హాలియా, న్యూస్‌లైన్ : ఎంపీపీగా పనిచేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచారు సాగర్ నియోజకవర్గ నేతలిద్దరు. పెద్దవూర మండలానికి చెందిన కర్నాటి లింగారెడ్డి, త్రిపురారం మండలానికి చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్‌లు గతంలో ఆయా మండలాల్లో ఎంపీపీలుగా పనిచేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు.
రెండు సార్లు ఎంపీపీగా..
పెద్దవూర మండల కేంద్రానికి చెందిన కర్నాటి లింగారెడ్డి 1983లోరాజకీయ జీవితం ప్రారంభించారు. 1983-86 వరకు ఆప్కాబ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1987-92 వరకు మొదటిసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06 వరకు పనిచేశారు. 2005-11 వరకు రెండు పర్యాయాలు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరల ఎంపీటీసీగా ఎన్నికై 2006-11 వరకు రెండోసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఈసారి కూడా పెద్దవూర జెడ్పీటీసీ జనరల్ కావడంతో ఆయన జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఒకసారి ఎంపీపీగా..
త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్, 1987లో సీపీఎం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై త్రిపురారం ఎంపీపీగా పని చేశారు. ఆ తరువాత 1998లో సీపీఎం (బీఎన్‌రెడ్డి పార్టీ ) తరఫున మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున త్రిపురారం జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06వరకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2010 జూలైలో కాంగ్రెస్‌లో చేరారు.
ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా..
Published Fri, Mar 28 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement