యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి.. 2050– విజన్‌తో వరంగల్ మాస్టర్ ప్లాన్
వరంగల్ అభివృద్ధిపై సమావేశంలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రానున్న 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం రూపొందుతున్న మాస్టర్‌ప్లాన్ తు దిదశలో ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేస్తామని వెల్లడించారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఆయా జిల్లా ల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. నగర మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం అంశాలపై చర్చించారు.
పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించి, ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువులో పూడిక తీసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు.
వరంగల్ ప్రజల చిరకాల వాంఛ ఎయిర్ పోర్టు: మంత్రి కొండా సురేఖ
వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపా రు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి అంగీకరించిందని చెప్పారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎ మ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె నాగరాజు, నాయిని రాజేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment