మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ శివారులోని మామునూరులో విమానాశ్రయాన్ని రెండు దశల్లో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తొలుత చిన్న విమానాలను నడు పుతూ, భవిష్యత్‌లో ఎయిర్‌బస్ లాంటి పెద్ద విమా నాలను నడిపేలా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద విమానాలు దిగేందుకు కావాల్సిన రన్‌వేను ముందుగానే సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎనిమిది నెలల్లో చిన్న విమానాల ఆపరేషన్‌కు వీలుగా, పెద్ద విమా నాల నిర్వహణను ఏడాదిన్నరలో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్‌కు వచ్చే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని పేర్కొ న్నారు. తదుపరి కొత్తగూడెం, రామగుండం విమా నాశ్రయాలను నిర్మిస్తామని చెప్పారు. హైదరా బాద్–విజయవాడ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఫిబ్రవరి నాటికి టెండర్లు పిలు స్తామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగకుండా జాప్యం జరుగుతూ వచ్చిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను తాము కొలిక్కి తెచ్చా మని, మేడిపల్లి నుంచి నారపల్లి సీపీఆర్‌ఐ వరకు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామ న్నారు. శ్రీశైలం రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టే యోచనలో ఉన్నామని, కేంద్రం సహకరిస్తే దాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు.
ఢిల్లీ–ముంబై, ముంబై–నాగ్‌పూర్, చెన్నై–కన్యాకుమారి ఎక్స్ ప్రెస్‌వే తరహాలో రీజినల్‌రింగురోడ్డు దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేయబోతోంద న్నారు. విమానాశ్రయం, ప్రతిపాదిత ఫోర్త్ సిటీతో దీనిని అనుసంధానిస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి అలైన్‌మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు.
నిధుల కోసం జైకా, వరల్డ్ బ్యాంకు, ఏడీబీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొ న్నారు. ఉత్తర భాగానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ భూసేకరణ పరిహారాన్ని ఖరారు చేయలేదని, ఇంకా టెండర్లు పిలవలేదన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.
సచివాలయ ప్రధాన గేటు పూర్తిగా తొలగింపు
సచివాలయం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును అధికారులు పూర్తిగా తొలిగించారు. గతంలో ఈ ప్రధాన గేటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలు సాగించేవారు. అయితే సచివాలయ ప్రధాన గేటు లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ గేటును తొలగిస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రధాన గేటు పూర్తిగా కనిపించకుండా ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.
ఈశాన్యం వైపు ఉన్న నాలుగో గేటుకు పక్కనే మరో గేటును నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం అక్కడ ప్రస్తుతం ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి రాకపోకలు ఉంటాయని సమాచారం. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్ల మార్పు విషయం చర్చనీయాంశమైంది.
తెలంగాణ తల్లి విగ్రహ పనులు
పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా నాణ్యత లోపించకూడదని, నిత్యం ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విగ్రహాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment