న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని, తనను చంపుతామని గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి హిందీలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెసేజ్‌ను శనివారం సాయంత్రం చూసినట్టు చెప్పారు. అందులో ‘‘ నేను మిమ్మల్ని, ప్రధానిని చంపాలనుకోవట్లేదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోంది. నన్ను క్షమించండ’’న్న అని పేర్కొని ఉంది. ఈ మెసేజ్ గురించి పోలీసులకు తెలియజేశానని ఆయన ఆదివారం వెల్లడించారు. కాగా, గత నెలలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముందురోజు కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి. మోదీని చంపుతామంటూ జైపూర్‌లోని బీజేపీ ఆఫీసుకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చిరునామాలోని నలుగురు వ్యక్తులను విచారిస్తే, వారికేం తెలియదని తేలిందని జైపూర్ పోలీసు డిప్యూటీ కమిషనరు యోగేశ్ దధీచ్ తెలిపారు.
నన్నూ, మోదీని చంపుతామంటున్నారు: ఢిల్లీ బీజేపీ చీఫ్
Published Sun, Jun 23 2019 3:58 PM | Last Updated on Sun, Jun 23 2019 7:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment