సవతి తండ్రి పాడుపని.. బాలికను భయపెట్టి.. లొంగదీసుకుని.. | Stepfather Molestation On Girl In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సవతి తండ్రి పాడుపని.. బాలికను భయపెట్టి.. లొంగదీసుకుని..

Published Sat, Jul 9 2022 7:18 AM | Last Updated on Sat, Jul 9 2022 7:18 AM

Stepfather Molestation On Girl In Visakhapatnam - Sakshi

నిందితుడు త్రినాథ్‌ (ఫైల్‌)

సబ్బవరం (పెందుర్తి)విశాఖపట్నం: బాలికపై మారటి తండ్రే లైంగికదాడికి పాల్పడిన ఘటన సబ్బవరంలో వెలుగు చూసింది. గురువారం బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సబ్బవరం సీఐ సీహెచ్‌ చంద్రశేఖరరావు కథనం మేరకు వివరాలిలావున్నాయి.
చదవండి: తహసీల్దార్‌ కంత్రీ వేషాల్.. అమ్మాయిలను లోబరుచుకుని.. వీడియోలు తీసి..

సబ్బవరానికి చెందిన బాధితురాలి తల్లికి ఇద్దరు ఆడ సంతానం. తొమ్మిదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం ఆమె సబ్బవరానికి చెందిన రేషన్‌ డీలర్‌ త్రినాథ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఆమెకు మరో ఆడపిల్ల జన్మిచింది. వీరు ఐదేళ్ల క్రితం వరకు కోటపాడులో నివాసం ఉండేవారు. ఆ తరువాత సబ్బవరంలోని భర్త త్రినాథ్‌ సొంత ఇంట్లోకి వచ్చేశారు. ఈనేపథ్యంలో పెద్ద కుమార్తె అయిన బాలిక (13)ను పలుమార్లు భయపెట్టి తన భర్త త్రినాథ్‌ లొంగదీసుకున్నాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

కొంతకాలంగా.. 
బాలికను భయపెట్టి కొంతకాలంగా త్రినాథ్‌ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఏడవ తరగతి చదువుతున్న బాలికను త్రినాథ్‌ వేరొకచోట హాస్టల్‌లో చేర్పించాడు. ఆమె ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక విజయనగరంలో పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. సెలవులు పూర్తయిన తరువాత బాలిక సబ్బవరంలోని సొంతింటికి వెళ్లేందుకు భయపడుతూ నిరాకరించింది. దీంతో ఆమెను పెద్దమ్మ నిలదీయడంతో విషయం నేరుగా చెప్పలేకపోయింది.

చీటిపై రాసి ఇంట్లోని ఫ్రిజ్‌పై పెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్దమ్మ వెంటనే చెల్లెలకు (బాలిక తల్లి) తెలియజేసింది. దీంతో వారు గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌కు బాలికను తీసుకువెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మారటి తండ్రి త్రినాథ్‌పై ఐపీసీ 376, 354 సెక్షన్‌ 5 (హెచ్‌ఎల్‌ఎన్‌),రెడ్‌ విత్‌–6, పోక్సో కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనకాపల్లి దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ మళ్ల మహేష్‌ కేసు విచారణ చేపట్టారు.

పరిచయం ఇలా.. 
బాధితురాలైన బాలిక తండ్రి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. సబ్బవరంలో రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్న త్రినాథ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. ఇలా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇంతలో బాధితురాలి తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో త్రినాథ్‌కు బాలిక తల్లితో ఏర్పడిన పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలను ఉన్న ఆమెను త్రినాథ్‌ వివాహం చేసుకున్నాడు. మరో ఆడ పిల్ల జన్మించడంతో వీరికి ముగ్గురు సంతానం ఉన్నారని స్థానికులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement