హాలియా: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలోనూ కాంగ్రెస్ పారీ్టదే అధికారమని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించా రు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఏ అధికారి అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తనకు సమాచారం అందించాలని సూచించారు.
చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’
Comments
Please login to add a commentAdd a comment