సాక్షి, నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్‌ను అధిష్టానం నియమించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
‘కమిటీల్లో మేమిచ్చిన పేర్లను పట్టించుకోలేదు. కమిటీ నియామకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగింది. గాంధీభవన్‌లో ఉంటూ పైరవీలు చేసే వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాలపై దిగ్విజయ్ విచారణ చేయాలి. తెలంగాణలో పరిస్థితులు ఆయనకు తెలుసు. మా సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల్లో రేవంత్ ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో విచారణ చేయాలి. మార్ఫింగ్ వీడియోలపై విచారణ చేయాలి. మునుగోడులో నన్ను బూతులు తిడుతున్న వాటిపై విచారించాలి.’ అని డిమాండ్ చేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తెలంగాణలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ఆరోగ్య శ్రీ పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో వెయ్యి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ అమలవుతోందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌పై హైకమాండ్ ఫోకస్.. రంగంలోకి దిగ్విజయ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment