ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య | Arallaku todikodalla suicide | Sakshi
Sakshi News home page

ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య

Published Thu, Feb 19 2015 2:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య - Sakshi

ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య

గన్నవరం: అత్తింటి వేధింపులకు తట్టుకోలేక గర్భవతులైన తోడికోడళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.  ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం  రాజీవ్‌నగర్ కాలనీలో బుధవారం జరిగింది.  ఈ కాలనీలో నివసిస్తున్న సోదరులు నక్కా రాంబాబు (24), శివ (21)లు  అదే ప్రాంతానికి చెందిన మురళీరమణమ్మ (20), ఝాన్సీ (19)లను ప్రేమించి ఏడు నెలల కిందట  పెళ్లి చేసుకున్నారు.

తోడికోడళ్లు ఒకే ఇంట్లో సొంత అక్కాచెల్లెళ్ల మాదిరిగా కలసిమెలసి ఉండడాన్ని అత్తమామలైన భూలక్ష్మి, వెంకటేశ్వరరావు సహించలేకపోయారు. కొడుకులు కూలి పనులకు వెళ్లిన సమయంలో కోడళ్లను హింసించేవారు. అత్తమామల వేధింపులు తట్టుకోలేక రమణమ్మ మంగళవారం రాత్రి ఝాన్సీతో సహా తల్లి ఇంటికి వెళ్లింది.

తమ వేదనను ఇద్దరూ కన్నవారికి చెప్పి విలపిం చారు. తర్వాత కుటుంబ సభ్యులు సర్దిచెప్పి  అత్తవారింటి వద్ద దింపివెళ్లారు. అత్తమామల వేధింపు మరింత ఎక్కువ య్యాయి. దీంతో రమణమ్మ, ఝాన్సీ  ఇంటి ఇనుప దూలానికి ఓణీలతో ఉరేసుకున్నారు. తమ కూతళ్లను అత్తింటివారే హత్య చేశారని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement