
సాక్షి, యాదాద్రి: టీపీసీసీ పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా నని నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలా తాను పార్టీలు మారనన్నారు. నల్లగొండలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ సత్తా చాటుతామన్నారు. కేసీఆర్‌ను పదవి నుంచి దింపడానికి పాదయాత్ర.. లేక మరో రూపంలో ఉద్యమం చేస్తామన్నారు.