Warangal Airport
-
రెండు దశల్లో మామునూరు విమానాశ్రయ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ శివారులోని మామునూరులో విమానాశ్రయాన్ని రెండు దశల్లో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తొలుత చిన్న విమానాలను నడు పుతూ, భవిష్యత్‌లో ఎయిర్‌బస్ లాంటి పెద్ద విమా నాలను నడిపేలా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద విమానాలు దిగేందుకు కావాల్సిన రన్‌వేను ముందుగానే సిద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎనిమిది నెలల్లో చిన్న విమానాల ఆపరేషన్‌కు వీలుగా, పెద్ద విమా నాల నిర్వహణను ఏడాదిన్నరలో సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఢిల్లీ నుంచి నేరుగా వరంగల్‌కు వచ్చే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని పేర్కొ న్నారు. తదుపరి కొత్తగూడెం, రామగుండం విమా నాశ్రయాలను నిర్మిస్తామని చెప్పారు. హైదరా బాద్–విజయవాడ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఫిబ్రవరి నాటికి టెండర్లు పిలు స్తామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో ముందుకు సాగకుండా జాప్యం జరుగుతూ వచ్చిన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను తాము కొలిక్కి తెచ్చా మని, మేడిపల్లి నుంచి నారపల్లి సీపీఆర్ఐ వరకు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామ న్నారు. శ్రీశైలం రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టే యోచనలో ఉన్నామని, కేంద్రం సహకరిస్తే దాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఢిల్లీ–ముంబై, ముంబై–నాగ్‌పూర్, చెన్నై–కన్యాకుమారి ఎక్స్ ప్రెస్‌వే తరహాలో రీజినల్‌రింగురోడ్డు దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేయబోతోంద న్నారు. విమానాశ్రయం, ప్రతిపాదిత ఫోర్త్ సిటీతో దీనిని అనుసంధానిస్తామన్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి అలైన్మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు. నిధుల కోసం జైకా, వరల్డ్ బ్యాంకు, ఏడీబీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొ న్నారు. ఉత్తర భాగానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ భూసేకరణ పరిహారాన్ని ఖరారు చేయలేదని, ఇంకా టెండర్లు పిలవలేదన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ఢిల్లీలో దోమల బాధ తట్టుకోలేక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.సచివాలయ ప్రధాన గేటు పూర్తిగా తొలగింపుసచివాలయం తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును అధికారులు పూర్తిగా తొలిగించారు. గతంలో ఈ ప్రధాన గేటు నుంచి అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలు సాగించేవారు. అయితే సచివాలయ ప్రధాన గేటు లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ గేటును తొలగిస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రధాన గేటు పూర్తిగా కనిపించకుండా ర్యాక్‌లు ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉన్న నాలుగో గేటుకు పక్కనే మరో గేటును నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం అక్కడ ప్రస్తుతం ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి రాకపోకలు ఉంటాయని సమాచారం. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ గేట్ల మార్పు విషయం చర్చనీయాంశమైంది.తెలంగాణ తల్లి విగ్రహ పనులు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా కూడా నాణ్యత లోపించకూడదని, నిత్యం ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విగ్రహాన్ని డిసెంబర్ మొదటి వారంలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. -
ఏడాదిలోగా వరంగల్ ఎయిర్‌పోర్టు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రానున్న 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం రూపొందుతున్న మాస్టర్‌ప్లాన్ తు దిదశలో ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఆయా జిల్లా ల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. నగర మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం అంశాలపై చర్చించారు.పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించి, ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువులో పూడిక తీసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ ఎయిర్ పోర్టు: మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపా రు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి అంగీకరించిందని చెప్పారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎ మ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె నాగరాజు, నాయిని రాజేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
మామునూరుకు పెద్ద విమానాలు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయాన్ని పెద్ద విమానాల ఆపరేషన్‌తోనే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అవరోధంగా ఉన్న రెండు ప్రధాన అంశాలను వెంటనే కొలిక్కి తెచ్చేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం–పౌరవిమానయాన శాఖ మధ్య ఒప్పందం కుదరనుంది. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండగా 150 కి.మీ. నిడివిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న అంశాన్ని అధిగమించేలా హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో పౌర విమానయాన శాఖ చర్చలు జరపనుంది. ఈ రెండు కీలక ప్రక్రియలు పూర్తయితే ఏడాదిన్నరలోపే విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భావిస్తోంది. ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఓ పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే.. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయమే అందుబాటులో ఉంది. బేగంపేటలోని పాత విమానాశ్రయం కేవలం ప్రముఖుల ప్రత్యేక విమానాల నిర్వహణకే పరిమితమైంది. దీంతో రెండో విమానాశ్రయం వెంటనే అవసరమని నిర్ణయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి చర్యలు చేపట్టింది. దాంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలలో మరో ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మిగతా వాటి విషయంలో జాప్యం జరిగే పరిస్థితి ఉండటంతో వరంగల్ విమానాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని చర్చల సందర్భంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌్రస్టిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్‌వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవటంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత్ ఎయిర్్రస్టిప్కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధీనంలోనే ఉంది. అక్కడే ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. పెద్ద విమానాశ్రయం నిర్మాణమంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చిన్న విమానాలు ఆపరేట్ చేసేలా ప్రస్తుతానికి చిన్న రన్‌వేతో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో భావించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరిస్తూ పోవాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఒకేసారి పెద్ద విమానాలను ఆపరేట్ చేసే పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఖరారు చేశారు. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉండటంతో దీనికి మార్గం సుగమమవుతోంది. అదనపు భూసేకరణకు రంగం సిద్ధం.. అందుబాటులో ఉన్న భూమికి అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడికి చేరువలోనే పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని సేకరించనున్నారు. ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉంటుంది. త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. విమానాశ్రయం వస్తే వరంగల్‌కు మరిన్ని పెట్టుబడులు.. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. దాన్ని ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి చేయాల్సి ఉందని చాలా ఏళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాజీపేట శివారులో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరింత వేగంగా పారిశ్రామీకరణ జరగాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రావాలంటే స్థానికంగా విమానాశ్రయం ఉండాలన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరంగల్ 135 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్‌లో విమానం దిగి దాదాపు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు కొంత ఆటంకంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే ఏర్పాటు ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని తేల్చారు. ఇదే విషయాన్ని జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని కేంద్రరాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి 150 కి.మీ. నిడివిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండకూడదన్నది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ సంస్థకు ఉన్న ఒప్పందం చెబుతోంది. ఈ నిబంధన ఇప్పుడు వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇందుకు త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఇందులో ఉంటారని సమాచారం. ఈ కమిటీ సభ్యులు జీఎంఆర్‌తో సంప్రదింపులు జరిపి ఈ సమస్యను కొలిక్కి తేనున్నారు. -
విమానంలో వేములవాడ, కొండగట్టు వెళ్దామా!
సాక్షి, కరీంనగర్: ఉత్తర తెలంగాణ పర్యాటకం ఇకపై పరుగులు పెట్టనుంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలిపే ఉడాన్ పథకం కింద పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్, వరంగల్‌లోని మామూనూరు ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 27న ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా బసంత్‌నగర్, మామూనూరు విమానాశ్రయాలను ఉడాన్ 5.0 తుదిజాబితాలో చేర్చింది. ఈ విమానాశ్రయాల సేవలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, మేడారం జాతరలకు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు ఇక విమానాల్లోనూ రావచ్చు. ఏంటీ ఉడాన్ పథకం! ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, ఢిల్లీతో కలిపేందుకు వినియోగంలో లేని ఎయిర్‌పోర్టులను ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం 2016 ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మామూనూరు, బసంత్నగర్ల్లో విమాన సేవలు అందుబాటులోకి వస్తే, ఉత్తర తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు పునః ప్రారంభమైతే.. దీనికి 40–50 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న రామగిరి ఖిల్లా, వేములవాడ, రామగుండం, సింగరేణి గనులు, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ వన్యప్రాణి ప్రాంతాలు, నిజామాబాద్‌లోని ప్రాజెక్టుల సందర్శన సులభతరం కానుంది. వాస్తవానికి ఈ రెండు విమానాశ్రయాలు రెండు దశాబ్దాల క్రితం వరకు సేవలందించాయి. మామూనూరు విమానాశ్రయం 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ స్థానిక ఖాజీపేట పేపర్ పరిశ్రమ, ఆజాంమిల్స్ ఉత్పత్తులను షోలాపూర్‌తోపాటు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పారిశ్రామిక కనెక్టివిటీ పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. 1981 వరకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది. 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తన రాకపోకలకు అనువుగా బసంత్‌నగర్ విమానాశ్రయాన్ని నిర్మించారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే ఇక్కడికి రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబర్‌లో ఈ ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్‌పోర్టుతో 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని తయారు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. -
గాలిమోటార్పై గంపెడాశ
మామూనూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ? కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం నేడు ఢిల్లీలో కొత్త ఎయిర్‌పోర్టులపై సమావేశం సాక్షి, హన్మకొండ :వరంగల్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. వరంగల్ ఎయిర్‌పోర్టును వాడుకలోకి తీసుకొచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఎంపీలు నడుం బిగించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వరంగల్ వాసులకు విహంగయానం అందుబాటులోకి వచ్చినట్లే. తెలుగు రాష్ట్రాలకు చెందిన అశోక్‌గజపతిరాజు ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పాత ఎయిర్ స్ట్రిప్, ఎయిర్డ్రోమ్ల పునురుద్ధరణపై ఆయన ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం న్యూఢిల్లీలో అశోక్‌గజపతిరాజు అధ్యక్షతన కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో రెండో పెద్దనగరమైన వరంగల్‌లో ఉన్న మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించాలని వీరు ప్రధానంగా కోరనున్నట్లు సమాచారం. అడ్డుగా 150 కిలోమీటర్లు హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) పరిధిలో 150 కిలోమీటర్ల పరిధిలో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు వీలు లేదు. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసిన జీఎంఆర్ సంస్థల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఫలితంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంలలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవలం కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పైనే ప్రకటనలు ఇస్తోంది. వరంగల్‌పై ప్రత్యేక దృష్టి.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రెండో పెద్ద నగరం కావడంతో పాటు త్వరలో ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టెక్స్టైల్స్ పార్కును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు మఫత్‌లాల్ వంటి ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భారతక్రికెట్ కంట్రోల్ బోర్డుతో చర్చలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడ కొలువుదీరగా త్వరలో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి జాతీయస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్ల నిబంధన నుంచి వరంగల్ ఎయిర్‌పోర్టుకు సడలింపు ఇవ్వాలనే అంశంపై కేంద్రంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 ఏళ్లుగా భూసేరకణ... మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ 1960కి ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు చెపుతున్నాయి. విమానాశ్రయం కోసం మామునూరు ప్రాంతంలో మొత్తం 706 ఎకరాలు సేరించారు. విమానాశ్రయం అవసరాలకు కనీసం 1200 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీప గ్రామాల్లోని రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీని కోసం రూ.28 కోట్లు అవసరమవుతాయని... ఈ మొత్తం విడుదల చేస్తే రైతులకు ముందుగా చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వానికి నివేదించారు. 2008లో ఒకసారి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. అప్పటి కలెక్టర్‌తో భేటీ అయ్యింది. మామునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు అక్కడి స్థలాన్ని పరిశీలించింది. జిల్లా యంత్రాంగం నుంచి భూసేకరణ ప్రారంభానికి ముందుగా రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు అనుమతివ్వాలని జిల్లా అధికారులు 2012 డిసెంబరులో ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రభుత్వం నుంచి దీనిపై ఇప్పటికీ స్పందన రాలేదు. నిజాం హయాంలోనే... హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వ హయంలో మామునూరు విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిచేవి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం సమయంలోనూ ఈ విమానాశ్రయంలోనే రక్షణ దళాలు మొహరించాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరణ, విస్తరణ డిమాండ్ సుదీర్ఘంగా ఉంది. దేశ తొలిప్రధాని నెహ్రూ తొలిసారిగా వరంగల్‌కు వచ్చినప్పుడు వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్యా›్ట మామునూరులో విమానాశ్రయం పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదనలుS పంపుతూనే ఉంది. -
ఓరుగల్లు, కరీంనగర్‌లకు సీ ప్లేన్‌లో
♦ భాగ్యనగరం నుంచి పర్యాటక విమానాలు ♦ పెద్ద చెరువులుంటే చాలు.. ఎయిర్‌పోర్టులు అవసరంలేదు ♦ రెండు సంస్థలతో ప్రభుత్వం చర్చలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు విమానంలో వెళ్లాలనుందా.. కొద్ది రోజుల్లో ఆ అవకాశం అందుబాటులోకి రావచ్చు.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. అదేంటి.. అసలు వరంగల్ విమానాశ్రయం శిథిలావస్థలో ఉంటే విమానం ఎలా వెళ్తుందని ఆశ్చర్యపోతున్నారా... ఈ విమానానికి ఎయిర్‌పోర్టు అవసరం లేదు.. ఎంచక్కా అక్కడి భద్రకాళి చెరువులోనో, వడ్డేపల్లి చెరువులోనో దిగుతుంది. హైదరాబాద్లోనేమో హుస్సేన్‌సాగర్ నుంచి రివ్వున ఎగిరిపోతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీన్ని కార్యరూపంలోకి తెచ్చే ప్రయత్నాలైతే సాగుతున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘సీ ప్లేన్’లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. తేలికపాటి విమానాలు నీళ్లలో దిగే ఏర్పాటుతోపాటు నేలపైనా దిగేందుకు అనువైనవి. సీప్లేన్లను రంగంలోకి దించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవచ్చని ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. గతంలో విదేశీ పర్యటన సమయంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిపై దృష్టి సారించారు. అక్కడి తరహాలో హైదరాబాద్‌లో సీ ప్లేన్‌ను అందుబాటులో ఉంచితే గగనతలం ద్వారా హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుం దని, ఇది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో కసరత్తు మొదలైంది. కేవలం పర్యాటకులను తిప్పటానికి మాత్రమే వాటిని పరిమితం చేయకుండా హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు కూడా వాటిని నడిపితే ఎలా ఉంటుందనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టులు అవసరం లేనందున ఆ నగరాల్లోని నీటి వనరులను టేకాఫ్, ల్యాండింగ్‌కు వాడొచ్చు. వరంగల్‌లో భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు టేకాఫ్, ల్యాండింగ్‌కు సరిపోతాయో లేదో పరిశీలించనున్నారు. ఇక కరీంనగర్‌కు ఆనుకునే ఉన్న లోయర్ మానేర్‌డ్యాం బాగా ఉపయోగపడనుంది. 15 నిమిషాల ప్రయాణానికి రూ.4 వేల వరకు, అరగంట ప్రయాణానికి 9 వేల వరకు చార్జి చేసే అవకాశం ఉంది. ఒక్కో విమానంలో పదిమంది ప్రయాణించే వెసులుబాటుంటుంది. హెలికాప్టర్లు నడిపేందుకు... ఇక హెలికాప్టర్లు నడిపేందుకు మరో రెండు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటికోసం హెలీప్యాడ్లు తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది. అందుకుగాను ఆ సంస్థకు రుసుము చెల్లించే విషయంలో చర్చలు సాగుతున్నాయి. సరిపడా స్థలాన్ని కేటాయిస్తే తామే నిర్వహించేందుకు సిద్ధమని పర్యాటక శాఖ స్పష్టం చేసింది. ఇది కూడా మరో వారంపదిరోజుల్లో కొలిక్కి రానుంది. వెరసి ఫిబ్రవరిలో ఇటు హెలికాప్టర్ అటు సీ ప్లేన్లు అందుబాటులోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటకప్రాంతాలను గగనతలం నుంచి వీక్షించే అనుభవం లేని నగర పర్యాటకులు వాటి రాకకోసం ఎదురుచూస్తున్నారు. మరికొద్దిరోజుల్లో స్పష్టత హైదరాబాద్ కేంద్రంగా సీప్లేన్ నిర్వహణకు రెండు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వాటితో ధరల విషయంలో చర్చలు సాగుతున్నాయి. టికెట్లను ప్రభుత్వమే విక్రయించుకుని తమకు నెలవారీ నిర్ధారిత మొత్తాన్ని చెల్లించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. వాటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుని టికెట్లను ఆయా సంస్థలే విక్రయించుకోవాలని పేర్కొంటోంది. దీనిపై మరో వారంపది రోజుల్లో స్పష్టత రానుంది.