త్వరలోనే సీఎంపై హైకోర్టులో కేసు వేస్తా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన సీఎం అక్రమార్జనపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వ్యవహరిస్తూ తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు.
పెద్దసంఖ్యలో ఫైళ్లపై సంతకాలు పెడుతూ.. కిరణ్ వేలకోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కిరణ్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ త్వరలోనే హైకోర్టులో కేసు వేస్తానని ఆయన తెలిపారు. కాగా రాజీనామా చేయడం ద్వారా మంత్రి శ్రీధర్‌బాబు... సీఎంకు సరైన సమాధానమిచ్చారని అన్నారు.