నార్కట్‌పల్లిలో మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో చిరుమర్తి
సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్) : ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విఫలం విషయమై త్వరలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చంచి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించి పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో వెళ్తామని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో నార్కట్‌పల్లిలో గల వివేరా హాటల్‌లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నల్లగొడలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోవడంతో నాయకులు సంబరాలు జరుపుకునేందుకు ఇష్టపడడం లేదన్నారు. నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసి అధిక మెజార్టీ సాధిస్తారని జోస్యం చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంతోపాటు జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నట్లు వివరించారు. ఒక గ్రామం నుంచి ముగ్గురు ఒకేసారి అసెంబ్లీకి పోవాలనే ఉద్దేశంతో పోటీచేసినట్లు తెలిపారు. ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మా గెలుపునకు కృషిచేసిన మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు, ప్రజాకుటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రసన్నరాజు, మేకల రాజిరెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, సాగర్ల గోవర్ధన్, చిలువేరు గిరి, యాణాల రాంరెడ్డి, చిన్న మల్లయ్య, కన్నెబోయిన సైదులు, భూపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సమద్, వెంకన్న తదితరులు ఉన్నారు,
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
చౌటుప్పల్ (మునుగోడు) : నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మంగళవారం చౌటుప్పల్‌కు వచ్చారు. స్థానిక తంగడపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా తన గెలుపుకోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లసింగారం మాజీ సర్పంచ్ సుర్వి నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, తిరుపతి రవీందర్, తీగుళ్ల కృష్ణ, ఎస్‌కె.జానిబాబు, తొర్పునూరి నర్సింహ, ముమ్మడి నవీన్, బాతరాజు మల్లేశ్, పల్చం సత్యం, పెద్దగోని రమేష్, మునుకుంట్ల శేఖర్, వెంకటేశం, చెరుకు యాదయ్య, మల్లేశ్, రమేష్, కృష్ణ, నరేష్, ఎస్.వెంకటేశం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment