haliya
-
అమ్మా.. నీ వెంటే నేనూ.. గంటల వ్యవధిలో తల్లీకుమారుడి మృతి..
సాక్షి, నల్లగొండ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లీ కుమారుడు గంటల వ్యవధిలో మృతి చెందారు. మాతృ దినోత్సవం రోజు నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేటకు చెందిన వందనపు పార్వతమ్మ (95), చంద్రయ్య దంపతులకు కుమారుడు వందనపు ఈశ్వరయ్య (74)తో పాటు ఐదుగురు కుమార్తెలు సంతానం. వందనపు చంద్రయ్య గ్రామంలోనే కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని పిల్లలను పెంచి పెద్దచేసి అందరి వివాహాలు జరిపించాడు. పదహారేళ్ల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. వీరి కుమారుడు ఈశ్వరయ్య ఇబ్రహీంపేటలో నివసిస్తూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. పార్వతమ్మ, ఈశ్వరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ వద్ద ఉంటున్న పార్వతమ్మ తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందింది. అదేరోజు కుమారుడు వందనపు ఈశ్వరయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్లగొండ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. తల్లి, కొడుకు ఒకే రోజు 12 గంటల వ్యవధిలో మృతి చెందడంతో ఇబ్రహీంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం: జానారెడ్డి
హాలియా: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలోనూ కాంగ్రెస్ పారీ్టదే అధికారమని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించా రు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఏ అధికారి అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తనకు సమాచారం అందించాలని సూచించారు. చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ -
రాహుల్ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు: కేటీఆర్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ, రాహులల్ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేసి చూపిస్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే భగత్ కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జానారెడ్డి అంటే గౌరవం.. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా.. ఫ్లోరైడ్ నిర్మూలన చేయలేదు. రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు గత పాలకులు. ఫ్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పెద్దమనుషుల ఆత్మగౌరవం పెంచిన నేత కేసీఆర్.. బీడీ కార్మికుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ అని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పథకాలు చరిత్రాత్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. మంత్రులుగా సుదీర్ఘంగా పనిచేసినా 6 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వలేదు గత పాలకులు. దేశంలో రైతుల కోసం అనేక పథకాలు ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ మాత్రమే. మనం కట్టే పన్నులు పక్క రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి. ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారు.? రాహుల్‌కు ఒక్కసారి అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏమీ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉంది’’ అని అన్నారు. Live: Addressing a mammoth public meeting in Nagarjuna sagar https://t.co/MiBZMZIUC5 — KTR (@KTRTRS) May 14, 2022 ఇది కూడా చదవండి: అమిత్‌షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ.. -
‘ఇంకొంచెం వడ్డించమ్మా’.. కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర ఫోటోలు..
సాక్షి, నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను మించి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు అడిగిన సమస్యలను పరిష్కరిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. సోమవారం వాటి అమలు కోసం హాలియాకు వచ్చారు. అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టడంతో మరిన్ని వరాలు ఇచ్చారు. సాగర్ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తాను భగత్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ది ఏమిటో చేసి చూపిస్తానని చెప్పానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్దిలో చాలా వెనుకబడి ఉందని, పట్టణం ఏమీ బాగా లేదని చెబుతూనే.. అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ఇస్తానని ప్రకటించారు. ఇంకొంచెం వడ్డించమ్మా: ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజనం చేస్తున్న సీఎం కేసీఆర్ వంటలు భేష్ పెద్దవూర: సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ స్వగృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. సీఎంతో పాటు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకే టేబుల్‌పై కూర్చుని భోజనాలు చేయగా వారికి ఎమ్మెల్యే , ఆమె సతీమణి భవాని వడ్డించారు. భోజనంలో మాంసం, తలకాయ కూర, బొటీ, నాటుకోడి కర్రీ, చికెన్ ఫ్రై, చేపల కర్రీ, రోస్టు, పప్పు, సాంబారు, పెరుగు, ఒక స్వీటు వడ్డించారు. ఎమ్మెల్యే భగత్ భోజనాలు వడ్డిస్తుండగా మాతో పాటు భోజనం చేయమని సీఎం అనడంతో అతను కూడా వారితో కూర్చుని తిన్నారు. వంటలు బాగున్నాయమ్మా అంటూ సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చాడు. వెల్కం సార్ : ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మీ రాక మాకెంతో ఆనందం : ముఖ్యమంత్రికి మంగళహారతితో స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే భగత్ కుటుంబ సభ్యులు వెళ్తొస్తా : హెలికాప్టర్లో తిరిగి వెళ్తున్న ముఖ్యమంత్రి -
గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే రావు: సీఎం కేసీఆర్
-
ముళ్ల చెట్లు పెట్టి కాయలు కాయాలంటే కుదరదు: కేసీఆర్
-
భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి నల్లగొండ: ‘ఎన్నికలొచ్చాయని ఆగమాగం కావొద్దు. అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది. విచక్షణతో ఆలోచించండి. గాడిదలకు గడ్డి వేస్తే.. ఆవులకు పాలు రావు. ముళ్లచెట్లు పెట్టి పండ్లు రావాలంటే వస్తాయా? పండ్ల చెట్లే పెట్టాలి.. అభివృద్ధి చూసి ఓటెయ్యండి..’ అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘గతంలో హాలియా సభలో మీకు చెప్పా. ఎవరేం చేశారో ఊళ్లకు వెళ్లి చర్చించమని. ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఆలోచించమని. ఇప్పుడూ అదే చెబుతున్నా. మీరంతా ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. ఎవరు గెలిస్తే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందో నిర్ణయించుకుని ఉంటారు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ గాలి 17 దాకా ఉండాలి ‘నోముల నర్సింహయ్యను కోల్పోవడం నాకూ బాధగానే ఉంది. ఆయన వామపక్ష పార్టీలో, అనేక ఉద్యమాల్లో పనిచేశారు. అదే స్థాయిలో పనిచేస్తడని, ఆయన కుమారుడు భగత్‌ను మీ ముందుకు తెచ్చిన. ఇప్పటికే ఆయన పేరు చెప్పగానే మీరు ఈలలు వేస్తున్నారంటే గాలి బాగానే ఉంది. అది 17వ తేదీ దాకా ఉండాలి. ఓటు రూపంలో ఉండాలి. మీ ఓట్లు దునికినట్లే నెల్లికల్లు లిఫ్ట్ ద్వారా నీళ్లు దునుకుతాయి. అలంపూర్‌లో లిఫ్ట్ విషయంలో కాంగ్రెస్ పట్టించుకోలేదని, అక్కడ నేను లిఫ్ట్‌ను పూర్తి చేస్తానని, ఓట్లు దుంకినట్లే నీళ్లు దుంకుతాయని చెప్పా. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అదే తరహాలో నెల్లికల్లు లిఫ్ట్ కూడా పూర్తి చేస్తాం. ఏడాదిన్నరలో నెల్లికల్లు లిఫ్ట్ పూర్తికాపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించడాన్ని నేను సమర్థిçస్తున్నా. ఆయన సవాల్లో ధైర్యం, నిజాయితీ ఉంది. వందశాతం ఆయన కరెక్ట్‌గానే చెప్పిండు. భిక్షమెత్తి అయినా నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేస్తా..’ అని హామీ ఇచ్చారు. నందికొండకు డిగ్రీ కాలేజీ ‘జానారెడ్డి 30 ఏళ్ల చరిత్ర, 60 ఏళ్ల చరిత్ర అంటడు.. ఇన్నాళ్లూ నందికొండ అటు మున్సిపాలిటీ కాదు.. గ్రామపంచాయతీ కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టీఆర్ఎస్ వచ్చాక మున్సిపాలిటీగా ఏర్పాటు చేశాం. అక్కడ ప్రాజెక్టు భూములు ఆక్రమించుకొని కొందరు బంగ్లాలు కట్టుకున్నారు. కానీ పేదలను పట్టించుకోలేదు. భగత్ గెలిచాక నేను స్వయంగా వచ్చి సర్టిఫికెట్లు ఇస్తా. సాగర్‌లో బీసీ గరుకులం ఉంది. ఇప్పుడు నందికొండకు డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేస్తా. 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న జానారెడ్డి హయాంలో డిగ్రీ కళాశాలకు దిక్కులేకుండా పోయింది. నర్సింహయ్య వెంటపడితే హాలియాలో డిగ్రీ కాలేజీ మంజూరు చేసిన. ఇప్పుడు సాగర్‌కు కూడా మంజూరు చేస్తున్నా..’ అని ప్రకటించారు. కాంగ్రెస్ సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేది? ‘కేసీఆర్‌కు సీఎం పదవి ఎవడి బిక్షో కాదు. తెలంగాణ ప్రజలైన మీరు పెట్టిన భిక్ష. వీళ్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఆ రోజు నేను డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ జెండా ఎత్తాను. వస్తే రాష్ట్రం రావాలి.. పోతే ప్రాణం పోవాలని, వెనుకడుగు వేస్తే రాళ్లతో కొట్టమని చెప్పాను. అసలు కాంగ్రెస్ నేతలు సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేది? పదవుల కోసం తెలంగాణను కాంగ్రెస్ నాయకులు వదిలేస్తే, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పదవులను వదిలేసింది. ఇదంతా ప్రజల కళ్ల ముందు జరిగిన చరిత్ర. ఇదంతా ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు గతంలో ఎక్కడివి. రైతు చనిపోతే రూ.50 వేల సాయం చేయడానికి నానా తిప్పలు పెట్టేవారు. గీకెటోడు.. గోకెటోనికి పోను చేతిలో రూ.10వేలు పెట్టేవారు. ఇప్పుడు ఒక గుంట భూమి ఉన్నా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా సొమ్ము నేరుగా అకౌంట్లో పది రోజుల్లో పడుతోంది. అప్పటిలాగా ఇప్పుడు గీకేటోడు గోకేటోడు లేడు. పైరవీలు లేకుండానే డబ్బులు నేరుగా అకౌంట్లలో జమ అయి సెల్‌ఫోనుకు మెసేజ్ వస్తుంది. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు తేడా ఇదే. ధరణి పోర్టల్ లేకముందు ఒకరి భూములను ఒకరు గుంజుకునే పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు..’ అని కేసీఆర్ చెప్పారు. అరవై ఏళ్ల పాలనలో ఆగమాగం చేసిండ్రు ‘నల్లగొండ మీద నేనే పాట రాసినా. ‘ఏమాయేను నల్లగొండ.. నీ గుండెనిండా ఫ్లోరైడు బండ..’ అని ఫ్లోరైడ్పై పాట రాశా. ఫ్లోరిన్ గోస గురించి మీకు తెలియంది కాదు. ఇప్పుడు మిషన్ భగీరథ నల్ల నీళ్లల్ల కేసీఆర్ కనిపించడంలేదా? అరవై ఏళ్లు ఆగమాగం చేసిండ్రు. కరెంటు సమస్య ఆనాడు ఎట్ల ఉండె.. ఈనాడు ఎట్లుంది? పాముకాట్లు, తేలుకాట్లు లేవు. ఇవి ఒట్టిమాటలు కావు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసినం. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కష్టపడి పనిచేశారు. కరెంటు ఎట్ల వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు సాగు మీదనే మా దృష్టి. కాళేశ్వరంతోటి అక్కడి ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ కూడా నెల్లికల్లు లిఫ్ట్ పూర్తయి మీరు ఆ నీళ్లల్లో కేరింతలు కొట్టాలి. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణాలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు జరిగే సందర్భంలో గోదావరి నీళ్లు వాడుకునేలా పెద్దదేవులపల్లికి నీళ్లు తెస్తాం..’ అని స్పష్టం చేశారు. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనాథ ‘దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశాం. ఏపీ మూడో స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనా«థ. అడిగేవారు లేరు.. నిలదీసేవారు లేరు. మీరంతా తెలిసీ తెలియనట్లు ఉండొద్దు. అర్థమై అర్థంకానట్లు ఉండొద్దు. ఆలోచించాలి. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తున్నాం. మంచి చేసేవారిని ఆదరిస్తే మంచి జరుగుతుందని ప్రజలు గమనించాలి. హాలియాలో షాదీఖానా కావాలని, మసీదును రిపేర్ చేయాలని కోరుతున్నారు. వీటిని పూర్తి చేయించే బాధ్యత నాది..’ అని సీఎం భరోసానిచ్చారు. జానారెడ్డి గిరిజనులకు చేసిందేమీ లేదు ‘చెరువులను బాగుచేశాం. శ్మశానవాటికలు నిర్మించడంతో పాటు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఇచ్చాం. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల చరిత్ర చెప్పుకునే జానారెడ్డి గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలను, గూడేలను పంచాయతీలుగా చేయడంతో వారే పాలకులయ్యారు. నిజంగా అభివృద్ధి చేసిన వారిని ఆదరించండి. గతంలో గొర్రెలను మేసిండ్రు. మేం యాదవులకు గొర్రెలు ఇచ్చినం. ఈసారి కూడా 3 లక్షల యూనిట్లు ఇవ్వనున్నాం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గొర్రెల యూనిట్ల సబ్సిడీ పెంచాలని కోరుతున్నారు.. ’ అని తెలిపారు. ‘పోడు సమస్య’ సాగర్‌లో ఉండే పరిష్కరిస్తా ‘నాగార్జునసాగర్‌లో అభివృద్ధి కొనసాగాలి. ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య బాగా పనిచేస్తున్నారు. భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి. కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తా. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్త. 15 రోజుల్లో సాగర్‌కు వస్తా. నియోజకవర్గంలో అందరినీ పిలిపించి చర్చిస్తా. పెన్షన్లు, రేషన్‌కార్డులు కొన్ని ఆగిపోయాయి. త్వరలో వాటిని కూడా మంజూరు చేస్తా. గిరిజనుల పోడు భూముల సమస్య రాష్ట్రమంతటా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి నాగార్జునసాగర్ నుంచే శ్రీకారం చుడతా. రెండ్రోజులు సాగర్‌లో ఉండి ప్రజాదర్బార్ పెట్టి నియోజకవర్గంలో గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా. నెల్లికల్లు ఒక్కటే కాదు.. ఇటీవల దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయకుంటే ఓట్లు అడగం..’ అని కేసీఆర్ ప్రకటించారు. బహిరంగసభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. -
గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్
సాక్షి, నల్లగొండ: ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోంది. గ్రామాలు పచ్చబడ్డాయి. తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ ఇంటికిపోయి ఆలోచించండి. నేను చెప్పింది అబద్ధమైతే టీఆర్ఎస్ను ఉప ఎన్నికలో ఓడించండి. నిజమైతే మిగతా పార్టీలకు డిపాజిట్ దక్కకుండా చేయాలి.’అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతోపాటు.. మరో 13 ఎత్తిపోతల పథకాలకు ఆయన బుధవారం తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు వద్ద ఒకేసారి శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియా మండల పరిధిలోని 14వ మైలురాయి (అలీనగర్) వద్ద జిల్లా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల ధన్యవాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారభేరీగా సాగిన ఈ సభలో ఆయన నల్లగొండ జిల్లాపై వరాలు కురిపించారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం ‘కృష్ణానదిలో సాధారణంగా నీరు తక్కువగా వస్తుంది.. రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా రావడం వల్ల ఇబ్బంది లేదు. వర్షాలు రానప్పుడు లిఫ్ట్‌లు నిలిచిపోకుండా గోదావరి జలాలతో ïసీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలిస్తాం. లిఫ్టు ద్వారా గోదావరి జలాలను పెద్దదేవులపల్లికి తరలించి గోదావరి– కృష్ణా నదులను అనుసంధానం చేస్తాం. రూ.600 కోట్లతో అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సాగునీటి కష్టాలు తీరి నల్లగొండ కళకళలాడుతుంది. గోదావరి జలాలు తెచ్చి నల్లగొండ ప్రజల కాళ్లు కడుగుతా’అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఎంతో అన్యాయానికి గురైందని, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి జిల్లాను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జరిగిన అన్యాయం ఇక జరగవద్దని, తానే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్లు వద్ద లిఫ్ట్‌ల శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్ కొత్త పెన్షన్లు– రేషన్ కార్డులు ‘కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్‌లో పడిపోయాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరోనా దెబ్బకొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూ చేస్తా’అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకుండా నూతన రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దళితుల అభివృద్ధికి బడ్జెట్లో రూ.వేయి కోట్లు ‘దళితజాతి ఇంకా వెనుకబడే ఉంది. అందరం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అన్ని వర్గాలూ బాగుపడాలి. అప్పుడే రాçష్టం మరింత అభివృద్ధి చెందుతుంది. బడ్జెట్లో దళిత అభివృద్ధి కోసం వేయి కోట్లు పెడతా. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటం.. నేనే పర్యవేక్షిస్తా’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణను బంగారు తునక చేసేందుకు కష్టపడుతున్నా... ప్రజలు గుర్తించాలన్నారు. ఎక్కడైన గాలి మాటలు మాట్లాడితే అవి విని మోసపోవద్దని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ‘మమ్మల్ని నిలబెట్టే బాధ్యత మీదే. నేను చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్దం ఉన్నా టీఆర్ఎస్ను ఓడించండి. నిజమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా చేయండి. సాగర్ ఉప ఉన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. రాజకీయ గుంట నక్కల మాటలు నమ్మి మోసపోవద్దు. అండగా ఉండండి... మిమ్ములను కాపాడుకుంటా’అంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు ఏడాదిన్నరలో ... ఎత్తిపోతలు పూర్తి ‘నల్లగొండ జిల్లాలో 13 లిఫ్టులను రూ.2,500 కోట్లతో చేపడుతున్నాం. వీటిని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం’అని సీఎం స్పష్టం చేశారు. ఎడమ కాలువ కింద ఎకరా మిగలకుండా నీరు ఇవ్వడమన్నదే తన ఉద్దేశమన్నారు. ‘చాలెంజ్ చేస్తున్న .. లిఫ్ట్‌లు ఏడాదిన్నరలో పూర్తి కాకపోతే ఓట్లు అడగం..’అని సవాల్ చేశారు. నోముల నర్సింహయ్య తన పక్కన లేడని చాలా బాధగా ఉందన్నారు. మిషన్ భగీరథ నీరు ఇస్తేనే ఓట్లు అడుగుతామని ఎన్నికలకు ముందు చెప్పిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విచక్షణతో ఆలోచించాలన్నారు. నల్లగొండకు నిధుల వరద... ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు సీఎం కేసీఆర్ హాలియా సభలో నల్లగొండ జిల్లాకు నిధుల వరద పారించారు. సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని, వీరికి తోడ్పాటునందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాలకు రూ.30 లక్షలు, జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ రూ.5 కోట్లు, మిగిలిన 6 మున్సిపాలిటీలకు ఒక్కో కోటి రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అవాకులు, చవాకులు పేలుతోంది ‘కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పేలుతోంది. బీజేపీది కొత్త బిచ్చగాళ్ల వ్యవహారం. మిడిసి పడొద్దు. వీరు పిడికెడు.. తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయితరు. సభనాడు వచ్చి గోల చేయడం సంస్కారం కాదు. ప్రజలే తీర్పు చెబుతరు. పార్టీలు, నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. చాలా మందితో పోరాడినం. తొక్కిపడేస్తం..’అని సీఎం కేసీఆర్ విపక్షాలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సీఎల్పీ నాయకుడు ఆదిలాబాద్ వరకు పొలంబాట – పోరు బాట అంటున్నడు.. పొలానికి ఏమైంది? బుద్ధిమంతుల్లా ఉంటే మంచింది. డంబాచారాలు చెప్పుకునే ప్రభుత్వం కాదు మాది’అని పేర్కొన్నారు. ‘తెలంగాణలో దుస్థితికి కారకులు ఎవరు? కాంగ్రెస్‌కు తెలంగాణ అనే పదం ఉచ్చరించే హక్కు లేదు. రైతుల ఆత్మహత్యలకు ఈ పార్టీ కాదా కారణం..? హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. విభిన్న సంస్కృతితో విలసిల్లింది. అలాంటి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ దుర్మార్గులు కాదా’అని మండిపడ్డారు. ఒక ముక్క మహారాష్ట్రలో, మరో ముక్క ఏపీ, ఇంకోటి కర్నాటకలో కలిపారన్నారు. గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకలు పైరవీల కోసం, పదవులు, పైసల కోసం ఆలోచించారు తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా మండలం అలీనగర్ వద్ద జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ప్రజలు. అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి .. లేదంటే మీకే నష్టం బహిరంగ సభలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేకలు వేయడంతో సీఎం సీరియస్ అయ్యారు. ‘అయిదుగురులేరు మీరు... వెళ్లిపోండి. మా వాళ్లు తలుచుకుంటే మీరు నశ్యం అవుతారు. పిచ్చిపనులు చేయొద్దం’టూ హెచ్చరించారు. ‘బీజేపీ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా వ్యవహరిస్తోంది. మీలాగా మాట్లాడటం చేత కాకకాదు. మీరు పిడికెడు, తలుచుకుంటే నశ్యం.. నశ్యం అవుతరు. మీరూ సభ పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. మేము పెట్టుకున్న సభను అడ్డుకోవడం సరికాదు. ఇలాంటి పిచ్చి చేతలు మానుకోవాలి’అంటూ హెచ్చరించారు. ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే .. ఎత్తిపోతల అవసరం వచ్చేదే కాదు ‘నాగార్జునసాగర్‌ను ఇప్పుడున్న చోట కాకుండా 19 కిలోమీటర్ల పైన... ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉండే. కేఎల్‌రావు అనే దుర్మార్గుని వల్ల అన్యాయం జరిగింది. దీంతోనే నేడు లిఫ్ట్‌లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్ నేతలు కళ్లు మూసుకోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొంది. ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేకపోయారు. 2007లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి, రైతుల ఇబ్బందులు తెలుకున్న. ఆనాడు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వను.. ఏం చేస్తారో చేసుకోండి అన్నా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. అలాంటి నాయకులు నేడు పొలంబాట, పోరుబాట.. బొందబాట అంటూ తిరుగుతున్నరు’.. అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే కమీషన్ల కోసం అంటున్నరు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును మీరు కట్టింది.. కమీషన్ల కోసమేనా’అని నిలదీశారు. ప్రజలు మౌనంగా ఉండరాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉండరాదని, చైతన్యంతో ఉండాలని సీఎం అన్నారు. ‘జిల్లాలో 1.50 లక్షల మందిని ఫ్లోరిన్ పొట్టన పెట్టుకుంది.. ఒక్కరన్నా దానిపై మాట్లాడిండ్రా..? ఒక్కరన్నా ఉద్యమించారా? నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి టేబుల్ మీద ఫ్లోరిన్ బాధితుడిని ఉంచి తమ గోడును వెల్లబోసినా సమస్య పరిష్కారం కాలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టినం. మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినం. అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.. ఇయ్యాల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు. తెలంగాణ రాకుముందు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు భారతదేశంలోనే 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పొలంబాట, పోరుబాట ఎందుకు చేస్తోంది? మేము రైతులకు నాణ్యమైన కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నందుకు కాంగ్రెస్ పొలంబాట–పోరుబాట చేస్తోందా? అని కేసీఆర్ నిలదీశారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనాడు 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నేడు రైతు బీమాతో వారం రోజుల్లోనే రూ.5లక్షలు రైతు కుటుంబానికి అందిస్తున్నాం. కాంగ్రెస్‌కు కడుపుమంట.. రెతుని ఆదుకునేందుకు విజయ డెయిరీ పాలసేకరణ ధరను పెంచాం. మిషన్ కాకతీయలో 48 వేల చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. దేశంలో ఆత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. 1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగుచేశాం. దీనిని వచ్చేసారి మరో 85 లక్షల ఎకరాలు పెంచుతాం’అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి దేశంలో ఎక్కడాలేదని, ఆడబిడ్డలు బరువు కావద్దన్న ఉద్దేశంతో తానే స్వయంగా ఆలోచించి పథకం పెట్టానన్నారు. కంటి వెలుగుతో ఉచితంగా అద్దాలు, కేసీఆర్ కిట్టుతో గర్భిణులను ఆదుకుంటున్నామని.. ఆడబిడ్డ çపుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు అయితే 12వేలు ఇçస్తున్నామని, ఇదంతా గ్రామాలకు వెళ్లి ఆలోచించుకోవాలని కోరారు. ధరణితో .. అవినీతికి చెక్ ‘రెవెన్యూలో, రిజిస్ట్రేషన్ శాఖల్లో లంచాలు తగ్గించేందుకు ధరణి తీసుకువచ్చాం. ధరణి ద్వారా పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయి. దీంతో లంచాల భారం పోయింది. అందుకోసమని కాంగ్రెస్ పోరుబాట చేస్తోందా..? మీది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. గ్రామాలను రావణ కాష్టంలా మార్చారు. త్వరలోనే భూ పంచాయితీల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోబోతున్నాం. దే«శంలోనే భూ పంచాయితీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది’అని సీఎం పేర్కొన్నారు. పేదరికం పోవాలి ‘రాష్ట్రంలో యాదవులను ఆదుకునేందుకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాం. 7.50 లక్షల దరఖాస్తులు రాగా 3.70 లక్షల యూనిట్లు అందించాం. ఈ బడ్జెట్లో మరో 2 లక్షల యూనిట్లకు నిధులు కేటాయిస్తాం. కాంగ్రెస్ నాయకులేమో గొర్రెలు మేసిండ్రు అని విమర్శించారు. మత్య్సకారులను ఆదుకునేందుకు రూ.160 కోట్లతో ఉచిత చేపపిల్లల పథకం ప్రవేశపెట్టాం. నాయీబ్రాహ్మణుల కోసం ప్రతి గ్రామంలో ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు లక్ష రూపాయలు మంజూరు చేయనున్నాం’అని ప్రకటించారు. టీఆర్ఎస్ది క్లీన్ గవర్నమెంట్ ‘రైతుబంధును రూ.15 వేల కోట్లతో చేపడుతున్నాం. ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడైనా చూశామా.? రూ.500 ఇస్తే.. రూ.250 లంచాలకే పోయేది. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్.. క్లీన్ గవర్నమెంట్. అవినీతి రహిత ప్రభుత్వం మాది. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉండాలి. రైతుబంధు ద్వారా లబ్ధి పొందుతరు.. మళ్లీ రోడ్లమీదకు వచ్చి అంటరు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 2,600 రైతు వేదికలను నిర్మించాం. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,768 గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించాం. గ్రామాల రూపురేఖలన్నీ మారిపోయాయి. హరితహారం ద్వారా చెట్ల పెంపకం జరుగుతోంది. గతంలో అమెరికా స్టోరీలే వినేవాళ్లం. నేడు తెలంగాణ గురించి వారే తెలుసుకునే పరిస్థితి వచ్చింది. గ్రామాలన్నీ అంత పరిశుభ్రంగా తయారయ్యాయి. సర్పంచులు బాగా పనిచేస్తున్నారు. వైకుంఠధామాలతో గ్రామాల్లో దహన సంస్కారాలు గౌరవంగా చేసుకునే వీలు కలిగింది. అన్ని కులాల వారికి వీటివల్ల మేలు జరుగుతుంది’అని అన్నారు. గిరిజన తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఏనాడూ ఏ ప్రభుత్వాలు వారి గురించి ఆలోచించిన పాపానపోలేదన్నారు. దామరచర్లలో 4వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని , రెండేళ్లలో పూర్తవుతుందని, దీనికోసం రూ.35వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అన్నారు. ‘యాదాద్రిని ఎవరూ పట్టించుకోలేదు. రూ.2వేల కోట్లతో పనులు చేపడుతున్నం. ప్రపంచమే వచ్చి చూసి పోతది. ఇవన్నీ చూసే కాంగ్రెస్‌కు కన్నుకుడుతోంది. ధర్మాన్ని గెలిపించాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, విప్ గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకపోతే.. ఓట్లు అడగను: కేసీఆర్
సాక్షి, హాలియా: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగా నిర్వహించింది. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత హాలియాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ఎదురెండలో కూడా ఇంత మంది నా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చినందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నల్లగొండలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌లు అందరూ ఎంతో బాగా పని చేస్తున్నారు. చెట్లు పెంచుతున్నారు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అన్నారు కేసీఆర్. ‘‘కేవలం అభినందనలు మాత్రమే కాక జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు.. ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయలు.. ఒక్కో మున్సిపాలిటీకి కోటి రూపాయలు.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. రేపే దీనిపై సంతకం చేస్తాను. సీఎం ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇస్తాను. అర్హులైన నిరుద్యోగులందరికి త్వరలోనే నిరుద్యోగ భ్రుతి, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. నెల్లికళ్లు-జింకలపాలేం భూ వివాదాన్ని పరిష్కరిస్తాం. అర్హులందరికి పట్టాలు ఇస్తాం’’ అన్నారు. రూ. 2,500 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఆయన మాట్లాడుతూ.. ‘‘నల్లగొండ వెనకబడిన జిల్లా. ఎందరు ముఖ్యమంత్రులు మారినా.. జిల్లాలో అభివృద్ధి జరగలేదు. జిల్లా సమస్యలన్ని నా దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది. నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వచ్చాను. వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశాను. వీటన్నింటికి 2500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఏడాదిన్నరలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాను. వేదిక మీద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల, గ్రామీణ ప్రాంత నాయకులంతా దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఏడాదిన్నరలోగా అన్ని సాగు నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి. ఈ హామీలన్నింటిని పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ అంటే ధీరుల పార్టీ.. వెన్నుచూపే పార్టీ కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నల్లగొండకు శాశ్వత ఆయకట్టు ఏర్పాటు చేసి.. సాగునీటికి సమస్య లేకుండా చూస్తాం. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను. డిండి ప్రాజెక్ట్ పూర్తయితే పాత నల్లగొండలోని 12 నియోజకర్గాలకు సాగు నీరుకు కరువుండదు’ అన్నారు. ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం ‘‘నల్లగొండలో ఫ్లోరైడ్ భూతం ఒక జనరేషన్‌ని నాశనం చేసింది. ఇక్కడి ఉద్యమ కారులు ఫ్లోరైడ్ బాధితుడిని తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ ముందు పడుకోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ టీఆర్ఎస్ ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టింది. అప్పటి చంద్రబాబు పంటలు వేసుకోమని చెప్పి.. మధ్యలో నీరు బందు పెట్టాడు. పంటలు ఎండిపోయాయి. అప్పుడు ఈ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. మేం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి.. నీరు ఇప్పించాం’’ అన్నారు. సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ కడుపు మండుతుంది ‘‘దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. మా ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు కరెంట్ ఇస్తుంది. దీనికే కాంగ్రెస్ నాయకులు కడుపు మండుతుంది. విజయ డైరీని పునరుద్దరించాం. లీటరు పాలకు ఐదు రూపాయలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా భూ గర్భ జలాలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ. త్వరలోనే దేశంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది’’ అన్నారు ‘‘తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి, కంటి చూపు, కేసీఆర్ కిట్.. ఆడపిల్ల పుడితే రూ. 13,500, మగ పిల్లాడు పుడితే రూ.12,000 ఇస్తున్నాం. రెవెన్యూలో అవినీతి నిర్మూలనకు, లంచాల బాధ నుంచి విముక్తి చేయడం కోసం ధరణిని తీసుకువచ్చాం. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గతంలో వీఆర్వోల చేతిలో పెట్టి గ్రామాలను రావణకాష్టం చేసిన వారు మీరు కాదా’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కుల వృత్తులను ఆదుకుంటాం ‘‘కుల వృత్తులను ఆదుకున్నాం. దానిలో భాగంగానే గొల్ల, కురమలకు గొర్రెలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 7,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి గొర్రెలు ఇచ్చాం. ఈ మార్చిలో మరో రెండు లక్షల మందికి.. వచ్చే ఏడాది మరో రెండు లక్షల మందికి గొర్రెలు ఇస్తాం. అన్ని కుల వృత్తులను ఆదుకుంటాం. రాబోయే బడ్జెట్లో ప్రతి గ్రామంలో ఆధునిక సెలూన్ల కోసం నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయలు ఇస్తాం’’ అన్నారు. 2,600 రైతు కేంద్రాలు నిర్మించాం ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో మొత్తం 2,600 రైతు కేంద్రాలు నిర్మించి ఇచ్చాం. రైతులంతా అక్కడ కూర్చుని మాట్లాడుకుని అన్ని విషయాలు చర్చించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు మీకు సేవ చేస్తారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజలు గుర్తించాలి. గతంలో సిద్ది పేటలో నాలుగు మొక్కలు పెడదాం అంటే దొరకలేదు. కానీ నేడు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లు అందజేశాం. ప్రతి గ్రామానికి స్మశాన వాటిక, వ్యర్థాల నిర్వహణ కొరకు ప్రత్యేక వార్డు నిర్మించాం’’ అన్నారు. విపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ‘‘కాంగ్రెస్ పార్టీ అవాకులు, చెవాకులు పేలుతోంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ నాయకులు పిచ్చి వేషాలు వేస్తున్నారు. మిమ్మల్ని జనాలు నశం చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. పిచ్చి వాగుడుకు ఓ హద్దు ఉంటుంది. చాలా మంది రాకాసులతో కొట్లాడం.. మీ లాంటి గోకాసులు మాకు పెద్ద లెక్క కాదు. మాలో సహనం నశిస్తే.. మీకే ప్రమాదం. తొక్కి పారేస్తాం జాగ్రత్త’’ అని కేసీఆర్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ‘‘హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కలిపిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణలో కన్నీరు, కష్టాలకు నాటి కాంగ్రెస్ నాయకులే కారణం. మేం ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తే.. కమిషన్ల కోసం అంటారు. మిషన్ భగీరథను కమిషన్ భగీరథ అంటున్నారు. మీకు ప్రజలే సమాధానం చెప్తారు’’ అని కేసీఆర్ హెచ్చరించారు -
సాగర్ బహిరంగ సభ: ‘ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు’
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు మండలకేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు మిర్యాలగూడకు రూ.5కోట్లు మంజూరు చేశాం మిగతా మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు నల్లగొండ జిల్లాకు మొత్తం రూ.186 కోట్లు మంజూరు నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరిస్తాం ఎత్తిపోతల పథకాలకు రూ.2,500 కోట్లు కేటాయించాం ఏడాదిన్నరలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతా బీజేపీ, కాంగ్రెస్ నేతలు హద్దు మీరితే.. తొక్కి పారేస్తాం తెలంగాణ వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం బీజేపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఆరేళ్లలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాం నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం కంటివెలుగు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నాం.. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం ప్రతి ఏడాది రైతు బంధు ద్వారా రూ.15వేల కోట్లు ఇస్తున్నాం రాష్ట్రంలో 2,600 రైతు కేంద్రాలు పెట్టాం.. రోజూ చర్చలు జరపాలి 3,400లకుపైగా తండాలను గ్రామపంచాయతీలు చేశాం దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు పెడతాం బహిరంగ సభ ప్రారంభం హాలియాలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ప్రతి గ్రామపంచాయతికీ రూ.20 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ నెల్లికల్లులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ లిఫ్టు ఇరిగేషన్ వరకు ఎల్ఎల్సీ పంప్ హౌజ్ నుంచి ఎచ్‌ఎల్‌సీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మత్తుల పనులు... దేవరకొండ నియోజకవర్గ పరిధిలో... పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, నంబాపురం-పెద్దగట్టు ఎత్తిపోతల.. పెద్దమునగాల ఎత్తిపోతల, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం.. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని.. దున్నపోతుల గండి, బాల్లేపల్లి చాప్లాతాండా ఎత్తిపోతల.. కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల.. నాగార్జున సాగర్-మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని ఎస్ఎల్బీసీ కాల్వ 1.8 కిలోమీటర్ల నుంచి 70.52 కిమీ వరకు సీసీ లైనింగ్.. హుజూర్ నగర్-కోదాడ నియోజక వర్గాల పరిధిలో ముక్త్యాల బ్రాంచ్‌కు ఎత్తిపోతల.. జాన్‌పహాడ్ బ్రాంచ్‌కు ఎత్తిపోతలతో పాటు డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సీసీ లైనింగ్, ఆధునీకీకరణ... సూర్యాపేట-హుజూర్ నగర్-కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కిలోమీటర్ల నుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్ అభివృద్ది పనులకు సంభందించిన శంకుస్థాపనలన్నింటిని నెల్లికల్లులో ఒకే చోట చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పనుల వివరాల మ్యాప్‌లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాగార్జున సాగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో నెల్లికల్లు చేరుకున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత హాలియా బహిరంగ సభకు హాజరవుతారు. -
‘సాగర్’ లో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా బుధవారం హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు వారం రోజుల క్రితం బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించడంతో తక్కువ వ్యవధిలో భారీ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దివంగత శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్క ల్లపల్లి రవీందర్రావు, మాజీ విప్ కర్నె ప్రభాకర్ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తు న్నారు. హాలియాలో అలీనగర్ సమీపంలో నల్లగొండ రహదారి వెంట ఏర్పాటుచేసిప ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. సభ వెనుక బహుముఖ వ్యూహం నాగార్జునసాగర్ ఉపఎన్నిక సన్నాహాల్లో భాగంగా టీఆర్ఎస్ బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్పటికీ పార్టీ అధినేత మదిలో ఇతర వ్యూహాలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో బుధవారం జరిగే సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రస్థానం, విధానంతో పాటు పాలనాపరమైన అంశాలపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కేసీఆర్ ప్రసంగంలో ప్రధానంగా చోటు చేసుకునే అవకాశముందని పార్టీ నేతలు అంచనా వేస్తు న్నారు. రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వపరంగా దూకుడుగా వెళ్తామనే సంకేతం ఈ సభ ద్వారా పార్టీ యంత్రాంగానికి ఇచ్చే అవకాశముంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గత ఆరున్నరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వివరించడంతో పాటు కొత్తగా పలు వరాలు కూడా ఇచ్చే అవకాశముంది. శాసనమండలి పట్టభద్రుల కోటా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఈ సభ నుంచి కేసీఆర్ పిలుపునిస్తారు. ఎన్నిక ఎప్పుడొచ్చినా... ‘సమర’ సన్నద్దత తొలుత తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి కూడా మార్చిలో ఉప ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ భావించింది. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక ఉంటుందని తాజాగా అంచనా వేస్తోంది. అయితే ఏ సమయంలో ఉప ఎన్నిక జరిగినా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దంగా వుంచేందుకు టీఆర్ఎస్ గత ఏడాది డిసెంబర్ నుంచే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మండల, నియోజకవర్గ స్థాయిలో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు పర్యాయాలు అంతర్గత సర్వేలు కూడా నిర్వహించింది. పార్టీ నేతల నుంచి అందిన అంతర్గత నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో టీఆర్ఎస్తో పాటు, ఇతర పార్టీల బలాబలాలను కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తూ వస్తున్నారు. రెండు రోజులుగా బహిరంగ సభ సన్నాహాల్లో భాగంగా మరోమారు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. మండలాల వారీగా ఇన్చార్జిలు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించి ఉప ఎన్నికకు సన్నద్దమవుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్రావు పర్యవేక్షణలో మండల ఇన్చార్జిలు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మందుల సామేలు (త్రిపురారం), కర్నె ప్రభాకర్ (నిడమానూరు), భరత్ కుమార్ గుప్తా (హాలియా), రవీందర్రావు (నాగార్జునసాగర్), సందీప్‌రెడ్డి (పెద్దఊర), ఒ.నర్సింహారెడ్డి (గుర్రంపోడు) ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక, సాగర్ ఉప ఎన్నిక కోసం పార్టీ స్థానిక నేతలను సమన్వయం చేయడంపై టీఆర్ఎస్ ఇన్చార్జిలు దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థి ఎంపిక ఇప్పట్లో లేనట్లే! టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న హాలియా బహిరంగ సభలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన ఉండే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, న్యాయవాది డీసీ కోటిరెడ్డి, దివంగత శాసనసభ్యులు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరితో పాటు మన్నె రంజిత్‌యాదవ్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ వంటి స్థానిక యువనేతలు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అభ్యర్థి ప్రకటనపై తొందరపడకుండా... సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే యోచనలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు సమాచారం. -
ఆర్టీసీ సమ్మె : ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు
సాక్షి, నల్లగొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఓ ప్రమాదానికి కారణమయింది. (చదవండి : రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి) నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్‌లో ప్రయాణికుడి కాలుపైకి బస్సును ఎక్కించాడు ఓ డ్రైవర్. అనుముల మండలానికి చెందిన చంద్రకాంత్.. అద్దె బస్సు ఎక్కి హాలియా బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సు దిగుతుండగానే డ్రైవర్ ముందుకు పోనించాడు. దీంతో బస్సు వెనుక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి అతన్ని స్థానిక ఆస్పత్రి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. -
యాదవ ప్రతినిధులకు సన్మానం
హాలియా : మండలంలోని శ్రీనాథపురం శ్రీకృష్ణ డీఎడ్ కళాశాలలో కష్ణాపుష్కరాలకు వచ్చిన యాదవ ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రతినిధులకు యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ యాదవులకు సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, గుండెబోయిన రామ్మూర్తియాదవ్, జైపాల్‌యాదవ్, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్యయ్య యాదవ్, కూరాకుల వెంకటేశ్వర్లు, రావుల చిన భిక్షం, గౌనిరాజారమేష్యాదవ్, రామాంజయ్య పాల్గొన్నారు. -
ముగిసిన ఫసియొద్దీన్ అంత్యక్రియలు
హాలియా : జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్ సయ్యద్ ఖాజాఫసియొద్ధీన్ అంత్యక్రియలు గురువారం తన స్వగ్రామమైన అల్వాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఫసియొద్దీన్ మతదేహాన్ని కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు తరలివచ్చారు. ఆయన మృతి పట్ల టీసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి ఫసియొద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అ«ధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కాకునూరి నారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు శాగం పెద్దిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బుర్రి రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అ«ధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అ«ధ్యక్షుడు కసిరెడ్డి నరేశ్, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గౌని రాజారమేష్‌యాదవ్ ఎంపీటీసీలు ముత్యాలు, జంగయ్య, మైనారిటీ సెల్ నాయకులు నసీరుద్దీన్, అన్వర్ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
2019లో నేనే ముఖ్యమంత్రిని : జానా
కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు రెండు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎల్పీ నేత జానారెడ్డి మరోమారు తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. ఎప్పటికైనా సీఎం కావాలనేది తన రాజకీయ ఆకాంక్ష అనే అంశాన్ని మరోమారు చెప్పకనే చెప్పారు. శుక్రవారం నాగార్జున సాగర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరు పార్టీలో నుంచి వెళ్లిపోయినా.. నేనున్న స్థాయిలో ఎవరినీ దూషించలేనని, పార్టీలో ఉన్న వారికి అండగా ఉంటానని, సీఎం ఎవరైనా నేను సీఎంతో సమానమైన మనిషినని, స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని, అప్పుడు నేను సీఎం అయినట్లేనని, నేనే సీఎంనని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో పెద్ద కలకలాన్నే లేపింది. గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్‌లో ఉపాధ్యాయులుఘెరావ్ చేసిన సందర్భంగా కూడా జానా ఈ విధమైన వ్యాఖ్యలే చేశారు. ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తెలంగాణ వస్తే సీఎంను అయ్యేది తానేనని చెప్పారు. మళ్లీ ఇప్పుడు జానా సీఎం పదవి గురించి వ్యాఖ్యానించడం అటు జిల్లాలో, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
'కాంగ్రెస్ గెలిస్తే.. నేనే సీఎం'
హాలియా (నల్లగొండ) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తానే ముఖ్యమంత్రి పదవిని చేపడతానని తెలంగాణ శాసనసబ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా హాలియాలో శుక్రవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిందీ కాంగ్రెస్సేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సీఎంతోపాటు సమాన హోదా కలిగిన ఏకైక నాయకుడిని తానే అని అన్నారు. -
మంత్రి కార్యక్రమంలో జేబు దొంగల హల్చల్
హాలియా (నల్లగొండ జిల్లా) : హాలియా మండలం తిరుమలగిరి గ్రామంలో సోమవారం మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో జేబు దొంగలు చెలరేగిపోయారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూమి పూజలో మంత్రితోపాటు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే దొంగలు చేతివాటం చూపించారు. పలువురి నుంచి మొత్తం రూ.18,700 కాజేశారు. దుర్గారావు జేబు నుంచి రూ.7,500, రమేశ్ దగ్గర రూ.8వేలు, వీఆర్ఏ నర్సింహ దగ్గర రూ.3వేలు, నాగయ్య అనే వ్యక్తి జేబు నుంచి రూ.200 కొట్టేశారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
హాలియ (నల్లగొండ) : బొడ్రాయి పండుగకు వెళ్లి వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం జానీరెడ్డి కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దవూర మండలం పూలగూడెం గ్రామంలో బొడ్రాయి మహోత్సవానికి వెళ్లి వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురూ గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
డెంగీతో వ్యక్తి మృతి
హాలియా: డెంగీతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని హజారుగూడెంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన పెరుమాళ్ల సైదయ్య(53) పది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సైదయ్య సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కల్తీ కల్లు తయారీ: ఒకరి అరెస్ట్
హలియా (నల్లగొండ): కల్తీ కల్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హలియా మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని శ్రీరాంపూర్‌లో ఓ వ్యక్తి కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతు బలవన్మరణం
హాలియా (నల్లగొండ) : అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఊపిరి తీసుకున్నాడు. నల్లగొండ జిల్లా హాలియా మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని బోయగూడెం గ్రామానికి చెందిన బొల్లిగొర్ల ఆంజనేయులు(32) మూడేళ్లుగా ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. సరిగా దిగుబడి రాకపోవటంతోపాటు ఈ ఏడాది పంట సాగుకు కలిపి రూ.5లక్షల అప్పు మిగిలింది. దీంతోపాటు రూ.1.50 లక్షల అప్పు చేసి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి బిల్లు కూడా రాలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆంజనేయులు శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి చనిపోయాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం'
హాలియా (నల్లగొండ జిల్లా) : లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. మండలంలోని రామడుగు గ్రామంలో 33-11 సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లోవేల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. -
హాలియాలో యథేచ్ఛగా అబార్షన్లు
హాలియా, న్యూస్‌లైన్, హాలియా అబార్షన్లకు అడ్డాగా మారింది. కొద్దికాలంగా స్థానిక పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసుల నిఘా కొరవడడంతో ఇక్కడ అబార్షన్లు, భ్రూణహత్యలు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మదారిగూడెం మేజర్‌కాల్వ వెంట గోడుమరక బజారు వీధిలో ఐదు నెలల పిండాన్ని కవర్లో కట్టి రోడ్డుపై వేయడం కలకలం సృష్టించింది. హాలియాలో పదికి పైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో పలు ఆర్ఎంపీ వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో నిత్యం అబార్షన్లు జరిగిపోతున్నాయి. మండల పరిధిలోని గ్రామాల్లో ప్రేమపేరుతో వంచనకు గురైన యువతులు, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని వద్దనుకున్న మహిళలు అబార్షన్ల కోసం హాలియాకు వస్తున్నారు. వీరేగాక మిర్యాలగూడెం, నల్లగొండ తదితర పట్టణాల్లో నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అబార్షన్ల తర్వాత పసిగుడ్డులను కంపచెట్లలోకి, పంటకాల్వల్లోకి పారేయడం పరిపాటైంది. అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యసేవలు హాలియాలో రెండేళ్ల క్రితం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించినప్పటికీ నేటికీ వైద్యసేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఇక్కడ ఆర్ఎంపీల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న పీహేచ్సీ ఊరికి దూరంగా ఉండటంతో అనారోగ్యంతో వచ్చిన ప్రజలు వైద్యం కోసం ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆర్ఎంపీలు అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డుపైనే పారేశారు : బొల్లేపల్లి శేఖర్‌రాజు, హాలియా హాలియాలో అబార్షన్లు చేయడం, పిండాలను చెత్తకుప్పల్లో, పంటకాల్వల్లో పడేయడం మామూలైంది. ఇటీవల మా వీధికి వెళ్లే దారిలో అబార్షన్ చేసిన పిండాన్ని రోడ్డుపై కవర్లో కట్టివేయడం ఇందుకు నిదర్శనం. ఆర్ఎంపీ వైద్యశాలలపై నిఘా ఉండాలి. అబార్షన్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలి. -
ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా..
హాలియా, న్యూస్‌లైన్ : ఎంపీపీగా పనిచేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచారు సాగర్ నియోజకవర్గ నేతలిద్దరు. పెద్దవూర మండలానికి చెందిన కర్నాటి లింగారెడ్డి, త్రిపురారం మండలానికి చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్‌లు గతంలో ఆయా మండలాల్లో ఎంపీపీలుగా పనిచేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు. రెండు సార్లు ఎంపీపీగా.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన కర్నాటి లింగారెడ్డి 1983లోరాజకీయ జీవితం ప్రారంభించారు. 1983-86 వరకు ఆప్కాబ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1987-92 వరకు మొదటిసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06 వరకు పనిచేశారు. 2005-11 వరకు రెండు పర్యాయాలు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరల ఎంపీటీసీగా ఎన్నికై 2006-11 వరకు రెండోసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఈసారి కూడా పెద్దవూర జెడ్పీటీసీ జనరల్ కావడంతో ఆయన జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒకసారి ఎంపీపీగా.. త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్, 1987లో సీపీఎం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై త్రిపురారం ఎంపీపీగా పని చేశారు. ఆ తరువాత 1998లో సీపీఎం (బీఎన్‌రెడ్డి పార్టీ ) తరఫున మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున త్రిపురారం జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06వరకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2010 జూలైలో కాంగ్రెస్‌లో చేరారు.