకే ప్రాధాన్యం ఇస్తోందని కోపం పెంచుకున్న ఓ సవతి తండ్రి ఆ బాలుడిని నిర్ధాక్షణంగా చంపేశాడు. ఈ ఘోరం దేశ రాజధానిలో చోటుచేసుకుంది. కరావల్ నగర్ కు చెందిన మహేష్(30) ఏడాది క్రితం కిరణ్ అనే మహిలను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇది రెండో వివాహం. మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు తండ్రి వద్దకు వెళ్లిపోగా, మూడేళ్ల వాడైన అర్జున్ కిరణ్‌తోనే ఉంటున్నాడు. రెండో భర్త మహేష్ తాగుడుకు బానిసై కుంటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. నిత్యం భార్యను హింసించేవాడు. అంతేకాక భార్య కుమారుడి బాగోగుల కోసమే సమయమంతా వెచ్చిస్తోందని, తన మాట వినటం లేదని అసంతృప్తితో ఉన్నాడు. రోజు రోజుకు అర్జున్ పై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అర్జున్ను తనతోపాటు బయటకు తీసుకెళ్లాడు. ఎవరు లేని ఓ ఫ్యాక్టరీ ఆవరణలో బాలుడిని తీవ్రంగా కొట్టి, ఉరి వేసి చంపాడు. మృతదేహాన్ని గుంతతీసి అందులో పాతి పెట్టి ఇంటికి తిరిగి వెళ్లాడు. భార్యతో అర్జున్ తప్పిపోయాడని చెప్పాడు. తను అర్జున్ చంపి ఫ్యాక్టరీ ఆవరణలో పాతి పెట్టిన విషయాన్ని తన బంధువు రింకుతో చెప్పి పరారయ్యాడు. వెంటనే రింకు కిరణ్ ను తీసుకుని ఫ్యాక్టరీ ఆవరణలో వెతకగా చిన్నారి మృతదేహం కనిపించింది. కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆనంద్ విహార్ బస్ టెర్మినస్ వద్ద ఉన్న మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మారుతండ్రి వేధింపులు తాళలేక..
పురుగుల మందు తాగి కూతురు ఆత్మహత్య గార్ల: మారు తండ్రి వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన ఓ కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శనివారం గార్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... గార్లలోని వికలాంగుల కాలనీకి చెందిన బొర్ర మంజుల మొదటి వివాహం చేసుకున్న భర్తకు బొర్ర ప్రియూంక (19) జన్మించిన అనంతరం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. అనంతరం 2002 సంవత్సరంలో బొర్ర మంజుల, బొర్ర కృష్ణారెడ్డితో రెండో వివాహం చేసుకుని గార్లలో నివాసం ఉంటుంది. వీరికి ముగ్గురు సంతానం. కాగా మొదటి భర్త కూతురు బొర్ర ప్రియూంకను మారు తండ్రి గత నెల రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేస్తూ..నీవు నాకు పుట్టలేదు.. అంటూ నానా ఇబ్బందుల పెడుతూ వేధిస్తున్నాడు. ఈ నెల 24న సైతం ప్రియూంక, తల్లి మంజులను చిత్రహింసలు పెడుతూ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియూంక శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన తల్లి హుటాహుటిన గార్ల ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స జరిపిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో మహబూబాబాద్ ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరిపిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందింది. పెళ్లీడుకొచ్చిన కూతురు తన కళ్లెదుటే చనిపోవడంతో తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భార్య మంజుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎస్ . వెంకటేశ్వరరావు భర్త కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాలికపై సవతి తండ్రి, బంధువుల అత్యాచారం
గురుదాస్‌పూర్: సవతి తండ్రి, మరో ముగ్గురు సమీప బంధువులు 14 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గతేడాదిగా ఆ అమ్మాయిపై పలుమార్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తండ్రి కాశ్మీర్ సింగ్, ఆయన తండ్రి గుల్జార్ సింగ్, ఆయన సోదరులు కుల్దీప్ సింగ్, అమృక్ సింగ్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి రెండేళ్ల క్రితం కాశ్మీర్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కలసి జీవిస్తున్నారు. -
కుమార్తెపై పెంపుడు తండ్రి, స్నేహితుల గ్యాంగ్ రేప్
27 ఏళ్ల కుమార్తెను పెంపుడు తండ్రితోపాటు అతడి ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసి అపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ సంబల్ ప్రాంతంలోని హయత్ నగర్లో చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి పెంపుడు తండ్రి చంద్రపాల్‌తోపాటు ఇద్దరు స్నేహితులు రవి శర్మ, రాంబాబులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఫ్యాక్టరీలో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న యువతిని పెంపుడు తండ్రి ప్రోద్బలంతో అతడి స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.