సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్స్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తమపై గెలుపొందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక టీడీపీ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు వేసిన పిటిషన్లన్నిటిని ఒకే కేసు కింద పరిగణించి విచారిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది.
కొడంగల్ అధికార పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నియమావాలిని ఉల్లంఘించారని, ఎన్నికల్లో రూ. 6.5 కోట్లు ఖర్చు చేసినట్లు డైరీ దొరికిందని కాంగ్రెస్‌నేత రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలని అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేసారు. కొంత మంది అధికారులు కొప్పుల ఈశ్వర్‌తో కుమ్మక్కై ఈవీఎంల టాంపరింగ్ చేశారని, ఈవీఎంలు భద్రపరిచిన గదులకు కనీసం సీల్ కూడా వేయలదని, భద్రతను గాలి కొదిలేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల జరిగిన 45 రోజులు లోపు మాత్రమే కోర్ట్ను ఆశ్రయించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, దాసోసు శ్రవణ్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ ,టీడీపీ అభ్యర్థి చంద్ర శేఖర్‌లు పిటిషన్లు వేసారు.
Comments
Please login to add a commentAdd a comment