సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్‌ఎస్) విజయం సాధిం చగలిగారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్‌రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు.
పదవులున్న వాళ్లంతా...!
టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లకు కూడా ఓటమి తప్పలేదు.
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
Published Wed, Dec 12 2018 6:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment