మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి,నల్లగొండ : కేసీఆర్ బీసీ వ్యతిరేకి..జాతీయ నేతల జయంతి సందర్భాల్లో వారి విగ్రహాలకు దండలు కూడా వేయకుండా ప్రగతి భవన్‌కే పరిమితమయ్యాడు’ అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బుధవారం జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్‌లోని పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ బీసీలంటే కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేశాడని ఆరోపించాడు. కాంగ్రెస్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే జయంతితో పాటు వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ వ్యతిరేకి కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత ప్రాతినిథ్యం ఇస్తోందని అందులో భాగంగానే బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చిందని తెలిపారు. బీసీ లకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సత్త య్య,వెంకన్న, జ నార్దన్‌గౌడ్, ముత్యాలు, జి. వెంకటేశ్వర్లు, కిన్నెర శ్రీను, గుండ్లపల్లి శ్రవణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment