ఈ నేతలు... వరుస విజేతలు | Janareddy, komatireddy venkata reddy, uttam kumar reddy Hat-trick win in nalgonda district | Sakshi
Sakshi News home page

ఈ నేతలు... వరుస విజేతలు

Published Sat, May 17 2014 2:39 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

ఈ నేతలు... వరుస విజేతలు - Sakshi

ఈ నేతలు... వరుస విజేతలు

నల్గొండ : సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధిస్తూ అధికార పార్టీ నాయకులు రికార్డులు సృష్టించారు. గడిచిన మూడు ఎన్నికల్లో వరుస విజయాలను కైవసం చేసుకుంటూ వస్తున్న నేతలు ఈ ఎన్నికల్లో కూడా విజయభేరి మోగించారు. జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కుందూరు జానారెడ్డి ఇప్పటివరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

1983, 85 ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండుసార్ల విజయం సాధించిన ఆయన ఆ తర్వాత... 1989,1999, 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు.

ఇక మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకూ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999,2004 ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందిన ఆయన 2009 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి, 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి తిరుగులేని మెజార్టీ సాధించి నాలుగోసారి ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు.

అలాగే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1999 నుంచి 2009 వరకూ జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఈ ఎన్నికల్లో కూడా గెలిచి రికార్డు సృష్టించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement