కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌ | Minister Ponguleti Challenge To Ktr On Corruption Charges | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌

Published Sat, Sep 21 2024 7:07 PM | Last Updated on Sat, Sep 21 2024 7:44 PM

Minister Ponguleti Challenge To Ktr On Corruption Charges

సాక్షి,హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌ విసిరారు.కేటీఆర్‌ చెప్పినట్లు అమృత్‌ స్కీమ్‌ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు.సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్‌21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌ టెండర్లను గత ‍ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.

ఇదీ చదవండి.. సీఎం రేవంత్‌ ప్రమేయంతోనే అమృత్‌ టెండర్లలో అవినీతి: కేటీఆర్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement