సాక్షి,హైదరాబాద్:బీఆర్‌ఎస్‌పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్‌ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment