
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. తొలుత శ్రీనివాస్‌ను పలకరించిన కోమటిరెడ్డి.. ‘శ్రీనన్నా.. మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..? ఉద్యమ సమయంలో మీరు, స్వామిగౌడ్ లాఠీ దెబ్బలు తిన్నారు కదా. మీకు మంత్రి పదవి వస్తే బాగుండేదన్నా..’అని అన్నారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. ‘అదేం లేదన్నా.. మంత్రి పదవి వచ్చే టైమ్‌లో వస్తుంది.. అయినా మా ప్రభుత్వం వచ్చింది కదా? సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కదా..’అని అన్నారు. ‘ఉద్యమం చేసిన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు వచ్చాయి కదా..’ అని కోమటిరెడ్డి చమత్కరించారు. ‘ఇదంతా ఎందుకు? మీరెప్పుడు మా పార్టీలోకి వస్తున్నరో చెప్పండి..’అని శ్రీనివాస్ గౌడ్ ఎదురు ప్రశ్నవేశారు. ‘ఎక్కడికీ రాను. తెలంగాణ వచ్చింది అదే సంతోషం. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న’ అని కోమటిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment