మారుతండ్రి వేధింపులు తాళలేక.. | doughter commit to sucide for stepfather harasement | Sakshi
Sakshi News home page

మారుతండ్రి వేధింపులు తాళలేక..

Published Sun, Jun 26 2016 2:47 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

మారుతండ్రి వేధింపులు తాళలేక.. - Sakshi

మారుతండ్రి వేధింపులు తాళలేక..

పురుగుల మందు తాగి కూతురు ఆత్మహత్య
గార్ల: మారు తండ్రి వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన ఓ  కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శనివారం గార్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... గార్లలోని వికలాంగుల కాలనీకి చెందిన బొర్ర మంజుల మొదటి వివాహం చేసుకున్న భర్తకు బొర్ర ప్రియూంక (19) జన్మించిన అనంతరం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. అనంతరం 2002 సంవత్సరంలో  బొర్ర మంజుల, బొర్ర కృష్ణారెడ్డితో రెండో వివాహం చేసుకుని గార్లలో నివాసం ఉంటుంది. వీరికి ముగ్గురు సంతానం.

కాగా మొదటి భర్త కూతురు బొర్ర ప్రియూంకను మారు తండ్రి గత నెల రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేస్తూ..నీవు నాకు పుట్టలేదు.. అంటూ నానా ఇబ్బందుల పెడుతూ వేధిస్తున్నాడు. ఈ నెల 24న  సైతం ప్రియూంక, తల్లి మంజులను చిత్రహింసలు పెడుతూ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియూంక శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన తల్లి హుటాహుటిన గార్ల ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స జరిపిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో మహబూబాబాద్ ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరిపిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందింది. పెళ్లీడుకొచ్చిన కూతురు తన కళ్లెదుటే చనిపోవడంతో తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.  భార్య మంజుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎస్ . వెంకటేశ్వరరావు భర్త కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement