గురుదాస్పూర్: సవతి తండ్రి, మరో ముగ్గురు సమీప బంధువులు 14 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గతేడాదిగా ఆ అమ్మాయిపై పలుమార్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తండ్రి కాశ్మీర్ సింగ్, ఆయన తండ్రి గుల్జార్ సింగ్, ఆయన సోదరులు కుల్దీప్ సింగ్, అమృక్ సింగ్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి రెండేళ్ల క్రితం కాశ్మీర్ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కలసి జీవిస్తున్నారు.