
కోమటిరెడ్డికి తమ బాధను వివరిస్తున్న బాధితురాలు
నల్లగొండ టౌన్ : జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకుల రౌడీయిజం పెరిగిపోతోందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాదయ్యను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరామర్శించి కారణాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకుల బెదిరింపులో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఆహ్మహత్యాయత్నా నికి పాల్పడినట్టు తెలిపారు.
కాలువ నీటి విషయంలో జరిగిన తగాదాలో యాదయ్యను టీఆర్‌ఎస్ నా యకులు కొట్టి బెదిరించారని ఆరోపించారు. కాలువలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెల్వదని, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల పేరుతో డబ్బులను సంపాదించే పనులకు పరిమితమాయ్యరన్నారు. ప్రగతిభవన్ వదిలి వెళ్లని ముఖ్యమంత్రికి రైతుల సమస్యలు ఎలా తెలు స్తాయని ప్రశ్నించారు. యాదయ్యకు ఏమైనా జరిగి తే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావులే బాధ్యత వహించాలన్నారు. ఆయన ను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో నా యకులు పాశం సంపత్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, గు మ్ముల మోహన్‌రెడ్డి, జూకూరు రమేష్, తఖీ, అల్లి సు భాష్‌యాదవ్, సట్టు శంకర్ కిన్నెర అంజి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment