‘ఏ పార్టీలోకి వెళ్లను, కాంగ్రెస్‌లోనే’ | We won't join any party, says Komatireddy Venkatareddy | Sakshi
Sakshi News home page

‘ఏ పార్టీలోకి వెళ్లను, కాంగ్రెస్‌లోనే’

Published Thu, Sep 14 2017 2:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘ఏ పార్టీలోకి వెళ్లను, కాంగ్రెస్‌లోనే’ - Sakshi

‘ఏ పార్టీలోకి వెళ్లను, కాంగ్రెస్‌లోనే’

సాక్షి, నల్లగొండ : తాను ఏ పార్టీలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతానని  ఎమ్మెల్యే కోమటిరెడ్డి  వెంకటరెడ్డి అన్నారు. అక్టోబర్‌ 2లోపు నల్లగొండకు మెడికల్‌ కళాశాల మంజూరు చేయాలని, లేకుంటే 72 గంటల నిరవధిక దీక్ష చేస్తానని ఆయన గురువారమిక్కడ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టుకుందని, అందుకే ప్రతిదానికి వాస్తు అంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కాగా గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వాటిని కోమటిరెడ్డి ఖండిస్తూ... తాము కాంగ్రెస్‌ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement