komatireddy venkatareddy
-
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
రెండు దశల్లో మామునూరు విమానాశ్రయ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ శివారులోని మామునూరులో విమానాశ్రయాన్ని రెండు దశల్లో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తొలుత చిన్న విమానాలను నడు పుతూ, భవిష్యత్‌లో ఎయిర్‌బస్ లాంటి పెద్ద విమా నాలను నడిపేలా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద విమానాలు దిగేందుకు కావాల్సిన రన్‌వేను ముందుగానే సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎనిమిది నెలల్లో చిన్న విమానాల ఆపరేషన్‌కు వీలుగా, పెద్ద విమా నాల నిర్వహణను ఏడాదిన్నరలో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్‌కు వచ్చే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని పేర్కొ న్నారు. తదుపరి కొత్తగూడెం, రామగుండం విమా నాశ్రయాలను నిర్మిస్తామని చెప్పారు. హైదరా బాద్–విజయవాడ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఫిబ్రవరి నాటికి టెండర్లు పిలు స్తామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగకుండా జాప్యం జరుగుతూ వచ్చిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను తాము కొలిక్కి తెచ్చా మని, మేడిపల్లి నుంచి నారపల్లి సీపీఆర్ఐ వరకు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామ న్నారు. శ్రీశైలం రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టే యోచనలో ఉన్నామని, కేంద్రం సహకరిస్తే దాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఢిల్లీ–ముంబై, ముంబై–నాగ్‌పూర్, చెన్నై–కన్యాకుమారి ఎక్స్ ప్రెస్‌వే తరహాలో రీజినల్‌రింగురోడ్డు దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేయబోతోంద న్నారు. విమానాశ్రయం, ప్రతిపాదిత ఫోర్త్ సిటీతో దీనిని అనుసంధానిస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి అలైన్మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు. నిధుల కోసం జైకా, వరల్డ్ బ్యాంకు, ఏడీబీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొ న్నారు. ఉత్తర భాగానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ భూసేకరణ పరిహారాన్ని ఖరారు చేయలేదని, ఇంకా టెండర్లు పిలవలేదన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.సచివాలయ ప్రధాన గేటు పూర్తిగా తొలగింపుసచివాలయం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును అధికారులు పూర్తిగా తొలిగించారు. గతంలో ఈ ప్రధాన గేటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలు సాగించేవారు. అయితే సచివాలయ ప్రధాన గేటు లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ గేటును తొలగిస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రధాన గేటు పూర్తిగా కనిపించకుండా ర్యాక్‌లు ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉన్న నాలుగో గేటుకు పక్కనే మరో గేటును నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం అక్కడ ప్రస్తుతం ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి రాకపోకలు ఉంటాయని సమాచారం. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్ల మార్పు విషయం చర్చనీయాంశమైంది.తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా నాణ్యత లోపించకూడదని, నిత్యం ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విగ్రహాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. -
మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ హైవే విస్తరణ పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఈ రోడ్డు మీద ఉన్న 930 మర్రి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీలొకేట్ చేసే 330 చెట్లకు సంబంధించి నిర్మాణ సంస్థతో వెంటనే తాను మాట్లాడతానని మిగతావాటిì తరలింపు పనులను ఎన్హెచ్ఏఐ వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.శుక్రవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘న్యాక్’లో ఎన్హెచ్ఏఐ అధికారులతో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యంపై సాకులు వెతక్కుండా ఇకనైనా పనులు మొదలుపెట్టాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆ రహదారి విస్తరణ పనులకు కొత్త టెండర్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశం మేరకు విజయవాడ హైవే విస్తరణ పనుల టెండర్లు రద్దు చేసి వచ్చేనెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబరులో పనులు మొదలుపెట్టాలని కోమటిరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఉప్పల్–ఘట్కేసర్ వంతెన పనులకు సంబంధించి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని కూడా సూచించారు. ఆర్మూరు–మంచిర్యాల జాతీయ రహదారి కోసం 630 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా, ఇప్పటికే 530 హెక్టార్లు సేకరించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రీజినల్ రింగురోడ్డు పూర్తయితే డిస్నీల్యాండ్ సంస్థలు ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడికి ముందుకొస్తాయని, పారిశ్రామిక క్లస్టర్లు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు ఏర్పడతాయని మంత్రి వారికి వివరించారు. జూలైలో రాష్ట్రానికి ఉన్నతాధికారుల బృందం జూలైలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి జాతీయ రహదారు ల విభాగం ఉన్నతాధికారుల బృందం వస్తున్నందున, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఎల్బీనగర్–మల్కాపూర్ మధ్య మన్నెగూడ వద్ద ప్రమాదకరంగా ఉన్న జాతీయ రహదారి మలుపుపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాక ప్రత్యేక కార్యదర్శి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఎన్హెచ్ఏఐ ఆర్ఓ రజాక్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్ఓ కుషా్వతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ లోపు ట్రిపుల్ ఆర్ పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దశ మార్చేలా రూపుదిద్దుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను డిసెంబర్‌లోపు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెండర్ల ప్రక్రియ అనంతరం అక్టోబర్‌లో లాంఛనంగా శంకుస్థాపన చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. కుదిరితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే ట్రిపుల్ ఆర్ పనులు ఇప్పటివరకు మొదలు కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి మళ్లీ ఆ పథకాన్ని పట్టాలెక్కించినట్టు చెప్పారు. బుధవారం రోడ్లు భవనాల శాఖపై 8 గంటల పాటు సమీక్ష అనంతరం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ ఆధారంగా స్పోర్ట్స్, హార్డ్‌వేర్ జోన్లు ‘ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చే స్థాయి ట్రిపుల్ ఆర్కు ఉంది. దీనిని ఆధారంగా చేసుకుని స్పోర్ట్స్ జోన్, హార్డ్‌వేర్ జోన్‌లాంటి వాటిని ఏర్పాటు చేయనున్నాం. దీనితోపాటు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్–విజయవాడ హైవే ఆరు వరుసల విస్తరణ పనులను కూడా డిసెంబర్ నాటికి కొలిక్కి తెస్తాం. రూ.375 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. 17 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులకు 23న శంకుస్థాపన చేస్తున్నాం.రూ.5,600 కోట్లతో గ్రీన్ హైవేగా బెంగుళూరు రహదారిని, ఎలివేటెడ్ కారిడార్లతో నాగ్‌పూర్ జాతీయ రహదారిని మెరుగుపరుస్తాం. నగరం చుట్టూ నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలను, వరంగల్ కొత్త ఆసుపత్రి భవనాన్ని సకాలంలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం అకౌంట్ల కోసం పనిచేస్తే, మా ప్రభుత్వం అకౌంటబిలిటీ(జవాబుదారీతనం) కోసం పనిచేస్తుంది..’అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. 3 నెలల్లో అంబర్‌పేట ఫ్లైఓవర్ ప్రారంభం ‘ఎనిమిదేళ్ల క్రితం పనులు మొదలై నిలిచిపోయిన ఉప్పల్ వంతెన పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తాం. అంబర్‌పేట వంతెనను 3 నెలల్లో ప్రారంభిస్తాం. అల్వాల్ మార్గంలో 14 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. ఢిల్లీలో ఏపీ భవన్ స్థలంలో మన దామాషా ప్రకారం దక్కే భూమిలో 24 అంతస్తులతో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తాం. దీనికి సంబంధించి డిజైన్లు పూర్తయ్యాయి. రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రోల్ మోడల్‌గా తెలంగాణ రోడ్లు తెలంగాణ రోడ్లు రోల్‌మోడల్‌గా ఉండేలా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర రహదారుల్లో వేటిని జాతీయ రహదారులుగా మార్చాలో తేల్చి కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం. ప్రస్తుతం 16 రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. వాటికి అనుమతులు సాధిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో పాటు ప్రధానిని కలుస్తాం. రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం పార్లమెంటులో విపక్ష కూటమి బలంగా ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తాం. హైదరాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే, దాని పక్కనే బుల్లెట్ రైలు మార్గం సాధించేందుకు కూడా ఒత్తిడి చేస్తాం. కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఉస్మానియాకు కొత్త భవనంపై అఖిలపక్ష సమావేశం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి అదే స్థలంలో కొత్త భవనాన్ని, అదే నమూనాలో నిర్మించే ప్రతిపాదన ఉంది. త్వరలో అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. పాటిగడ్డలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. దేశంలోనే గొప్ప హైకోర్డు భవనంగా తెలంగాణ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తాం. దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో భవనం సిద్ధమవుతుంది..’అని మంత్రి వివరించారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తితో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కలి్పస్తుందని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు డెల్టా టీమ్ తెలిపిందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇలావుండగా శ్రీధర్‌బాబుతో పాటు పర్యటనలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్‌ను కోరారు.నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కృష్ణకుమార్.. డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ‘కోకో కోలా’ సానుకూల స్పందన అట్లాంటాలోని కోకో కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథాన్ రీఫ్‌తో కూడా మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహా్వనించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు పెరిగాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన జోనాథాన్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మంత్రులతో ఉన్నారు. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్‌రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్‌రెడ్డికి సూచించారు. -
రేవంత్ జోలికొస్తే ఊరుకోను
-
కాంగ్రెస్ సంక్షోభంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్‌ను అధిష్టానం నియమించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ‘కమిటీల్లో మేమిచ్చిన పేర్లను పట్టించుకోలేదు. కమిటీ నియామకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగింది. గాంధీభవన్‌లో ఉంటూ పైరవీలు చేసే వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాలపై దిగ్విజయ్ విచారణ చేయాలి. తెలంగాణలో పరిస్థితులు ఆయనకు తెలుసు. మా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో విచారణ చేయాలి. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలి. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారించాలి.’ అని డిమాండ్ చేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఆరోగ్య శ్రీ పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ అమలవుతోందని గుర్తు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్ -
Congress Party: చర్యల్లో తేడాలెందుకు? కోమటిరెడ్డికి ఓ రూల్.. మర్రికి మరో రూల్!
కాంగ్రెస్ ఒక విచిత్రమైన పార్టీ. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఒక్కొక్కరి మీద ఒక్కోలా చర్యలుంటాయి. బీజేపీ నేతలతో సమావేశమయ్యారనే ఆరోపణతో ఒక నేతను పార్టీ నుంచి బహిష్కరించారు. మరి మునుగోడులో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చెప్పాడంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? మా వాడయితే ఓకే.! కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని.. తమది ప్రజాస్వామ్య పార్టీ అని చెబుతారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ నాయకుడు శశిథరూర్‌ను ఘోరంగా అవమానిస్తారు. బీజేపీ నేతలను కలుసుకున్నందుకు సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని ఆరేళ్ళ పాటు బహిష్కరించారు. ఆయనకు కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఘోరంగా విమర్శించిన పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీద నో యాక్షన్. పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా కనీసం పల్లెత్తు మాట అనలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో బయటపడినా ఎంపీ వెంకటరెడ్డి మీద నో యాక్షన్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేదా క్రమశిక్షణా సంఘం ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తోంది? పార్టీలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల నాయకుడెవరు? మాదంతా నిబద్ధత, క్రమశిక్షణ కాంగ్రెస్ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ.. అక్టోబర్ 22న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షోకాజ్ నోటీసు పంపారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరికి ఫోన్ చేసి మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని వెంకటరెడ్డికి ఏఐసిసి నోటీసు పంపింది. ఈ నోటీసుకు వెంకటరెడ్డి చాలా ఆలస్యంగా సమాధానం పంపారు. తాను రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెబుతున్న వాయిస్ మెసేజ్ తనది కాదని ఆయన చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పులు తనవి కావని వివరణ ఇచ్చినట్లు ఏఐసిసి వర్గాల సమాచారం. తాను నిబద్దత, క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తనని ఏఐసిసి క్రమశిక్షణ సంఘానికి చెప్పారట. అసలు కారణం అదా.? వెంకటరెడ్డి వివరణతో సంతృప్తి చెందిన ఎఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇప్పట్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదని ఏఐసిసి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సిట్టింగ్ ఎంపీ కావడంతో చర్యలు తీసుకోవడానికి అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది అసలు విషయం. ఇప్పటికే లోక్‌సభలో తక్కువ సభ్యులతో అధమ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీని వదులుకొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందో పార్టీ హైకమాండ్‌కు బాగా తెలుసు. అందుకే క్రమశిక్షణ పేరుతో బెత్తం పట్టుకుంటే లోక్ సభలో మరింత పలచబడతామని అర్థం చేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని చూసి చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డిని ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారు. కనీస వివరణ తీసుకోకుండా ఆయనపై బహిష్కరణ వేటును కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సైతం చర్యలు తీసుకుంటే సీనియర్లు రగిలిపోయే అవకాశం ఉందట. పార్టీ క్రమశిక్షణను ధిక్కరించినా.. ఆయన ఎంపీ కావడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం. శశిధర్‌రెడ్డి చట్టసభ సభ్యుడు కాదు కనుకే తేలిగ్గా ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటే లోక్‌సభలో కాంగ్రెస్ కౌంట్ ఒకటి తగ్గుతుంది. అందుకే హైకమాండ్ సైతం ఈయన విషయంలో సైలెంట్ అయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
గడ్కరీకి రాయగిరి రైతుల గోడు
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డుతో భూములు పూర్తిగా కోల్పోతున్న రాయగిరి రైతుల సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీని సోమవారం కలిసి వివరిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. శనివారం భువనగిరిలో రాయగిరి నిర్వాసితులు ఎంపీ వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. వారితో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆయనతో రీజినల్ రింగ్‌రోడ్డు సమస్యలపై చర్చిస్తానని చెప్పారు. రాయగిరితోపాటు పలుచోట్ల్ల త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని వినతులు వచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రిని కలిసి స్థానిక సమస్యలు తెలిపి అలైన్మెంట్ మార్చే విధంగా చూస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. -
మహిళల మృతి పట్టదా.. బీహార్‌కు ఎలా వెళ్తారు: కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటన సంచలనంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యంగా నలుగురు మహిళలు మృతిచెందారు. దీంతో, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. కాగా, మహిళల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్, సీఎంపై ఫైరయ్యారు. కేసీఆర్ బీహార్ పర్యటనను ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా సీఎం కేసీఆర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమటిరెడ్డి సదరు లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు. కానీ విమానంలో పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 అనుకూల మీడియాలో వైద్య ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 31, 2022 -
రాహుల్ సభ.. రైతుల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకే వచ్చే నెల 6న వరంగల్‌కు రాహుల్‌గాంధీ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి రైతుల్లో ధైర్యం నింపుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత వర్గాలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో వరంగల్ రైతు సంఘర్షణ సభలో వెల్లడిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేయనుందో కూడా చెబుతారు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ సభ విజయవంతం కోసం పార్టీ నేతలందరమూ కృషి చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సభకు వచ్చి రాహుల్ ఏం చెప్తారో వినాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఏది?: భట్టి కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్ఎస్ రుణమాఫీ ప్రకటించినా అమలు చేయకపోవడంతో రూ. లక్ష రుణానికి వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయని, ఇప్పుడు ఆ రుణం తీర్చడం రైతులకు కష్టంగా మారిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.లక్ష లోపు వడ్డీలేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రింకర్లతో పాటు పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూములను టీఆర్ఎస్ సర్కారు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతోనే వరి రైతులు నష్టపోయారన్నారు. మూడేళ్ల క్రితమే ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా యేటా ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూలి కూడా గిట్టట్లేదు: కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని, ఆయన ఇచ్చే మద్దతు ధరతో కూలి కూడా గిట్టడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాహుల్ వరంగల్‌కు రావట్లేదని, రైతుల కోసం వస్తున్నారని చెప్పారు. వరంగల్ సభ ఏర్పాట్ల నుంచి అన్ని అంశాలపై స్పష్టంగా ముందుకెళ్తామన్నారు. ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ నేతల భేటీ గురించి విలేకరులు ప్రశ్నించగా పీకే గురించి పార్టీ నుంచి తమకు ఎలాంటి వివరణ అందలేదని, ఊహాగానాలపై చర్చ అవసరం లేదని, మీడియా కథనాలపై స్పందించలేమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు -
తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్
-
సొంత డబ్బా ఎక్కువైంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని రాహుల్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన ఫేస్బుక్, ట్విట్టర్లో ఈమధ్య పెట్టిన పలు పోస్టింగ్‌లను ఆయనకు చూపించినట్లుగా తెలిసింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ‘పార్టీలో రేవంత్ ఒక్కరే పవర్ఫుల్’, ‘ఆయన మాటల్నే ఏఐసీసీ వింటుంది’, ‘ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది’, ‘ఇతర నాయకులకు ఏఐసీసీ విలువివ్వడం లేదు’ అన్న తరహాలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి వివరించారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సీనియర్ నేతలకు సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్ని అంశాలు పరిశీలిస్తామని రాహుల్ వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పంట చేతికొచ్చే సమయంలో కోతలా? సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి కరెంటు కోతల సమస్య వచ్చి పడిందని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సరైంది కాదని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘ఇప్పటికే వడ్ల కొనుగోలు గురించి రైతులు గందరగోళంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తూ రైతులకు కోతలు విధించటం సబబు కాదు. అవసరమైతే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 2 గంటలు విద్యుత్ కోతలు విధించి రైతాంగానికి మేలు చేయండి’అని సీఎంకు రాసిన లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్‌రెడ్డి హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్సార్ లాంటి నేతలు లేరు: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం ఇందుకు సంబంధించిన లేఖను న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్రమంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్‌రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని, ప్రత్యేక తెలంగాణలో రాష్ట్ర సర్కార్ కోట అభివృద్ధికి సహకరించడం లేదని తెలిపారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు కాలగమనంలో కలిసిపోయాయని అన్నారు. ఇప్పటికైనా పట్టించుకోకుంటే భువనగిరి కోట కూడా అలాగే అవుతుందని తెలిపారు. కోట అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ కిషన్‌రెడ్డిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని ఆయన మీడియాకు తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘‘ పీసీసీ నా దృష్టిలో చాలా చిన్న పదవి. రేవంత్‌రెడ్డి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. మల్కాజ్‌గిరిలో 40 డివిజన్లలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో నియోజకవర్గ స్థాయి నేతలు తప్ప.. వైఎస్సార్ లాంటి నేతలు లేరు. కాంగ్రెస్‌లోనే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపై సమర్ధవంతమైన నాయకుడు లేడు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతా’’నని కోమటిరెడ్డి అన్నారు. -
వైస్ఆర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ లో లేడు : కోమటిరెడ్డి
-
చచ్చినా కాంగ్రెస్‌ను వీడను: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, జహీరాబాద్: కాంగ్రెస్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, చచ్చినా పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేయడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని సీనియర్లకు ఇస్తేనే రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. పీసీసీ పదవి భర్తీలో జాప్యం వల్లే కొంత మంది సీనియర్లు పార్టీని వీడుతున్నారన్నారు. ఎన్నికలను సాకుగా చూపుతూ ఇంకా జాప్యం చేస్తే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తోందని ఆరోపించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు విడుదల చేస్తున్నారని, మిగతా నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దూకుడు పెంచిన టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో నయా జోష్ వచ్చింది. యాత్రలజోరు పెరిగింది. ముఖ్యనాయకులు ‘నడక మంచిదే’అంటున్నారు. నల్ల వ్యవసాయచట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతుయాత్రలు చేపట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇకముందు కూడా ఇదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. ఈ యాత్రల ద్వారా పార్టీ కేడర్‌లో కదలిక వస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టగలుగుతున్నామని భావిస్తున్న టీపీసీసీ నాయకత్వం 2023 ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేపనిలో పడింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాలని, జై జవాన్, జై కిసాన్ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టేందుకు టీపీసీసీ ముఖ్యులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రెండు యాత్రలు... రెండు రూట్లు రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇద్దరు ముఖ్యనేతలు ఈ నెలలో యాత్రలు చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఈ నెల 7న అనూహ్యంగా అచ్చంపేట దీక్షా శిబిరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించి 10 రోజులపాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను ఆయన కదిలించగలిగారు. రోజుకు నాలుగైదు గ్రామాల చొప్పున 40 గ్రామాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్ర ముగింపు సమయంలో రావిరాలలో భారీ జనసమీకరణతో బహిరంగసభ నిర్వహించి ఒక్కసారిగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడతానని ప్రకటించారు. మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఈ నెల 9వ తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాతో యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి రోజూ ఆయన కూడా నాలుగైదు గ్రామాల్లో తిరుగుతూ రైతులతో మమేకం అవుతున్నారు. వీలున్నచోటల్లా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈ నెల 22 వరకు తన యాత్రను కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు యాత్రలు పార్టీకి ఉపయోగకరంగానే ఉన్నాయనే భావన టీపీసీసీ ముఖ్యుల్లో వ్యక్తమవుతోంది. ఈ యాత్రల గురించి టీపీసీసీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ ఇన్నాళ్లూ ప్రజల్లోకి వెళ్లే ఆలోచన చేయలేకపోయామని, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభమైనందున, దీన్ని కొనసాగించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటేనే పార్టీకి మేలు కలుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండ జిల్లా నుంచి హైదరాబాద్‌కు త్వరలోనే పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమకారులతో వరుస సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇప్పటికే కొందరిని కలిశారని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని అంటున్నారు. మొత్తంమీద వరుస ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయి యాత్రలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ
సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి -
రసాభాసగా కాంగ్రెస్ నేతల సమావేశం
సాక్షి, యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సలీం హమద్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ముఖ్య నాయకుల ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జనగాంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనగాం ప్రాంత కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ అలా చేస్తోంది : ఉత్తమ్ సాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్‌రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లను వెంటవెంటనే ప్రకటిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పక్షాన కోర్టులో కేసు వేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ బయపడదని అన్నారు. పౌరసత్వ బిల్లు అమలు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
దొంగనాటకాలు ప్రజలు గమనించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దొంగనాటకాలను ప్రజలు గమనించాలని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పెద్ద నోట్ల రద్దు నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటా బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకూ అనుమతివ్వడం లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఎన్నార్సీకి వ్యతిరేకంగా ‘సేవ్ ఇండియా’పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ఒక్క తెలంగాణలో తప్ప దేశమంతా అనుమతినిచ్చారని చెప్పారు. ఎన్నార్సీకి నిరసనగా శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘సత్యాగ్రహ దీక్ష’లో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వం పేరుతో దేశంలో కల్లోల వాతావరణానికి బీజేపీ కారణమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విధానాలకు కట్టుబడి ఉందని, అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు భృతి, రైతు రుణమాఫీ, రైతు బంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు, మూడెకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు... ఇలా అన్ని విషయాల్లో టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని చెప్పారు. ప్రజల్ని మోసం చేసిన టీఆర్ఎస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత కూడా లేదని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తామేమీ మున్సిపల్ ఎన్నికలకు భయపడడం లేదని, రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత నామినేషన్ల దాఖలు కొంత సమయం మాత్రమే అడిగామని చెప్పారు. అయినా ఓటరు జాబితా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఘనత తెలంగాణ ఎన్నికల కమిషన్‌కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తామన్నా అనుమతించకపోవడం దారుణమని, తెలంగాణలో ఆర్ఎస్ఎస్కి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు వారి పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. దేశంలో, రాష్ట్రంలో నియంత పాలనకు త్వరలోనే స్వస్తి పలుకుతామని ధీమాను వ్యక్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్, ఎంఐఎం పార్టీలు మోదీ కోసం పనిచేస్తున్నాయని, అందుకే తిరంగా ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడం అన్యాయమని, అందుకే ఎన్నార్సీని కాంగ్రెస్ విమర్శిస్తోందని చెప్పారు. అనంతరం టీపీసీసీ నేతలు సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ దీక్షలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ వీహెచ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్‌కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు బల్మూరి వెంకట్రావు, అనిల్‌కుమార్ యాదవ్, నేరెళ్ల శారద, టీపీసీసీ నేతలు ఇందిరా శోభన్, ఫిరోజ్‌ఖాన్, గౌస్‌లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్రికత్తల నడుమ కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అంతకుముందు గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ తలపెట్టిన ‘సేవ్ ఇండియా ర్యాలీ’కి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆ పార్టీ నేతలతో కలసి ఆయన గాంధీభవన్‌లోనే సత్యాగ్రహ దీక్షకు దిగారు. గాంధీభవన్ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. గాంధీభవన్‌కు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు బయటే అడ్డగించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ పతనానికి ఈ దీక్ష వేదిక ప్రతిన పూనాలి: భట్టి టీఆర్ఎస్ పతనానికి సత్యాగ్రహ దీక్ష వేదికగా ప్రతిన పూని కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకెళ్లాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశ విభజనకు కారణమవుతున్న చట్టాలను వ్యతిరేకిస్తూ దేశాన్ని ఓ కుటుంబంలాగా ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే ఎన్నార్సీకి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తే టీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడుతుందనే దుర్మార్గపు ఆలోచనతో, ఆందోళనతో ఆ పార్టీ తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. నాటి బ్రిటిష్ పాలనలో కూడా ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేసేందుకు అనుమతి వచ్చిందని, సామాజ్య్రవాద శక్తుల కంటే కేసీఆర్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఆర్ఎస్లు కలసి బీజేపీ అధికారంలోకి రావడానికి పునాదులు వేస్తున్నాయని, హైదరాబాద్‌లోని ఈ రెండు పార్టీలను కదిలించకపోతే రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు. ఈ ఒక్కరోజు దీక్ష ఆపినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోలేదన్నారు. ప్రతి ఇంటి గుండెను, గ్రామాన్ని, పట్టణాన్ని పలకరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. -
నీరూ.. నిప్పు!
సాక్షి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం మొదలైంది. నిధులు ఇవ్వడం లేదని, జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిగా.. అసలు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్రా జెక్టుల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు.. ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. అదే మాదిరిగా, నల్లగొండ ఎంపీ, టీ.పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిగా, శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ ఇరువురు ఎంపీల ప్రకటనలపై మండిపడ్డారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఈనెల 26వ తేదీన బ్రాహ్మణవెల్లెంల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ జల సౌధకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికోసం ఆయన పోలీసుల అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు అనుమతిని నిరాకరిస్తే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఇవీ... పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో, రెండోసారి 2018లో ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కూడా ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ‘ నీళ్లు–నిధుల–నియామకాలు ’ అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, స్వరాష్ట్రం సిద్ధించాక తమ నినాదాన్ని మరిచిపోయి, జిల్లాలో ప్రాజెక్టులను ఏమ్రాతం పట్టించుకోవడం లేదని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోగా.. నిధులూ అంతంత మాత్రంగానే విడుదల చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే.. నేరుగా శ్రీశైలం రిజర్వాయరు నుంచే నీటిని తీసుకోవడం ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు, అక్కడి నుంచి ఎఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథానికి నీళ్లు అందుతాయనని చెబుతున్నారు. కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఏళ్లుగా కొనసాగుతుండడంపై ఈ ప్రాంత నాయకులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి , బునాదిగాని కాల్వల పనులు పూర్తికావడం లేదు. దీంతో అనుకున్న మేర రైతులకు సాగునీరు అందడం లేదు. ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే నిధులు : గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాం. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ మరో 10.5 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2,150 కోట్లు ఎస్ఎల్బీసీ టన్నెల్‌కి కేటాయిం చాం. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ జయప్రకాష్ అండ్ కంపెనీ ఒప్పం దం చేసుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి రిజర్వాయర్ పూర్తి చేశారు. మరో 11 నెలల్లో సొరంగమార్గం పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ప నులకు రూ.260 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ హయాంలోనే యాభై శాతం పనులు పూర్తయ్యాయి. ధనిక రాష్ట్రమని చెబు తున్న సీఎం ఎందుకు బునాదిగాని కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తదనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. 5వేల మందితో పాదయాత్రగా జలసౌధకు వెళతా. -
‘కేటీఆర్.. ట్విట్టర్లో ఇప్పుడు స్పందించవా?’
సాక్షి, హైదరాబాద్ : ఓట్ల కోసం శిలా ఫలకం ప్రారంభించిన కేటీఆర్ ఇంతవరకూ రోడ్డు వేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 4 వేల కోట్లకు పైగా దొంగ జీవోలు చేసినా ఎక్కడా పనులు చేపట్టలేదని విమర్శించారు. తట్టి అన్నారంలోని ఇందు అరణ్య అపార్ట్మెంట్ నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వెంకటరెడ్డి ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తాననీ కార్యకర్తలకు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తట్టి అన్నారం క్రాస్ రోడ్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేటీఆర్ ప్రారంభించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ‘ప్రతి దానికి ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఈ అంశంపై స్పందించాలి. తట్టి అన్నారం, పెద్ద అంబర్ పెట్ క్రాస్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. లేని పక్షంలో ఓట్ల కోసమే శిలాఫలకం ప్రారంభించానని తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి’ అని ఎంపీ అన్నారు.