సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మరో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లాలో టీఆర్‌ఎస్ తొలిసారిగా నాలుగు నియోజకవర్గాల్లో ఖాతా తెరిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐనుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన మిర్యాలగూడ అభ్యర్థి ఎ¯.భాస్కర్‌రావు, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా కంచర్ల రికార్డుకెక్కారు. గత ఎన్నికల్లో కంచర్ల ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పరాజయం పాలు కాగా, ఆయన ఇలాకాలో తొలిసారిగా టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో జానా మీద పోటీచేసి ఓడిన నోముల నర్సింహయ్య ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన జమానాకు తెరదించారు.
జానా కోటలో గెలిచిన రెండో నేత
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌పైన ఓడిపోయారు. 1994 ఓటమి తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు జానా గెలుపొందారు. తిరిగి ఇరవై ఏళ్ల విరామం తర్వాతా అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన నోమల నర్సింహయ్య చేతిలో జానా ఓడిపోవడం గమనార్హం.
రెండు స్థానాలు కోల్పోయిన టీఆర్‌ఎస్
2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్‌ఎస్ గెలిచిన రెం డు స్థానాలను ఈ ఎన్నికల్లో కోల్పోయింది. కమ్యూనిస్టులకు అడ్డగా అప్పటి దాకా నిలబడిన నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవగా, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఇవే నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసిన వేములవీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఈ ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించా రు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ 1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా మునుగోడులో సీపీఐ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఓడిపోయారు. మళ్లీ మూడు ఎన్నికల విరామం తర్వాత రాజగోపాల్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ను విజయం వరించింది.
జానా, కోమటిరెడ్డి పరాజయం...
మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్న సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో తొలిసారి టీఆర్‌ఎస్‌ఖా తా లో పడ్డాయి. 1983 నుంచి ఒక్క టర్మ్ మినహా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డిదే. 1994 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుస్తూ వస్తోన్న మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. దివగంత సీఎం వైఎస్‌ఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. అయిదో సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు.
మిర్యాలగూడలో కారు హవా !
కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన మిర్యాలగూడ ని యోజకవర్గంలో సైతం కారు జోరు సాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలి చిన ఎన్.భాస్కర్‌రావు ఈసారి టీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన పైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఏడు సార్లు గెలుపొందింది. సీపీఎం ఐ దు సార్లు విజ యం సాధిం చిం ది. అయితే ఈ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌పేరుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జూలకంటిరంగారెడ్డి పదివేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దేవరకొండలో మూడోసారి రవీంద్ర గెలుపు
దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన రవీంద్రకుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా గెలిచిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ మారాక, ఈ సారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రవీంద్రకుమార్ దేవరకొండలో గులాబీ ఖాతా తెరిచారు. 2004, 2014 ఎన్నికల్లో రవీంద్రకుమార్ కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ నుంచి పోటీ చేసిన రవీంద్ర కుమార్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బాలునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి ఈ ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మ¯గా ఎన్నికైన బాలునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో ఆయన సొంతగూటికి వెళ్లి టికెట్ తెచ్చుకుని పోటీ పడినా పరాజయం పాలయ్యారు.
నల్లగొండ : కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment