Bullying
-
కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
కేరళ (Kerala)లోని కొచ్చిలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ యువకుడు ఎత్తైన భవనం 26వ అంతస్తులోని ఫైర్ ఎగ్జిట్ వింటోనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విపరీతమైన ర్యాగింగ్ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బలవంతంగా టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారని, నిగ్గా (నల్లగా ఉన్నాడని) అంటూ దారుణంగా వేధించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని బాధితుడి తల్లి ఆరోపించారు. విచారణ జరిపించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసింది. వేధింపులపై దర్యాప్తు చేయాలని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సహాయం కోరింది. గుండెల్ని పిండేసే విషయాలుమరోవైపు మిహిర్ అకాలమరణంపై ఐడి ఫ్రెష్ ఫుడ్స్ సీఈఓ పీసీ ముస్తఫా iD Fresh Foods CEO, PC Musthafa) స్పందించారు. మిహిర్ తన మేనల్లుడు అని సోషల్‌మీడియాలో వెల్లడించారు. నల్లగా ఉన్నాడనే కారణంగానే అతణ్ణి వేధించి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు నిగ్గుతేల్చి, తన మేనల్లుడు మిహిర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ పోస్ట్‌ను ఎక్స్ (గతంలో ట్విటర్) ఇన్‌స్టాలో పంచుకున్నారు.అలాగే మిహిర్‌తో, తన కుమారుడి కలసి చిన్ననాటి స్నాప్‌ను పోస్ట్ చేసి బాధను వ్యక్తం చేశారు. చిన్నపుడు బెంగళూరులో కలిసిపెరిగారని వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులని తెలిపాడు. కేవలం పదిహేనేళ్లకే నూరేళ్లు నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిహిర్ పాఠశాలలో, బస్సులో విద్యార్థుల గ్యాంగ్ దారుణంగా ర్యాగింగ్‌కు పాల్పడింది. శారీరకంగా దాడికి గురిచేసింది. చనిపోయేముందు రోజుకూడా మిహిర్‌ను కొట్టారు. దుర్భాషలాడారు. అవమానించారు. అతన్ని బలవంతంగా వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, టాయిలెట్ సీటును నాకమని బలవంతం చేశారు. టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నప్పుడు అతని తలని టాయిలెట్లోకి నెట్టారు. దీని తర్వాత, వారు అతన్ని 'పూపీహెడ్' అని పిలిచి ఎగతాళి చేశారు’’ అంటూ వేధింపుల తాలూకు వివరాలను పీసీ ముస్తఫా వెల్లడించారు. View this post on Instagram A post shared by Musthafa PC (@musthafapcofficial) మిహిర్ మరణించిన తర్వాత కూడా'నిగ్గా' అని సంబోధించారని, ఆ సేజ్స్చూసి చలించిపోయాయనని, చాట్ స్క్రీన్షాట్లను చదివిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయానని ముస్తఫా పంచుకున్నారు. చిన్నపిల్లాడి పట్ల ఇంత దారుణా అంటూ వాపోయారు. అందుకే ఈ దుర్మార్గుల బెదిరింపులు, ర్యాగింగ్లు లేని ప్రపంచానికి వెళ్లిపోయాడు. వాడి మరణం వృధా కాకూడదు. న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ,న్యాయం గెలుస్తుందదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని నెటిజన్లును కోరారు. తనకోసం కాదు, ఎదిగే ప్రతిబిడ్డకోసం, సురక్షితమైన వాతావరణంలో చదువుకునేందుకు తాను చేస్తున్న పోరాటంలో తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇవీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు -
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్‌ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
-
Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..
కొంతమంది చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంటారు. చేసిందితప్పు అని చెప్తే ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నచ్చచెప్పే ప్రయత్నం, శాంతంగా వివరణ ఇచ్చిన బుర్రకెక్కుదు. పైగా అలా చెప్పిన వాళ్లని తిట్టడమో! లేక వారిపై దాడి చేయడమో చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే యూఎస్‌లోని ఒక రెస్టారెంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....అమెరికాలోని బియాంకా ప్లోమెరా అనే 19 ఏళ్ల యువతి హ్యాబిట్ బర్గర్ గ్రిల్ రెస్టారెంట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అయితే అక్కగే ఒక దివ్యాంగుడు కూడా పనిచేస్తున్నాడు. కొంతమంది మగవాళ్లు సదరు దివ్యాంగుడిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ప్రారంభించారు. దీన్ని చూసిన అసిస్టెంట్ మేనేజర్ ప్లోమెరా వారిని అడ్డుకుని మీరు చేసింది కరెక్ట్ కాదు, అతను దివ్యాంగుడు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అంతే ఒక వ్యక్తి అనూహ్యంగా ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా ప్రతిదాడి చేయడం ప్రారంభించగా... మళ్లీ యువతి ఘోరంగా దాడి చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో యువతి కుడి కన్నుకి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు మాత్రం ఆమె కన్నుని కాపాడలేకపోయారు. ఫలితంగా ఆమె కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు రెస్టారెంట్ వద్దకు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, asistente. gerente de @habitburger en Mahogany en Antioch después de que ella le dijo que se fuera porque estaba acosando a un adolescente con necesidades especiales. @CaraTurky @DrZpitapita . pic.twitter.com/XTA7Pzym59 — Bunburyfan (@Bunburyfan8) November 17, 2022 (చదవండి: ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు) -
ముచ్చటగా మూడోసారి మంత్రి పదవికి రాజీనామా
లండన్: బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా కన్జర్వేటివ్ పార్టీ మాజీ చీఫ్ విప్ విండీ మోర్టాన్ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి. మాజీ మహిళా ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల మీడియాలో బహిర్గతమవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ప్రధాని అండ కారణంగానే ఆయన్ని తప్పించడం లేదంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో.. మంగళవారం విలియమ్సన్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. విలియమ్సన్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు. మూడేళ్లక్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో నేషనల్ సెక్యూరిటీ అంశంతో పాటు ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఆపై గతేడాది విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. కరోనా పరిస్థితులను హ్యాండిల్ చేయకపోవడం, స్కూళ్ల నిర్వహణ అంశాల ఆధారంగా వివాదంలో చిక్కుకుని పదవి నుంచి దిగిపోయారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తోటి సభ్యులపై దురుసుతనం ప్రదర్శించి పదవి నుంచి దిగిపోయారు. ఇదిలా ఉంటే తన రాజీనామా లేఖలో ఆరోపణల కారణంగా తప్పుకుంటున్నట్లు విలియమ్సన్ పేర్కొనగా.. రిషి సునాక్ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు వివాదాల్లో చిక్కుకున్న వాళ్లను కేబినెట్లోకి తీసుకోవడం ప్రతిపక్ష లేబర్ పార్టీ, ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి సునాక్ నిర్ణయంపై పోస్ట్‌మార్టం జరుగుతోంది అక్కడ. వివాదాలకు కేరాఫ్ అయిన వాళ్లకు కేబినెట్ పదవులు.. కట్టబెట్టడాన్ని ప్రతిపక్షం ఆయుధంగా చేసుకుంటోంది. ఇప్పటికే బ్రేవర్మన్ విషయంలో సునాక్‌పై విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు రిషి సునాక్ తీరుపై సొంతపార్టీలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
కుల వివక్ష, వేధింపులకు గురయ్యా: నటి
గత కొద్ది రోజులుగా విద్యార్థిని, విద్యార్థులు తమ పాఠశాల, కళాశాలల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, కుల వివక్ష గురించి బహిరంగంగా నోరు విప్పుతున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కళాశాలకు చెందిన కామర్స్ ఉపాధ్యాయుడిపై సదరు పాఠశాల విద్యార్థులు కుల వివక్ష, లైంగిక వేధింపుల వంటి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిగతా స్కూళ్ల విద్యార్థులు సైతం తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సినీ నటి, ‘96, మాస్టర్’ మూవీ ఫేం గౌరి కిషన్ కూడా తాను స్కూలింగ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కుల వివక్ష, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ట్విటర్ వేదికగా బుధవారం వరుస పోస్ట్స్ షేర్ చేశారు. ‘ప్రతి ఒక్కరికి చదువుతున్న రోజులు మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని భావిస్తారు. కానీ అవే రోజులు కొందరికి భయం పుట్టించేవిగా ఉండటం నిజంగా బాధాకరం. నేను కూడా అలాంటి చెదు అనుభవాలను నా స్కూలింగ్‌లో చూశాను. ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు వేల సంఖ్యల్లో ఉన్నారనే విషయం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. పాఠశాల అనేది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మైదానం కావాలి, కానీ వారి విలువలను కూల్చేసే స్థలం కాకుడదు’ అంటు ఆమె రాసుకొచ్చారు. అంతేగాక తను చదివిన ఆడయార్ హిందు సీనియర్ సెకండరీ స్కూల్ సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు. ‘ఇటీవల వెలుగు చూసిన పీఎస్‌బీబీ స్కూల్ సంఘటన మాదిరిగా నేను చదివిన అడయార్ హిందూ సీనియర్ సెకండరీ పాఠశాలలో కూడా ఇలాంటి భయంకర సంఘటనలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. విద్యార్థులపై లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్, కుల వివక్షత, వ్యక్తిత్వాన్ని కించపరడం, నిరాధారమైన ఆరోపణలు వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల వారి ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వేధింపులన్నిటిని కూడా నేను అడయార్ పాఠశాలలో స్వయంగా చూశాను, ఎదుర్కొన్నాను. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే దీనికి కారణమైన ఉపాధ్యాయుల పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి ధైర్యంగా బహిర్గతం చేయడం ద్వారా మున్ముందు పాఠశాలల సంస్కృతిలో మార్పు తీసుకువస్తాయనే ఆశిస్తున్నా. ఎందుకంటే బాల్యంలో ఇలాంటి సంఘటనలు నరకంగా ఉంటాయి. అవి గుర్తుకు వస్తనే గుండెల్లో వణుకుపుడుతుంది’ అంటు ఆమె భావోద్వేగంతో చేదు జ్ఞాపకాలను పంచుకుంది. This is with respect to the issues being brought to light in school environments which seem highly toxic and problematic! It needs to change, NOW. Please read the thread. #SpeakUpAgainstHarrasment #HinduSchoolAdyar #PSBB @Chinmayi pic.twitter.com/QXsV784x6P — Gouri G Kishan (@Gourayy) May 25, 2021 -
‘సల్మాన్ ఇంట్లో బాంబు.. దమ్ముంటే ఆపుకోండి’
సాక్షి, ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబుందని పదహారేళ్ల బాలుడు పోలీసులకు నకిలీ ఈ మెయిల్ పంపాడు. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల గెలాక్సీ అపార్ట్మెంట్లోని సల్మాన్‌ఖాన్ ఇంట్లో పెట్టిన బాంబు రెండు గంటల్లో పేలనుందని, ఆపే సత్తా ఉంటే ఆపుకోమని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఈ నెల 4న ఈమెయిల్లో సవాల్ విసిరాడు. మెయిల్ చూసిన పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి సల్మాన్ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దాదాపు నాలుగుగంటల పాటు అణువణువూ గాలించారు. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో లేరు. ఇంట్లో ఉన్న సల్మాన్ తండ్రి సలీమ్‌ను, సోదరి అర్పితను పోలీసులు ముందే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బాంబు దొరక్కపోవడంతో నకిలీ ఈ మెయిల్‌గా భావించి, మెయిల్ ఆధారంగా బాలుడిని ఘజియాబాద్ ప్రాంతవాసి(16)గా గుర్తించారు. అనంతరం పోలీసుల బృందం నిందితుడి కోసం ఘజియాబాద్‌కు వెళ్లగా, భయపడిన బాలుడు స్థానిక టిస్ హజారీ కోర్టులో దాక్కున్నాడు. దీంతో న్యాయవాది అయిన బాలుడి సోదరుడిని కలిసిన బాంద్రా పోలీసులు అతని ద్వారా బాలుడిని ఒప్పించి ఇంటికి రప్పించారు. తర్వాత పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన నోటీసును అతనికి చూపించి తమ వెంట తీసుకెళ్లి విచారించారు. విచారణలో అతను జనవరిలో ఘజియాబాద్‌లోని కబీర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఇలాంటి బెదిరింపు మెయిల్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత బాలుడిపై చార్జిషీట్ దాఖలు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని విడిచిపెట్టామని పోలీసులు వెల్లడించారు. -
నన్నే బదిలీ చేస్తావా? పెట్రోల్ పోసి తగలబెడతా
అల్లాదుర్గం (మెదక్) : ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేయడంపై ఆగ్రహించిన అంగన్వాడీ సూపర్వైజర్ కుటుంబ సభ్యులతో కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించడమే కాక, పెట్రోల్ పోసి చంపుతానని బెదిరించిన సంఘటన అల్లాదుర్గంలో సోమవారం చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీడీపీఓ సోమ శేఖరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద శంకరంపేట మండలం మల్కపూర్ సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీశైల శనివారం ఆమె భర్త వీరయ్య స్వామి, ఇద్దరు కూతుళ్లు, అల్లుడు కలిసి అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయానికి వచ్చి దాడికి యత్నించారు. తన చాంబర్లో నిర్భందించేందుకు ప్రయత్నించగా మరో గదిలోకి వెళ్లే క్రమంలో సూపర్వైజర్ కూతురు భుజం పట్టుకొని దాడి చేశారు. శ్రీశైలను రేగోడ్ నుంచి పెద్ద శంకరంపేట సెక్టార్‌కు బదిలీ చేయడంతో కక్ష కట్టి దాడికి పాల్పడింది. కుటుంబ సభ్యులతో వచ్చి పెట్రోల్ పోసి చంపేస్తామని సిబ్బంది ముందే బెదిరించింది. సోమవారం సూపర్వైజర్ కార్యాలయ ఆవరణలోనే తిరుగుతూ ఉందని, తనపై దాడి చేసేందుకు యత్నిస్తున్నట్టు సోమ శేఖరమ్మ చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కార్యాలయానికి రాగానే సూపర్వైజర్ వెళ్లిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయం ఉండడంతో పై అధికారులకు తెలియజేసి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనపై సీడీపీఓ ఫిర్యాదు మేరకు శ్రీశైల భర్త శంకరయ్య, ఇద్దరు కూతుళ్లు, అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ గంగయ్య తెలిపారు. -
మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు
తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ దీపా మోహన్ లిఖిత పూర్వకంగా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు. దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ జయచంద్రన్ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు. మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్ అసోసియేషన్ శుక్రవారం విధులు బహిష్కరించింది. -
నన్నూ, మోదీని చంపుతామంటున్నారు!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని, తనను చంపుతామని గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి హిందీలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెసేజ్‌ను శనివారం సాయంత్రం చూసినట్టు చెప్పారు. అందులో ‘‘ నేను మిమ్మల్ని, ప్రధానిని చంపాలనుకోవట్లేదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోంది. నన్ను క్షమించండ’’న్న అని పేర్కొని ఉంది. ఈ మెసేజ్ గురించి పోలీసులకు తెలియజేశానని ఆయన ఆదివారం వెల్లడించారు. కాగా, గత నెలలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముందురోజు కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి. మోదీని చంపుతామంటూ జైపూర్‌లోని బీజేపీ ఆఫీసుకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చిరునామాలోని నలుగురు వ్యక్తులను విచారిస్తే, వారికేం తెలియదని తేలిందని జైపూర్ పోలీసు డిప్యూటీ కమిషనరు యోగేశ్ దధీచ్ తెలిపారు. -
మీటూ.. ఓ బెదిరింపు ఆయుధం
‘‘ప్రొఫెషనల్ పని మీద ఇంటికి వెళ్తే నాతో తప్పుగా ప్రవర్తించాడు’’ అంటూ తమిళ నటుడు, నటి రాధిక సోదరుడు రాధారవి మీద ఓ మహిళ అజ్ఞాతంగా ఆరోపించారు. ఈ విషయంపై రాధారవి స్పందించారు.. ‘‘రేసిజం గురించి మాట్లాడటానికి అమెరికాలో మొదలైన ‘మీటూ’ ఉద్యమం మన ఇండియాలో తప్పు దారిలో నడుస్తోంది. కొన్ని రోజులైతే ‘మీటూ’ అనేది బెదిరింపు ఆయుధంలా మారిపోతుందేమో? మీటూ అనేది కేవలం స్త్రీలకే కాదు పురుషులకు కూడా. ఇలా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎవరు కరెక్టో మనం తెలుసుకోవాలి. మేం అజ్ఞాతంగా ఉంటాం కానీ మగవాళ్ల పేర్లు మాత్రం చెబుతాం అంటున్నారు. తప్పు జరిగితే వెంటనే బయటకు చెప్పాలి. 15 ఏళ్ల క్రితం ఇలా జరిగింది అని చెప్పడంలో పాయింటే లేదు. ఉద్యమం నిజమైతే నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ ‘మీటూ’ నమ్మేలా లేదు. అందుకే సపోర్ట్ చేయదలచుకోలేదు’’ అన్నారు. -
నేను వేధింపులకు గురయ్యాను : మెలానియా ట్రంప్
వాషింగ్టన్ : ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వేధింపులకు గురవతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అంటున్నారు అమెరికా ఫస్ట్ లేడి మెలానియా ట్రంప్. ఆఫ్రికా పర్యటన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెలానియా ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘నేను అత్యుత్తమంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ దాన్నే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో చర్చిస్తుంటారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు. గత వారం ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియ ఘనా, మళావి, కెన్యా , ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో, మీడాయాలో జనాలు ఆమె వస్త్రధారణ గురించే ఎక్కువగా పరహసించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మెలానియా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్లకు కూడా కోపం తెప్పించింది. అంతేకాక గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే వాక్యాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాక ఈజిప్ట్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మెలానియా మైకెల్ జాక్సన్ ఆహార్యాన్ని తలపించేలా వైట్ షర్ట్, ప్యాంట్, బ్లాక్ టై ధరించి వెళ్లారు. ఈ సందర్భంగా మెలానియా ‘నా వస్త్రధారణ గురించి కాకుండా నేను చేసిన పనుల గురించి మాట్లాడితే మంచిది’ అన్నారు. -
2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా
వాషింగ్టన్: తమ దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబేను బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. గత వారం కెనడాలో జరిగిన జీ–7 సమావేశం సందర్భంగా ట్రంప్ ఇలాంటి పలు వ్యాఖ్యలు చేశారని భేటీలో పాల్గొన్న యూరప్ దేశాల ప్రతినిధులు వెల్లడించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘యూరప్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వలసలు. షింజో, మీకు ఈ సమస్య లేదు. అందుకే మీ దేశానికి నేను 2.5 కోట్ల మెక్సికన్లను పంపిస్తా. అప్పుడిక మీరు వెంటనే పదవి కోల్పోతారు’అని ట్రంప్ అనడంతో అబే సహా అక్కడున్న నేతలంతా అసహనానికి గురయ్యారు. ఇరాన్, ఉగ్రవాదం అంశంపై ట్రంప్ మాట్లాడుతూ..‘మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి ఇమ్మానుయేల్, ఎందుకంటే టెర్రరిస్టులంతా పారిస్‌లోనే ఉన్నారు’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్నుద్దేశించి అన్నారు. అమెరికా దిగుమతులపై సుంకం పెంచిన చైనా బీజింగ్: అమెరికా నుంచి దిగుమతయ్యే దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా శనివారం సుంకాలు పెంచింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం పెంచిన మరుసటి రోజునే, గట్టి సమాధానమిచ్చేలా చైనా తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యయుద్ధం మొదలైంది. -
ఫిర్యాదుదారులపై విచారణాధికారి రుబాబు
కోటవురట్ల(పాయకరావుపేట): విచారణకు వచ్చిన అధికారి ప్రవర్తన వివాదాస్పదమైంది. నోటి దురుసుతో ఫిర్యాదుదారులపై మండి పడి, బెదిరింపు ధోరణిలో వ్యవహరించడమే కాకుండా వివరణ కోరిన పాత్రికేయులపైనా దురుసుగా మాట్లాడి కాల్ ద పోలీసు అంటూ హడావుడి చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని సమన్వయ అధికారి డాక్టర్ వడ్డి శ్రీధర్‌పై ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి ఏడాది క్రితం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో ఒకసారి విచారణకు హాజరు కావాలని ఎంపీపీ వరహాలమ్మకు, జెడ్పీటీసీ వెంకటలక్ష్మికి విచారణాధికారి నోటీసులు పంపించి, విచారణ జరిపేందుకు ఆ అధికారి రాలేదు. మళ్లీ బుధవారం విచారణకు వస్తున్నట్టు నోటీసులు పంపడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ హాజరయ్యారు. విచారణాధికారిగా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరై మొదటి నుంచి దురుసుగా ప్రవర్తించారు. సుమారు గంట సేపు ఫిర్యాదుదారులైన ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మితో మాట్లాడి వారి వాదన నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పలువురు మండల స్థాయి అధికారులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం గదిలో నుంచి బయటకు రాగానే పాత్రికేయులు వివరణ కోరారు. పాత్రికేయులకు సమాధానమివ్వకుండా పశుసంవర్ధక శాఖ సిబ్బందిపై డీడీ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఒరేయ్ గేటు, తలుపులు వేసేయ్..ఎవడు పడితే వాడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు’ అంటూ మండిపడ్డారు. వివరాలు తెలపాలని పాత్రికేయులు కోరగా అవసరం లేదు, ఇక్కడి నుంచి పోతారా పోలీసులను పిలవాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదిక కలెక్టర్‌కు ఇస్తాను.. ఎట్టకేలకు విచారణాధికారి శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడారు. విచారణ పూర్తయిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కోర్టును ఆశ్రయిస్తాం.. విచారణాధికారి శ్రీనివాసరావు మాతో ఆగ్రహంగా మాట్లాడారని, మహిళా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ మండల సమన్వయ అధికారికి వత్తాసు పలికేలా వ్యవహరించారని ఎంపీపీ వరహాలమ్మ, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి ఆరోపించారు. మీవి తప్పుడు ఆరోపణలఅంటూ మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఫిర్యాదు గురించి వివరిస్తూ మండల సమన్వయ అధికారి వడ్డి శ్రీధర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ కక్షతో తమకు పథకాల సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సమావేశాలకు పిలవకుండా అవమానపరుస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు మంజూరయ్యేలా చూస్తున్నారన్నారని, తనిఖీల పేరిట కింది స్థాయి ఉద్యోగులను బెదిరిస్తున్నారని, సొంత విధులు నిర్వహిండమానివేసి, మండలంపై పెత్తనం చెలాయించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. దీంతో ఫిర్యాదు చేశామన్నారు. అయితే విచారణాధికారి శ్రీనివాసరావు తమ శాఖాధికారైన ఏడీని కాపాడే ధోరణిలోనే వ్యవహరించారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ రౌడీయిజం పెరిగిపోతోంది
నల్లగొండ టౌన్ : జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల రౌడీయిజం పెరిగిపోతోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాదయ్యను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించి కారణాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఆహ్మహత్యాయత్నా నికి పాల్పడినట్టు తెలిపారు. కాలువ నీటి విషయంలో జరిగిన తగాదాలో యాదయ్యను టీఆర్ఎస్ నా యకులు కొట్టి బెదిరించారని ఆరోపించారు. కాలువలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెల్వదని, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల పేరుతో డబ్బులను సంపాదించే పనులకు పరిమితమాయ్యరన్నారు. ప్రగతిభవన్ వదిలి వెళ్లని ముఖ్యమంత్రికి రైతుల సమస్యలు ఎలా తెలు స్తాయని ప్రశ్నించారు. యాదయ్యకు ఏమైనా జరిగి తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావులే బాధ్యత వహించాలన్నారు. ఆయన ను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నా యకులు పాశం సంపత్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గు మ్ముల మోహన్‌రెడ్డి, జూకూరు రమేష్, తఖీ, అల్లి సు భాష్యాదవ్, సట్టు శంకర్ కిన్నెర అంజి ఉన్నారు. -
టీడీపీ బెదిరింపులకు భయపడేదేలేదు..
-
కొత్త ఎంఈఓలపై ‘అధికార’ పెత్తనం!
అనంతపురం: ‘నాకు తెలీకుండా, మాట కూడా చెప్పకుండా నా నియోజకవర్గంలో ఎలా ఎంఈఓగా చేరతావు. చేరకూడదు అంతే. పొరబాటున చేరితే నీ ఇష్టం...’ ఇదీ ఓ మండల విద్యాశాఖ అధికారికి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరింపు. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ శాఖల అధికారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆ ఎంఈఓ అక్కడ చేరే సాహసం చేయలేదు. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో ఎంఈఓలను విధుల్లో చేరకుండా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. సీనియార్టీ ఆధారంగా ఈ నెల 26న కడపలో కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఈఓ పోస్టులను భర్తీ చేశారు. అయితే గతంలో ఇన్ చార్జ్ ఎంఈఓలుగా పని చేసిన హెచ్ఎంలు కొందరు వారికి అనుకూలంగా ఉండడడంతో తిరిగి వారిని ఎంఈఓ పోస్టులో కూర్చొబెట్టాలని కొత్తవారిని విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నారు. సీనియార్టీ ఆధారంగా తమను ఎంఈఓ పోస్టుల్లో నియమించారని చెప్పుకున్నా అధికార పార్టీ నాయకులు వినే పరిస్థితుల్లో లేరు. ముదిగుబ్బ, శింగనమల, గాండ్లపెంట, నల్లచెరువు, నల్లమాడ, ఆమడగూరుతో పాటు మరికొన్ని మండలాల్లో విద్యాశాఖ అధికారులు విధుల్లో చేరలేదు. మరోవైపు అధికారులేమో ఆయా ఎంఈఓలపై విధుల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. -
యువతి న్యూడ్ ఫోటోలు కావాలంటూ వేధింపులు
-
ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..
లండన్: ఉద్యోగ జీవితంలో బాస్‌తో, సహచరులతో గొడవలు పడే అలవాటు ఉందా. ఒకవేళ ఉంటే.. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వర్క్ ప్లేస్‌లో గొడవల విషయంలో మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల స్పందించే తీరు వేరు వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. వర్క్ ప్లేస్‌లో గొడవలు పడే పురుష ఉద్యోగులు ఆ ఉద్యోగాన్నే వదిలేయడానికి మొగ్గుచూపుతారని.. అదే మహిళలు మాత్రం కొన్నాళ్లు సిక్ లీవ్‌లో వెళ్లడం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడటం చేస్తుంటారని డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సుమారు 3000 మంది అభిప్రాయాలు తీసుకోగా.. వీరిలో ఏడు శాతం మంది తాము వర్క్‌ప్లేస్‌లో గొడవల బాధితులమే అని వెల్లడించారు. ఈ బాధితుల్లో 43 శాతం మంది పురుషులు ఉన్నారు. కాగా.. వర్క్ ప్లేస్‌లో గొడవలు పురుషుల ప్రమోషన్లు, జీతాలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ముంజెర్గ్ ఎరిక్సన్ వెల్లడించారు. గొడవలతో పురుషులు సిక్ లీవ్‌లకు వెళ్లడం మాత్రం జరగదని ఆమె పేర్కొన్నారు. వర్క్‌ప్లేస్‌లో గొడవల మూలంగా కీలకమైన బాధ్యతలు కాకుండా అంతగా ప్రాధాన్యత లేని బాధ్యతలు ఉద్యోగులు పొందుతారని పరిశోధనలో గుర్తించారు. -
రూ.50 లక్షలు ఇస్తారా.. ఆస్పత్రిని పేల్చేయమంటారా?
మావోయిస్టుల పేరిట బెదిరింపు.. ఇద్దరిని పట్టుకున్న పోలీసులు జవహర్‌నగర్: మావోయిస్టు శీనన్న పేరుతో ఓ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెది రించిన ఇద్దరిని రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. బుధవారం కీసర మండలం దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రి మేనేజర్ క్యాబిన్లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తుపాకీతో బెదిరించి ఆస్పత్రి ఎండీ డాక్టర్ రవీంద్రకుమార్‌ని కలవాలని, మావోయిస్టు శీనన్న ఫోన్ చేశాడని చెప్పమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రి ఎండీ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం కూడా సదరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి మేనేజర్‌ను కలిశారు. రవీంద్రకుమార్ వెంటనే రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆస్పత్రిని పేల్చేసి ఆయనను ఛత్తీస్‌గఢ్ అపహరించుకుపోతామని బెదిరించారు. ఇక్కడే ఇస్తే రూ.50 లక్షలు అవుతుందని, డాక్టర్‌ను తాము తీసుకెళ్తే రూ.2 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌కుమార్ చాకచక్యంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నయీమ్ బాటలో..!
వ్యాపారికి ఇద్దరు విద్యార్థుల బెదిరింపు కోదాడ అర్బన్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు.. నయూమ్‌ను ఆదర్శంగా తీసుకుని వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్‌కు చెందిన కొల్లు గోపాల్‌రెడ్డి స్థానిక ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి స్నేహితుడి తమ్ముడైన పత్తేపురం నాగరాజు నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. గోపాల్‌రెడ్డి, నాగరాజులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారు. నయీమ్ తరహాలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. నయీమ్ భువనగిరికి చెందిన ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కాల్ రికార్డును విని, ఎలా బెదిరింపులకు పాల్పడాలో తెలుసుకున్నారు. శాంతినగర్‌లో ఇటుకల వ్యాపా రం నిర్వహించే మల్లెల పూర్ణచందర్‌రావుకు ఫోన్ చేశారు. ‘నేను భాయ్‌ని మాట్లాడుతున్నా.. నాకు పది లక్షలు ఇవ్వాలి.. లేకుంటే నీ కుమార్తెతో పాటు కుటుంబసభ్యులను చంపుతాం’’ అని బెదిరించారు. దీంతో పూర్ణచందర్రావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు, వారి కాల్ డేటా ఆధారంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. -
అహంభావం వద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్న వారికి అహంభావం పనికిరాదని శని వారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడడమంటే విపక్షాల గొంతును నొక్కే ప్రయత్నం చేయడమేనన్నారు. ఇటువంటి బెది రింపులు, కేసుల విషయంలో ఇటీవల తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు నష్టమన్నారు. తక్కువ వ్యయంతో పూర్యయ్యే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై అందరితో చర్చించి విధివిధానాలను రూపొందించుకోవాలని సూచించారు. -
మా ప్లాట్లు ఆక్రమించారు..
పోలీసులకు నయూమ్ బాధితుల ఫిర్యాదు భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని అనుచరులు తమ ప్లాట్లను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడినట్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారి శ్రీధర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి, మౌలాలి, రాంనగర్, శంషాబాద్‌తోపాటు భువనగిరి, యాదగిరిగుట్టకు చెందిన 25 మంది ఈ సందర్భంగా మాట్లాడారు. భువనగిరిలో ఉన్న సర్వే నంబర్లు 722, 723, 724, 726, 727, 728, 731, 732లలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనర్సింహనగర్ వెంచర్‌లోని ప్లాట్లను తాము 1996లో కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్కో ప్లాటు 300 గజాల చొప్పున ఉందనీ, తాము అప్పులు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను నయీమ్, అతని అనుచరులు 2006లో ఆక్రమించారని వారు ఆరోపించారు. తమకు కనీసం సమాచారం లేకుండా ప్లాట్ల హద్దులను తొలగించి స్వాధీనం చేసుకుని కొత్తగా లే-అవుట్ చేసినట్లు తెలిపారు. ఇదేమిటని బాధితులమంతా పలుమార్లు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా నయీమ్ అనుచరులు పాశం శ్రీనుతోపాటు పలువురు తమపై బెదిరిం పులకు పాల్పడినట్లు ఆరోపించారు. అరుు నా తాము వారిని ఏమీ చేయలేక పోయామన్నారు. నయీమ్ ఆక్రమణల్లో ఉన్న తమ ప్లాట్లను మళ్లీ తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేదలను మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బాధితులు ఆర్.శ్యాంకుమార్, బి.శ్రీసాయిరాం, బి.బాలయ్య, ఆర్.సత్యనారాయణగౌడ్, కె.రమేష్, కె.సురేష్, కె.కె.చారి, మనోహర్‌గౌడ్, పి.పాండు, కిష్టయ్య, వీవీ.రాజు, పి.పాండు, ఎ.సత్యనారాయణ, వి.దేవేంద్రమ్మ, వెంకటేష్ ఉన్నారు. -
ఇస్తారా.. చస్తారా?
తలపై తుపాకులు.. మెడపై కత్తులు పెట్టి బెదిరింపు మహేశ్వరం: ‘ఈ భూమిపై భాయ్‌సాబ్ కన్నుపడింది. మర్యాదగా వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి. భూమి ఇస్తారా.. చస్తారా? అనేది మీరే తేల్చుకోండి’ అని గ్యాంగ్‌స్టర్ నయూమ్ అనుచరులు కొంతమంది రైతులను హెచ్చరించారు. కిడ్నాప్ చేసి తలపై తుపాకులు, మెడపై కత్తులు పెట్టి బెదిరించారు. ఏకంగా 33 ఎకరాల 04 గుంటల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రైతులు.. నయీమ్ అనుచరులు తమ భూములు స్వాధీనం చేసుకున్న విషయాన్ని శుక్రవారం వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని వారు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ పంచాయతీ శ్రీనగర్ గ్రామానికి చెందిన రామిరెడ్డి, పాపిరెడ్డి, అంజన్ రెడ్డి, అమరావతి, జైపాల్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు ఆరుగురు అన్నదమ్ములు. వీరి పెద్దమ్మ అనంతమ్మలకు శ్రీనగర్ గ్రామం శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే సర్వే నెంబర్ 242లో నాలుగెకరాల 37 గుంటలు, 243-2లో 2 ఎకరాల 25 గుంటలు, 244-2లో 5 ఎకరాల 23 గుంటలు, ఇమాంగూడ రెవెన్యూలో సర్వే నెంబర్ 54లో 11 ఎకరాల 25 గుంటలు, 218లో 8 ఎకరాల 14 గుంటలతో కలిపి సుమారు 33 ఎకరాల 04 గుంటల భూమి తాత ముత్తాతలు సంపాదించి ఇచ్చారు. 2005 డిసెంబర్లో నయీమ్ అనుచరుడు శ్రీధర్ అలియాస్ శ్రీకాంత్ సహా మరి కొంతమంది పొలం వద్దకు వచ్చి ‘పొలంపై భాయ్‌సాబ్ కన్ను పడింది. ఈ పొలాన్ని వదిలి వెళ్లి తమకు అప్పగించడని బెదిరించారు. నయీమ్ అనుచరులు శ్రీధర్, సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్‌లు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీనగర్ రైతుల ఇంటి వద్దకు వచ్చి 20 మంది పట్టాదారు రైతులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. గన్లు పిస్టళ్లు, మెడపైన కత్తులు పెట్టి సామ సంజీవరెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, రవిప్రసాద్, నర్సింహారావు, ఆరీఫ్‌అలీ, హసీనాబేగం, మహ్మద్ అరీఫ్, సలీమా బేగం, తాహేరాబేగంల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నయీమ్ అనుచరులు కాజేసిన తమ భూమిని ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మారుతండ్రి వేధింపులు తాళలేక..
పురుగుల మందు తాగి కూతురు ఆత్మహత్య గార్ల: మారు తండ్రి వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన ఓ కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన శనివారం గార్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... గార్లలోని వికలాంగుల కాలనీకి చెందిన బొర్ర మంజుల మొదటి వివాహం చేసుకున్న భర్తకు బొర్ర ప్రియూంక (19) జన్మించిన అనంతరం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు. అనంతరం 2002 సంవత్సరంలో బొర్ర మంజుల, బొర్ర కృష్ణారెడ్డితో రెండో వివాహం చేసుకుని గార్లలో నివాసం ఉంటుంది. వీరికి ముగ్గురు సంతానం. కాగా మొదటి భర్త కూతురు బొర్ర ప్రియూంకను మారు తండ్రి గత నెల రోజుల నుంచి చిత్రహింసలకు గురి చేస్తూ..నీవు నాకు పుట్టలేదు.. అంటూ నానా ఇబ్బందుల పెడుతూ వేధిస్తున్నాడు. ఈ నెల 24న సైతం ప్రియూంక, తల్లి మంజులను చిత్రహింసలు పెడుతూ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రియూంక శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన తల్లి హుటాహుటిన గార్ల ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స జరిపిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో మహబూబాబాద్ ఏరియూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరిపిస్తుండగా తెల్లవారు జామున మృతి చెందింది. పెళ్లీడుకొచ్చిన కూతురు తన కళ్లెదుటే చనిపోవడంతో తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భార్య మంజుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎస్ . వెంకటేశ్వరరావు భర్త కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పోకిరి వేధింపులు, విద్యార్థిని ఆత్మహత్య
పోకిరి వేధింపులు తాళలేక ఓ డిగ్రి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లిలో గురువారం జరిగింది. గుండిగానిపల్లికి చెందిన లక్ష్మీని అదే గ్రామానికి చెందిన ఓ పోకిరి వేధిస్తున్నాడు. ఎన్ని సార్లు మందలించినా మానుకోలేదు. దీంతో త్రీవ మనస్తాపంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇక్కడ పనిచేయలేం!
మహిళా వైద్యులన్న గౌరవమే లేదు వీఆర్ఎస్ తీసుకున్న ప్రసూతి విభాగాధిపతి అదే బాటలో మరికొందరు వైద్యులు ఇదీ ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి విజయవాడ (లబ్బీపేట) : వారంతా సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్నవారు. అలాంటివారిని నిత్యం వేధించడం, అమర్యాదకరంగా వ్యవహరించడం, మాట్లాడడం చేస్తుంటే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధుల తాలూకా అంటూ ఒకరు.. మంత్రి కార్యాలయం నుంచి అంటూ మరొకరు.. అభివృద్ధి కమిటీ పేరు చెప్పి ఇంకొకరు.. ఇలా ఎవరు పడితే వారు మహిళా డాక్టర్లకు ఫోన్లు చేసి ఏకవచనంతో మాట్లాడడంతో మనస్తాపానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడంకన్నా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రసూతి విభాగాధిపతి వీఆర్ఎస్పై వెళ్లిపోగా, మరికొందరు వైద్యులు అదే బాటపడుతున్నారు. అభివృద్ధి కమిటీ పేరుతో దబాయింపు ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో వైద్య రంగంపై ఏమాత్రం అవగాహన లేని సభ్యులను నియమించడంతో వారితో వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒక సభ్యుడు నిత్యం ఏదో ఒక విభాగానికి వె ళ్లడం ..నేనెవరో తెలుసా.. ఉద్యోగం చేయాలని లేదా? అంటూ వైద్యుల నుంచి నర్సింగ్., నాలుగో తరగతి సిబ్బంది వరకు బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. పురుషులకు ప్రవేశం లేని లేబర్ వార్డుకు సైతం వెళ్లి దబాయిస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. సౌకర్యాల గురించి పట్టించుకోరు ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల రక్తపరీక్షలు నేటికీ అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి రక్తపరీక్షలు చేయాలన్నా, స్కానింగ్ తీయాలన్నా బయటకు వెళ్లాల్సిందే. దీని గురించి ఒక్క నాయకుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రసూతి విభాగాన్ని ఆరు యూనిట్లు చేయాలని మొరపెట్టుకున్నా ఒక్క నాయకుడూ స్పందించలేదు. కేవలం 40 పడకలు కొనుగోలు చేసి చేతులు దులుపుకొన్నారు. వైద్యులు, సిబ్బంది ఎక్కడి నుంచి వస్తారో నాయకులకే ఎరుక. అసలు వైద్యంపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించినప్పుడే ప్రభుత్వ తీరు అర్థమయిందని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేయడం కంటే రాజీనామా చేసి వెళ్లిపోవడమే మేలనే నిర్ణయానికి వైద్యులు వచ్చేసినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్దీ అదే పరిస్థితి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ డెరైక్టర్ హోదాలో ఉన్నవారు పనిచేస్తుంటారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ సూర్యకుమారికి సైతం అడ్మినిస్ట్రేషన్‌లో 25 ఏళ్ల అనుభవం ఉంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా యూరాలజిస్ట్. మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పరిస్థితి కూడా అలాగే మారింది. ఒక దశలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆమె వెళితే ఆ సీట్లో కూర్చునేందుకు ఏ ఒక్కరూ సిద్ధపడే పరిస్థితి లేదు. మూడేళ్ల కిందట నెలలో ముగ్గురు సూపరింటెండెంట్లు మారిన చందంగా మళ్లీ ఆస్పత్రి పరిస్థితి తయారవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్లలో ఏ ఒక్కరూ ఆ సీట్లు కూర్చునేందుకు ఆసక్తి చూపడంలేదు. నిత్యం తిట్ల దండకం ‘నేనెవరో తెలుసా..ఏం మాట్లాడుతున్నావ్..ఉద్యోగం చేయాలని లేదా...’ అంటూ మహిళా వైద్యురాలు అని కూడా చూడకుండా ఫోన్లో బెదిరింపు ధోరణులు. ‘ఏమిటి.. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా..’ అంటూ తిట్లపురాణం..ఇలా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మహిళలతో పాలకులు ఏకవచనంతో మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. మంత్రిగారి పేషీ అంటూ ఒకరు.. ఎమ్మెల్యే తాలూకా అంటూ మరొకరు నిత్యం ఫోన్లు చేస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై వైద్యులు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇలాంటి వేధింపులు ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.5 కోట్లు... అదే ఫైనల్
♦ తండ్రికి ఫోన్ చేసి బెదిరించిన అభయ్ కిడ్నాపర్ ♦ అంత డబ్బు లేదని వేడుకున్న బాలుడి తండ్రి ♦ సికింద్రాబాద్ రావాలని చెప్పిన దుండగుడు సాక్షి, సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్ పరిధి నుంచి రాజ్‌కుమార్ కుమారుడు అభయ్‌ను బుధవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన దుండగులు అతడి తండ్రితో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడారు. రాత్రి 10.05 గంటలకు తొలి ఫోన్‌కాల్ రాగా... 11.14 గంటలకు రెండో కాల్ వచ్చింది. డబ్బు డిమాండ్ చేస్తూ కిడ్నాపర్ రెండోసారి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ రికార్డు మీడియాకు అందింది. 2.31 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియో ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో రెండుచోట్ల పాత సంభాషణలు మరోసారి వినిపించడం... స్పష్టమైన ముగింపు లేకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అటు హిందీ, ఇటు ఉర్దూ సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయాడు. దీన్ని బట్టి మరో వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి రాజ్ కుమార్, కిడ్నాపర్ల మధ్య సంభాషణ ఇదీ... తండ్రి: హలో... కిడ్నాపర్: హలో... తండ్రి: హాజీ... (చెప్పండి) కి: బోలేనా దస్ కరోడ్ హోనా బోల్కే (రూ.పది కోట్లు కావాలని చెప్పానుగా) తం: కిత్తా పైసే బోలే సాబ్? (ఎంత మొత్తం చెప్పారు సార్?) కి: దస్ కరోడ్ (రూ. పది కోట్లు) తం: ఆప్ కౌన్ బోల్రే భయ్యా? (మీరు ఎవరు మాట్లాడుతున్నారు భయ్యా) కి: కిడ్నాపర్ బోల్రా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా) తం: హా..! (ఆ..!) కి: కిడ్నాపర్ బోల్ రహా హు (కిడ్నాపర్‌ని మాట్లాడుతున్నా) తం: హమారీసే క్యా దుష్మనీ హైసాబ్? (మాతోం ఏం శత్రుత్వం ఉంది సార్?) కి: ---- (ఫోన్ డిస్ట్రబెన్స్ వచ్చింది) తం: హా సాబ్... ఆవాజ్ నహీ ఆరీ ఆప్మీ ఫోన్ పే సహీ....(సార్... మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదు) కి: కిత్తే దేతే? (ఎంత ఇస్తారు?) తం: రాత్ మే కిత్తే రహేంగే సాబ్ హమారే పాస్... దో లాఖ్, పాంచ్ లాఖ్... పాంచ్ లాఖ్ తక్పడే రహతే పూరాబీ నికాల్ దియేతో ఘర్ మే... పాంచ్ లాఖ్ రహతా... ఔర్ దస్బీస్ తులా సోనా రహతా లేడీస్ క... (రాత్రికి రాత్రంటే మా దగ్గర ఎంత ఉంటుంది సార్! రూ.రెండు లక్షలు.. ఐదు లక్షలు... రూ.ఐదు లక్షల వరకు ఉంటుంది. మహిళలకు సంబంధించిన పది, 20 తులాల బంగారం ఉంటుంది.) కి: పాంచ్ కరోడ్ లాస్ట్ (రూ.5 కోట్లు... ఇదే ఆఖరి బేరం) తం: ఉత్తా రహేంగేనా సాబ్ ఘర్మే కాసే రహేంగే సాబ్ పైసే? (మా దగ్గర అంత మొత్తం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది?) కి: ఘర్మే నహీ ఐసే ఝూటే మత్ బోలో. పాంచ్ కరోడ్. (ఇంట్లో లేవు... ఇలాంటి అబద్ధాలు చెప్పవద్దు. రూ.5 కోట్లు) తం: హా సాబ్ (ఏంటి సార్) కి: పాంచ్ కరోడ్ (రూ. 5 కోట్లు) తం: పాంచ్ కరోడ్ కిత్తో హోతే సాబ్. పాంచ్ సాత్ సూట్‌కేస్ హోతే బడేబడే. (రూ. ఐదు కోట్లంటే ఎంతో తెలుసా సార్? ఐదేడు పెద్ద పెద్ద సూట్ కేసులు కావాలి.) కి: జాదా బాతా నై కర్నా (ఎక్కువగా మాట్లాడవద్దు) తం: పాంచ్ సాత్ లాఖ్ రుపే ఘర్మే నికల్ జాతే పూరే పేమెంట్. (మొత్తం కలిపి ఐదేడు లక్షలు ఉంటుంది.) కి: కిత్తే? (ఎంత?) తం: పాంచ్ లాఖ్ సాత్ లాఖ్ నికల్ జాతే. దస్ బీస్ తులే సోనా నికల్ జాతా. (ఐదేడు లక్షల నగదు, పది, 20 తులాల బంగారం) కి: ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు) తం: హా భయ్యా (ఏంటి భయ్యా?) కి: ఝూటే మత్ కరో (అబద్ధాలు ఆడద్దు) తం: మై ఝూటే మత్ కర్తుమ్నా భయ్యా ఝూట్ క్యూం కరూంగా మే? (నేను మీ దగ్గర అబద్ధాలు ఆడను కద భయ్యా? ఎలా ఆడగలను?) కి: సునో.... ఆప్ కుచ్ భీ కరో... పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్ ఫైనల్... ఆప్ కో హోనా హైతో ఆప్కే బచ్చేసే పూఛో... కౌసే దేఖ్ రహాహూ.. ఆనేకే బాద్ పూంఛో.... (వినండి.. మీరే ఏమైనా చేయండి. ఐదు కోట్లు ఫైనల్. కావాలంటే మీ అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎలా చూసుకున్నానో అడగండి.) తం: మై నాంపల్లి తక్ ఆయాహు (నేను నాంపల్లి వరకు వచ్చాను) కి: సునో... సునో పాంచ్ కరోడ్ లాస్ట్ అండ్ ఫైనల్ (వినండి. ఐదు కోట్లే ఆఖరి మాట) తం:భయ్యా మై ఆప్కో హాత్ జోడ్తాహు... ఇత్తే పైసే కైసే ఆతే ఆపీ బతానే మేరేకో... (భయ్యా మీకు చేతులెత్తి దండం పెడతా.. అంత డబ్బు ఎలా వస్తుందో మీరే చెప్పండి) కి: బోల్దేతుం సున్లేలో... ఆప్కా బచ్చా కల్ సుబే ఛే బజే ఆజాతే. (చెప్తున్నాను వినండి... మీ అబ్బాయి రేపు (గురువారం) ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాడు) తం: హా సాబ్ (చెప్పండి సార్) కి: కల్ సుబే ఛే బజే ఆజాతే.. ఆనేకా బాద్ పూచో కైసే దేఖ్హ్రాహూ (రేపు ఉదయం ఆరు కల్లా వచ్చేస్తాడు. వచ్చాక అడగండి ఎలా చూసుకున్నానో) తం: మై కైసే ఆనా ఆప్కే పాస్? (మీ దగ్గరకు నేను ఎలా రావాలి?) కి: సికింద్రాబాద్ ఆజావో (సికింద్రాబాద్‌కు వచ్చెయ్) తం: ఆప్ అబిడ్స్ తన్ నై ఆసక్తే.. అబిడ్స్ తక్... (మీరు ఆబిడ్స్ వరకు రాలేరా?) కి: నై ఆసక్తే... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా. (రాలేను... మీరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలి) తం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆనా? (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రావాలా?) - ఆడియో ఇక్కడితో ఆగిపోయింది. -
నా వెంట వస్తావా.. చంపాలా..
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ♦ ముద్దనూరు యువకుడిపై కేసు నమోదు తాడిపత్రి రూరల్: ‘నువ్వంటే నాకిష్టం.. నా వెంట వస్తావా, లేదా? రాకపోతే నిన్ను బతకనివ్వను. చంపేస్తానంటూ’ తనను ముద్దనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే యువకుడు బెదిరిస్తున్నట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం చిన్నపోలమడ గ్రామానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌కుమార్ గతంలో పెళ్లి చూపుల పేరుతో తమ ఇంటికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ సంబంధం పెద్దలకు నచ్చక వద్దన్నారని ఆమె వివరించింది. ఆ తరువాత ఈ నెల 6న తన మేనమామతో వివాహమైందని తెలిపింది. ఈ విషయం తెలిపినా విన్పించుకోకుండా తనతో రాకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. సదరు యువకుడిపై చర్యలు తీసుకొని తన జీవితాన్ని, కాపురాన్ని నిలబెట్టాలని వేడుకుంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు విలేకరుల అరెస్ట్
అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు విలేకరులపై సంజామల పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కంభగిరిస్వామి ఆలయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిని బయటపెడితే తమరు జైలు కెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరించి విలేకరులు పూజారి రామ్మోహన్ స్వామి నుంచి మూడు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. వాటిని ఉపయోగించి నుంచి రూ.లక్ష విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు విలేకరులు గఫ్ఫార్, బాబా సప్తగిరిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంజామల మండలం పేరుసోమల గ్రామంలో ఉన్న కంభగిరిస్వామి ఆలయంలో రామ్మోహన్ స్వామి పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక...
- హైస్కూల్లోనే పురుగుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య బల్లికురవ : తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక హైస్కూల్లోనే పురుగుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన దర్శి హనుమంతరావు, వెంకటరత్నం దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె నాగమణికి ఇటీవల వివాహం చేయగా, రెండో కుమార్తె నవ్య (14) స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఇటీవల తరచూ నవ్యను వేధిస్తుండటంతో ఈ నెల నాలుగో తేదీ ఇంటి నుంచి పాఠశాలకు పురుగుమందు తీసుకెళ్లి తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. ఉపాధ్యాయుల ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థిని కుటుం బ సభ్యులు.. గ్రామంలో ప్రథమ చికిత్స చేయించి అదేరోజు మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పదిరోజుల పాటు చికిత్స పొందిన విద్యార్థిని ఆరోగ్యం కుదుటపడింది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏఎం శ్రీనివాసరావు కూడా వైద్యశాలకు వెళ్లి నవ్యను పరామర్శించి వచ్చారు. అయితే, బుధవారం ఒక్కసారిగా నవ్య ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. హైస్కూల్ ఉపాధ్యాయులు నవ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పాఠశాలకు సెలవు ప్రకటించి సంతా పం తెలిపారు. ఎస్సై శ్రీహరిరావు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. -
ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య
గన్నవరం: అత్తింటి వేధింపులకు తట్టుకోలేక గర్భవతులైన తోడికోడళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం రాజీవ్‌నగర్ కాలనీలో బుధవారం జరిగింది. ఈ కాలనీలో నివసిస్తున్న సోదరులు నక్కా రాంబాబు (24), శివ (21)లు అదే ప్రాంతానికి చెందిన మురళీరమణమ్మ (20), ఝాన్సీ (19)లను ప్రేమించి ఏడు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. తోడికోడళ్లు ఒకే ఇంట్లో సొంత అక్కాచెల్లెళ్ల మాదిరిగా కలసిమెలసి ఉండడాన్ని అత్తమామలైన భూలక్ష్మి, వెంకటేశ్వరరావు సహించలేకపోయారు. కొడుకులు కూలి పనులకు వెళ్లిన సమయంలో కోడళ్లను హింసించేవారు. అత్తమామల వేధింపులు తట్టుకోలేక రమణమ్మ మంగళవారం రాత్రి ఝాన్సీతో సహా తల్లి ఇంటికి వెళ్లింది. తమ వేదనను ఇద్దరూ కన్నవారికి చెప్పి విలపిం చారు. తర్వాత కుటుంబ సభ్యులు సర్దిచెప్పి అత్తవారింటి వద్ద దింపివెళ్లారు. అత్తమామల వేధింపు మరింత ఎక్కువ య్యాయి. దీంతో రమణమ్మ, ఝాన్సీ ఇంటి ఇనుప దూలానికి ఓణీలతో ఉరేసుకున్నారు. తమ కూతళ్లను అత్తింటివారే హత్య చేశారని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. -
పోకిరీల భరతం పట్టిన అక్కాచెల్లెళ్లు
రోహ్తక్ (హర్యానా): ఆకతాయిల వేధింపులను మౌనంగా భరించే అబలలం కాదంటూ హర్యానాలోని రోహ్తక్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిరూపించారు. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలకు బుద్ధిచెప్పేందుకు తోటి ప్రయాణికులెవరూ ముందుకు రాకున్నా ధైర్యంగా వారిని ప్రతిఘటించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. రోహ్తక్కు చెందిన అక్కాచెల్లెళ్లు రోజూలాగే శుక్రవారం కాలేజీకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కగా వారు కూర్చున్న సీట్ల వెనక నిలబడిన ముగ్గురు పోకిరీలు వేధించడం మొదలుపెట్టారు. కాగితాలు చింపి విసరడం, అసభ్య చేష్టలు ప్రారంభించారు. దీనిపై యువతులు అభ్యంతరం తెలపడంతో ఆగ్రహించిన పోకిరీల్లో ఒకడు ఒక యువతిపై దాడి చేశాడు. మరో ఇద్దరు పోకిరీలు రెండో యువతిని గట్టిగా పట్టుకున్నారు. ఇంత జరుగుతున్నా బస్సులోని ప్రయాణికులెవరూ ఆకతాయిలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఎలాగోలా అక్కాచెల్లెళ్లిద్దరూ ధైర్యాన్ని కూడదీసుకొని ఆకతాయిలపై ఎదురుతిరిగారు. పోకిరీలపై పిడిగుద్దులు కురిపించారు. ఒక యువతి ఏకంగా తన బెల్టు తీసి ఓ పోకిరీని చితక్కొట్టింది. అయితే బస్సు ఆగడంతో పోకిరీలు ఆ యువతులను బస్సులోంచి తోసేశారు. అనంతరం కాన్ల్సా అనే గ్రామంలో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ దాడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించినఒక ప్రయాణికుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం బయటపడింది. నిందితులపై బాధిత యువతుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని కుల్దీప్, మోహిత్, దీపక్‌లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ శశాంక్ ఆనంద్ తెలిపారు. మరోవైపు ఈ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పంచాయతీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని యువతుల తండ్రి చెప్పారు. -
‘పుట్టగుంట’కు మావోయిస్టుల బెదిరింపు ఫోన్‌కాల్స్
హనుమాన్‌జంక్షన్ : హనుమాన్జంక్షన్కు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు పార్టీ నేతల పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటం స్థానికంగా కలకలం సృష్టించింది. గత నాలుగు రోజులుగా వరుస ఫోన్‌కాల్స్ రావటంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి పార్టీకి ప్లీనరీ నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నాలుగైదు సార్లు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో కూడా కాల్ వచ్చింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై జంక్షన్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సతీష్ ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయనకు వచ్చిన ఫోన్ నంబరుపై నిఘా పెట్టారు. నిజంగా మావోయిస్టులు చేస్తున్నారా? లేక వారి పేరుతో డబ్బు వసూలు కోసం ఇతరులెవరైనా యత్నిస్తున్నారా ? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఆ ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా నుండి మాట్లాడుతున్నట్లు సదరు వ్యక్తి తొలుత పుట్టగుంటకు ఫోన్లో చెప్పాడు. కాల్‌డేటాను పరిశీలిస్తే వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసినట్లు వెల్లడైంది. ఏఎస్సై నేతృత్వంలో ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన బృందం వరంగల్ చేరుకుని అక్కడి పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది. నకిలీ ఆధారాలతో బ్యాంకు ఖాతా.. పుట్టగుంట సతీష్‌కుమార్‌కు మావోయిస్టు నేత గణపతి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ సమీపంలోని ఐ.సి.ఐ.సి.ఐ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతాకు సంబంధించి బ్యాంకు అధికారులకు ఇచ్చిన ఆడ్రస్సు, ఇతర ఆధారాలు సరైనవి కాకపోవటంతో పాటు నగదును కూడా పూర్తిగా ఏటీఎం ద్వారానే డ్రా చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఆ ఖాతాలోకి ఎప్పుడెప్పుడు, ఎవరి ఖాతాల లోంచి ఎంత మొత్తంలో నగదు జమ అయింది.. అనే సమాచారాన్ని బ్యాంకు అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ఆగ్రనేతే ఫోన్ చేస్తాడా? సాక్షాత్తూ మావోయిస్టు పార్టీ ఆగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ రావటంపై పోలీసుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రికార్డు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్‌లోని వ్యక్తి మాటతీరును బట్టి అతడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిసింది. కానీ గణపతికి 60 ఏళ్లు పైబడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. -
అడ్డదారిలో అందలం
శ్రీకాకుళం కలెక్టరేట్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. మెజారిటీ మండలాలు దక్కించుకునే స్థితిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరిన్ని స్థానాలు దక్కించుకోవాలన్న యావతో అధికార జులుం ప్రదర్శించింది. అనైతిక చర్యలు, ప్రలోభాలు, బెదిరింపులతో కొన్ని మండలాలను అదనంగా చేజిక్కించుకోగలిగినా.. మరికొన్ని మండలాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు. జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకారం 22 మండలాల్లో టీడీపీ, 16 మండలాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం సాధించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే సహజంగా అధ్యక్ష పీఠాలను సైతం ఇదే సంఖ్యలో గెలుచుకోవాల్సి ఉంది. కానీ అధికార దర్పం, అనైతిక చర్యలతో మరో నాలుగు పీఠాలను అదనంగా చేజిక్కించుకుంది. మొత్తం మీద టీడీపీ 26, వైఎస్ఆర్సీపీ 12 మండలాల్లో విజయం సాధించాయి. తనకు తగిన బలం లేని, అభ్యర్ధులు లేని మండలాల్లో టీడీపీ రెండు రోజులు ముందుగానే వ్యూహం ప్రకారం బలహీనవర్గాలకు చెందిన ఎమ్పీటీసీలను, ఇండిపెం డింట్లను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. రాజాం మండలంలో వైఎస్ఆర్సీపీకి 8, టీడీపీకి 6గురు సభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఉన్నా రు. ఈ లెక్కన ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్న వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష పదవి దక్కాలి. కానీ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌ను బెదిరించి, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకొన్నారు. వారి సహకారంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వంగర మండలంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు ఎంపీపీ ఎన్నికల్లో వెలుగుచూశాయి. కళావెంకటరావు, ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ మండలంలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్ధి విషయంలో ఈ రెండు వర్గాలు చివరకు పరస్పరం పోటీ పడ్డాయి. పలాసలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ఇండిపెండింట్‌ను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీకే ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. హిరమండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్పీటీసీలను టీడీపీ నేతలు బెదిరించారు.ఆమదాలవలసలో టీడీపీ ప్రలోభాలు ఫలించాయి. కొందరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చివరి క్షణంలో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తింంచారు. సమావేశం ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్లు లాక్కున్నారు. అదే పోలీసులు, అధికారులు సమావేశ మందిరంలో నిబంధనలకు విరద్ధంగా టీడీపీ నేతలు ఫోన్లలో మంతనాలు సాగించినా పట్టించుకోలేదు. సీతంపేటలో వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం ఉండగా, ఆ మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఏమాత్రం లొంగలేదు.బూర్జ మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. నిండు గర్భిణితో బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేసి, భంగపడింది. కాంగ్రెస్, టీడీపీలు ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా..చివరకు న్యాయమే గెలిచి..పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జి.సిగడాంలో టీడీపీ ఎమ్పీటీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి అవసరమైన ఎస్సీ అభ్యర్ధి లేకపోవడంతో వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిని సూరీడమ్మను ప్రలోభపెట్టి ఆమె చేత ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. ఆమెకు మద్దతుగా ఓటేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సూరీడమ్మ పోటీ చేసినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తోటి విద్యార్థి వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు ఆ విద్యార్థి వివరాలు చెప్పాలంటూ ఆందోళన దురుసుగా ప్రవర్తించిన కళాశాల యాజమాన్యం మదనపల్లెక్రైం: తోటి విద్యార్థి ఏడాది కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయ డం, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల కథ నం మేరకు.. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన సిద్దిక్, షకీలా కుమార్తె కుశీద(19). ప్రశాంత్‌నగర్‌లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బీ.కాం ద్వితీయ సంవత్స రం చదువుతోంది. ఇదే కళాశాలలో బొ మ్మనచెరువు తాండాకు చెందిన హరికృష్ణనాయక్ బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుశీద, హరికృష్ణనాయక్ ఒకే సెక్షన్లో ఉంటారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే హరికృష్ణనాయక్ ప్రేమపేరుతో కుశీద వెంటపడేవాడు. రెండు మూడు పర్యాయాలు గ్రీటింగ్‌లు కూడా ఇచ్చాడు. ఇంట్లో, కళాశాలలో చెబితే ఏమి జరుగుతుందోనని భావించిన కుశీద మిన్నుకుండిపోయింది. తోటి విద్యార్థి వేధింపుల వల్ల సక్రమంగా చదవలేకపోయింది. మొదటి సంవత్సరం పరీక్షలు సరిగ్గా రాయలేకపోయింది. రెండో సంవత్సరంలో అ డుగుపెట్టి ప్రస్తుతం కాలేజీకి వెళుతోం ది. యథాప్రకారం హరికృష్ణనాయక్ వే ధింపులు మొదలయ్యాయి. ఇదిలా ఉం డగా శుక్రవారం మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. కుశీద బీకాం కంప్యూటర్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిం ది. దీంతో కళాశాలలో ఉండలేక ఇంటికి వెళ్లిపోయింది. గమనించిన హరికృష్ణనాయక్ కూడా కుశీద ఇంటికి వెళ్లాడు. అ తను అమ్మాయిని ఏమన్నాడో ఏమో కాని కొద్దిసేపటికి కుశీద ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పక్కింటికి చెందిన పెద్దమ్మ, బంధువులు గమనించి బాధితురాలిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షిం చిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. కళాశాల ఎదుట ఆందోళన బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు నేరుగా సిద్దార్థ డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లారు. కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డికి విషయం చెప్పారు. కాలేజీలోని విద్యార్థులు ఇలా అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో వారు విద్యార్థులు బయటకు వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో మాకెలా తెలుస్తుందని దురుసుగా మాట్లాడారు. వేధింపులకు పాల్పడిన విద్యార్థి వివరాలు చెప్పాలని ప్రశ్నించినా తమకు తెలియదన్నారు. విద్యార్థి చిరునామా కూడా లేకుండా ఎలా కళాశాలలో చేర్చుకుంటారని ఆందోళనకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి మీ చేతనైంది చేసుకోండని కళాశాల నుంచి బయటకు పంపేశాడు. దీంతో తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడిన విద్యార్థితో పాటు కళాశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
మీలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో తెలుసు..
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రం ఏమీ అనడం లేదు, మా పార్టీ కార్యకర్తలను మాత్రం కనీసం ఓట్లు వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వరా అంటూ ఎస్ఐ పి.ఉద యబాబుతో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ దురుసుగా ప్రవర్తించారు. స్థానిక సెయింట్‌పాల్స్, సెయింట్ ఆన్స్ పాఠశాల కేంద్రాల్లో పోలింగ్ సరళిని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర హెనీ క్రిస్టినా పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ తో కలసి రెండు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. హెనీక్రిస్టినా వెంటనే చర్చి ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు చర్చి ప్రాంగణంలో నుంచి బెల్ టవర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సెయింట్‌ఆన్స్ పాఠశాలలో కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లి టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు చర్చి ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతుండగా అప్పుడే ఎన్నికల కేంద్రానికి చేరుకున్న ఎస్ఐ ఉదయబాబు ఇక్కడ ఎవ్వరూ ఉండవద్దు వె ళ్లిపోవాలంటూ సూచించారు. ఇంతలో టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఎస్ఐపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంటున్నాడని గల్లా జయదేవ్ దృష్టి తెచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఆయన వచ్చేది మా ప్రభుత్వమే.. మా వెంట కార్యకర్తలు ఉండకూడదా అంటూ ఎస్ఐతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తారో చూస్తాం.. మీ లాంటి అధికారులను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసంటూ ఆవేశంగా మాట్లాడారు. ఎస్ఐ ఉదయబాబు మాత్రం సంయమనం పాటిస్తూ అక్కడి నుంచి కార్యకర్తలు, నాయకులను పంపించి వేశారు.