డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree student suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Jun 28 2014 3:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

  •      తోటి విద్యార్థి వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు
  •      ఆ విద్యార్థి వివరాలు చెప్పాలంటూ ఆందోళన
  •      దురుసుగా ప్రవర్తించిన కళాశాల యాజమాన్యం
  • మదనపల్లెక్రైం: తోటి విద్యార్థి ఏడాది కాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయ డం, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల కథ నం మేరకు.. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన సిద్దిక్, షకీలా  కుమార్తె కుశీద(19). ప్రశాంత్‌నగర్‌లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బీ.కాం ద్వితీయ సంవత్స రం చదువుతోంది.

    ఇదే కళాశాలలో బొ మ్మనచెరువు తాండాకు చెందిన హరికృష్ణనాయక్ బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుశీద, హరికృష్ణనాయక్ ఒకే సెక్షన్‌లో ఉంటారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే హరికృష్ణనాయక్ ప్రేమపేరుతో కుశీద వెంటపడేవాడు. రెండు మూడు పర్యాయాలు గ్రీటింగ్‌లు కూడా ఇచ్చాడు. ఇంట్లో, కళాశాలలో చెబితే ఏమి జరుగుతుందోనని భావించిన కుశీద మిన్నుకుండిపోయింది. తోటి విద్యార్థి వేధింపుల వల్ల సక్రమంగా చదవలేకపోయింది.

    మొదటి సంవత్సరం పరీక్షలు సరిగ్గా రాయలేకపోయింది. రెండో సంవత్సరంలో అ డుగుపెట్టి ప్రస్తుతం కాలేజీకి వెళుతోం ది. యథాప్రకారం హరికృష్ణనాయక్ వే ధింపులు మొదలయ్యాయి. ఇదిలా ఉం డగా శుక్రవారం మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. కుశీద బీకాం కంప్యూటర్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిం ది. దీంతో కళాశాలలో ఉండలేక ఇంటికి వెళ్లిపోయింది.

    గమనించిన హరికృష్ణనాయక్ కూడా కుశీద ఇంటికి వెళ్లాడు. అ తను అమ్మాయిని ఏమన్నాడో ఏమో కాని కొద్దిసేపటికి కుశీద ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పక్కింటికి చెందిన పెద్దమ్మ, బంధువులు గమనించి బాధితురాలిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షిం చిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
     
    కళాశాల ఎదుట ఆందోళన
     
    బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు నేరుగా సిద్దార్థ డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లారు. కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డికి విషయం చెప్పారు. కాలేజీలోని విద్యార్థులు ఇలా అమ్మాయిల వెంటపడి వేధింపులకు గురిచేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో వారు విద్యార్థులు బయటకు వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో మాకెలా తెలుస్తుందని దురుసుగా మాట్లాడారు.

    వేధింపులకు పాల్పడిన విద్యార్థి వివరాలు చెప్పాలని ప్రశ్నించినా తమకు తెలియదన్నారు. విద్యార్థి చిరునామా కూడా లేకుండా ఎలా కళాశాలలో చేర్చుకుంటారని ఆందోళనకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన కరస్పాండెంట్ వెంకట్‌రెడ్డి మీ చేతనైంది చేసుకోండని కళాశాల నుంచి బయటకు పంపేశాడు. దీంతో తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడిన విద్యార్థితో పాటు కళాశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement