
‘కేసీఆర్ వేలకోట్లు ముడుపులు తీసుకున్నారు’
నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే తీరును మార్చుకోవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వేలకోట్ల రూపాయిలు ముఖ్యమంత్రి ముడుపులు తీసుకుంటున్నారని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు.
శతాబ్ధి ఉత్సవాల సందర్బంగా ఉస్మానియా యూనివర్శిటీలో సీఎం కేసీఆర్ మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని, ఆ స్థానంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా తన పదవికి రాజీనామా చేసేవారని అన్నారు. తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిలాంటి వారే పార్టీలు మారతారని ఆయన అన్నారు.