mpp
-
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
ఎంపీపీ పదవి కోసమే అక్రమ కేసులు
కుప్పంరూరల్: ‘మా తండ్రి, అన్నయ్యను అక్రమంగా అరెస్టు చేశారు’ అని కుప్పం ఎంపీపీ కుమారి అశ్విని ఆరోపించారు. కేవలం పదవీ కాంక్షతో అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్నామని, మరో వైపు తనను ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని వాపోయారు. 8 నెలల క్రితమే ట్రాక్టర్ దొంగతనం చేసినట్లు తన తండ్రి, సోదరుడిపై అభియోగాలు మోపారని, మరి పోలీసులు ఇంతకాలం ఏమి చేశారని ప్రశ్నించారు. ట్రాక్టర్లు, స్కూటర్లు దొంగతనం చేయాల్సిన దుస్థితిని ఆ దేవుడు తమకు కల్పించలేదన్నారు. పైగా అట్రాసిటీ కేసును కూడా 8 నెలల క్రితమే నమోదు చేస్తే అప్పుడే పోలీసులు విచారణ చేపట్టి తప్పుడు కేసుగా కొట్టేశారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి, మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్, తన అన్న, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనిత భర్త శీనుపై అట్రాసిటీ కేసులు పెట్టడం వెనుక టీడీపీ నేతల ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా భయపడమని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అక్కడే తేల్చుకుంటామన్నారు. ఓ మహిళ, పెళ్లి కాని యువతి ఎంపీపీగా ప్రజలకు సేవ చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక, తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పార్టీ మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా ? అని ప్రశ్నించారు. కుప్పం నుంచే తిరుగుబాటు మొదలవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘‘దేవుడు ఉన్నాడు.. ధర్మం గెలుస్తుంది.. ప్రాణం ఉన్నంత వరకు మా నాయకుడు జగనన్న చూపిన బాటలోనే నడుస్తా.. ప్రజాసేవలోనే ఉంటా’’ అని అశ్విని గద్గద స్వరంతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో పంచుకున్నారు. -
నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వివాదాలే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని వివాదాల మయం చేస్తున్నారు. ఏదోక దుందుడుకు చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత క్యాడర్లోనే అసంతృప్తి రేగింది. ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారిని లెక్క చేయపోవడంతో ఆయన తీరుపైన పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. తీరా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అవుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, చెన్నారావు నిర్మించిన భవనాన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బుల్డోజర్ని తీసుకెళ్లి కూల్చివేస్తానని హంగామా చేశారు. పోలీసులు, అక్కడ అధికారులు వారిస్తున్నా వినకుండా డాబా దిగువన ఉన్న గదిని కూల్చేశారు. రోడ్లపైన ఉన్న గోతులను పూడ్చాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనదే బాధ్యత. అయితే బాధ్యత మరిచి రోడ్డుపై ఉన్న నీటి గుంత ముందు కూర్చొని నిరసన తెలిపారు. సొంత పార్టీనేతలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో విస్సన్నపేటలో గ్రామ కమిటీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.తాజాగా మరొక వివాదంతో..తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యే ప్రధానవీధిలో నడిబొడ్డున ఉన్న ఒక భారీ అక్రమ కట్టడంపై నగరపంచాయతీ తీసుకున్న చట్టపరమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కట్టడం ఒక వార్డు కౌన్సిలర్‌కు చెందినది కావడంతో ఆ సామాజికవర్గానికి తాను అండగా ఉంటానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. దీనికి తోడు అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని మరో వార్డు కౌన్సిలర్ చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే రాజకీయ రంగు పులిమారు. మంగళవారం అక్రమ కట్టడాలపై నగర పంచాయతీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పాలకవర్గం వైఎస్సార్ సీపీ ఆధీనంలో ఉండగా, వ్యాపారులకు నష్టం కలిగించే చర్యలకు ఆ పార్టీ పాల్పడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పోస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలంటూ 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు నగరపంచాయతీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే..అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఏనాడూ తిరువూరులో వ్యాపారులతో కక్షసాధింపు ధోరణికి పాల్పడలేదని, సామరస్య పూర్వకంగానే వ్యవహరించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.పార్టీకి సంబంధం లేదు..అక్రమ కట్టడాల విషయంలో అధికారులే తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు సైతం తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ నియోజకవర్గంలో అభద్రతా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. ఆయన వివాదాస్పద వైఖరి ఇకనైనా మార్చుకోవాలి.– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
ఎంపీపీకి టీడీపీ బెదిరింపులు
చిలమత్తూరు: ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా, అధికారం బలంతో ఎంపీపీ పదవి చేజిక్కించుకొనేందుకు టీడీపీ నీచ రాజకీయానికి దిగింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు ఎంపీపీని బెదిరించి, అధికార బలాన్ని ఉపయోగించి, ఆయన మండల సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకొంది. రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేసింది. శనివారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయించింది. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, 144 సెక్షన్ విధించి, భారీ సంఖ్యలో కార్యకర్తలతో హంగామా సృష్టించింది. 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బలవంతంగా టీడీపీలో చేర్చుకొంది.ఈ ఎంపీటీసీల బలంతో ఎంపీపీ పదవిని చేజిక్కించుకొనేందుకు ఎత్తులు వేస్తోంది. ఒక్క ఎంపీటీసీ కూడా గెలవని టీడీపీ.. చిలమత్తూరు ఎంపీపీ పదవి కోసం పోలీసులను ఉపయోగించింది. ఇందుకోసం ఎంపీపీ పురుషోత్తంరెడ్డిని లక్ష్యంగా చేసుకొంది. ఆయన్ని పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసింది. సమావేశానికి హాజరైతే రౌడీïÙట్ తెరిపించి జిల్లా బహిష్కరణ చేస్తామని పోలీసులు, టీడీపీ నేతలు బెదిరించినట్టు సమాచారం. దీంతో శనివారం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనాల్సిన పురుషోత్తమరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎంపీపీ లేకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు ఎంపీడీవో ప్రకటించారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా గొడవలు జరుగుతాయంటూ పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అయితే దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. వందలాది టీడీపీ కార్యకర్తలు, నాయకులు మండల కేంద్రంలో హల్చల్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీలో లుకలుకలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను చేర్చుకోవడంతో టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండా ఎలా పార్టీల్లో చేర్చుకుంటారంటూ ఆ పంచాయతీల్లోని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ పదవి పైనా టీడీపీలో నాగరాజు యాదవ్, రంగారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తమ పారీ్టలోకి వచి్చన ఎంపీటీసీలను వారి శిబిరాల్లో చేర్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఎంపీపీ అనితపై అవిశ్వాసం!
రంగారెడ్డి: ఆమనగల్లు ఎంపీపీ అనితపై అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు ఎంపీటీసీ సభ్యులు కందుకూరు ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సొంత పార్టీకి చెందిన నేతలే ఎంపీపీ అనితపై అవిశ్వాస తీర్మాణం పెట్టడం విశేషం. ఆమనగల్లు మండల పరిషత్ పరిధిలో 5 ఎంపీటీసీ స్థానాలుండగా గత ఎన్నికల్లో 5 ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన మేడిగడ్డ ఎంపీటీసీ అనిత ఎంపీపీగా, మంగళపల్లి ఎంపీటీసీ జక్కు అనంతరెడ్డి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఎంపీపీ అనిత ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో విభేదించి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గంలో చేరారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎంపీపీ అనితను పదవినుంచి దించేందుకు మిగతా ఎంపీటీసీలు ప్రయత్నిస్తున్నారు. కాగా ఎంపీపీ అనితపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, కోనాపూర్ ఎంపీటీసీ సరిత, పోలెపల్లి ఎంపీటీసీ దోనాదుల కుమార్, ఆకుతోటపల్లి ఎంపీటీసీ నిట్టె మంగమ్మ సంతకాలు చేసి ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు నోటీసు అందించినట్లు తెలుస్తుంది. -
నాటి వైస్ ఎంపీపీ... నేడు ఉపాధ్యాయుడిగా!
అనకాపల్లి: అనుకోకుండా రాజకీయాల్లో వచ్చిన ఆయన వైస్ ఎంపీపీ అయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో బిజీగా మారిన తనిప్పుడు ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు. కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామానికి చెందిన బండారు మంగపతి 2014–19 వరకు వైస్ ఎంపీపీగా పనిచేశారు. 1998–డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టింగ్‌లపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయంతో అతడికి ఉపాధ్యాయ కొలువు సాకారమైంది. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో 352 మంది కుటుంబాల్లో వెలుగులు నింపారని మంగపతి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈయన్ను 1,786 ఓట్ల మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు. తదనంతరం వైస్ ఎంపీపీగా సభ్యులంతా ఎన్నుకున్నారు. సీఎం జగన్ పాలనపైనా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నాయకత్వంలో పని చేసేందుకు ఆసక్తితో 2019లో వైఎస్సార్సీపీలో చేరారు. నాటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 98–డీఎస్సీ కౌన్సెలింగ్‌లో అనంతగిరి మండలం చింతలపాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి చదువులతోపాటు నైతిక విలువలు మరింత పెంపొందించేలా విద్యా బోధనను అందించనున్నట్లు మంగపతి తెలిపారు. -
సీఎం జగన్ కు వస్తున్న ఆధరణ తట్టుకోలేక ప్రతిపక్షాల కుట్రలు
-
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
రెండు రోజుల్లో గ్రామానికి రూ.కోటి నిధులు ఇవ్వాలి.. లేకుంటే..
సాక్షి, ఘట్కేసర్: హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి మూడేళ్లుగా మంత్రిని నిధులు అడిగితే ఎంపీపీనని చూడకుండా మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల కిందట ఇచ్చిన ప్రొసిడింగ్స్ పనులకు దిక్కులేదని.. నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధుల కోసం అధికారులకు వినతులు ఇచ్చి , గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టినా నిధులు ఇవ్వడం లేదన్నారు. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని.. నిధులడిగితే పార్టీ మారుతున్నాడని అంటున్నారని.. తనను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండలోని ప్రతి గ్రామానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మండలంలోని పేదలకు మొదట ఇవ్వాలన్నారు. మండలంలోని దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని... గతంలో ఇచ్చిన ప్రొసిడెంగ్స్ పనులు చేయించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మండలంలో అందించిన సేవలు ప్రజలకు తెలుసనని ఈ సందర్భంగా ఎంపీపీ అన్నారు. రెండు రోజుల్లో నిధులివ్వని పక్షంలో ఎంపీపీ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని అన్నారు. -
చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్‌లాగే సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఘట్కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో ఆదివారం ఆయన ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివద్ధికి నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గాల తరఫున మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా నిధులు విడుదల చేయనందున మండల పరిషత్ కార్యలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశానన్నారు. నిధుల విడుదలపై చర్చ జరగాలనే సీఎం నేతృత్వంలోని సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎందుకంటే సీఎం సమావేశంలో చర్చించే అవకాశం తమకు రాదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తే చర్చ జరిగి నిధులు వస్తాయన్న నమ్మకం ఉందని, మూడేళ్లుగా మండల పరిషత్ సమావేశాల్లో చాయ్ డబ్బులు చెల్లిద్దామన్న నిధులు లేని దుస్థితి ఉందన్నారు. నిధులు విడుదలపై అధికారులు, మంత్రులు కూడా స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
వైఎస్సార్సీపీ ఎంపీపీ హత్యకు సుపారి?
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు కిరాయి హత్యలకు కూడా తెరతీశారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీని హత్య చేసేందుకు టీడీపీ నాయకులు కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంపీపీ హత్య కోసం గ్రామానికి వచ్చి రెక్కీ నిర్వహిస్తున్న కిరాయి హంతకుడు సత్తు గాలయ్యను, అతన్ని నియమించిన టీడీపీ నేతలిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఎంపీపీ హత్యకు రూ.20 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. జిల్లాలోని వైఎస్సార్సీపీకి చెందిన వెల్దుర్తి మండల ఎంపీపీ చింతా శివరామయ్యకి, స్థానికంగా టీడీపీ నేతలకు వైరం ఉంది. నాలుగు నెలల క్రితం టీడీపీ నాయకులు ఎంపీపీ హత్యకు ప్రయత్నించారు. హత్య చేయడానికి వచ్చిన వీరిద్దరూ పోలీసుల తనిఖీల్లో మారణాయుధాలతో సహా దొరికిపోయారు. వారిద్దరినీ పోలీసులు జైలుకు పంపారు. జైలులో ప్రకాశం జిల్లాకు చెందిన సత్తు గాలయ్య అనే కిరాయి హంతకుడితో వీరిరువురికి పరిచయమైంది. గుంటూరు వద్ద నల్లపాడు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కిరాయి హత్యలకు పాల్పడ్డట్లు గాలయ్యపై కేసులు ఉన్నాయి. ఎంపీపీ హత్యకు గాలయ్యతో టీడీపీ నేతలు రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ నాయకులు బెయిల్‌పై గత నెలలోనే విడుదల కాగా, గాలయ్య వారం క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎంపీపీ హత్యకు శనివారం ఉదయం 10 గంటలకు గాలయ్య గుండ్లపాడులోని టీడీపీ నేతల ఇంటికి చేరుకున్నాడు. తనపై టీడీపీ నాయకులు పగబట్టారన్న సమాచారంతో నిఘా ఉంచిన ఎంపీపీకి గ్రామంలో కొత్త వ్యక్తి తిరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలయ్య రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెల్దుర్తి ఎంపీపీని హత్య చేయడానికి సుపారీ తీసుకున్నట్లు గాలయ్య తెలపడంతో ఇద్దరు టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కుట్ర వెనుక మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరి హస్తం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ దిశగా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. 13 ఏళ్లుగా ఒక్క ఫ్యాక్షన్ హత్య జరగని మాచర్లలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు నియమించడం ద్వారా ఫ్యాక్షన్ హత్యలకు మళ్లీ ఊపిరిపోశారని, ఆయన వచ్చిన తర్వాతే హత్యలు, దాడులు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నాడు అటెండర్‌గా మంచి నీళ్లు, టీ ఇచ్చాడు.. నేడు ఎంపీపీగా..
సాక్షి, నెల్లూరు(పొదలకూరు): ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్‌గా మంచినీళ్లు, టీ మోసిన వ్యక్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల వల్ల రోజు కూలీగా జీవనం సాగిస్తున్న వ్యక్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సుబ్బరాయుడు తండ్రి ఆదెయ్య సుదీర్ఘకాలం అటెండర్‌గా పనిచేశారు. ఆదెయ్యకు ఆరోగ్యం దెబ్బతినడంతో తండ్రి స్థానంలో సుబ్బరాయుడు తాత్కాలికంగా ఆఫీసు సబార్డినేట్‌గా ఉద్యోగంచేసి అధికారుల మన్ననలు పొందారు. 2020 మార్చిలో మహ్మదాపురం గ్రామ పెద్దలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా సుబ్బరాయుడును ఏకగ్రీవం చేయించారు. విజయలక్ష్మి అకాల మృతితో.. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఎంపీపీగా ఎన్నికైన ఆర్‌వైపాళెం ఎంపీటీసీ సభ్యురాలు నిమ్మళ్ల విజయలక్ష్మి అనారోగ్య కారణాల వల్ల మృతిచెందారు. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండలాధ్యక్షుని ఎన్నికను ప్రత్యేకాధికారి శోభన్‌బాబు నిర్వహించారు. మహ్మదాపురం ఎస్టీ జనరల్ సెగ్మెంట్ ఎమ్పీటీసీ సభ్యుడు కందుకూరు సుబ్బరాయుడుకు వైఎస్సార్సీపీ నుంచి బీ–ఫాం అందింది. దుగ్గుంట ఎమ్పీటీసీ సభ్యుడు రామిరెడ్డి సుబ్బరాయుడును ఎంపీపీగా ప్రతిపాదించారు. మరో ఎమ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు బలపరిచారు. దీంతో సుబ్బరాయుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ప్రత్యేకాధికారి సుబ్బరాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీడీఓ పీ.సుజాత, ఈఓపీఆర్డీ ఎం.నారాయణరెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ పాల్గొన్నారు. -
దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నించింది. దీనిపై అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి టీడీపీలో బీసీ మహిళ లేకపోవడంతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు. -
ఖమ్మం ‘చంద్రముఖి’ నిజ స్వరూపం: అప్పుడు.. ఇప్పుడు
సాక్షి, హైదరాబాద్: సామాన్య జనాలకు మూఢ నమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన వ్యక్తే.. ఓ దేవతా అవతారం ఎత్తిన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చర్చాంశనీయంగా మారింది. ఆయనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అంతేకాదు ఆమె ఆశ్వీరాదం కోసం వంగి వంగి దండాలు పెడుతూ తాను కూడా మిరపకాయల పూజలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మాతను దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతం అంటూ భక్తిని చాటుకున్నారు. విచిత్రమేమిటంటే.. తనతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని కూడా తీసుకెళ్లి పూజలు చేయించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చదవండి: వివాదంలో తెలంగాణ డీహెచ్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. అనేక వివాదాల్లో ఉన్న ఎంపీపీ దేవత అవతారం ఎత్తడం విచిత్రం. తను నడిచే నడక, చూపు, మాట అంతా అమ్మవారిలా కనిపించేలా తెగ కవర్ చేస్తూ భక్తులకు దర్శనమిచ్చింది. మరో విశేషమేమిటంటే.. ఎంపీపీ భర్త సింగరేణి ఉద్యోగి. ఆయన సైతం డ్యూటీకి వెళ్లకుండా పూజలో నిమగ్నమయ్యారు. పూజలు, హోమాలు, అన్నదానాల పేరుతో వీళ్లు చేసే దందా అంత ఇంత కాదు. భూత, భవిష్యత్, వర్తమానం గురించి చెప్తా అంటూ అమాయక ప్రజలను మోసం చేసే ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
606 మండలాల్లో వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులే
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 623 మండలాల్లో మంగళవారం రెండో మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 606 మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏడు మండలాల్లో తెలుగుదేశం, మూడుచోట్ల జనసేన, ఒక చోట సీపీఎం ఆ పదవుల్ని దక్కించుకున్నాయి. ఆరు మండలాల్లో ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందారు. 2 జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 623 మండలాల్లో మంగళవారం ఎన్నికలు ముగిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎన్నిక పూర్తవగా, మిగిలిన 11 జిల్లాల్లో 26 మండలాల్లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఈ మండలాల్లో బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులకు మండల ప్రిసైడింగ్ అధికారులు సమాచారం ఇచి్చనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా పాపిరెడ్డి మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో పలుచోట్ల ఖాళీగా ఉన్న జెడ్పీ చైర్మన్, మండల అధ్యక్ష (ఎంపీపీ), ఒకటో ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. కర్నూలు జెడ్పీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన యర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► విశాఖ జిల్లా మాకవరపాలెం, చిత్తూరు జిల్లా గుర్రంకొండ, రామకుప్పం మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రామకుప్పం మండలంలో ఎన్నిక వాయిదా పడింది. మాకవరపాలెం, గుర్రంకొండ మండలాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ గెల్చుకుంది. రామకుప్పం మండలంలో బుధవారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ► వైఎస్సార్ జిల్లా గాలివీడు, సిద్ధవటం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలాల్లో మొదటి ఉపాధ్యక్ష పదవుల్ని వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెల్చుకున్నారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో రెండు ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. -
ఎంపీపీ పీఠంపై వలంటీర్.. వైస్ ఎంపీపీగా విద్యార్థిని
పశ్చిమగోదావరి: వలంటీర్లు కొందరు సర్పంచ్‌లయ్యారు.. మరికొందరు ఎంపీటీసీ సభ్యులయ్యారు. కానీ వలంటీర్‌గా సేవలందిస్తున్న ఓ గిరిజన మహిళ అతి చిన్న వయసులోనే ఎంపీపీగా ఎన్నికైంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడేనికి చెందిన 24 ఏళ్ల కారం శాంతి ఇంటర్ వరకూ చదువుకున్నారు. గృహిణిగా ఉన్న శాంతి ఆ తర్వాత వలంటీర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆమెను దొరమామిడి–2 ఎంపీటీసీ అభ్యరి్థగా నిలబటెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుట్టాయగూడెం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాల్లో 2 ఏకగ్రీవం కాగా, రెండింటిలో ఇది ఒకటి. మిగిలిన 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కారం శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. – బుట్టాయగూడెం అతి చిన్న వయసులో ఓ యువతి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో.. ఇంకా విద్యార్థినిగా ఉండగానే ఆమె ఎన్నికవడం విశేషం. మండలంలోని బొమ్మిడి గ్రామం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన మేడవరపు విద్యాలక్ష్మి వయసు 22 ఏళ్లు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ సైన్సెస్ కళాశాలలో ఫార్మా–డి కోర్సు ఐదో సంవత్సరం చదువుతోంది. ఆమె తల్లి మేడవరపు సుష్మ బొమ్మిడి మాజీ సర్పంచ్. తండ్రి కిరణ్ వైఎస్సార్సీపీ నేత. – ఉంగుటూరు చదవండి: ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ -
ఆ సామాజికవర్గంలో ఆమె మొట్టమొదటి ఎంపీపీ
పాలకొండ రూరల్: రాష్ట్రంలోనే తొలిసారి రెల్లి సామాజికవర్గానికి చెందిన మహిళ ఎంపీపీగా ఎన్నికయ్యారు. సీఎం జగన్ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని ఆ సామాజికవర్గానికి చెందినవారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన బొమ్మాళి భాను భాసూరు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలుండగా.. 10 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో బొమ్మాళి భానును మండల పీఠం వరించింది. -
Volunteer Shantabai: ఎంపీపీగా వలంటీర్!
మార్టూరు: అదృష్టం ఎవరిని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణ గ్రామ వలంటీర్‌గా ప్రస్థానం ప్రారంభించి మార్టూరు మండల అధ్యక్షురాలిగా అధికార పీఠం ఎక్కనున్న భూక్యా శాంతాబాయి. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని నాగరాజుపల్లి తండాకు చెందిన శాంతాబాయి బీకాం, బీఈడీ పూర్తి చేసింది. మార్టూరు తండాకు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు బాణావత్ బాబు నాయక్‌తో వివాహమైంది. మార్టూరులో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నది. అయితే మార్టూరు ఎంపీపీ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్థానిక జనార్ధన కాలనీ ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా బరిలోకి దిగింది. టీడీపీకి చెందిన తన ప్రత్యర్థిపై 1,184 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీలలో ఎస్టీ కేటగిరీ కింద మరెవ్వరూ అభ్యర్థులు లేకపోవడంతో ఎంపీపీగా శాంతాబాయి ఎన్నిక లాంఛనమే. మండలంలోని ఎంపీటీసీలందరిలోకి ఆమె పిన్న వయసు్కరాలు కావడం విశేషం. నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తా.. గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచచ్చిన నేను నెల తిరక్కుండానే ఎంపీపీ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడం నచ్చి రాజకీయాల్లో వచ్చా. మండల ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు పడతా. – శాంతాబాయి -
ఎంపీపీ వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్.. ఆ మాత్రం తెలియదా..
సాక్షి, ఇల్లందకుంట(కరీనంగర్): ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చదవండి: ఫోన్‌కాల్ కలకలం: ‘నువ్వేమైనా కేసీఆర్వా.. లేక ఎర్రబెల్లివా?’ -
ఆవేశంలో అసలు విషయం చేపిన ఎంపీపీ వినోద
-
చిట్యాల ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం!
-
చిట్యాల ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం!
సాక్షి, నల్గొండ : జిల్లాలో మంగళవారం అర్థరాత్రి దాటాకా పాత కక్షలు భగ్గుమన్నాయి. చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ కుటుంబంపై అర్ధరాత్రి 12 గంటలకు 4 కార్లలో వచ్చిన కిరాయి హంతకులు వారిపై హత్యాప్రయత్నం చేశారు. ఈ ఘటన చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అయితే గ్రామంలోని ప్రజలు వెంటపడడంతో ఊర్లో ఉన్న పాత నేరస్థునితో సహా 9 మంది పట్టుబడగా.. మిగతా 15 మంది పరారీలో ఉన్నారు. అసలు విషయానికి వస్తే.. పేరేపల్లికి చెందిన కొలను వెంకటేశ్, అదే గ్రామానికి చెందిన అంతటి వెంకటేశ్ గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచే ఇద్దరు సర్పంచ్ ఎన్నికకు పోటీలో నిలిచారు. ఈ సందర్భంగా కొలను వెంకటేశ్ సర్పంచ్ ఎన్నికల్లో అంతటి వెంకటేశ్ చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొలను వెంకటేశ్ భార్య సునీత పోటీ చేసి గెలిచి చిట్యాల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇది జీర్ణించుకోలేని అంతటి వెంకటేశ్ కొలను వెంకటేశ్‌పై కక్ష పెంచుకున్నాడు.. దీంతోపాటు ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి. కాగా మంగళవారం ఎంపీపీ సునీత భర్త వెంకటేశ్ పుట్టినరోజు పురస్కరించుకొని వేడుక నిర్వహించేందుకు కుటుంబసభ్యులతో కలిసి పేరేపల్లికి వచ్చారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అంతటి వెంకటేశ్ అనుచరుడు జగన్ వారిని హత్య చేయించేందుకు ఇదే సరైన సమయమని భావించి హైదరాబాద్ నుంచి 15 మంది కిరాయి రౌడీలను నాలుగు కార్లలో రప్పించాడు. అయితే రౌడీలు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కుటుంబసభ్యులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన రౌడీలలో 9 మందిని స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులంతా చిట్యాల పోలీస్‌స్టేషన్ ఉన్నారు. -
వైఎస్సార్ వ్యక్తి కాదు ఓ శక్తి
ఇచ్చోడ(బోథ్): విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం గొప్ప అనుభూతినిచ్చింది. పుస్తకం చదువుతున్నంత సేపు రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడిన మాటలు, ఆయనతో గడిపిన క్షణాలు కళ్లముందు కదలాడినట్లు అనిపించింది. పుసక్తం చేతిలో పట్టుకుంటే చాలు వైఎస్సార్‌తో పెనవేసుకున్న మధుర జ్ఞాపకాలు కళ్లలో మెదలుతున్నాయని వైఎస్సార్ అభిమాని, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం చదివిన ఆయన వైఎస్సార్‌తో తనకున్న అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వైఎస్సార్ ఓ శక్తి.. వైఎస్సార్‌తో 1994లో పరిచయం ఏర్పడింది. ఆయన చనిపోయే వారం ముందు ఆయనతో మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డితో నాకు ఎంతో సానిహిత్యం ఉండేది. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కార మార్గం చూపేవారు. ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి. మిస్టర్ శ్రీనివాస్ అనే వారు.. ఎన్నిసార్లు కలిసినా చెరగని చిరునవ్వుతో మిస్టర్ శ్రీనివాస్ అంటూ ప్రేమగా పొట్టపై చిన్నగా కొట్టేవారు. జిల్లా సమస్యలు విని వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపేవారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈరోజు ఉన్నంతలో కొంత పేదల కోసం ఖర్చు చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మరిచిపోలేని అనుబంధం 2001లో పాదయాత్రలో పాల్గొన్నాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది, వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయనతో అనుబంధం మరింత పెరిగింది. 2007లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సోనాలలో మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన వైద్య వృత్తిలో చేసిన సేవల మాదిరిగానే నా కుమారిడితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాను. -
నంది వనపర్తి : ఉద్రిక్తతల మధ్య రోడ్డు విస్తరణ పనులు
-
ఎంపీపీపై దాడి.. వ్యక్తిపై కేసు నమోదు
సాక్షి, బంట్వారం/ రంగారెడ్డి : వారిద్దరు ఒకే గ్రామానికి చెందిన మంచి మిత్రులు. కానీ మద్యం మత్తు వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. బీరు బాటిల్‌తో దాడి చేయడంతో కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కోట్‌పల్లి పెట్రోల్ పంపు ఎదురుగా జరిగింది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్‌పల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన నల్లోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, చేపూరి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆయన స్నేహితుడు జగన్‌రెడ్డిలు కలిసి చేపూరి శ్రీనివాస్‌రెడ్డి ఫర్టిలైజర్ షాపులో మద్యం సేవిస్తున్నారు. కొద్దిసేపటికి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, చేపూరి శ్రీనివాస్‌రెడ్డిల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో క్షణికావేశంతో చేపూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డిపై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీపీ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న రాంపూర్ మాజీ ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి, జగన్‌రెడ్డిలు వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఎంపీపీని తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఎంపీపీ భార్య లలిత ఫిర్యాదు మేరకు చేపూరి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ పరామర్శ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునితారెడ్డి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు. గాయపడిన ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి -
డ్వాక్రా మహిళలకు టోకరా
గత తెలుగుదేశం పాలనలో అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కనుసన్నల్లో ఆ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు తెరలేపారు. ఐదేళ్లలో చేపట్టిన ప్రతి పనిలోనూ పర్సంటేజీలు దండుకున్నారు. తమ అధినాయకుడి అండను చూసుకుని ఉరవకొండ ఎంపీపీ సుంకరత్నమ్మ డ్వాక్రా మహిళలకు సంబంధించిన సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు బయటపడింది. సాక్షి, ఉరవకొండ: ఉరవకొండ ఏరియా క్లస్టర్ పరిధిలోని ఆమిద్యాలలో ఐదు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. టీడీపీ ఎంపీపీ సుంకరత్నమ్మ స్వగ్రామమైన ఆమిద్యాలలో తానే తన మద్దతుదారులతో సిరివెన్నెల గ్రామైక్య సంఘం (వీఓ) ఏర్పాటు చేసుకుంది. ఈ వీఓలో మొత్తం 34 స్వయం సహాయక పొదుపు (డ్వాక్రా) సంఘాలు ఉండగా.. ఇందులో 90 శాతం తన బినామీలను సభ్యులు ఏర్పాటు చేసుకుని రూ.లక్షలు స్వాహా చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఆమిద్యాలలోని జాబిలి, ఝాన్సీలక్ష్మి, ముద్దమందారం, మారుతీ ప్రసన్న, విజయ సంఘాల్లో ఎక్కవ శాతం అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అవినీతి జరిగిన సంఘాల్లో వీఓలో మారుతీ ప్రసన్న సంఘానికి ఎంపీపీ లీడర్‌గా ఉంది. గతంలో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభం ఎంపీపీకి ఉండటంతో వీఓలకు ఎన్ని నిధులు వస్తాయో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. స్త్రీనిధి, సీఐఎఫ్ సొమ్ము స్వాహా సిరివెన్నెల గ్రామైక్య సంఘానికి రూ.20 లక్షల వరకు స్త్రీనిధి మొత్తం 2016–17లో మంజురు కాగా.. ఇందులో ఒక్క పైసా కుడా సంఘాలకు పంపిణీ చేయలేదు. 2011 నుండి 2013లో సామాజిక పెట్టుబడి నిధి కింద వీఓకు రూ.10 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు ఒక్క పైసా రికవరీ చేయలేదు. 34 సంఘాల్లో ఉన్న రూ.3లక్షల పొదపు సొమ్ము మొత్తం ఎంపీపీ స్వాహ చేసినట్లు తెలిసింది. ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీ సంఘానికి జీవనోపాధుల కోసం రూ.5 లక్షల మంజూరైతే తనే ఎరికల సరస్వతీ మహిళా సంఘానికి మంజూరు చేసినట్లు చూపింది. అయితే ఆ సంఘానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. వాస్తవానికి ఆ సంఘానికి ఒక్క పైసా మంజూరు కాలేదని వెలుగు అధికారుల విచారణలో బయటపడింది. సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ నేతలు ఉరవకొండ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఎంపీపీ సుంకరత్నమ్మ ఆమె ప్రధాన అనుచరులైన టీడీపీ నాయకులు డ్వాక్రా సంఘాలను భ్రష్టు పట్టించారు. కొంతమంది యానిమేటర్లను ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచడానికి ఎంపీపీ వినియోగించినట్లు తెలుస్తోంది. అధికారం ఉంది కదా అని సంఘంలో మహిళలను బెదిరించి టీడీపీకి ఓటు వేయాలని ప్రలోభాలకు గురిచేసింది. స్త్రీనిధి సొమ్మును ఎంపీపీ ప్రోద్బలంతో కొంతమంది యానిమేటర్లు గ్రామైక్య సంఘాల ద్వారా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రతి పైసా కక్కిస్తాం ఆమిద్యాల వీఓ పరిధిలోని ఆరు సంఘాల్లో అవినీతి జరిగినట్లు విచారణలో తేల్చాం. ఈ సొమ్మ కట్టాలని ఆయా సభ్యులకు అడిగితే తాము కడుతామని చెబుతున్నారు. సంఘాల పేరుతో ఒక వ్యక్తి సొమ్మను తీసుకుని వాడుకున్నట్లు తెలుస్తోంది. తిన్న ప్రతి పైసా కక్కిస్తాం. – రవీంద్రబాబు, ఏసీ, ఉరవకొండ క్లస్టర్ -
18 ‘ఎంపీపీ’లకు 15న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన 18 మండలాల్లోని కోఆప్టెడ్, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికను ఈ నెల 15న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ కోఆప్టెడ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు పూర్తిచేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. జెడ్పీపీ పదవులన్నింటికీ ఏకగ్రీవ ఎన్నికలు పూర్తికాగా, కొన్ని ఎంపీపీల్లో కోరం లేక కోఆప్టెడ్, అధ్యక్షులు, ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో 18 ఎంపీపీల్లోని పదవులకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్లో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికయ్యే పాలక మండళ్ల పదవీ కాలం ఏ తేదీ నుంచి మొదలయ్యేది ఎస్ఈసీ విడిగా నోటిఫై చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే.. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, సారంగపూర్, భద్రాద్రి జిల్లా లోని అల్లపల్లి, ములకలపల్లి, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని టెక్మల్, సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి, నల్లగొండ జిల్లాలోని చందంపేట, కేతేపల్లి, నేరేడుగొమ్ము, సూర్యా పేట జిల్లాలోని చిల్కూరు, రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్, మాడుగుల, జనగామ జిల్లా తరిగొప్పుల, జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ ఎంపీపీ స్థానాలకు 15న ఎన్నికలు జరగుతాయి. ఎన్నిక నిర్వహిస్తారిలా.. 15న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి సంబంధించి 14వ తేదీలోగా సంబంధిత ఎంపీపీల గెజిటెడ్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ మండలాల్లో ఉదయం 9 నుంచి 10 మధ్య కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని పరిశీలించాక మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్ని క, అది ముగిశాక మధ్యాహ్నం 3కి ఎంపీపీ అధ్యక్షు లు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరగకపోతే అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించరు. ఈ విషయాన్ని అధికారులు ఎస్ఈసీకి తెలపాల్సి ఉంటుంది. కోఆప్టెడ్‌ల ఎన్నిక పూర్తయ్యాక ఏ కారణంతోనైనా ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకపోతే, 16న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నికలు జరగకపోతే ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే దీనికోసం మరో తేదీని నిర్ణయిస్తుంది. -
ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్తత
నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఎంపీపీ ఎంపికలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 6 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్ గెలుపొందింది. నర్సంపేట ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది. ఎంపీటీసీల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోగా.. 6వ తేదీ రాత్రి ఇరు పార్టీల ఎంపీటీసీలు నర్సంపేటకు చేరుకున్నారు. అదే రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనిక, రాజుపేట ఎంపీటీసీ బాదావత్ వీరన్నలను టీఆర్ఎస్ శిబిరంలోకి తీసుకున్నారు. విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఉన్న నలుగురు ఎంపీటీసీలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. లక్నెపల్లికి చెందిన ఎంపీటీసీ వల్లెరావు రజితను కిడ్నాప్ చేశా రని ఆమె భర్త బుచ్చయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎంపీటీసీ భర్త ఫిర్యాదు మేరకే లక్నెపల్లి రజితను స్టేషన్‌కు తీసుకువచ్చామని, ఆమెను భర్తకు అప్పగిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్టేషన్ నుంచి రజితను బుచ్చయ్య తీసుకెళ్తుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మహిళా నేత చెప్పుతో టీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహేశ్వరం ఎంపీటీసీ మోతె కలమ్మ ఎంపిక కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన భాంజీపేట ఎంపీటీసీ అజ్మీరా మౌనికకు వైస్ ఎంపీపీగా అవకాశం దక్కింది. నిరసన ‘మంటలు’ పీసీసీ పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదని ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు కార్యకర్తలు దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందులో కొందరు కార్యకర్తలు, పోలీసులు చిక్కుకున్నారు. వారికి మంటలు అంటుకోవడంతో ఎవరికి వారు పరుగులు తీశారు. చెల్లాచెదురుగా పడిపోయారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. సాక్షి ఫొటో జర్నలిస్టు, ఖమ్మం -
436 మండల పీఠాలపై గులాబీ జెండా
సాక్షి, హైదరాబాద్: మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 436 మండల పీఠాలను గెలుచుకుని సత్తా చాటింది. 6 జిల్లాల్లో ఎంపీపీలన్నిం టినీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 12 జిల్లాల్లో ఖాతాయే తెరవలేదు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో 538 ఎంపీపీలు ఉండగా.. 537 చోట్ల ఎన్నికలు జరిగాయి. భద్రాద్రి జిల్లాలోని ఒక మండలంలో ఎన్నిక జరగలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం 537 ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 436 ఎంపీపీలను టీఆర్ఎస్ గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ 53 చోట్ల విజయం సాధించింది. ఇక బీజేపీ కేవలం 8 ఎంపీపీలతో సరిపెట్టు కోగా.. ఇతరులు (స్వతంత్రులు) 7 ఎంపీపీల్లో గెలుపొందారు. సీపీఐ, సీపీఎం ఒక్క ఎంపీపీనీ గెలుచుకోలేకపోయాయి. 33 ఎంపీపీల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్నిచోట్ల స్వతంత్రంగా గెలిచిన ఎంపీటీసీలు మద్దతు తెలపడంతో ఆయా ఎంపీపీలు అధికార పార్టీ వశమయ్యా యి. ఈ సందర్భంగా పలువురు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరినట్టు సమాచారం. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌లోని ఒకట్రెండు మండలాలు, ఇతర జిల్లాలోని మరికొన్ని చోట్ల మండల అధ్యక్ష పదవుల కోసం టీఆర్ఎస్లోని గ్రూపుల మధ్య పోటీ నెలకొనడంతో అక్కడక్కడా ఘర్షణపూర్వక వాతావరణం ఏర్పడింది. కొన్నిచోట్ల ఈ పరిణామాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించి, తర్వాత ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. అధిక మండలాల్లో టీఆర్ఎస్కి మెజార్టీ ఉండటంతో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఎంపీపీ పదవులు చేజిక్కించుకున్న చోట్ల అధికార పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకొన్నాయి. -
పరిషత్ పీఠాలు ఎవరివో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఎంపీపీ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలతోపాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. శనివారం జెడ్పీ కోఆప్టెడ్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారులు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినందున ఎస్ఈసీ ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఫలితాలను మండలాల్లో, జెడ్పీల ఫలితాలను జిల్లాల్లో వెంటనే వెలువరిస్తారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునే విధానం ఉండేది. అయితే, ఫలితాల వెల్లడి తర్వాత బేరసారాల నివారణ చర్యల్లో భాగంగా పరిషత్ పదవుల ఎన్నికకు ఎక్కువ వ్యవధి లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడంతో ఈ ఆనవాయితీ మారింది. ఎంపీ టీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేయకుం డానే ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఇలా ప్రమాణం చేయకుం డానే అధ్యక్ష, చైర్పర్సన్లను ఎన్నుకోవడం పంచాయతీరాజ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల ప్రక్రియ ఇలా... ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతి మండలానికీ సదరు మండల ఎంపీడీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు వస్తే మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికలన్నీ కోరం ఉంటేనే నిర్వహిస్తారు. సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే వీటిని నిర్వహిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి చేతులు ఎత్తే పద్ధతిలో సభ్యులతో ఓట్లు వేయిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారిని ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు. ఒకవేళ బరిలో ఉన్నవారందరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తారు. కోఆప్టెడ్ పూర్తి కాకపోతే అధ్యక్ష ఎన్నికలు ఉండవు... ఒకవేళ ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తి కాకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే ఈ ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ప్రకటిస్తుంది. కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అవకాశం లేదు. అయితే కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తయి ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక పూర్తి కాకపోతే మరో తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుంది. స్ఈసీ నిర్ణయించిన తేదీన నిర్వహించే ఎన్నికలకు కోరం లేకపోయినా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవచ్చు. కాగా, తాము నియమించిన విప్‌లను మార్చే అవకాశం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కల్పించారు. అయితే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు ప్రిసైడింగ్ అధికారులకు ఆ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తున్నట్టు గతంలో ఇచ్చిన వ్యక్తే మరోసారి లేఖ ఇవ్వాలి. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందితే అందుకు అనుమతిస్తారు. జులైలోనే బాధ్యతల స్వీకరణ... పాత పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియనందున కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, శుక్రవారం ఎన్నికయ్యే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శనివారం ఎన్నికయ్యే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవీకాలం వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల పదవీ కాలం జూలై 3 వరకు, జెడ్పీటీసీల పదవీకాలం జులై 4 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల తర్వాతే కొత్త పరిషత్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత కొత్త జెడ్పీ చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
7న ఎంపీపీ.. 8న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జూన్ 7న.. జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీపీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 8న జరగనున్నాయి. ఎంపీపీ ఎన్నికల రోజే మండల కోఆప్షన్, జెడ్పీపీ ఎన్నికల రోజున జిల్లా పరిషత్ కోఆప్షన్ ఎన్నికలూ పూర్తికానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాలతో ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించలేదు. 5,857 ఎంపీటీసీ స్థానాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఎంపీపీ పరిధిలోని 11 ఎంపీటీసీలు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎంపీపీ పరిధిలోని 15 ఎంపీటీసీలు, ములుగు జిల్లా మంగపేటలోని 14 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగలేదు. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. వాటిలో 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 534 జెడ్పీటీసీ, 5,659 ఎంపీ టీసీ స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది. కొత్త గా జరిగిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పాత 9 జిల్లాల స్థానంలో(హైదరాబాద్ మినహాయించి) 32 కొత్త జిల్లాల్లోని జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 538 ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంది. 6న ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 7న ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 6వ తేదీన మండలాల్లోని రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. జూన్ 7న ఉదయం 10 గంటల వరకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల పదవి కోసం పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించి, చెల్లుబాటయ్యే నామినేషన్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఒకవేళ కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరగకపోతే, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. కోఆప్షన్ సభ్యులను ఎన్నికైన సభ్యుడు ప్రతిపాదించాలి. ఒకే సభ్యుడు రెండు పేర్లను ప్రతిపాదిస్తే ఆ నామినేషన్ తిరస్కరిస్తారు. ఒక్కరే పోటీలో ఉంటే ఏకగ్రీవమైనట్టు ప్రకటిస్తారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇద్దరు సభ్యులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష, ఉపాధ్య ఎన్నిక ఉంటుంది. మొదట ఎంపీపీ అధ్యక్షుడి కోసం పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంపీపీ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసిన తర్వాత ఎన్నికలు ముగిసినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 7న జెడ్పీపీ చైర్పర్సన్ల ఎన్నిక నోటిఫికేషన్... జూన్ 8న నిర్వహించే జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం జూన్ 7న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల తరహాలోనే జూన్ 8న ఉదయం 10 గంటల వరకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పరిశీలించిన తర్వాత చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించి, ఆ తర్వాత ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ముందుగా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీపీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి ఎన్నిక ప్రక్రియ ముగిస్తారు. ఏదైనా కారణంతో ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీపీపీ చైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాపడితే, మరుసటిరోజున వాటిని నిర్వహించాలి. రెండోసారి కూడా వాయిదాపడితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలి. -
బెదిరింపనుకోండి.. వార్నింగనుకోండి!
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు తారస్థాయికి వెళ్తున్నాయి. వారి మాటాలు సామాన్య ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బరితెగింపులకు దిగుతుండడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నిజంగా వారిని గెలిపిస్తే కలిగే ఇబ్బందులను తలుచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ‘నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే కాగానే ఆర్నెల్లు అవకాశం ఇస్తా. ప్రత్యర్థులను కాళ్లు చేతులు విరచండి. చంపుతారా చంపండి. నేను చూసకుంటా’నని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బెదిరించిన వైనం మరువకముందే రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి ఎంపీపీ భర్త చేసిన బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వచ్చేది మా ప్రభుత్వమే. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోతాడు. ఎన్నికలలోపు అందరూ తెలుగుదేశం వైపు రావాలి. లేదంటే మీ ఇష్టం’ అంటూ కనగానపల్లి ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు బీసీ, ఎస్సీలను బహిరంగంగా బెదిరింపులకు గురి చేశారు. ఈ నెల 13న కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల పంచాయతీ తల్లిమడుగుల గ్రామంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్వయానా మంత్రి సమక్షంలో బహిరంగ సభలో ఎంపీపీ భర్త ఇచ్చిన వార్నింగ్ దుమారం రేపుతోంది. ‘కచ్చితంగా మళ్లీ మేమే అధికారంలో ఉంటాం. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి వెళ్తాడు. గుర్తు పెట్టుకోండి. బెదిరింపు అన్నా అనుకోండి, వార్నింగ్ అన్నా అనుకోండి. పద్ధతిగా ఉండండి. మారేందుకు అవకాశం ఇస్తున్నాం. ఎన్నికల్లోపు ఈ పక్క ఉండాలి. పొరబాటు జరిగిందంటే మాత్రం వచ్చే మా ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దీనికి రెడీగా ఉండండి’ అంటూ హెచ్చరించారు. పరిటాల కుటుంబ దౌర్జన్యాలకు పరాకాష్ట పరిటాల కుటుంబం సాగిస్తున్న దౌర్జన్యాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తాము చేసే మంచి పనులను ప్రజలకు వివరించి, వారిలో అభిమానం సంపాదించి ఓట్లు వేయించుకోవడం తప్పు కాదని, అయితే బలవంతంగా తమ పార్టీకే ఓట్లు వేయాలనే ధోరణిలో బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే ముకుందనాయడు ఇలా బెదిరిస్తున్నారని, ఆయన్ను గెలిపిస్తే ఆరాచకాలు మితిమీరిపోతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు ఓటు ద్వారా బుద్ధి చెబుదామని స్పష్టం చేస్తున్నారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీపీల జిల్లా కోటాను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు కసరత్తు చేసిన జిల్లా పరిషత్ అధికారులు బుధవారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీలకు సంబంధించి మండలాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగించారు.ఎంపీటీసీల రిజర్వేషన్ మాత్రం ఆయా జిల్లాల ఆర్డీఓల పర్యవేక్షణలో ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్‌ను జనాభా ప్రాతిపదికన నిర్ణయించగా, బీసీల రిజర్వేషన్ మాత్రం ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించారు. ఉదయంనుంచి రాత్రి వరకు రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రస్తుతం తయారు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతికి సూర్యాపేట, భువనగిరికి రిజర్వేషన్ జాబితాను పంపంచి అనుమతి తీసుకున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ నల్లగొండ జిల్లా ఎంపీపీ జెడ్పీటీసీ అడవిదేవులపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) అనుముల ఎస్సీ(జ) ఎస్సీ(జ) చందంపేట ఎస్టీ(మ) ఎస్టీ(మ) చండూరు బీసీ(మ) బీసీ(జ) చింతపల్లి జనరల్(మ) జనరల్(మ) చిట్యాల బీసీ(మ) బీసీ(మ) దామరచర్ల ఎస్టీ(మ) ఎస్టీ(మ) దేవరకొండ జనరల్ జనరల్(మ) గుండ్లపల్లి జనరల్(మ) జనరల్ గుర్రంపోడు జనరల్ జనరల్(మ) కనగల్ బీసీ(జ) బీసీ(జ) కట్టంగూర్ జనరల్ జనరల్ కేతెపల్లి ఎస్సీ(జ) ఎస్సీ(మ) కొండమల్లేపల్లి జనరల్(మ) జనరల్(మ) మాడ్గులపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(జ) మర్రిగూడ జనరల్ జనరల్ మిర్యాలగూడ జనరల్(మ) జనరల్ మునుగోడు బీసీ(జ) బీసీ(మ) నకిరేకల్ జనరల్ జనరల్(మ) జనరల్ జనరల్(మ) నల్లగొండ ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఎస్సీ(జ) నాంపల్లి జనరల్(మ) జనరల్ నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి(జ) జనరల్ నేరేడుగొమ్ము ఎస్టీ(జ) ఎస్టీ(జ) నిడమనూరు జనరల్(మ) జనరల్(మ) పీఏపల్లి జనరల్ జనరల్(మ) పెద్దవూర జనరల్(మ) జనరల్ శాలిగౌరారం ఎస్సీ(మ) ఎస్సీ(మ) తిప్పర్తి జనరల్ జనరల్ తిరుమలగిరి సాగర్ ఎస్టీ(జ) ఎస్టీ(మ) త్రిపురారం జనరల్(మ) జనరల్(మ) వేములపల్లి ఎస్సీ(మ) ఎస్సీ(మ) అడ్డగూడూరు ఎస్సీ(జ) ఎస్సీ(మ) ఆలేరు ఎస్సీ(జ) ఎస్సీ(జ) ఆత్మకూరు ఎం జనరల్(మ) జనరల్ బొమ్మల రామారం జనరల్ జనరల్ భువనగిరి బీసీ(మ) బీసీ(జ) బీబీనగర్ జనరల్ జనరల్(మ) చౌటుప్పల్ జనరల్ జనరల్ గుండాల ఎస్సీ(మ) ఎస్సీ(మ) మోటకొండూరు జనరల్(మ) జనరల్ మోత్కూర్ జనరల్(మ) జనరల్(మ) నారాయణపురం జనరల్(మ) జనరల్(మ) పోచంపల్లి జనరల్ జనరల్(మ) రాజాపేట బీసీ(జ) బీసీ(జ) రామన్నపేట బీసీ(మ) బీసీ(మ) తుర్కపల్లి ఎస్టీ(జ) ఎస్టీ(జ) వలిగొండ బీసీ(జ) జనరల్(మ) యాదగిరిగుట్ట బీసీ(జ) బీసీ(మ) నల్లగొండ జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్‌తోపాటు మిగిలిన రెండు జిల్లాల జాబితాను కూడా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అనుమతితో జెడ్పీ అధికారులు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలో మొత్తం 16మహిళలకు రిజర్వ్ కాగా, 15 మండలాలు జనరల్‌కు కేటాయించారు. సూర్యాపేటలో మొత్తం 23 మండలాలకు మహిళలకు 12, జనరల్‌కు 11 కేటాయించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలకు గాను 7 మహిళలకు రిజర్వ్ చేయగా, 10 జనరల్‌కు కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలో ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించారు. -
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకీ షాక్
-
పరిటాల సునీతకు ఎదురుదెబ్బ?
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళిపై రాప్తాడు మండల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఆయన ఆధిపత్యం చెలాయించడమేమిటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించమని మురళి ఎలా చెప్తారంటూ ఆందోళనకు దిగారు. కాగా మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ విషయమై పరిటాల వర్గంలో చర్చ మొదలైంది. -
టీడీపీలో అధిపత్య పోరు.. పదవి కొల్పోయిన ఎంపీపీ
సాక్షి, కంచికచర్ల: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. సొంత పార్టీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షురాలు(ఎంపీపీ)ని ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు గద్దె దించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల ఎంపీపీ వేల్పుల ప్రశాంతిని ఆ పదవి నుంచి తప్పించటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ప్రశాంతిపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సబ్ కలెక్టర్‌ను కలిశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడానికి సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై ప్రశాంతి కోర్టును ఆశ్రయించడంతో అవిశ్వాస సమావేశం వాయిదా పడింది. ఆ తర్వాత ఎంపీటీసీలు కూడా కోర్టును ఆశ్రయించడంతో.. న్యాయస్థానం ఎంపీపీ, ఎంపీటీసీల పిటిషన్లను తిరస్కరించింది. దీంతో బుధవారం అవిశ్వాస సమావేశం జరుపుతున్నట్టు ఆర్డీఓ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఆ మేరకు ఈ రోజు ఉదయం జరిగిన అవిశ్వాస తీర్మానం సమావేశానికి 15 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వారందరు కూడా ప్రశాంతికి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఆమె ఆ పదవిని కొల్పోవాల్సి వచ్చింది. కాగా, నేడు అవిశ్వాసంపై జరిగిన సమావేశానికి ప్రశాంతి హాజరుకాలేదు. -
‘అవిశ్వాసం’ సెగ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్లో అధికార పార్టీలోని కొందరు నేతల్లో మధ్య ఉన్న అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఈ అభిప్రాయభేదాలు ఇటీవలి అవిశ్వాస తీర్మానాలతో మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానాల వెనుక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటం.. వాటిని ఎదుర్కోవడమో, తిప్పి కొట్టడం వెనక ఉన్నది సైతం ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులే కావడం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల చోటు చేసుకున్న ‘అవిశ్వాసం’ రాజకీయాలతో అధికార పార్టీ నేతల మధ్యన ఏర్పడిన అంతర్గత విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ‘అవిశ్వాసం’తో వేడెక్కిన హుజూరాబాద్.. హుజూరాబాద్ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వా సం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు 18 మంది అవిశ్వాసంపై సంతకాలు చేయడం.. ఆ తర్వాత విజయ్‌కుమార్ రాజీనామా కు సిద్ధమయ్యారు. ఈ వివాదం కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో హుజూరాబాద్ ఎంపీపీపై ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులను కలుపుకుని టీఆర్ఎస్కు చెందిన బావు తిరుపతి తొమ్మిది మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని జెడ్పీ సీఈవో, ఆర్డీవోలకు ఇవ్వడం కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మధ్య సఖ్యత లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఈ ఇద్దరు నేతలు, వర్గాల మధ్య పొసగడం లేదన్న సంగతి ఆ పార్టీలోని వర్గాల్లోనూ ఉంది. ఇదే సమయంలో సరోజినీదేవిపై అవిశ్వాసం పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఓ వైపు కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్మే వి.సతీష్‌రావు, మరోవైపు మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీటీసీలను శాంతపరచేందుకు ఆ పార్టీకి చెందిన మండల మాజీ మండల ప్రజాప్రతినిధి, ఓ ప్రజాప్రతినిధి, ప్రముఖ కాంట్రాక్టర్ తదితరులను కూడా రంగంలోకి దింపారు. సతీష్‌కుమార్ హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో ఎంపీటీసీలతో చర్చించగా, మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీటీసీల కూటమితో మాట్లాడారు. ఈ ఇరువర్గాలు కూడా అసంతృప్తి ఎంపీటీసీలకు ప్రభుత్వ పనులు ఇప్పించేందుకు హామీ ఇవ్వడంతో ‘అవిశ్వాసం’ వేడి చల్లారింది. సద్దుమణిగింది. రచ్చకెక్కిన రామగుండం రాజకీయాలు.. ఇండిపెండెంట్ కార్పొరేటర్‌గా గెలుపొంది ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆశీస్సులతో టీఆర్ఎస్లో చేరి మేయర్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణ తిరిగి టీఆర్ఎస్ చేతిలోనే ఓటమి పాలయ్యారు. దీంతో రామగుండం నియోజకవర్గం అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే, ఆర్టీసీ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్ వర్గీయుల మధ్య ఎప్పటి నుంచో వర్గపోరు సాగుతోంది. బయటికి కనిపించకపోయినా పోలీసు అధికారుల మొదలు పలు అంశాల్లో ఒకరి నిర్ణయాలను ఒకరు అడ్డుకున్న సంఘటనలు అనేకం. ఈ పోరులో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎంపీ సుమన్ వర్గంగా ముద్రపడిన మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం వరకు దారితీసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరిగింది. నాటకీయ ఫక్కీలో పరిణామాలు చోటు చేసుకున్నవి. ఆ క్రమంలో మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసమే ప్రకటించారు. ఆ తర్వాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ సమక్షంలో మళ్లీ ఆయనే హైదరాబాద్‌లో మీడియా ముందు చెప్పడం వంటి పరిణామాలు రక్తికట్టించాయి. స్వపక్షంలోనే తన రాజకీయ ప్రత్యర్థిగా తయారైన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి అధిష్ఠానం నుంచి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా ఎమ్మెల్యే చక్రం తిప్పి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రామగుండం అభివృద్ధిని ఎమ్మెల్యేను అడ్డుకున్నారని శనివారం కొంకటి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మేయర్ అయిన కొంకటి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకుడు కోరుకంటి చందర్, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, జెడ్పీటీసీ సంధ్యారాణి సైతం గ్రూపులుగా కొనసాగుతుండటంతో రామగుండం రాజకీయాలు రచ్చకెక్కాయి. నువ్వా–నేనా.. ఎమ్మెల్యే రమేష్, తుల ఉమ కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. కొద్ది మాసాలుగా పార్టీ సభ్యత్వం, పదవులు, పనుల విషయంలో ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య రసవత్తర పోరే సాగుతోంది. కమిటీలకు కమిటీలు రద్దు చేయడం, మరికొందరిపై బహిష్కరణ వేటుతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే వరకు గొడవలు వెళ్లాయి. తాజాగా వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈ ఇద్దరు నేతల మధ్య మరింత అగాధం పెరిగిందంటున్నారు. ఎంపీపీ వెంకటేశ్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వర్గీయుడు కాగా, ఆయనపై ఎమ్మెల్యే రమేష్ వర్గీయులు నోటీసు ఇచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం తొమ్మిది మందితో అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, గత నెల 25న నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో తిప్పాపూర్ ఎంపీటీసీ అహ్మద్‌పాషా గైర్హాజర్ కాగా వెంకటేశ్‌పై అవిశ్వాసం వీగిపోయింది. ఈ వ్యవహారంలో తుల ఉమ కీలకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. అదేవిధంగా బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన నామాల ఉమ వేములవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ఆమె భర్త లక్ష్మీరాజంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 20 మందిలో 15 మంది కౌన్సిలర్లు నామాల ఉమను దింపేందుకు నోటీసు ఇచ్చారు. ఇదే సమయంలో క్యాంపునకు తరలిన 15 మంది ఎంపీటీసీల్లో ఇద్దరు (నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం) బయట పడటంతో సీన్ రసవత్తరంగా మారింది. ఈ వ్యవహరంలోనూ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా వుంటే కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్‌కు అవిశ్వాసం ముప్పు తప్పింది. మొత్తం 24 మంది ఎంపీటీసీ సభ్యుల్లో సుమారు 17 మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాసానికి సిద్ధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగ ప్రవేశం చేశారు. ఒకేపార్టీలో ఉంటూ అవిశ్వాసం పెట్టడం సరికాదని, ఇరువర్గాలకు నచ్చజెప్పిన ఆయన చివరకు వాసాలపై ‘అవిశ్వాసం’కు తెరవేశారు. అలాగే కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన మెజార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే కమలాకర్ ఎదుట తమ అక్కసు వెళ్లబోసుకోగా, పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దని సూచించి, వారించినట్లు చర్చ ఉంది. -
దళిత మహిళ ఎంపీపీ కావడంతో చిన్నచూపు
-
దళిత కాబట్టే వివక్ష!
-
అధిష్టానంతో మాట్లాడాకే రాజీనామా చేస్తా
పెనుగొండ: ఎంపీపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని, అయితే అధిష్టానానికి ఇక్కడి పరిస్థితిని వివరించాకే చేస్తానని పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖ స్పష్టం చేశారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేకపోయినా, ఒప్పంద ఉల్లంఘన అంటూ ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. అయినా రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు వివరించారు. ఈ మేరకు ముందే సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖను విలేకర్లకు చూపించారు. ఈ నెల 25వ తేదీ అనంతరం రాజీనామా లేఖను అందచేస్తానని వివరించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎన్నికల ముందు జరిగిన, ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలు వివరిస్తాననితెలిపారు. తన వాణి అధిష్టానం వద్ద వివరించిన అనంతరం రాజీనామా చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు తనను ఓడించడానికి కొందరు ప్రయత్నం చేసినా ప్రజల అండతో గెలిచానన్నారు. ఎన్నికల అనంతరం అవాంతరాలు కూడా సృష్టించారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ, పార్టీ పటిష్టతకు కృషి చేశానని తెలిపారు. 2న అవిశ్వాస తీర్మానం ఆగస్టు 2వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీవో వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణకు అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీని అయిదేళ్లలో రెండు భాగాలు పంచుకోవాలని నిర్ణయించుకొని మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 సంవత్సరం నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది. అయితే, ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమీరా అనడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును ఆర్డీవోకు అందించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం విశేషం. రాజీనామాకు దారి తీసిన సంఘటనలు, అవిశ్వాస తీర్మానం వెనుక ఉన్న రాజకీయాలను అధిష్టానానికి వివరించిన తరువాతే రాజీనామా చేస్తానని సురేఖ చెప్పడం కొస మెరుపు. -
పదవి భార్యది.. పెత్తనం భర్తది
గురజాల: పదవి భార్యది పెత్తనం మాత్రం భర్తది. మహిళలు మహారాణులు అంటారు కానీ మన దగ్గర మాత్రం మహిళలకు ఆ స్థానం లేదు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఆర్డీవో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీకి బదులుగా ఆమె భర్త సీట్లో దర్జాగా కూర్చొన్నారు. ఎన్నికల ఒప్పందంలో భాగంగా రెండో ఎంపీపీగా ఈ నెల ఐదో తేదీ సగిలా సరితాదేవి ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే జరిగిన సమావేశంలో భర్త బాల కోటిరెడ్డి సమావేశాల్లో ఎంపీపీగా కూర్చుంటున్నారు. అధికారికంగా జరుగుతున్న మీటింగ్‌లో ఆర్డీవో పక్కన ఎంపీపీ భర్త సగిల బాల కోటిరెడ్డి కూర్చోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారిక సమావేశంలో ఎంపీపీ భర్త దర్జాగా కూర్చోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
టీడీపీ సర్కారు బీసీ నేతలను చులకనగా చూస్తున్నారు
-
ఎంపీపీపై అవిశ్వాస ప్రతిపాదన
తాండూరు రూరల్ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సొంత ఇలాఖాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు ఎంపీపీ లక్ష్మమ్మపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. 9 మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అప్పట్లో అంతారం–2 ఎంపీటీసీ సభ్యురాలు కోస్గి లక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాట కారణంగా మంగళవారం అదే పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ లక్ష్మమ్మపై తిరుగుబాటు జెండా ఎగురువేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి మంగళవారం తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌ను కలిసి అవిశ్వాసం లేఖ అందజేశారు. వడ్డె శ్రీనుతో వేగలేకపోతున్నాం.. టీఆర్ఎస్కు చెందిన అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు శేఖర్, వసంత్‌కుమార్, శోభ మాట్లాడుతూ.. ఎంపీపీ లక్ష్మమ్మ వర్గీయుడు, తాండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను మండలంలో ఏకపక్షంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ వ్యవహారాల్లో అతనే ముందుండి నడిపిస్తున్నారని, తమను లెక్క చేయడం లేదని మండిపడ్డారు. ఆయనతోనే స్థానికంగా టీఆర్ఎస్ భ్రష్ఠుపట్టిందని, గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమకు మంత్రి మహేందర్‌రెడ్డి అంటే అభిమానమేనని.. కానీ వడ్డె శ్రీను ఒంటెత్తు పొకడతో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాల్సి వస్తోందని తెలిపారు. మంత్రి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం.. తాండూరు మండలం ఎంపీపీ కోస్గి లక్ష్మమ్మపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి అప్రమత్తయ్యారు. సోమవారం మధ్యాహ్నం వైస్ ఎంపీపీ శేఖర్‌తోపాటు ఎంపీటీసీ సభ్యులు వసంత్‌కుమార్, మ్యాతరి శోభతో ఫోన్లో మాట్లాడారు. అంతర్గత సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుందామని.. ఇలా రచ్చకెక్కడంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సర్దిచెప్పారు. మంత్రి మాటలు లెక్కచేయకుండా అసమ్మతి ఎంపీటీసీలు మంగళవారం ఆర్డీఓను కలిసి ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు లేఖ ఇచ్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి అసమ్మతి ఎంపీటీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. -
ఎంపీపీ భర్తపై గ్రామస్తుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వరంగల్ : జిల్లాలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో ఓ యువకుడిని చితకబాదారంటూ.. స్థానిక ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డిపై నారాయణగిరి గ్రామస్తులు దాడికి దిగారు. రమణారెడ్డి, అతని అనుచరుల ఇళ్లపై ఒక్కసారిగా రాళ్లు దాడులు జరిపారు. ఇళ్లపైకి వచ్చి ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి.. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గ్రామంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సుధీర్ అనే యువకుడిపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. సుధీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూవివాదం విషయంలో సుధీర్‌పై రమణారెడ్డే దాడి చేయించాడంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ తాతా పేరుమీద ఉన్న భూమిని కొనేందుకు గతంలో రమణారెడ్డి ప్రయత్నం చేశారు. కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆయన వెనుకకు తగ్గారు. ఈ క్రమంలో సుధీర్ కుటుంబం రమణారెడ్డి వద్ద అప్పు తీసుకోవడం.. ఆ అప్పు కింద భూమిని తనకు ఇవ్వాలని రమణారెడ్డి ఒత్తిడి తేవడంతో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే సుధీర్‌పై రమణారెడ్డి దాడి చేయించాడని గ్రామస్తులు అంటున్నారు. తాజా ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో నారాయణగిరి గ్రామం పోలీసుల పహారాలో ఉంది. -
మహిళను తన్నిన ఎంపీపీ గోపీ అరెస్టు!
సాక్షి, నిజామాబాద్: మహిళను కాలితో తన్ని అవమానించిన దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మహిళపై అనుచితంగా ప్రవర్తించి దాడి చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. భూతగాదాల విషయమై గొడవ జరగడంతో ఎంపీపీ ఇమ్మడి గోపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడు. మహిళ చెప్పుతో కొట్టడంతో విచక్షణ కోల్పోయిన అతను.. ఆమెను కడుపులో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందల్ వాయి మండలం గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి వద్ద వ్యవసాయ భూమి, అందులోని మరో ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా నగదు ఇవ్వాలని ఇమ్మడి గోపి డిమాండ్ చేస్తున్నారని రాజవ్వ ఆరోపించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇందల్ వాయిలో నివాసం ఉంటున్న ఎంపీపీ గోపి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. అమ్మిన ఇంటిని అప్పగించకుండా, తాళాలు వేసి తమకు ఇవ్వకపోవడం బాధిత రాజవ్వకు ఆగ్రహం తెప్పించింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో బాధిత మహిళ రాజవ్వ, ఎంపీపీ గోపిపై చెప్పుతో దాడి చేశారు. వరండాపైన ఉన్న గోపి కింద ఉన్న రాజవ్వను గట్టిగా కాలితో తన్నాడు. దీంతో మహిళ కింద పడిపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ బంధువు గోపిని అడ్డుకున్నారు. బాధిత మహిళ రాజవ్వ వివరాల ప్రకారం.. ‘ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కనే గోపికి చెందిన 1125 గజాల స్థలం, అందులోని ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తాను అని చెప్తే 33 లక్షల 72 వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు. ఎంపీపీ గోపి అదనంగా డబ్బులు చెల్లించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును గోపి బయట పడేశారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. మాజీ నక్సలైట్ ను అని తమతో పెట్టుకోవద్దని గోపి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మా కొడుకులకు ఏం జరిగినా ఎంపీపీదే బాధ్యత. ఎస్సై, సీఐ, సీపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి సమస్య చెప్పుకుంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు కనుక, అదే ఇంట్లో ఉండాలని చెప్పారు. కానీ మాకు అన్యాయమే జరిగిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. -
అధికారం ఉంది.. తంతా!
ఇందల్వాయి(నిజామాబాద్ జిల్లా): అతడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి.. దాదాపు ఏడాది కింద ఓ మహిళకు తన ఇంటిని అమ్మాడు.. ఆమె డబ్బులన్నీ కట్టేసింది.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.. అయినా ఇంటిని స్వాధీనం చేయలేదు.. ఆ మహిళ ఇంటికెళ్లి నిలదీసినందుకు బలంగా కాలితో తన్నాడు! నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారానికి చెందిన ఇమ్మడి గోపి దాష్టీకమిదీ. 33 లక్షలకు అమ్మి.. 90 లక్షలు కావాలంటూ.. గోపి ధర్పల్లి ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇందల్వాయిలోని సర్వే నెం.1107లో 1,125 గజాల స్థలంలో రెండు పోర్షన్లతో కూడిన ఇల్లు (3–8–11/3) ఉంది. 11 నెలల క్రితం ఈ ఇంటితో సహా స్థలాన్ని గౌరారానికి చెందిన ఒడ్డె రాజవ్వ, గంగారాం దంపతులకు రూ.33.72 లక్షలకు విక్రయించాడు. విడతల వారీగా మొత్తం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. నెల క్రితం ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రాజవ్వ ఇసుక, ఇటుక తరలించగా.. గోపి అడ్డుకున్నాడు. రూ.90 లక్షలకు ఇంటిని అమ్మానని, మిగతా రూ.56 లక్షలు కడితేనే ఇంటిని స్వాధీనం చేస్తానని ఆయన అన్నట్లు రాజవ్వ, ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు. తాను మాజీ నక్సలైట్‌నని, తన చేతుల్లో అధికారం ఉందని, ఎవరూ ఏమి చేయలేరంటూ బెదిరించాడంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే సివిల్ తగాదాలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించడంతో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులకు వద్దకు వెళ్లగా.. చివరకు ఎంపీపీపై బెదిరింపుల చట్టం కింద కేసు నమోదైంది. చెప్పుతో కొట్టడంతో.. రాజవ్వ కుటుంబీకులు ఆదివారం తమ కులస్తులతో కలిసి ఇందల్వాయిలోని తాము కొన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. తాళం పగలగొట్టి లోపన ఉన్న వస్తువులు, వంట సామగ్రిని బయటకు పడేసి, తమకు న్యాయం చేయాలంటూ ఇంటి మందు బైఠాయించారు. ఈ క్రమంలో ఎంపీపీ గోపికి, రాజవ్వ కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన రాజవ్వ గోపిని చెప్పుతో కొట్టింది. దీంతో అతడు రాజవ్వను కాలితో బలంగా తన్నాడు. కిందపడిన రాజవ్వ అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదంపై వివరణ కోరగా ఎంపీపీ స్పందించేందుకు నిరాకరించారు. మాకు ప్రాణ భయం ఉంది: రాజవ్వ తమ వద్ద గోపి రూ.33 లక్షలు తీసుకొని, ఇంటిని, స్థలాన్ని అప్పగించడం లేదని రాజవ్వ పేర్కొంది. ‘‘నేను మాజీ నక్సలైట్‌ను.. నా చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏమి చేయలేరు అని బెదిరిస్తున్నాడు. అతడి నుంచి మాకు ప్రాణ భయం ఉంది. నా భర్త దుబాయిలో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని కొన్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి’’అని ఆమె గోడు వెల్లబోసుకుంది. గోపిని అరెస్ట్ చేయాలి ఎంపీపీ దాడి విషయం తెలిసి వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి తదితరులు ఇందల్వాయికి చేరుకుని నిరసన తెలిపారు. ఎంపీపీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోపిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం ప్రజాసంఘాలతో కలిసి ‘చలో ఇందల్వాయి’నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఇందల్వాయి బంద్‌కు పిలుపునిచ్చింది. -
మహిళను తన్నిన ఎంపీపీ.. వైరల్!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్ వాయిలో దారుణం జరిగింది. ఎంపీపీ మహిళను కాలితో తన్నడం ఉద్రిక్త పరిస్థతులకు దారితీసింది. భూతగాదాల వల్లే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలిలా.. ఇందల్ వాయి మండలం గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి వద్ద వ్యవసాయ భూమి, అందులోని మరో ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా నగదు ఇవ్వాలని ఇమ్మడి గోపి డిమాండ్ చేస్తున్నారని రాజవ్వ ఆరోపించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇందల్ వాయిలో నివాసం ఉంటున్న ఎంపీపీ గోపి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. అమ్మిన ఇంటిని అప్పగించకుండా, తాళాలు వేసి తమకు ఇవ్వకపోవడం బాధిత రాజవ్వకు ఆగ్రహం తెప్పించింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో బాధిత మహిళ రాజవ్వ, ఎంపీపీ గోపిపై చెప్పుతో దాడి చేశారు. వరండాపైన ఉన్న గోపి కింద ఉన్న రాజవ్వను గట్టిగా కాలితో తన్నాడు. దీంతో మహిళ కింద పడిపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ బంధువు గోపిని అడ్డుకున్నారు. బాధిత మహిళ రాజవ్వ వివరాల ప్రకారం.. ‘ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కనే గోపికి చెందిన 1125 గజాల స్థలం, అందులోని ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తాను అని చెప్తే 33 లక్షల 72 వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు. ఎంపీపీ గోపి అదనంగా డబ్బులు చెల్లించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును గోపి బయట పడేశారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. మాజీ నక్సలైట్ ను అని తమతో పెట్టుకోవద్దని గోపి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మా కొడుకులకు ఏం జరిగినా ఎంపీపీదే బాధ్యత. ఎస్సై, సీఐ, సీపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి సమస్య చెప్పుకుంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు కనుక, అదే ఇంట్లో ఉండాలని చెప్పారు. కానీ మాకు అన్యాయమే జరిగిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. -
మా పార్టీ జోలికొస్తే సహించం
ఒంగోలు: మిత్రపక్షంగా ఉంటారో...వెళతారో అనేది మీరే తేల్చుకోండి...అంతే తప్ప మిత్రపక్షం అంటూ మా పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే మాత్రం సహించేది లేదంటూ టీడీపీ నాయకులను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులివెంకట కృష్ణారెడ్డి హెచ్చరించారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని మిత్రపక్షంగా భావించి తాము మౌనంగా ఉంటున్నా టీడీపీ నాయకుల వ్యవహారశైలి ఆక్షేపణీయంగా ఉంటుందన్నారు. త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిందని, దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీఈవో నిర్ణయం వెలువరించారన్నారు. దీనిపై హైకోర్టులో సవాల్ చేసి తిరిగి ఆమె త్రిపురాంతకం ఎంపీపీగా కొనసాగుతున్నారన్నారు. తాజాగా జరుగుతున్న జన్మభూమి–మా వూరు కార్యక్రమంలో ఆమెను ఖాతరు చేయకుండా ఆమె మాట్లాడుతుంటే మైక్ సైతం లాక్కోవడం, ఎంపీడీఓవో మాణిక్యాలరావు అయితే ఏకంగా టీడీపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సామాజిక తనిఖీ బృందం రూ.14 కోట్ల అవినీతి జాతీయ ఉపాధిహామీ పథకంలో చోటు చేసుకుందని తేల్చిందన్నారు. అంతే కాకుండా మరుగుదొడ్లలో కూడా రూ.2 కోట్ల అవినీతి చోటుచేసుకోవడంతో దానిపై చెన్నమ్మ ప్రశ్నించారన్నారు. అక్కడి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పినట్లుగా నడుస్తూ ఎంపీపీ పట్ల నిర్లక్ష్యంగా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ఎంపీడీవో మాణిక్యాలరావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అక్కడ జరిగిన అవినీతి నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో నాలుగు రోజుల్లో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, ఈ విషయమై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధిష్టానంతోపాటు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా హాజరవుతారని ఆశిస్తున్నామని, అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ త్వరలోనే కనిగిరి నుంచి వెలిగొండ ప్రాజెక్టు వరకు పాదయాత్ర కూడా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంపీపీ నీలం చెన్నమ్మ మాట్లాడుతూ అవినీతిపై గళం ఎత్తుతున్నందుకే తమను బీజేపీలో ఉన్నా హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయిస్తే అక్కడ ఎమ్మెల్యే అయి పార్టీ మారిన డేవిడ్‌రాజు, దళిత ఎంపీపీ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. కోఆప్షన్ సభ్యుడు నీలం లాజర్ మాట్లాడుతూ బీజేపీ ఉనికినే లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే తాము జిల్లా అధ్యక్షుడ్ని కలిసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు బొద్దులూరి ఆంజనేయులు, ముదివర్తి బాబూరావు పాల్గొన్నారు. -
పింఛన్ వార్!
♦ కురుపాం టీడీపీలో ముదురుతున్న వర్గపోరు ♦ శత్రుచర్ల వర్సెస్ జగదీష్ ♦ నువ్వానేనా అన్నట్టుగా వారి అనుయాయులు ♦ పరస్పరం ఫిర్యాదులతో రచ్చ రచ్చ ♦ అధికారులపైనా తీవ్రమైన ఒత్తిడి జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఏ నియోజకవర్గం చూసినా... యుద్ధవాతావరణమే కనిపిస్తోంది. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్సీలు శత్రుచర్ల... ద్వారపురెడ్డి అనుయాయులైన డొంకాడ... దత్తిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి ఆదేశాలు పాటిస్తే ఏమైపోతామోనని అధికారులు హడలెత్తిపోతున్నారు. ఇరువర్గాల ఒత్తిళ్ల మధ్య ఇరుక్కుపోతున్నారు. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న పింఛన్ల వార్ జిల్లా అధికారులకు తీరని శిరోభారం తెప్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నరేళ్లు ద్వారపురెడ్డి జగదీష్ వర్గం చక్రం తిప్పింది. ఆయన వర్గీయులుగా ఎంపీపీ దత్తి కామేశ్వరి భర్త లక్ష్మణరావు హవా సాగించారు. జన్మభూమి కమిటీలు కూడావీరి చేతిలో ఉండటంతో అంతా వారికి అనుకూలంగానే నడిచింది. ఈ క్రమంలో తమ అనుయాయులైన అనర్హులకు పెద్దపీట వేశారు. ముఖ్యం గా పింఛన్ల విషయంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఇక, రెండున్నరేళ్ల తర్వాత పవర్ సెంటర్ మారింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు హవా మొదలైంది. ఈయనొచ్చాక పాత జన్మభూమి కమిటీలు రద్ద య్యా యి. వారి స్థానంలో తమ వర్గానికి చెందిన కమి టీలు ఏర్పడ్డాయి. ఈయన అనుచరునిగా జెడ్పీటీసీ డొంకాడ మంగమ్మ భర్త, ఏఎంసీ మాజీ చైర్మన్ డొంకాడ రామకృష్ణ ఆధిపత్యం మొదలైంది. ఇప్పుడు వీరి ఆధ్వర్యంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా మొదలవ్వడంతో వివాదం ముదిరింది. పింఛన్ల విషయంలో రగడ ఇక్కడి వర్గపోరు పుణ్యమాని పరస్పరం బహిరంగ విమర్శలకు దిగారు. అంతేనా... ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ముఖ్యంగా పింఛన్ల విషయంలో వీరి మధ్య పెద్ద రగడే నడుస్తోంది. దత్తి లక్ష్మణరావు హవా సాగిన రోజుల్లో పింఛన్ల అక్రమాలు జరిగాయని, అనర్హులైన 76మందికి పింఛన్లు మంజూరు చేశారని డొంకాడ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. కొత్త పవర్‌సెంటర్ వచ్చాక తాజాగా మంజూరైన 141పింఛన్లలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఇచ్చేశారని ఇప్పుడు దత్తి లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు. ఇరువర్గీయులు కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు. నలిగిపోతున్న అధికారులు ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికా రుల పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్న చందంగా తయారైంది. ఇరువర్గీ యుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లా అడిట్ అధికారి, డీఆర్డీఏ అడిషనల్ ప్రాజె క్టు ప్రసాద్ విచారణ చేపట్టారు. చర్యలు తీసుకునే సరికి ఇరువర్గాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. మూ డు పర్యాయాలు విచారణ చేపట్టినా హాజరు కాలేదని చెప్పి ఎంపీపీ స్వగ్రామంలో కొన్ని పింఛన్లు రద్దు చేశారు. ఇది దత్తి లక్ష్మణరావు ఆగ్రహానికి కారణమైంది. పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా పింఛన్లు ఎలా తొలగిస్తారని అధికారులపై విరుచుకుపడ్డారు. అక్కడ ఎంపీడీఓ పైనే కాకుం డా జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ అడిషనల్ పీడీ ప్రసాద్‌పైనా మండిపడ్డారు. ఆ మధ్య జెడ్పీ సీఈఓ రాజకుమారి డీఆర్డీఏ ఇన్చార్జి పీడీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ కొచ్చి వీరంగమే సృష్టించా రు. సీఈఓ ఛాంబర్లో అడిషనల్ పీడీ ప్రసాద్‌పై అంతెత్తున లేచారు. పరిస్థితిని గమనించిన సీఈఓ రాజకుమారి జోక్యం చేసుకుని తొలగించిన పింఛ న్లు పునరుద్ధరిస్తామని చెప్పేసరికి శాంతించారు. ఇక, శత్రుచర్ల వర్గానికి చెందిన డొంకాడ రామకృష్ణ కూడా ఫించన్ల విషయంలో అధికారులపై ధ్వజమెత్తినట్టు తెలిసింది.ముఖ్యంగా మండల స్థాయి అధి కారులపై విరుచుకుపడినట్టు విమర్శలు ఉన్నా యి. తాజాగా శత్రుచర్ల వర్గానికి చెందిన 33 పింఛన్లను అనర్హులుగా తేల్చి, వాటిని తొలగించాలని విచారణాధికారి సిఫార్సు చేశారు. ఇప్పుడా పింఛన్లపై ఎంత రాద్ధాంతం జరుగుతుందోనన్న భయం అధికారులకు పట్టుకుంది. మొత్తానికి ఇరువర్గాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఇవీ ఆరోపణలు... రాయఘడ గౌరమ్మ భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛను ఇచ్చారని, లచ్చిరెడ్డి దాలినాయుడు ల్యాండ్లార్డు అయినా పింఛను ఇచ్చారని, రా యల అప్పలనర్సమ్మ(ఐడీ నంబర్ 328928)కు భర్త ఉన్నా వితంతు పింఛను అందుకుంటున్నారని, గవరమ్మపేట పంచాయతీ వెంకటరా జపురంలో సంగాపు సత్యవతి(ఐడీ 15939)కి భర్త ఉన్నా వితంతు పింఛను మంజూరు చేశారని, పెళ్లి కాకపోయినా ఎజ్జు గంగమ్మకు వితం తు పింఛను ఇచ్చారని, జియ్యమ్మవలసలో పెద్దింటి అప్పలస్వామి(328741)కి వితంతు పింఛను ఇచ్చారని, జియ్యమ్మవలసకు చెందిన దత్తి నారాయణమ్మ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో సిద్ధాంతం రాముడమ్మకు పింఛను ఇస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఒక్క జి య్యమ్మవలసలో దొంగ దివ్యాంగ సర్టిఫికేట్లతో దాదాపు 60 మంది వరకు పింఛన్లు అందుతున్నాయని ఆరోపించారు. ఎంపీపీ సొంత గ్రామమైన వెంకటరాజపురంలో 16 పింఛన్లు అనర్హులకే ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఫిర్యాదుల నేపథ్యంలోనైనా ఇక్కడ అక్రమాలు జరిగాయన్నది స్పష్టమయ్యింది. -
ఎంపీపీపై లైంగిక వేధింపుల కేసు
చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి ఎంపీపీ తాడూరి కిష్టయ్యపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హుస్నాబాద్ ఏఎస్సై మోతిలాల్‌నాయక్ వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలపరిషత్ అధ్యక్షుడిగా పని చేస్తున్న తాడూరి కిష్టయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన వివాహితపై లైంగిక దాడి చేసినట్లు సదరు వివాహిత భర్త శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిష్టయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కిష్టయ్య గతంలో పేకాట కేసులో అరెస్టయ్యాడు. ఎంపీపీ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. -
పెనుగొండ ఎంపీపీ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖను టీడీపీ నుంచి బహిష్కరిస్తూ ఎంపీపీ పదవిపై ఏర్పడిన వివాదానికి తెరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. జూలి సురేఖను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటిస్తారని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు. పెనుగొండ మండల పరిషత్‌లో ఎంపీపీ వివాదం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఎంపీపీగా తొలుత పల్లి జూలీ సురేఖకు రెండున్నర సంవత్సరాలు, అనంతరం చీకట్ల భారతి కొనసాగేవిధంగా అంగీకరించారు. రెండున్నరేళ్లు పూరై్తనా తాను రాజీనామా చేసేది లేదంటూ సురేఖ తేల్చిచెప్పడంతో టీడీపీలో వివాదం రాజుకుంది. కొందరు నేతలు సురేఖకు మద్దతు ప్రకటిస్తున్నారన్న అనుమానాలు ఉండడంతో ఎంపీటీసీలతో చర్చించారు. టీడీపీకి చెందిన 17 మంది ఎంపీటీసీలు ఏకతాటిపైకి రావడంతో జిల్లా నాయకత్వానికి ఎంపీపీ వివాదాన్ని తెలియచెప్పారు. ఎమ్మెల్యే పితాని ఆధ్వర్యంలో మండలానికి చెందిన కొందరు నాయకులు ఎంపీపీ వివాదాన్ని నారా లోకేష్‌కు వివరించడంతో జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎంపీపీతో చర్చించి నిర్ణయం తీసుకోమని ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై శనివారం ఏలూరులో జరిగిన సమావేశంలో చర్చించినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో చివరకు ఎంపీపీని సస్పెండ్ చేయడానికి నిర్ణయించారు. వైస్ ఎంపీపీగా చీకట్ల భారతి కాగా ఎంపీపీగా ఆఖరి రెండున్నర సంవత్సరాలు కొనసాగాల్సిన చీకట్ల భారతిని వైస్ ఎంపీపీగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం దేవ ఎంపీటీసీ మన్నే శ్రీహరి విశ్వేశ్వరరావు పెండ్లికొడుకు వైస్ ఎంపీపీగా ఎన్నిక కావాల్సి ఉన్నా భారతికి అన్యాయం జరిగిందన్న కారణంతో పాటు ఎంపీపీకి చెక్ పెట్టేందుకు ఆమెను ఎంపిక చేశారు. ఇదిలా టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు ఎటువంటి సమాచారం అందలేదని పల్లి జూలీసురేఖ చెప్పారు. -
చాగలమర్రి ఎంపీపీకి నోటీసులు
చాగలమర్రి: చాగలమర్రి మండల పరిషత్ అధ్యక్షుడు మస్తాన్‌వలికి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నోటిసులు అందాయి. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మూడు సాధారణ సమావేశాలకు వరుసగా గైర్హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఎంపీడీఓ శ్రీలత గత సమావేశం తర్వాత జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. మస్తాన్‌వలి ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా కడప కేంద్ర కరాగారంలో ఉన్నారు. అప్పటి నుంచి మండల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఎంపీపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నోటీసులకు సంబంధించి ఎంపీపీ 30 రోజుల్లో సంజాయిషీ(వివరణ) ఇవ్వాల్సి ఉందని ఎంపీడీఓ తెలిపారు. -
నువ్వెంత.. నువ్వెంత
పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్, ఎంపీపీ మధ్య వాగ్వాదం ఇద్దరి మధ్య తిట్ల పురాణం ఎస్ఐల ప్రేక్షకపాత్ర గుత్తి : ఒకరు కానిస్టేబుల్. మరొకరు ఎంపీపీ. చిన్న విషయంగా వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అనే స్థాయికి వచ్చారు. ఇదంతా ఎస్ఐల ముందే జరగ్గా, వారు ప్రేక్షకపాత్ర వహించారు. గుత్తి పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన గురువారం జరిగింది. జరిగిందేమిటంటే... బసినేపల్లి వద్ద లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆ విషయంగా మాట్లాడేందుకు ఎంపీపీ వీరేశ్, బసినేపల్లి సర్పంచు భర్త మహ్మదాలీ, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస యాదవ్, ధర్మాపురం సర్పంచు శ్రీనివాసచౌదరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ మోహన్ అనే కానిస్టేబుల్ ఎదురయ్యారు. అతన్ని ఉద్దేశించి.. బాబు.. మీ ఎస్ఐ లేరా?అని ఎంపీపీ అడిగారు. దీంతో సదరు కానిస్టేబుల్.. నన్ను బాబూ అని పిలుస్తావా? నువ్వెవరు? అంటూ ప్రశ్నించారు. కోపోద్రుక్తుడైన ఎంపీపీ.. నన్నే ఎవరంటావా?నన్నెప్పుడూ చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి తిట్ల పురాణానికి దిగారు. ‘నీ సంగతి చూస్తా’నంటే.. నీ సంగతి చూస్తా’నంటూ ఒకర్నొకరు చాలెంజ్ చేసుకున్నారు. ఈ తతంగమంతా ఎస్ఐ సమక్షంలోనే జరగడం గమనార్హం. అనంతరం తమపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసు కానిస్టేబుల్ మోహన్‌పై ఎంపీపీ , టీడీపీ నాయకులు ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. -
ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడండి
కనగానపల్లిలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయండి కలెక్టర్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం అర్బన్ : కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవికి బుధవారం ఎన్నిక జరుగనుందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్ కోన శశిధర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాగే పరశురాం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతం చాలా సమస్యాత్మకమైందని తెలిపారు. కాబట్టి ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా చూడాలన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మండల పరిషత్‌లో సంపూర్ణ ఆధిక్యత ఉందని, తమ పార్టీ అభ్యర్థి మండల పరిషత్ అధ్యక్షనిగా ఎన్నిక అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ ఎన్నికను ఏకపక్షంగా జరుపుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మండల పరిషత్ సభ్యులకు తగిన రక్షణ కల్పించి ప్రజాస్వామ్య పద్ధతిలోఎన్నిక జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. -
తాను చెప్పినవారికే పనులు కల్పించాలి
ఎంపీపీ భర్త రామా వీరబల్లి: మండలంలో ఉపాధిహామీపనులు మొదలుకుని ఎలాంటి అభివృద్ధిపనులు వచ్చినా తాను చెప్పినవారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీచేస్తున్నాడని ఎంపీపీ స్వరూ స్వప్న భర్త రామా, తదితర టీడీపీ నాయకులు తెలుపుతున్నారని కొందరు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మండలంలో మామిడిమొక్కలు నాటుకునేందుకు మంజూరు కాగా ఈ విషయమై ఏపీవో హేమలతను రైతులు శివ, హరి, చంద్ర, బాబులతోపాటు మరికొందరు పలుమార్లు ఏపీవోను సంప్రదించగా నాయకుల వద్దకు వెళ్లి ఒక మాట అడగండి అని అంటున్నారని రైతులు వాపోతున్నారు. ఏపీవో కార్యాలయంలో నేరుగా రైతులే సంప్రదించగా ఏపీవోపై ఆగ్రహం చెందగా తమకు మామిడిమొక్కలు నాటుకునేందుకు మంజూరయ్యాయని సోమవారం నుంచి మొక్కలు నాటుకునేందుకు పనులు కల్పిస్తామని తెలిపారు. రైతులు ఉపాధి అధికారులపై ఆగ్రహం చెందిన విషయం ఎంపిపి భర్త రామాకు ఏపివో తెలుపగా అతను విలేకర్లపై మండిపడ్డాడు. దీంతో ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ తాము ఎన్నికలలో ఎంతో ఖర్చుచేశామని ఎలాంటిపని వచ్చినా తమను సంప్రదించాల్సిందేకదా అంటూ విలేకర్లపై చిందులువేశారు. రైతులు కొందరు ఏపివోపై ఆగ్రహం చెందగా ఎంపీపీ భర్త న్యూస్లైన్పై పలు ఆరోపణలు చేశారు. ఉపాధి అధికారులు కూలీల పట్ల పక్షపాతంలేకుండా పనులు కల్పించాలని పార్టీనాయకులకు తొత్తులుగా ఉండకూడదు అని పలువురు వారిపై మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఈ విషయం గమనించి అందరికీ సమ న్యాయం కల్పించేలా ఉపాధి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎంతైనా లేకపోలేదు. -
ఎంపీపీతో అరబిందో, హెటిరో ఒప్పందాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెచ్ఐవీ, హెపటైటిస్ సీ ఔషధాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో భాగమైన మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ)తో అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ తదితర ఆరు సంస్థలు సబ్లెసైన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అల్పాదాయ దేశాల ప్రజలకు అందుబాటు ధరలో మరిన్ని ఔషధాలను సరఫరా చేసేందుకు ఇవి ఉపయోగపడగలవని ఎంపీపీ ఈడీ గ్రెగ్ పెరీ తెలిపారు. ఇప్పటికే ఎంపీపీ భాగస్వామిగా ఉన్న అరబిందో కొత్తగా రెండు సబ్-లెసైన్సులు కుదుర్చుకుంది. మొదటి దాని కింద ఆఫ్రికా కోసం లొపినావిర్, రిటోనావిర్ ఉత్పత్తి చేయనుండగా, రెండో దాని కింద ఇతర కంపెనీలతో కలిసి బీఎంఎస్‌కి చెందిన హెపటైటిస్ సీ ఔషధం అభివృద్ధిలో పాలుపంచుకోనుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు. అటాజాన్విర్, రాల్టెగ్రావిర్ చౌక వెర్షన్లు తయారు చేసేందుకు సబ్-లెసైన్స్‌లు తోడ్పడనున్నట్లు హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ భవేష్ షా వివరించారు. మరికొన్ని ఔషధాల కోసం లారస్, లుపిన్, జైడస్ తదితర సంస్థలు సబ్-లెసైన్సులు దక్కించుకున్నాయి. -
రెండేళ్ల క్రితం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన టీడీపీ
రెండేళ్ల క్రితం కేవలం ఒకేఒక్క స్థానంతో గట్టెక్కిన అధికార టీడీపీకి ఇక్కడ వింత పరిస్థితి ఎదురుకానుంది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కుదుర్చుకున్న ‘జెంటిల్మెన్ ఒప్పందం’ ఇప్పుడు ఏం తేల్చుతుందోనని ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆత్రేయపురం మండల పరిషత్‌లో తొలి రెండేళ్లు ఒకరికి ఎంపీపీ పదవిని కట్టబెట్టగా, అది కొద్ది రోజుల్లో ముగియనుంది. ఒప్పందం మేరకు తర్వాతి మూడేళ్ల పాటు ఆ పదవిని మరొకరికి అప్పగించాల్సి ఉంది. మరి ఎంపీపీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జెంటిల్మెన్ ఒప్పందమిదే.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ తరఫున ఎంపీపీ స్థానంలో కూర్చొనేందుకు ఇద్దరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయం మేరకు జెంటిల్మెన్ ఒప్పందం కుదిరింది. తొలి రెండేళ్లు వీవీ కృష్ణారావు, ఆ తర్వాత మూడేళ్ల పాటు మద్దూరి సుబ్బారావు ఎంపీపీగా కొనసాగాలనేది ఆ ఒప్పందం సారాంశం. ఈ మేరకు ఎంపీపీగా వీవీ కృష్ణారావు పదవి చేపట్టగా, సుబ్బారావు వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. జూలై 4తో రెండేళ్లు ఆ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూలై నాలుగో తేదీకి కృష్ణారావు ఎంపీపీగా కొనసాగి రెండేళ్లు పూర్తి కానుంది. జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం.. ఆ తర్వాత ఎంపీపీ పగ్గాలు సుబ్బారావుకు అప్పగించాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై నెల రోజుల నుంచి ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కృష్ణారావు రాజీనామా చేస్తే, సుబ్బారావు ఆ పదవి చేపడతారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కృష్ణారావు ఆ పదవిని వీడకపోతే, అధికార పక్షానికి చెందిన ఇద్దరు, ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఉపసంహరించుకోవచ్చని మండల పరిషత్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే ఇప్పటికే 9 మంది సభ్యుల బలం ఉన్న వెఎస్సార్ సీపీకి లబ్ధి చేకూరే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమం అంతంతమాత్రమే.. ఈ విషయం పక్కనపెడితే.. ఎంపీపీగా కృష్ణారావు ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా లేవని సొంత పార్టీవారే పెదవి విరుస్తున్నారు. ఒకవేళ జెంటిల్మెన్ ఒప్పదం అమలు కాకపోతే, స్వపక్షంలోనే వర్గవిభేదాలు పొడచూపే పరిస్థితి తలెత్తవచ్చన్న ఆందోళన వారిలో ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంపీపీ కృష్ణారావు స్వచ్ఛందంగా పదవి వదులుకుని ‘జెంటిల్మెన్’ ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేక ఆయనే పదవిలో కొనసాగుతూ కొత్త సంక్షోభానికి తెర తీస్తారా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. నేటి సమావేశంపైనే అందరి దృష్టి మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం వంటి విషయాల్లో అధికార పక్ష సభ్యులే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లోను అటు పార్టీ కేడర్‌తో పాటు సొంత వర్గీయుల నుంచి ఎంపీపీ అసంతృప్తిని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిఏ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేస్తారా లేక ప్రస్తుత ఎంపీపీనే కొనసాగిస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బంగారు తెలంగాణకు ఎంపీపీలే కీలకం
♦ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ సమస్యలను ఏకరువు పెట్టిన ఎంపీపీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బంగారు తెలంగాణ సాధనలో ఎంపీపీలదే కీలక భూమిక అని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఎంపీపీల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరిస్తామని చెప్పారు. సోమవారం జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఎంపీపీలు నిరంజన్‌రెడ్డి, సాయిలుగౌడ్, తీగల విక్రమ్‌రెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీపీలు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామాల పర్యటనలకు వాహన భ త్యం సమకూర్చాలని, మండలాలకు గత ప్రభుత్వం తగ్గించిన బదలాయింపు సుంకాన్ని పునరుద్ధరించాలని కోరారు. బీఆర్జీఎఫ్ పథకం రద్దు చేయడంతో మండల పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడిందని, 13, 14వ ఆర్థిక సంఘం నిధులను కూడా నిలిపివే యడంతో మండల పరిషత్‌ల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. జిల్లా మంత్రి కోటా నుంచి ప్రతి మండలానికి రూ.కోటి నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీపీల సమస్యలను ఆలకించిన మంత్రి.. జడ్పీ సీఈఓ రమణారెడ్డితో చర్చించారు. కేసీఆర్ ప్రభుత్వం మునుపెన్నడులేని విధంగా ఎంపీపీల వేతనాలు పెంచిందని, స్థానిక సంస్థల ప్రతినిధుల పట్ల సర్కారు గౌరవంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. -
డెంకాడ ఎంపీపీ కారు దహనం
డెంకాడ: ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఓ ప్రజాప్రతినిధి కారు కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇంటి మందు పార్క్ చేసి ఉన్న కారును దుండగులు తగలబెట్టారు. ఇది గుర్తించిన స్థానికులు ఎంపీపీని అప్రమత్తం చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్
కామేపల్లి: బాధ్యతాయుతంగా ఉండాల్సిన మండలాధ్యక్షుడు ఓ కానిస్టేబుల్‌తో కలిసి పేకాట ఆడుతూ అడ్డంగా పట్టుబడ్డాడు. కామేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న కామేపల్లి ఎంపీపీ మాలోతు సరిరాం నాయక్, స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ భరద్వాజ శివకుమార్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన గార్ల ఎంపీపీ
వరంగల్: జిల్లాలోని గార్ల ఎంపీపీ , వైస్ ఎంపీపీలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన తొలి విడత పరామర్శయాత్రలో గార్ల ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ నర్సింగరావులు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు షర్మిలపై చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టనున్న రెండో విడత పరామర్శయాత్ర సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకూ కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు. వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. -
అవినీతిపై పచ్చతమ్ముళ్ల మధ్య రచ్చ..రచ్చ..
♦ టీడీపీ ఎంపీపీ వర్సెస్ టీడీపీ సర్పంచులు ♦ ఎంపీపీ పేరుతో ఉన్న బోర్డు ధ్వంసం ♦ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన కళ్యాణదుర్గం : అవినీతి విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య రచ్చరచ్చ జరిగింది. టీడీపీ మహిళా ఎంపీపీ మంజులకొల్లప్ప టీడీపీ సర్పంచులు చిక్కన్న, అనీల్, వైస్‌ఎంపీపీ వెంకటేశుల మధ్య వర్గ పోరు మొదలైంది. కొంత కాలంగా ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా తూర్పుకోడిపల్లి పంచాయతీ పరిధిలో మెగావాటర్‌షెడ్ పనుల్లో అవినీతి, డ్రైల్యాండ్ హార్టికల్చర్ పనుల్లో అక్రమాలపై ఎంపీపీ విచారణకు ఆదేశించడంతో వివాదం ముదిరింది. తూర్పుకోడిపల్లి సర్పంచ్ చిక్కన్న అవినీతి విచారణ విషయంలో ఎంపీపీ మంజుల, ఆమె భర్త కొల్లప్పను మంగళవారం సాయంత్రం నిలదీశారు. ఇరువర్గాల మద్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం సర్పంచ్ చిక్కన్న ఆయన వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎంపీడీఓ డీఎంకేబాషాను చుట్టుముట్టి నిలదీశారు. ఎంపీపీ మంజుల కుర్చీలో ఆమె భర్త కొల్లప్ప కూర్చునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎంపీపీతో పాటు ఆమె భర్త ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పేదాక కదలకూడదంటూ ఎంపీడీఓను అడ్డుకున్నారు. ఇంతలో అక్కడి చేరుకున్న కొండాపురం సర్పంచ్ అనీల్, వైస్ ఎంపీపీ వెంకటేశులు, జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ రామ్మోహన్ కొల్లప్పకు ఏమిఅధికారముందని అందరిపైనా అజమాయిషి చేస్తున్నాడంటూ నిలదీశారు. సుమారు గంట పాటు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటు చేసుకుంది. తూర్పుకోడిపల్లి పంచాయతీకి చెందిన పలువురు చివరి సమయంలో రెచ్చి పోయారు. ఎంపీపీ మంజుల కొల్లప్ప పేరుతో ఉన్న బోర్డును ధ్వంసం చేశారు. ఈసమయంలో జోక్యం చేసుకున్న జెడ్పీటీసీ ఇది మంచిపద్ధతి కాదని హితబోధ చేశారు. అందరూ అక్కడి నుంచి మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా కొల్లప్ప తీరుపై ఆగ్రహం వెళ్లగక్కి నాయకులను నిలదీశారు. -
మిషన్ ఇంద్రధనస్సును ప్రారంభించిన ఎంపీపీ
అదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఎంపీపీ ఘనంగా ప్రారంభించారు. మంగళవారం ఎంపీపీ మెండరి హేమలత చెరువులో మట్టి తవ్వి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద రైతులకు మేలు జరుగుతుందన్నారు. -
సీనరేజీ ఎగనామం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయా మండలాల పరిధుల్లో ఇసుక, మట్టి, తదితర ఖనిజ నిక్షేపాల తవ్వకాలపై వసూలు చేస్తున్న రాయల్టీలోంచి మండల, జిల్లా పరిషత్‌లకు చెల్లించాల్సిన 25శాతం సీనరేజీపై ప్రభుత్వం దాగుడుమూతలాడుతోంది. గత ఐదేళ్లలో జిల్లాకు సీనరేజీ రూపంలో రూ.51.10 కోట్లు ఇవ్వాల్సివుండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంట్లో జిల్లా పరిషత్‌కు రూ.5.68 కోట్లు, మండల పరిషత్‌లకు 10.62 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. స్థానిక సంస్థల పరిపుష్టికి దోహదపడే ఈ నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అట్టిపెట్టుకున్న నిధులను విడుదల చేయాలని కోరుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడే సీనరేజీని బదలాయించాలని ఆమె కోరారు. రూ.200 కోట్లు.. నగర శివార్లను కలుపుతూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 162 కిలోమీటర్ల పొడవునా ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ మార్గం నిర్మాణానికి మట్టి, ఇసుక, కంకరను జిల్లా నుంచి వినియోగించుకున్నారు. దీంతో ఈ క్రమంలోనే దాదాపు రూ.255 కోట్ల మేర సీనరేజీని కాంట్రాక్టు సంస్థల నుంచి హెచ్ఎండీఏ వ సూలు చేసింది. అయితే, ఈ నిధులను స్థానిక సంస్థలకు బదలాయించకుండా మొండికేసింది. రింగ్‌రోడ్డు పక్క ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టిని తీయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై జిల్లా ప్రణాళిక సంఘం కమిటీ సమావేశంలో నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఆందోళన ప్రకటించడంతో దిగివచ్చిన సర్కా రు.. రూ.55 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్మును మాత్రం ఇప్పటి కీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు రాయల్టీని కట్టినా.. ప్రభుత్వం మాత్రం సీనరేజీ రూపంలో స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన నిధుల విషయంలో దిగిరాకపోవడం గమనార్హం. -
జిల్లాలో ముగ్గురు ఎంపీపీల ఎన్నిక చెల్లదని పిటిషన్లు
చిత్తూరు (టౌన్) : జిల్లాలోని కేవీబీ పురం, బీ.కొత్తకోట, తిరుపతి రూరల్ ఎంపీపీల ఎన్నికపై ఆయా మండలాలకు చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తమకు నివేదికను సమర్పించాలంటూ జెడ్పీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి కథనం మేరకు..ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవీబీ పురం మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యూరు. వీరిలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ, మిగిలిన 10 మంది టీడీపీకి చెందినవారు. అయితే ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ టీడీపీకి చెందిన పదిమంది సభ్యులు గెలిచినా ఎస్టీకి చెందిన మహిళా అభ్యర్థి ఓడిపోవడంతో రాజ్యాంగం ప్రకారం పార్టీలతో నిమిత్తం లేకుండా వైఎస్ఆర్ సీపీకి చెందిన తుపాకుల సులోచనను ఎంపీపీ పదవి వరించింది. అయితే ఇది చెల్లదంటూ టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటు చెల్లదంటూ... తమపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూ తిరుపతి రూరల్ మండల టీడీపీ ఎంపీటీసీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రూరల్‌లో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలుండగా 21 స్థానాల్లో టీడీపీ,14 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ, ఒక స్థానంలో సీపీఎం అభ్యర్థులు, 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే టీడీపీకి ఎంపీపీ అయ్యేందుకు అవసరమైన మెజారిటీ ఉన్నా ఇతరుల మద్దతుతో శెట్టిపల్లె-5 ఎంపీటీసీ సభ్యుడు మునికృష్ణ ఎంపీపీ అయ్యారు. దానికి సాయినగర్-3 ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి, పద్మావతిపురం-2 ఎంపీటీసీ సభ్యురాలు ఉష మద్దతిచ్చారు. దీంతో ఆ ముగ్గురిపై విప్ ధిక్కారం కింద అనర్హత వేటు ఇటీవలే పడింది. దీంతో ఆ ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించారు. అధిక సంతానంవల్ల అనర్హుడిగా ప్రకటించండి బీ.కొత్తకోట ఎంపీపీ ఖలీల్ అహమ్మద్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానమని, అతనిని అనర్హుడిగా ప్రకటించాలని బీ.కొత్తకోట-6 ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. -
మద్యం మానితే రూ.20 లక్షల నజరానా
నరసాపురం రూరల్ : తూర్పుతాళ్లు గ్రామస్తులు మద్యానికి దూరంగా ఉంటే రూ.20 లక్షలను ప్రోత్సాహక బహుమతిగా అందిస్తామని కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు సభలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులలో ఎక్కువమంది మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడ్డాయన్నారు. అందరూ ఒకేమాటపై ఉండి గ్రామాన్ని సంపూర్ణ మద్యపానం నిషేధ గ్రామంగా తీర్చిదిద్దితే ఈ బహుమతి అందిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు అందిస్తోందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారి, సీఈవో డి.వెంకటరెడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తుల బలిచక్రవర్తి, బండారు ఇస్సాకు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసి బాలం ప్రతాప్, ఎంపీడీవో ఎన్వీ శివప్రసాద్‌యాదవ్, తహసిల్దార్ శ్రీపాద హరనాథరావు పాల్గొన్నారు. -
మృణాళిని ఇలాకాలో తమ్ముళ్ల రణం
చీపురుపల్లి: అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే అధికార తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ముసలం మొదలయ్యింది. మండలంపై ఆధిపత్యం కోసం నువ్వా నేనా అంటూ ఎంపీపీ, జెడ్పీటీసీలు కా లు దువ్వుతుండడంతో ఏం చేయాలో అ ర్థం కాక దిగువ శ్రేణి నాయకులు ముక్కు న వేలేసుకుంటున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం కావడంతో వీరిలోఎవరి మాట వినాలో అర్థం కాక, ఏం చేయాలో తెలియక మండలం లో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది కాలంగా ఆధిపత్యం కోసం ఎంపీపీ, జెడ్పీటీసీల మధ్య అంతర్గతంగా జరుగుతున్న అలజడి తా జాగా బహిర్గతమయ్యింది. ఈవిషయా న్ని సాక్షాత్తూ ఎంపీపీ రౌతు కాంతమ్మ, ఆమె భర్త ఎంపీటీసీ రౌతు కామునాయుడులే బాహాటంగా పత్రికలు ముందు వా రి అక్కసు వెళ్లగక్కారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అంతా ఒక్కటిగా ఉండి కార్యకర్తలను ముందుకు నడిపించాల్సిన ఎంపీపీ, జెడ్పీటీసీలే ఇలా ఆధిపత్యం కోసం కుమ్ములాడుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం వేదికగా వీరి మధ్య ప్రారంభమైన విభేధాలు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వరకు పాకి ప్రస్తుతానికి తారస్థాయికి చేరాయి. దీంతో జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఎంపీపీ రౌతు కాంతమ్మ భర్త ఎంపీటీసీ, మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు రౌతు కామునాయుడు మాత్రం తమ ఆవేదనను ఎక్కడికక్కడే బాహాటంగా వెళ్లగక్కు తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు హాజరైన ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్పీటీసీ భార్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజినిలు ఇద్దరిలో సర్పంచ్ మీసాల సరోజినితో పాఠశాలల్లో జెండా వందనం చేయించడాన్ని ఎంపీపీ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయంపై అదే రోజు చాలా మంది ఉపాధ్యాయులపై తమ కోపాన్ని ప్రదర్శించారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు పెరిగాయి. ఇటీవల స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. వారి స్థానంలో ప్రస్తుతం జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడుకు చెందిన వర్గీయులు మధ్యాహ్న భోజన నిర్వహణ వ్యవహారాన్ని చూస్తున్నారు. దీంతో అదే పాఠశాలలో తమ మనుషులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అప్పగించాలంటూ గత కొద్ది కాలంగా ఎంపీపీ దంపతులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనికి జెడ్పీటీసీ మీసాల వరహాలునాయుడు ససేమిరా అన్నారు. కొద్ది కాలంగా ఈ వ్యవహారం నలుగుతున్న సమయంలో శని వారం బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఎంపీపీ దంపతులు..ఉపాధ్యాయులు, మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు వీరు పాఠశాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికే జెడ్పీటీసీ వర్గీయులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీపీ దంపతులు ఓ వైపు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోవైపు జెడ్పీటీసీ తెలివిగా వ్యవహరిస్తూ ఆయన పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. దీని ప్రకారం ఆధిపత్యం విషయంలో జెడ్పీటీసీ ముందంజలో ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. -
నిలదీత.. ఉదాసీనత
ఏలూరు:కొల్లేరు జిరాయితీ భూముల్లో పంటలు సాగుకు అనుమతి ఇవ్వడం.. లేదంటే భూముల యజమానులకు నష్టపరిహారం చెల్లించడం అనే అంశాల్లో ఏదో ఒకదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం కొత్త విధానం ప్రకటించే వరకు స్ధానికంగా లభ్యమయ్యే ఇసుకను పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా అందించేలా ప్రభుత్వా న్ని కోరటం.. జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నాయకుల విగ్రహాల ఏర్పాటు.. జెడ్పీ సమావేశ మందిరానికి పేరుపెట్టే అంశాలపైనా తీర్మానాలను ఆమోదిం చారు. జెడ్పీ అధ్యక్షుడు ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలను జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఏకరువు పెట్టారు. అజెండాలో పలు కీలక అంశాలు పొందుపర్చినప్పటికీ నూతన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క సమస్యకు ఉన్నతస్థారుు ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కార మార్గం చూపలేకపోయూరు. స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాను ఉన్నత స్థారుులో నిలి పేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, రోడ్లు, డ్రెరుునేజీ, తాగు, సాగునీటి సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదృష్ట్యా ఆదాయ వనరుల్ని అన్వేషించాలన్నారు. జిల్లాలో ఇసుక కొరత నివారణకు త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు అధికారులపై దర్పాన్ని ప్రదర్శించడానికే ఎక్కువ సమయం కేటారుుంచారు. మండలాల్లో ఉండే టీడీపీ ప్రజాప్రతినిధులకు యంత్రాంగం గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని పదేపదే కోరారు. అధికారులెవరూ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ మాగంటి బాబు అసహనం ప్రదర్శించారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపిందేకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాన్నారు. గ్రామాల్లో అక్రమంగా ఇసుక, మట్టి విక్రయాలను అడ్డుకుని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలపై ఇలా.. కొల్లేరు కాంటూరు కుదింపు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు, మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం, ఇళ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులు పంపిణీలో జాప్యం, ఉపాధి హామీ పథకంలో ఇక్కట్లు, పింఛను లబ్ధిదారులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడుతున్న తీరుపై పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్ మాట్లాడుతూ నవుడూరు-అండలూరు, నవుడూరు- వీరవాసరం రోడ్లు అధ్వానంగా తయూరయ్యూయని, ఆ రోడ్లపై ప్రయూణం నరకప్రాయంగా ఉందని చెప్పారు. వీరవాసరం ఎంపీపీ కవురు శ్రీనివాస్ వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పెదవేగి జెడ్పీటీసీ కె.విద్యాసాగర్ వ్యవసాయ అవసరాలకు 7 గంటలపాటు నిరాటకంగా విద్యుత్ సరఫరా చేయూలని డిమాండ్ చేశారు. సమావేశంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ బి.రమణ, డీఆర్డీఏ పీడీ పి.శ్రీనివాసులు, ఈపీడీసీఎల్ ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్, వ్యవసాయ శాఖ జేడీ వి.సత్యనారాయణ, ఉద్యానశాఖ ఏడీ ఎస్.సుజాత, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే... ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపుపై ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నుంచి కొల్లేటి కోటకు వెళ్లేందుకు వీలుగా వంతెన నిర్మించేందుకు అన్ని అనుమతులు సాధించామన్నారు. ద్వారకాతిరుమల ప్రాంతంలో సిరామిక్ హబ్ ఏర్పాటుకు గుజరాత్ పారిశ్రామికవేత్తల సాయం తీసుకుంటామన్నారు. సిరామిక్ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తే 30వేల మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో అధికారుల తీరు ఏమాత్రం బాగాలేదన్నారు. ఇసుక, మట్టిని అక్రమంగా దోచుకుంటున్న అధికారులు అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం మంచి పద్దతి కాదు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జెడ్పీ సీఈవో వెంకటరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ అజెండాను సభ్యులకు వారం రోజుల ముందుగా ఎందుకు పంపలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షం లేదని గర్వపడకుండా.. జిల్లా అభివృద్దికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మం త్రుల సహకారంతో జెడ్పీటీసీలు ముం దుకు సాగాలని సూచించారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, అక్కడ పరిశ్రమల స్థాపనకు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇసుక కొరత కారణంగా డెల్టా ఆధునికీక రణ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్నిచర్యలు తీసుకోవాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గం వరదలతో అతలాకుతలం అవుతోందని, డెల్టా ఆధునికీకరణలో డ్రెయిన్లు, కాలువ పనులు చేపట్టాలని కోరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కొల్లేరు కాంటూర్ కుదింపు ప్రక్రియను వేగవంతం చేయూలని కోరారు. -
‘చే’జారిన ఎంపీపీ
కొత్తగూడెం: ఇప్పటికే నియోజకవర్గంలో చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వలోపం మరోమారు బహిర్గతమైంది. మెజార్టీ ఉన్నా ఎంపీపీ పదవిని కూడా గెలుచుకోలేక చతికిలపడింది. కొత్తగూడెం మండల పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 14 ఎంపీటీసీలను గెలుచుకుంది. దీంతో ఎంపీపీ అధ్యక్షపీఠం ఇక హస్తగతమేనని అందరూ అనుకున్నారు. ఇక సీపీఐకి 9, వైఎస్సార్సీపీకి 3, టీడీపీకి 2, సీపీఎంకు 2 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. ఎంపీపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ అయి, ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉండగా అనూహ్య రీతిలో సీపీఐ తరపున తన ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించగా అంతర్గతంగా సయోధ్య కుదరకపోవడంతో మరో కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా పోటీకి దిగారు. దీంతో ఆరోజు ఎన్నిక వాయిదా పడింది. మరుసటిరోజు కూడా అదే పరిస్థితి నెలకొనడం, అనూహ్యంగా మరొక కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా ఎంపీపీ అధ్యక్ష పీఠంపై కన్నేయడంతో కాంగ్రెస్‌లో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తం 31 మంది ఎంపీటీసీలు ఉన్న కొత్తగూడెంలో 16 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన వారికే ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉంది. కాగా 14 ఎంపీటీసీ స్థానాలున్న కాంగ్రెస్ మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీని చేజిక్కించుకునే అవకాశాలుండగా 9 మంది ఎంపీటీసీలు ఉన్న సీపీఐ సైతం ఎంపీపీపై కన్నేసింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో జాప్యం చేయడంతో ఆ పార్టీ ఎంపీటీసీల్లో అయోమయం నెలకొంది. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండిపోయింది. ఇక అభ్యర్థిని ప్రకటించడంలో సైతం తీవ్ర జాప్యం జరగడంతో పలువురు ఎంపీటీసీలు ఇతర పార్టీలవైపు చూశారు. సీతంపేటకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ లక్ష్మినారాయణ సీపీఐ అభ్యర్థికి మద్దతు తెలపడంతో చేజేతులారా ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకున్నట్టయింది. కాంగ్రెస్ పెద్దలు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలం కావడంతోపాటు సొంత పార్టీలో కుమ్ములాటలు కూడా పరిష్కరించలేని స్థితి నెలకొంది. నాలుగురోజుల క్రితం ఇతర పార్టీల ఎంపీటీసీల మద్దతుతో 16 మందితో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చివరకు అభ్యర్థి ఎంపిక జాప్యం జరగడంతో డీలాపడాల్సి వచ్చింది. -
ఎన్నికల కమిషన్ కొరడా
సాక్షి, రాజమండ్రి :తెలంగాణ ప్రభుత్వ అదేశాలు లేనిదే తాము ఎన్నికల విధులు నిర్వర్తించబోమని మొండికేసిన అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ అధికారులను హెచ్చరించడంతో ఖమ్మం కలెక్టర్ సూచనల మేరకు ఎంపీపీల ఎన్నిక నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయగా తదుపరి ఏర్పాట్లను అధికారులు మంగళవారం కొనసాగించారు. సోమవారం సాయంత్రమే ఎంపీటీసీ సభ్యులకు ఎన్నికల నోటీసులు అందజేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అధికారుల పర్యవేక్షణలో చింతూరు, కూనవరం, విఆర్‌పురం మండలాల ఎంపీపీ ఎన్నికలు బుధవారం నిర్వహించేందుకుఅడ్డంకులు తొలగిపోయాయి. కఠిన చర్యలుంటాయి విలీన మండలాల ఎన్నికలను తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం నిర్వహించాలని గత నెలలో ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. కూనవరం ఎంపీపీ ఎన్నికలకు చింతూరు ఆర్అండ్ బీ డీఈ లాల్‌సింగ్, చింతూరు మండల పరిషత్ ఎన్నికలకు పంచాయతీరాజ్ డీఈ వెంకటరెడ్డి, వీఆర్‌పురం ఎన్నికలకు ఆర్‌డబ్ల్యూస్ డీఈ వెంకటేశ్వర్లును నియమిస్తూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓ సూర్యభగవాన్ ఆదేశాలు జారీచేశారు. అయితే వీరు తమ తెలంగాణ ప్రభుత్వం చెబితేనే విధులు నిర్వర్తిస్తామని ఆదివారం వరకూ మొండికేశారు. ఈ విషయాన్ని సీఈఓ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు నివేదించగా, ఆమె ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఉంటాయని ఎన్నికల సంఘ కమిషనర్ నవీన్‌మిట్టల్ హెచ్చరించారు. ఈ మేరకు ఇరు జిల్లాల అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు మరో సారి నోటీసులు జారీ చేయాలని, అయినా వాటిని ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని, తూర్పుగోదావరి జిల్లా నుంచి డివిజన్ స్థాయి అధికారులను హుటాహుటిన రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్తి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులను పిలిపించి వివరించడంతోవారు ఎన్నికల నిర్వహణకు అంగీకరించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలివే ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. భద్రాచలం మండలంలో భద్రాచలం తెలంగాణ లోనే ఉండడంతో మిగిలిన గ్రామాలకు నెల్లిపాకలను మండల కేంద్రంగా చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఈ మండలానికి ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన మూడు మండలాల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు మండలాల ఎంపీపీల ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి అప్పగించింది. -
గుంటూరులో ‘తమ్ముళ్ల’ అరాచకం
దారికాచి ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, వారి వాహనాలపై దాడులు ఎమ్మెల్యే ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు తీవ్రగాయాలు నలుగురు ఎంపీటీసీలు, మరో ముగ్గురి కిడ్నాప్.. కిడ్నాపైన వారిలోముగ్గురు మహిళా ఎంపీటీసీలు మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ ఎత్తుకెళ్లి తమ వాహనాల్లో పడేసిన టీడీపీ నేతలు గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద ఘటన కోడెల కుమారుడి నేతృత్వంలోనే ఈ దుశ్చర్య! దాడిలో పాల్గొన్న నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు టీడీపీ నేతలు గుంటూరు-మాచర్ల రహదారిపై వైఎస్సార్ సీపీ రాస్తారోకో అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసులు దౌర్జన్యంగా ముప్పాళ్ల ఎంపీపీ స్థానం దక్కించుకున్న టీడీపీ కోడెల కుమారుడి కనుసన్నల్లోనే..! ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణ కనుసన్నల్లోనే ఆదివారం వైఎస్సార్సీపీ ఎంపీపీలు, నేతలపై దాడి జరిగి నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతానికి టీడీపీ నాయకులు వచ్చిన వాహనాలన్నీ కోడెల అనుయాయులు, మాజీ ఎంపీపీకి చెందినవే. ఈ దాడికి నరసరావుపేటలోని కోటలో పథక రచన జరిగినట్లు చెబుతున్నారు. దాడికి పాల్పడ్డవారిలో అధిక శాతం కార్యకర్తలు కోడెల పాత నియోజకవర్గమైన నరసరావుపేట, రొంపిచర్ల మండలాలు, ఆయన సొంత మండలమైన నకరికల్లు మండలానికి చెందిన వారే ఉన్నట్లు సమాచారం. గుంటూరు నుంచి ముప్పాళ్లకు ఎంపీటీసీలను తీసుకెళ్లేందుకు వీలున్న అన్ని దారుల్లో టీడీపీ నాయకులు కాపుకాశారని, ఎటు నుంచి వెళ్లినా దాడి చేసేలా పథక రచన చేశారని చెబుతున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు! ఈ దాడుల వెనుక పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శిస్తున్నారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీలను తీసుకొచ్చే సమయంలో దాడులకు పాల్పడేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, తమ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని కోరినప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరానికి దగ్గర్లో, మేడికొండూరు పోలీసు స్టేషన్ సమీపంలోనే దాడి జరిగినప్పటికీ గంట వరకు పోలీసులు అక్కడకు చేరుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. ఎస్పీ లేకపోవడంతో అక్కడకు చేరుకున్న ఏఎస్పీ జానకీ ధరావత్, డీఎస్పీలు గంగాధరం, నరసింహంలు ఏంచేయాలో పాలుపోక మిన్నకుండిపోయారు. కనీసం ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన వాహనాలను పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేయడంగానీ, గాలింపు చర్యలు చేపట్టడంకానీ, నాకాబందీ నిర్వహించడం కానీ చేయకపోవడం చూస్తుంటే పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి ఎంపీటీసీలను ఎత్తుకెళ్ళేందుకు టీడీపీ నేతలు ఉపయోగించిన వాహనాలు ముప్పాళ్ళ ఎంపీపీ కార్యాలయం వద్దే తిరుగుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టనట్లే వ్యవహరించారు. టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిన ముప్పాళ్ళ ఎంపీటీసీ గద్దల శివకోటేశ్వరరావు ఎన్నిక అయిపోయిన తరువాత తాను ఇంటికి వెళ్లిపోతానని చెప్పినప్పటికీ, పోలీసుల ముందే నరసరావుపేటకు చెందిన టీడీపీ నేతలు ఆయన్ని బలవంతంగా ఇన్నోవా వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. పైగా, దానికి పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ సాగనంపారు. -
మెంటాడ ఎంపీపీ పీఠం
మెంటాడ: కోరం లేక రెండు సార్లు ఎన్నిక వాయిదా పడిన జిల్లాలోని మెంటాడ ఎంపీపీ పీఠాన్ని చివరికి వైఎస్సార్సీపీ దక్కించుకుంది. వైస్ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాల్లో 6 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మెంటాడ ఎంపీపీ పీఠం ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే టీడీపీ నుంచి గెలుపొందిన వారిలో ఎస్టీ ఎంపీటీసీ సభ్యు లు ఒక్కరూ లేరు. 6 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీకి ఇద్దరు ఎస్టీ ఎంపీటీసీ సభ్యులు ఉండడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జక్కువ ఎంపీటీసీ అభ్యర్థి శొంఠ్యాన సింహాచలమమ్మను ఎంపీపీ అభ్యర్థిగా, పోరాం ఎంపీటీసీ అభ్యర్థి చెల్లూరి లక్ష్మణరావు ప్రతిపాదిం చగా, ఇద్దనవలస ఎంపీటీసీ సభ్యురాలు పూడి రామకృష్ణమ్మ బలపరచడంతో ఎంపీపీగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మధ్యాహ్నం 3.38 గంటలకు ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరావు ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏడుగురు ఎంపీటీసీలు ఉన్న టీడీపీ..వైస్‌ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది. వైస్ ఎంపీపీగా చలుమూరి వెంకటరావును పిట్టాడ ఎంపీటీసీ రెడ్డి పార్వతి ప్రతిపాదించగా, కుంటినవలస ఎంపీటీసీ సభ్యురాలు సూరెడ్డి పార్వతి ప్రతిపాదించారు. దీంతో చలుమూరి వెంకటరావు వైస్ ఎంపీపీగా ఎన్నికైట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత రం ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ప్రిసైడింగ్ అధికారి పి.శ్రీనివాసరావు, ఎంపీడీఓ గంటా వెంకటరావు, పంచాయతీ అధికారి పార్థసారథి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ శేణుల్లో ఉత్సాహం ఎంపీపీగా శొంఠ్యాన సింహాచలమమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండలంలోని వైఎస్సార్సీపీ శేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. ఆమె ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆమెతో పూజలు చేయించారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ మండల నాయకులు రెడ్డి సన్యాసినాయుడు, కనిమెరక త్రినాథ, చింత కాశీనాయుడు, జక్కువ పీఏసీఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి అప్పారావు, చెల్లూరు సత్యం, మాజీ ఎంపీపీలు లెంక సన్యాసప్పలనాయుడు, కొర్రాయి కళావతి, సర్పంచ్‌లు యర్రా సింహాచలం, తాడ్డి రామునాయుడు, గజపతినగరం ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు, ముఖ్య నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, బాయి అప్పారావు, సారిక ఈశ్వరరావు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఆమెను ముంచెత్తి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ సింహాచలమమ్మ మాట్లాడుతూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, దాట్ల హనుమంతురాజు, పార్టీ మండల నాయకులు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటూ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మండల ప్రజలకు భరోసా ఇచ్చారు. పోలీసు పహారాలో ఎన్నిక స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 144వ సెక్షన్‌ను అమలు చేశారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్, గజపతినగరం సీఐ చంద్రశేఖర్, ఆండ్ర, పెదమానాపురం, బూర్జవలస ఎస్సైలు పిసిని నారాయణరావు, మహేష్, వై.సింహాచలంలతో పాటు మరో 50 మంది పోలీసు సిబ్బంది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. -
ఫలించిన టీడీపీ కుతంత్రం
సాక్షి, ఏలూరు : కుట్రలు కుతంత్రాలే ఫలిం చాయి. స్పష్టమైన ఆధిక్యం ఉన్న వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి పదవి దక్కకుండా చేయాలని కుయుక్తులు పన్నిన టీడీపీ దేవరపల్లి ఎంపీపీ పీఠాన్ని వైసీపీ నుంచి తన్నుకుపోయింది. టీడీపీ దౌర్జన్యాల నేపథ్యంలో వాయిదా వేసిన దేవరపల్లి ఎంపీపీ ఎన్నికను ఆదివారం నిర్వహిం చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురిచేసి ఇద్దరిని తమవైపునకు తిప్పుకున్న టీడీపీ లాటరీ విధానంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలోని మొత్తం 22 స్థానాలకు 12 సీట్లు గెలుచుకుని వైఎస్సార్ కాంగ్రెస స్పష్టమైన మెజార్టీ సాధించగా, టీడీపీకి 9 స్థానాలు లభించాయి. ఒక స్థానంలో గెలుపొందిన స్వత్రంత్ర అభ్యర్థి వైసీపీకే మద్దతు ఇవ్వటంతో ఆ పార్టీ బలం 13కు చేరింది. ఈ పీఠాన్ని వైసీపీకి దక్కకుండా చేసేందుకుగాను పన్నిన వ్యూహంలో భాగంగా ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక సమయంలో టీడీపీ చేసిన దౌర్జన్యకాండతో ఎన్నిక వాయిదా పడింది. ఈ లోగా వైసీపీ అభ్యర్థులను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయటం వంటి వాటి తో ఇద్దరిని తమవైపు లాక్కోవటంలో టీడీపీ నాయకత్వం సఫలమైంది.పలువురు మంత్రుల బెదిరిం పులు, ప్రలోభాల మేరకు జిల్లా క్వారీక్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆండ్రు రమేష్‌బాబు వైసీపీకి వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్ సీపీకి చెందిన లక్ష్మీపురం ఎంపీటీసీ పోలుమాటి విజయనిర్మల, గౌరీపట్నం-1 ఎంపీటీసీ చెరుకూరి కృష్ణకుమారిలను టీడీపీవైపు తిరిగిపోయారు. దీంతో వైసీపీ, టీడీపీలకు సమానంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులయ్యారు. ఆర్వోతో టీడీపీ సభ్యుల వాగ్వివాదం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీటీసీ సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించేందుకు రిటర్నింగ్ అధికారి ఆర్.గోవిందరావు సమాయత్తమయ్యారు. ఆ సమయంలో తమ పార్టీ సభ్యులు ఇద్దరు రావాల్సి ఉన్నందున ఎన్నిక ప్రక్రియను కొద్ది సేపు నిలపాలని టీడీపీకి చెందిన ఎంపీటీసీలు ఆర్వోను కోరారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని ఆర్వో స్పష్టం చేయడంతో వారు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎన్నికల హాల్లోకి పోలీసులు రావడంపై గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు గది బయటకు వెళ్లిపోయారు. అనంతరం ప్రమాణ స్వీకారం కొనసాగింది. కొంత సేపటికి రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎంపీటీసీలు ఇద్దరూ వచ్చారు. తర్వాత కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నుంచి అక్బర్ పఠాన్ ఖాన్, టీడీపీ నుంచి షేక్ అబ్దుల్‌ఘని పేర్లు ప్రతిపాదించగా ఇద్దరికి చెరో 11 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో ఎన్నికను లాటరీ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి లాటరీ తీశారు. ఇద్దరి పేర్లు ఐదు చీటీలపై రాసి లాటరీ తీయగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి అక్బర్ పఠాన్ఖాన్ను పదవి వరించింది. ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీపీ పదవికి వైఎస్సార్ సీపీ నుంచి పల్లంట్ల ఎంపీటీసీ గన్నమని జనార్దనరావు, టీడీపీ నుంచి దేవరపల్లి ఎంపీటీసీ శ్రీకాకోళపు నరసింహమూర్తి పోటీపడ్డారు. టీడీపీకి, వైఎస్సార్ సీపీకి చెరో 11 మంది ఎంపీటీసీ సభ్యుల బలం లభించింది. లాటరీ తీయగా టీడీపీ అభ్యర్ధి నర్శింహమూర్తిని అదృష్టం వరించింది. ఉపాధ్యక్ష ఎన్నికకు వైఎస్సార్ సీపీ నుంచి బొంత భరత్‌బాబు, టీడీపీ నుంచి బాదంపూడి ఇందిర పేర్లు ప్రతిపాధించగా లాటరీలో బాదంపూడి ఇందిరకు పదవి లభించింది. ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారిపై దాడి చేసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు బి.ఇందిర, సీహెచ్.నాగమణిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో వారికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పుడు నిలిచిన ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నిర్వహించారు. -
శంషాబాద్ ఎంపీపీగా చెక్కల ఎల్లయ్య
శంషాబాద్: శంషాబాద్ మండలపరిషత్ అధ్యక్ష స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోరం లేకపోవడంతో ఇటీవల రెండుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలను వ న్నికల ప్రిసైడింగ్ అధికారులు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 24 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను కాంగ్రెస్ నుంచి 8, స్వతంత్రులు ముగ్గురు, ఎంఐఎం 1 తోపాటు టీడీపీకి చెందిన శంషాబాద్ ఎనిమిదో వార్డు ఎంపీటీసీ సభ్యుడు వై.సురేష్‌గౌడ్ కాంగ్రెస్ ఎంపీపీ అభ్యర్థి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ చెక్కల ఎల్లయ్యకు మద్దతు పలికారు. మరోవైపు బీజేపీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా శ్రీధర్‌ను ఆ పార్టీకి చెందిన నేతలు ప్రతిపాదించినప్పటికీ ఆయనకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చెక్కల ఎల్లయ్య విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. కిరికిరి మధ్యన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక... ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీడీపీ సభ్యుడు సురేష్‌గౌడ్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్ష స్థానాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ యాదవ్ ఆ స్థానం తనకే కావాలని పట్టుబట్టాడు. శ్రీకాంత్ యాదవ్‌కు బీజేపీ, టీడీపీ నేతలు మద్దతు పలకగా, సురేష్‌గౌడ్‌కు కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులు మద్దతిచ్చారు. పార్టీ తనను మోసం చేసిందని, తనకే మద్దతు పలకాలని శ్రీకాంత్‌యాదవ్ ఎంపీపీ అభ్యర్థితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో ఎన్నికలు నిర్వహించారు. సురేష్‌గౌడ్‌కు 12 ఓట్లు, శ్రీకాంత్ యాదవ్‌కు 12 ఓట్లు రావడంతో లాటరీ వేశారు. లాటరీలో సురేష్‌గౌడ్ పేరు రావడంతో ఆయనను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు అధికారులు ధ్రువీకరణపత్రాలు అందజేశారు. -
దేవరపల్లిలో అదే తీరు
సాక్షి, ఏలూరు : తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలో నిలిచిపోయిన దేవరపల్లి ఎం పీపీ ఎన్నిక ఆదివారం జరగనుంది. ఆ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బెదిరించడంతోపాటు ప్రలోభాలకు గురి చేస్తోంది. ఇద్దరు ఎంపీటీసీలను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇంకోవైపు సొంతపార్టీ వాళ్లు చేయి దాటిపోకుండా ద్విచక్ర వాహనాలు, భారీగా నగదును బహుమతులుగా ఇస్తోంది. భారీ బందోబస్తు దేవరపల్లి ఎంపీపీ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహిం చాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో అధికార యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4న ఎంపీపీ ఎన్నికలు జరగాల్సిండగా టీడీపీ దౌర్జన్యానికి దిగి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. ఈ ఘట నపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిం దిగా ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పోలీసులు టీడీపీ ఎంపీటీసీలు బి.ఇందిర, సీహెచ్.నాగమణిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం జరిగే ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్నికను సజావుగా పూర్తి చేసేందుకు దాదాపు 1,300 మంది సిబ్బందిని నియమించారు. పెద్దఎత్తున రాయ‘బేరాలు’ ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ సీపీ నుంచి పల్లంట్ల ఎంపీటీసీ గన్నమని జనార్దనరావు, టీడీపీ నుంచి దేవరపల్లి ఎంపీటీసీ శ్రీకాకోళపు నరసింహమూర్తి పోటీపడుతున్నారు. మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 12 స్థానాలను వైఎస్సార్ సీపీ, 9 స్థానాలను టీడీపీ దక్కించుకున్నారుు. స్వతంత్ర అభ్యర్థి కూడా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. ఇంత స్పష్టమైన ఆధిక్యం ఉన్నచోట కూడా టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించి ఎంపీపీ పదవి తన్నుకుపోవాలని చూస్తోంది. టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు స్వయంగా రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామంటూ కొందరు ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఓ నేతను తమవైపు తిప్పుకుని అతని ద్వారా లక్ష్మీపురం, గౌరీపట్నం ఎంపీటీసీలు పోలుమాటి విజయకుమారి, చెరుకూరి కృష్ణకుమారిలను శిబిరానికి తీసుకువెళ్లడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. వీరిలో కృష్ణకుమారి వైఎస్సార్ సీపీలోనే ఉంటానని, ప్రలోభాలకు లొంగేది లేదని తెగేసి చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు బెదిరింపుల మేరకు జిల్లా క్వారీ క్రషర్స్ ఓనర్సు అషోసియేషన్ మాజీ అధ్యక్షుడొకరు టీడీపీకి తొత్తుగా మారి మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో 11 మంది ఎంపీటీసీలు, టీడీపీ శిబిరంలో 9మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇప్పుడున్న బలానికి తోడు కనీసం మరొకరినైనా తమవైపు తిప్పుకుంటే వైఎస్సార్ సీపీని ఇరకాటంలో పెట్టొచ్చని టీడీపీ భావిస్తోంది. తమ ఎంపీటీసీలను ప్రలోభపెట్టేందుకు అవసరమైతే ఐదెకరాల పొలం లేదా రూ.50 లక్షల నగదు ఇస్తామని టీడీపీ బేరాలు సాగిస్తున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
(అ)ధిక్కారం..అరాచకం
- ఎన్నికల్లో ఆది నుంచి టీడీపీ వీరంగం - ‘స్థానిక' పగ్గాల కోసం బరి తెగించిన రాజకీయం - మెజార్టీలేని చోట్ల ప్రలోభాల తో పైచేయి - మొన్న మున్సిపల్, ఎంపీపీల్లోనూ .. - జెడ్పీటీసీల కొనుగోళ్లకూ వెనుకాడని వైనం - తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యకాండపై వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి, ఒంగోలు: ముందెన్నడూ లేనంతగా జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు యుద్ధవాతావరణంలో సాగడాన్ని సర్వత్రా ఖండిస్తున్నారు. ‘స్థానిక’ సంగ్రామంలో అధికార టీడీపీ నేతల వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పలుచోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అద్దంకి, పర్చూరు, కొండపి, కందుకూరు, చీరాల, దర్శి తదితర నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతల తలలు పగలడంతో పాటు.. పోలింగ్ అనంతరం గ్రామాల్లో నెలకొన్న గొడవల కారణంగా ఆపార్టీకి చెందిన ఐదారుగురు ప్రాణాలొదిలారు. రెండ్రోజుల కిందట కూడా మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన దళితులను టీడీపీకి ఓట్లేయలేదని బహిష్కరించారు. వారి ఆస్తులను సైతం నిప్పటించి తగులబెట్టారు. * జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా.. టీడీపీ తమకు మెజార్టీరాని చోట్ల ప్రలోభాల ఎర వేసింది. లొంగని వారిని బలవంతంగా తమవైపునకు తిప్పుకునేందుకు కౌన్సిల్ సమావేశాల్లోనే తెలుగు తమ్ముళ్లు బలప్రదర్శనకు దిగడంపై ఫిర్యాదులు అధికారికంగానే నమోదయ్యాయి. * మండలప్రాదేశిక ఎన్నికల్లోనూ అచ్చంగా ఇదే జరిగింది. ఎంపీటీసీ సభ్యులను కొనుగోలుచేసి మరీ ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంటామని అధికారపార్టీ నేతలు బహిరంగంగా సవాళ్లు విసిరిన ఘటనలు ప్రభుత్వ అధికారుల సాక్షిగా చోటుచేసుకున్నాయి. రాష్ట్రపరిపాలనా పగ్గాలు చేపట్టామన్న ధీమాతో.. స్థానికంగా ‘పట్టు’కు టీడీపీ నేతలు బలప్రదర్శనలతో బరితెగిస్తున్న వైనాన్ని చూసి సామాన్య ప్రజానీకంతో పాటు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా, జెడ్పీపీఠం కైవసానికి ఆ పార్టీ నేతలు నడిపిస్తున్న రాజకీయ కుయుక్తులపై జిల్లావ్యాప్తంగా చర్చసాగుతోంది. దౌర్జన్యకాండ ఆంతర్యమిదే... జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 31 స్థానాలు, టీడీపీ 25 స్థానాలు గెలుచుకున్నాయి. జిల్లాపరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే 29 మంది సభ్యుల మెజార్టీ సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కన్నా అదనంగా సభ్యుల మెజార్టీ పొందిన వైఎస్సార్సీపీకే జెడ్పీపీఠం ఖాయమైంది. అయితే, మొదట్నుంచి అన్ని ఎన్నికల్లో ప్రలోభాల ఆధారంగానే పైచేయిగా నిలుస్తున్న టీడీపీ.. ప్రత్యర్థి జెడ్పీటీసీ సభ్యుల్ని సైతం ప్రలోభానికి గురిచేసింది. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కంభం, కొత్తపట్నం, కారంచేడు జెడ్పీటీసీల్ని టీడీపీ లాక్కెళ్లింది. దీంతో బలం రెండు పార్టీలకూ 28 మంది సభ్యుల చొప్పున ఉంది. అలాంటప్పుడు లాటరీ తీసినా.. పదవి వైఎస్సార్సీపీకి దక్కుతుందనే భయాందోళనతో శనివారం టీడీపీ నేతలు రకరకాల విన్యాసాలు చేశారు. వారి దౌర్జన్యకాండను నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులతో వీరంగం చేసి బలప్రయోగం చేశారు. అయితే, ఇంత జరుగుతున్నా.. వైఎస్సార్సీపీ సభ్యులు, నేతలు శాంతంగా మౌనం వహించడంపై.. వారి రాజకీయ పరిణతిని విశ్లేషకులు అభినందిస్తున్నారు. నిజానికి, వైఎస్సార్సీపీ సభ్యుల్ని ఏదో ఒక కారణంగా కేసుల్లో ఇరికించాలని.. కొందరినైనా సమావేశానికి దూరం చేయాలనే ఎత్తుగడతోనే టీడీపీ నానా రకాలుగా రెచ్చగొట్టినట్టు అధికార వర్గాలు సైతం గుర్తించాయి. వారి బలప్రయోగ వ్యూహం ఫలించనందున.. బహిరంగంగానే వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించే వారికి రూ.కోటి ఇస్తామంటూ ఆఫర్లివ్వడం తెలుగు నేతల దిగుజారుడుతనాన్ని నిరూపించిందని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శించాయి. ప్రలోభాల బలంతో దక్కిన పదవులివీ.. * అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుండగా, ఇందులో 8 వైఎస్సార్సీపీ, 7 టీడీపీ గెలుచుకున్నాయి. మండలంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వెలమవారిపాలెం ఎంపీటీసీ బుల్లెమ్మాబాయిని టీడీపీ ప్రలోభపెట్టింది. ఆమె అటు ఓటేయగా, ఎంపీపీ పదవి టీడీపీకి దక్కింది. ఇందుకు ప్రతిఫలంగా బుల్లెమ్మాభాయి టీడీపీ తరఫున ఉపాధ్యక్షురాలిగా ఎంపికైంది. * కొరిశపాడు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, ఇందులో 7 వైఎస్సార్సీపీ, 7 టీడీపీ గెలుచుకున్నాయి. ఇక్కడ ‘డ్రా’ కావాల్సిన ఎంపీపీ ఎన్నిక... వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన గుడిపాడు ఎంపీటీసీ ఇ.నాగమణి గైర్హాజరుతో టీడీపీకి దక్కింది. ఈమె గైర్హాజరు వెనుక టీడీపీ ప్రలోభాలున్నట్లు ఆరోపణలున్నాయి. * కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో 18 ఎంపీటీసీల స్థానాలుండగా, వైఎస్సార్సీపీ 11, టీడీపీ 7 చోట్ల గెలిచింది. వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు సభ్యులను టీడీపీ బలవంతంగా లాక్కెళ్లింది. వారిని ప్రలోభపెట్టి ఓట్లేయించుకుని టీడీపీ ఎంపీపీ పదవిని దక్కించుకుంది. * చీరాల నియోజకవర్గం చీరాల మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్సీపీ 10, టీడీపీ 9, బీఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాలు గెలుపొందారు. ఇక్కడ ఏడుగురు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగానే కొనుగోలు చేసింది. ఈ ఏడుగురిలో ఒకరైన గవిని శ్రీనివాసరావు (వైసీపీ తరఫున గెలిచాడు)ను ఎంపీపీ అభ్యర్థిగా అధికారపార్టీ ప్రతిపాదించింది. ఇతరులెవ్వరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. * దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్సీపీకి 8, టీడీపీకి 6 స్థానాలొచ్చాయి. అయితే, వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దర్ని టీడీపీ కొనుగోలు చేయడంతో ఎంపీపీ పదవి అధికార పార్టీ దక్కించుకుంది. * సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుండగా, వైఎస్సార్సీపీ 10, టీడీపీ 9 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కె.తక్కెళ్లపాడు ఎంపీటీసీ గాలి విజ యలక్ష్మిని ప్రలోభపెట్టి టీడీపీ శిబిరంలో చేర్చుకున్నారు. దీంతో ఎంపీపీ పదవి ఆ పార్టీకెళ్లింది. * చీరాల మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీకి టీడీపీ కంటే అదనంగా వార్డులు దక్కాయి. ఇక్కడ మొత్తం వార్డులు 33 ఉండగా, వాటిల్లో వైఎస్సార్సీపీ 15, టీడీపీ 12 వార్డులు గెలుచుకుంది. * స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం 6 వార్డుల్లో స్వతంత్రంగా గెలిచారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే ఆమంచి వర్గ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. దీంతో ఆపార్టీ బలం 18కి చేరి చైర్మన్ పదవి టీడీపీకి పోయింది. -
పెద్దపంజాణిలో వైఎస్సార్సీపీ కేతనం
- చక్రం తిప్పిన ఎమ్మెల్యే - ఎంపీపీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ - మండల ఉపాధ్యక్షురాలిగా సుమిత్ర పలమనేరు: అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెద్దపంజాణి మండల ఎంపీపీ కుర్చీ వైఎస్ఆర్ సీపీ ఖాతాలో చేరింది. దీంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, ఆరు వైఎస్ఆర్ సీపీ, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల మద్దతుతో ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వారికి సారధ్యం వహించిన స్వతంత్ర అభ్యర్థి, ఎంఎల్సీ సోదరుడు విజయభాస్కర్‌రెడ్డి సహకారం తీసుకోవాలని భావించారు. ఇటీవలి పరిణామాలతో సీన్ పూర్తిగా మారిపోయింది. విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. ఏడుగురు టీడీపీ సభ్యుల్లో ఇద్దరు ఎంపీపీ కుర్చీపై కన్నేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు చెంగారెడ్డి, రోజారెడ్డి చక్రం తిప్పడంతో అనూహ్యంగా ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. దీంతో వైఎస్ఆర్సీపీ బలం తొమ్మిదికి చేరుకుంది. టీడీపీ నుంచి ఎంపీపీగా నామినేషన్ వేసిన రామచంద్రకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో కోగిలేరు ఎంపీటీసీ సభ్యుడు మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికిన ఇండిపెండెంట్ల ప్యానెల్ నుంచి అమ్మరాజుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మండల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఓటింగ్‌కు స్వతంత్రుల ప్యానల్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ కంగుతినింది. -
కనిగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
'కమ్మ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలి'
అనంతపురం : మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి మండలాధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటా మూకుమ్మడి రాజీనామాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మంత్రి పదవి పొందిన పల్లె రఘునాథరెడ్డి ఎంపీపీ పదవుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం సరిగా లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, కార్యకర్తలను నిరాదరణకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక సంస్థల పదవులు టీడీపీలో పెద్ద దూరామాన్నే లేపాయనే చెప్పవచ్చు. -
టిక్.. టిక్..
ఎంపీపీల ఎన్నిక నేడు * జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపు * కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల శిబిరాలు * టీడీపీ ప్రలోభాలపర్వంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు * విప్ జారీ చేసిన వైఎస్సార్ సీపీ సాక్షి, ఒంగోలు : జిల్లాలో పరిషత్ పోరు ఊపందుకుంది. మండల అధ్యక్షుల (ఎంపీపీలు) ఎన్నిక శుక్రవారం జరగనుంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. గెలిచిన ఎంపీటీసీ సభ్యుల బలబలాలపై ఆయా పార్టీల నాయకులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ.. మండల స్థాయిలోనూ హవా కొనసాగించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. మెజార్టీ లేనిచోట్ల ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభపెట్టి తమ వైపునకు తిప్పుకునేందుకు నానాతంటాలు పడుతోంది. తెలుగు తమ్ముళ్ల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యధిక ఎంపీపీ స్థానాలు కై వసం చేసుకోవాలన్న టీడీపీ ఎత్తులకు వైఎస్సార్ సీపీ పైఎత్తులు వేస్తోంది. విప్ జారీ చేసిన సంగతి ఆ పార్టీ తమ సభ్యులకు తెలియజేసింది. ఎంపీపీలను ఎన్నుకునే ముందు తొలుత ఎంపీటీసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అత్యధిక స్థానాలు వైఎస్సార్ సీపీవే ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో జిల్లాలోని 56 మండలాల్లో 790 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 409 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ బలం 345 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థులు 15 చోట్ల గెలవగా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం ఆటో గుర్తుపై పోటీ చేసి 14 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. మండలాల వారీగా చూస్తే వైఎస్సార్ సీపీ 29 ఎంపీపీ పీఠాలు, టీడీపీ 19 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 8 మండలాల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేనందున ఇక్కడ స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఆ రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. అందిరి చూపూ జెడ్పీ పీఠం వైపే జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల బలం వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉంది. జిల్లాలో 56 జెడ్పీటీసీలకుగాను ఆ పార్టీ 31 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ తరఫున 25 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు. టీడీపీ ఎలాగైనా జెడ్పీ పగ్గాలు చేపట్టాలనే వ్యూహంతో రకరకాల కుయుక్తులకు పాల్పడుతోంది. కసరత్తులో భాగంగా తొలుత అత్యధిక ఎంపీపీ స్థానాల కైవసం చేసుకునేందుకు ఇతర పార్టీల ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. నేతల సమావేశాల్లో కొనుగోళ్ల వ్యవహారంపై బహిరంగంగానే కార్యకర్తలకు పిలుపునివ్వడం.. కొన్నిచోట్ల ఎంపీటీసీల బంధువులతో బేరాలకు దిగి బరితెగించిందనే ఆరోపణలు టీడీపీ మూటగట్టుకుంటోంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాత్రం తాము పార్టీ నిబంధనలకు కట్టుబడే ఉన్నామని, ప్రత్యర్థులు పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారని పలు సందర్భాల్లో బహిరంగంగానే వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురికాక తప్పదన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలపై జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. -
మండలాధీశులెవరో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌ల పరోక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను ఎవరు అధిరోహించనున్నారో శుక్రవారం తెలనుంది. పరిషత్‌లోని మొత్తం స్థానాల్లో మెజార్టీ సభ్యుల ఆమోదయోగ్యం ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు జరపనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని 33 మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నామినేషన్ల ప్రక్రియ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక చేపట్టనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చక్రధర్‌రావు పేర్కొన్నారు. పద్నాలుగింట అస్పష్టత.. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు ఏప్రిల్‌లో ఎన్నికల జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీటి ఫలితా లు వాయిదా పడ్డాయి. తాజాగా పాల కవర్గాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో 33 మండల పరిషత్‌లలో 19 మండలాల్లో మాత్రమే గెలుపును ప్రభావితం చేసే లా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ మేరకు పార్టీలు తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించి పరోక్ష ఎన్నిక సమయానికల్లా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నాయి. 14 మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పొరుగుపార్టీ సభ్యులను తమ వైపునకు మళ్లించుకునేందుకు ఎత్తుగడ వేసి వ్యూహాత్మకం గా వ్యవహరించాయి. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో సభ్యులు అటుఇటుగా తారుమారయ్యారు. ఈ మండలాల్లో.. 19 మండలాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆయా పార్టీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే అభ్యర్థి పేరును ఖరారు చేసినప్పటికీ చివరి నిమిషం వరకు గోప్యత పాటిం చాలని నిర్ణయించాయి. దోమ, మహేశ్వరం, శామీర్‌పేట, హయత్‌నగర్, మేడ్చల్, బషీరాబాద్, తాండూరు, ధారూరు, కీసర, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పరిగి, వికారాబాద్, బంట్వారం, శంకర్పల్లి, పెద్దేముల్, యాలాల, కుత్బుల్లాపూర్, నవాబుపేట మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వీటిలో ఏడు మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి 5, టీఆర్ఎస్ ఆరు మండలాల్లో ముందంజలో ఉన్నాయి. మరోవైపు పద్నాలుగు మండలాల్లో స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో సమీకరణల మార్పుతో కొంత మెజార్టీ సాధించే దిశగా పార్టీలు వ్యవహరించాయి. వీటిలో గండేడ్, మంచా ల, మొయినాబాద్, కుల్కచర్ల, షాబా ద్, యాచారం, చేవెళ్ల, కందుకూరు, ఘట్కేసర్, మోమిన్‌పేట, రాజేంద్రనగర్, మర్పల్లి, సరూర్‌నగర్, పూడూరు మండలాలున్నాయి. ఈ పద్నాల్గింటి లో ఆరు మండలాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. మరో 4 మండలాల్లో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండగా, టీడీపీ-బీజేపీ కూటమి 3 మండలాలను కైవసం చేసుకునే అవకా శం ఉంది. మంచాల మండలంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీపీఎంకు పీఠం దక్కే అవకాశం ఉంది. -
ఉపాధికి వెలుగు రేఖలు..
ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ.. పది పూర్తయితే చాలు ఇంటర్మీడియెట్ స్థాయిలో చాలా మంది ఎంపిక చేసుకునే గ్రూపులివి! ఉన్నత విద్యా కోర్సుల్లో చేరి, నచ్చిన కెరీర్‌ను అందుకునేందుకు బాటలు వేసే గ్రూపులివి! అయితే పది తర్వాత రెండేళ్లకే పదిలమైన ఉపాధిని అందించే కోర్సులు ఒకేషనల్ కోర్సులు. విద్యార్థికి ప్రత్యేక వృత్తి నైపుణ్యాలు అందించి, కోర్సు పూర్తయిందే తడవు ఉద్యోగాన్ని లేదంటే స్వయం ఉపాధిని అందించే ఇంటర్ ఒకేషనల్ కోర్సులపై స్పెషల్ ఫోకస్.. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల లక్ష్యాలు +2 స్థాయిలో విద్యార్థులకు వివిధ వృత్తులకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలను అందించి, ఉద్యోగావకాశాలు లేదా స్వయం ఉపాధిని పొందేలా చేయడం.ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి, వ్యక్తిగత శ్రేయస్సులను అనుసంధానించడం.వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో వృద్ధి పథంలో పయనిస్తున్న విభాగాలకు అవసరమైన మధ్యస్థాయి మానవ వనరులను సృష్టించడం. తక్షణ ఉపాధికి సత్వర మార్గం: పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇ లాంటి వారికి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులు అవసరం. మరోవైపు నేటి ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి. అర్హత, కోర్సులు: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఔత్సాహిక విద్యార్థులు నేరుగా కాలేజీని సంప్రదించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తక్షణ ఉపాధికి మార్గాలు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల వ్యవధి గల ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. లేదంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యలోనూ అవకాశాలు పొందొచ్చు. కోర్సు పూర్తిచేసిన తర్వాత అప్రెంటీస్‌షిప్ చేయొచ్చు. ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. ఏటా ప్రభుత్వం అప్రెంటీస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. వీటిద్వారా అప్రెంటీస్‌షిప్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. మా కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ (ఓఏ) కోర్సు ఉంది. ఇందులో గతేడాది 30 మందికిపైనే చేరారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులకు అధికారులు అనుమతిచ్చినప్పటికీ ఫ్యాకల్టీ కొరత ఉంది. ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు, విశ్రాంత సిబ్బందిని మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకోవాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. - పి.నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్, బాలికల కళాశాల, వనపర్తి, మహబూబ్‌నగర్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఒకటి. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కంపెనీలు తేలికపాటి, భారీ వాహనాలను పెద్ద ఎత్తున తయారుచేస్తున్నాయి. దీంతో సర్వీసింగ్, మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో మధ్యస్థాయి టెక్నీషియన్లకు డిమాండ్ పెరిగింది. కరిక్యులం: వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్.. ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.స్వయం ఉపాధి: ఆటోమొబైల్ మెకానిక్, డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ సర్వీస్ మెకానిక్, వెహికల్ ఆపరేటర్, స్పేర్ పార్ట్స్ సేల్స్‌మ్యాన్-డీలర్. మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.స్వయం ఉపాధి: సోలార్ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్వహణ; వెల్డింగ్ వర్క్‌షాప్; లైట్ మోటార్ వెహికల్ సర్వీసింగ్ సెంటర్; జనరల్ వర్క్‌షాప్.ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్; డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.స్వయం ఉపాధి: ఎలక్ట్రానిక్ పరికరాల సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల డీలర్షిప్/ఏజెన్సీ, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి. ఎలక్ట్రికల్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్. స్వయం ఉపాధి: ఎలక్ట్రిక్ ఉపకరణాల డీలర్షిప్/ఏజెన్సీ; రిపైర్ షాప్; మ్యానుఫ్యాక్చరింగ్; ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్; ఎలక్ట్రీషియన్; వైర్‌మ్యాన్; సర్వీస్ టెక్నీషియన్/సర్వీస్ ఇంజనీర్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: ఉద్యోగావకాశాలు: జూనియర్ ప్రోగామర్, కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, సాఫ్ట్వేర్ మార్కెటింగ్ పర్సనల్, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అసిస్టెంట్, డ్రాఫ్టింగ్ అసిస్టెంట్స్.స్వయం ఉపాధి: డీటీపీ ఆపరేటర్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సెంటర్ మెయింటెనెన్స్, ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ హార్డ్‌వేర్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నీషియన్, వెబ్‌డిజైనర్. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ: ఉద్యోగావకాశాలు: నిర్మాణ రంగంలో ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లకు అసిస్టెంట్లు; కాంట్రాక్ట్ ఉద్యోగాలు; తాపీమేస్త్రీ, కార్పెంటర్, పెయింటర్ వంటివి.స్వయం ఉపాధి: నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టర్; పెయింటింగ్, బార్ బెండింగ్ వంటి సేవలు. అగ్రికల్చరల్ కోర్సులు క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్: భూ, నీటి వనరులు క్షీణిస్తుండటం.. వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి నేపథ్యంలో దేశంలో పంట ఉత్పత్తుల్లో నిలకడ వృద్ధి సాధించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సంస్థాగతపరమైన సహకారంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ వృత్తి విద్యా నిపుణుల అవసరం పెరుగుతోంది. ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఫార్మ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, విలేజ్ కోఆర్డినేటర్, ప్లాంట్ ప్రొటక్షన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: అగ్రీ ఇన్పుట్ సప్లయిర్; సీడ్ గ్రోవర్, క్రాప్ ప్రొడ్యూసర్, కస్టమ్ సర్వీస్, కాంట్రాక్టర్/కాంట్రాక్టింగ్ ఫార్మింగ్. డెయిరీ: ఉద్యోగావకాశాలు: వెటర్నరీ అసిస్టెంట్, డెయిరీ ఫారం అసిస్టెంట్; మిల్క్ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్; డెయిరీ లేబొరేటరీ అసిస్టెంట్; ఫీడర్ ప్రొడక్షన్ సూపర్వైజర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: డెయిరీ ఫారం ఓనర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్; ఫీడర్ ప్రొడ్యూసర్; మిల్క్ పార్లర్; మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్; మిల్క్ కలెక్షన్ సెంటర్. ఫిషరీస్: ఉద్యోగావకాశాలు: లేబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, సూపర్వైజర్; ఆక్వా కేంద్రాలు, హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబొరేటరీ అసిస్టెంట్; ఫీల్డ్ మార్కెటింగ్ అసిస్టెంట్, సీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిషరీస్ కోఆపరేటివ్ సంస్థలలో ఉద్యోగాలు, స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు. స్వయం ఉపాధి: ఫిషరీ ఇన్పుట్ సప్లయిర్, సీడ్ ప్రొడ్యూసర్, ఫిష్ ప్రొడ్యూసర్.. సెరీకల్చర్: ఉద్యోగావకాశాలు: ఆపరేటివ్ (గ్రెయినేజ్/మల్బరీ కల్టివేషన్/ఎక్స్టెన్షన్/రియరింగ్/రీలింగ్); లేబ్ అటెండర్; కల్టివేటర్/లేబర్.స్వయం ఉపాధి: మల్బరీ నర్సరీ, గ్రెయినేజ్, సెరీకల్చర్ సర్వీస్ సెంటర్, మల్బరీ గ్రోవర్, సిల్క్‌వార్మ్ సీడ్ సప్లయిర్, మల్బరీ ప్రోపగేటర్, సిల్క్ రీలర్, సిల్క్ ట్విస్టర్, కకూన్ సప్లయిర్. హ్యుమానిటీస్, ఇతర కోర్సులు కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్: ఉద్యోగావకాశాలు: మీడియా సంస్థలలో యానిమేటర్‌గా అవకాశాలుంటాయి. డ్రాయింగ్ అసిస్టెంట్, ఫొటో ఎడిటింగ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందొచ్చు. స్థానిక కేబుల్ టీవీ కేంద్రాలు, గేమింగ్ స్టూడియోల్లోనూ అవకాశాలుంటాయి. టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్: ఉద్యోగావకాశాలు: టూరిజం అసిస్టెంట్, టూరిస్ట్‌గైడ్, టూర్ ఎస్కార్ట్, గెస్ట్ రిలేషన్ అసిస్టెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్, హౌస్‌కీపింగ్ అసిస్టెంట్..స్వయం ఉపాధి: కేటరింగ్ ఆపరేషన్స్, టూర్ కండక్టర్, కొరియర్ అండ్ కార్గో ఏజెంట్, టూరిస్ట్ గైడ్.. పారామెడికల్ కోర్సులు ెుడికల్ ల్యాబ్ టెక్నీషియన్: వైద్య సేవల రంగంలో రోగ నిర్ధరణ కీలకమైంది. సరిగా రోగ నిర్ధరణ జరక్కుంటే రోగికి చికిత్స చేసేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. కరిక్యులం: బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ అండ్ పాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఉద్యోగావకాశాలు: ఆసుపత్రుల రోగ నిర్ధారణ కేంద్రాలు; వైద్య, ఫార్మసీ కళాశాలలు; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్స్ వంటివాటిలో లేబొరేటరీ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.స్వయం ఉపాధి: డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల ఏర్పాటు; ల్యాబ్ కెమికల్స్, గ్లాస్‌వేర్, ల్యాబ్ పరికరాలు, విడి భాగాల డిస్ట్రిబ్యూటర్.ఇతర కోర్సులు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ. బిజినెస్, కామర్స్ కోర్సులు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్: కరిక్యులం: బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఉద్యోగావకాశాలు: సూపర్ బజార్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, బ్యాంకుల్లో అవకాశాలుంటాయి. మ్యూచ్‌వల్‌ఫండ్స్ కంపెనీలు, సూక్ష్మ రుణ సంస్థల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి: పోస్టల్ సేవింగ్ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లుగా స్వయం ఉపాధి పొందొచ్చు. చిట్‌ఫండ్స్, సూక్ష్మరుణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ................................. ఇతర కోర్సులు: ఆఫీస్ అసిస్టెంట్‌షిప్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులకు కొత్త కరిక్యులం రూపొందించి, 2012-13 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏ ఒకేషనల్ కోర్సుకైనా ప్రాక్టికల్స్ కీలకం. కాబట్టి కోర్సులో భాగంగా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కుల వెయిటేజీ కూడా థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమానంగా ఉంటుంది. అంటే.. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు పాక్టికల్స్‌కు ఉంటాయి. ఒకేషనల్ కోర్సులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్టులుంటాయి. కళాశాల వీలునుబట్టి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. వేతనాలు ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాలు ఉంటాయి. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. స్వయం ఉపాధి ద్వారా అధిక మొత్తాలను ఆర్జించవచ్చు. మరికొందరికి ఉపాధిని చూపించవచ్చు. ఉన్నత విద్యావకాశాలు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వొకేషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. లేదంటే 10 శాతం కోటా కింద సంబంధిత పాలిటెక్నిక్ హెల్త్ అండ్ పారామెడికల్ కోర్సులు చేసిన వారు బ్రిడ్జ్‌కోర్సు, ఎంసెట్‌తో గ్రాడ్యుయేషన్ స్థాయిలో మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు.మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వారు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. కామర్స్, బిజినెస్ కోర్సులు పూర్తిచేసిన వారు బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు బీఎస్సీ, బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. -
తెగబడిన తమ్ముళ్లు
జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్‌గిరి కైవసానికి కుట్రలు - కిడ్నాప్‌లకూ వెనుకాడని వైనం - ప్యాపిలికి చెందిన ఇద్దరు ఎంపీటీసీల అపహరణ - మరి కొందరి కోసం ప్రలోభాలపర్వం సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం టీడీపీ నేతలు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్‌లకు తెరతీశారు. ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య బద్దంగా అయితే జెడ్పీ చైర్మన్, 22 ఎంపీపీ, ఐదు మునిసిపాలిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి. అయితే టీడీపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. భారీ ఎత్తున డబ్బు ఆశ చూపిస్తున్నారు. మరి కొందరిని బెదిరిస్తున్నారు. ఇంకొందరిని కిడ్నాప్ చేస్తున్నారు. ప్యాపిలి మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 12, టీడీపీ తొమ్మిదింట గెలుపొందాయి. అందులో వైఎస్సార్ సీపీకి చెందిన ఊటకొండ ఎంపీటీసీ అనారోగ్యంతో మృతి చెందారు. అయినా ఎంపీపీ కావటానికి వైఎస్సార్ సీపీకే బలముంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు శనివారం రాత్రి ప్యాపిలి-3 ఎంపీటీసీ పెద్దరాజును కారుబాడుగ విషయం మాట్లాడేందుకని ఇతరుల ద్వారా ఫోన్ చేయించి గుత్తిలో కిడ్నాప్‌కు పాల్పడ్డారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవిని సైతం మభ్య పెట్టారు. ఆమెతో పాటు ఆమె భర్త శ్రీనివాసులు రెండు రోజులుగా కనిపించటం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రూ. 5 లక్షల నగదుతో పాటు రేషన్ డీలర్ షిప్‌ను కూడా ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ససేమిరా అంటున్నా వారి బంధువుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న ధీమాతో తాము ఏం చేసినా చెల్లుతుందని టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటే: ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీకి ఓటు వేయడానికి వీలు లేదని, అలా చేసిన వారికి విప్‌ను జారీ చేస్తే వారిపై అనర్హత వేటు పడుతోందని అందరికీ తెలిసిందే. అన్నీ తెలిసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిపై ఎలాగైనా అనర్హత వేటు వేయించటమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. కిడ్నాప్‌లపై స్పందించని పోలీసులు: టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని శనివారం పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక పోలీసులు స్పందించక పోవడంతో పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ఆదివారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. టీడీపీ నాయకులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవితో పాటు ఆమె భర్త శ్రీనివాసులు మూడు రోజులుగా కనిపించడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా మూర్తి, మల్లికార్జునరెడ్డి తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రమాదేవి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులు రమాదేవి, శ్రీనివాసులు ఈ నెల 27 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్యాపిలి మండల టీడీపీ నాయకులే తన తల్లిదండ్రులను కిడ్నాప్ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని హరికృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకులపై కేసు నమోదు ప్యాపిలి: వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడు పెద్దరాజును కిడ్నాప్ చేసిన సంఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ ఆదివారం తెలిపారు. కారు బాడుగ మాట్లాడేందుకు పెద్దరాజును పిలిచి గుత్తి వద్ద టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి భార్య నులక వెంకటేశ్వరమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన తన భర్తను టీడీపీ నాయకులు బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు టీడీపీ నాయకులు టి. శ్రీనివాసులు, శాంతు, అర్జున్, వెంకటేష్, హరి, పోదొడ్డి సుంకన్నలతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీల కిడ్నాప్
ప్యాపిలి: మెజారిటీ లేకపోయినా ఎంపీపీ పీఠం కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీస్తోంది. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఇరువురు ఎంపీటీసీలను కిడ్నాప్ చేసింది. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 9 స్థానాల్లో గెలుపొందాయి. వీరిలో ఒక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ వుృతి చెందినా ఆ పార్టీకి 11 వుంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ప్యాపిలి-3వ ఎంపీటీసీ పెద్దరాజును కారు బాడుగకు మాట్లాడాలి రమ్మంటూ ఫోన్ చేసి గుత్తి వద్ద కొందరు కిడ్నాప్ చేశారు. జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవి, ఈమె భర్త శ్రీనివాసులు సైతం మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. పెద్దరాజును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమాదేవి దంపతుల అదృశ్యంపై కూడా వారి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
ఎంపీపీ ఎంపికలో రాజకీయం
చీపురుపల్లి: చీపురుపల్లి, గరివిడి మండల అధ్యక్షుల ఎంపికలో రాజకీయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఎంపీపీలు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే కొందరిని ఎంపీపీలుగా ఎంపిక చేసినప్పటికీ అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు శనివారం చేసిన వ్యాఖ్యలు అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి తెరతీసాయి. దీనిపై చీపురుపల్లి, గరివిడి మండలాల్లోని టీడీపీ వర్గీయుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి మెజార్టీతో పాటు మంత్రి ఆశీస్సులు ఉండడంతో చీపురుపల్లి, గరివిడి మండలాలకు చెందిన ఎంపీపీ అభ్యర్థులు ముహూర్తం పెట్టుకు ని సీటులో కూడా కూర్చున్నారు. కానీ గద్దే ఝలక్‌తో ఇప్పుడు వారంతా ఖంగు తింటున్నారు. గద్దే మాటల తో ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మె రకముడిదాం, గుర్ల మండలాల ఎంపీపీ అభ్యర్థులను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో చీపురుపల్లి, గరివిడి మండలాల్లో ఇప్పటికే రౌతు కాంత మ్మ, పైల సింహాచలం వారం రోజులు క్రితమే ము హూర్తం కోసం ఎంపీపీ సీటులో అనధికారికంగా కూ ర్చున్నారు. అయితే వచ్చే నెల 4వ తేదీన ఎంపీపీ ఎన్ని క జరగనున్న నేపథ్యంలో..శనివారం గద్దే బాబూరావు విలేకరులతో మాట్లాడుతూ చీపురుపల్లి, గరివిడి మం డల అధ్యక్షుల ఎంపికపై అస్పష్టంగా మాట్లాడడంతో సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ముహూర్తానికి ఈ రెండు మండలాల్లో ఎంపీపీ అభ్యర్థులు కూర్చొన్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా కూర్చొంటే అయిపోతుందా అంటూ ఎదురు ప్రశ్న వే శార. అయితే చివరకు ఆ ఇద్దరినే కూర్చోబెట్టొచ్చు కా ని....పనితీరు బాగా లేకపోతే నెల రోజుల్లో దింపేయవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తన మాట ల్లో ఎంపీపీ అభ్యర్థి పైల బలరామ్‌కు కూడా ఝలక్ ఇచ్చారు. గరివిడి వైస్ ఎంపీపీగా తన అనుచరుడు రవి పేరును ప్రకటించడంతో టీడీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇది నచ్చని ఆ పార్టీలో మరికొంతమం ది వైస్ ఎంపీపీ పేరు ప్రకటించడానికి ఆయనకు ఉన్న అధికారమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు బ యటకు పొక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గీయుల్లో చర్చ ప్రారంభమవ్వగా.. ఎంపీపీ అభ్యర్థుల్లో గుబు లు మొదలైంది. -
‘స్థానిక’ విజేతలకు స్థానచలనం
సాక్షి, కాకినాడ :జిల్లాలో మెజారిటీ ఎంపీపీ పదవులపై కన్నేసిన టీడీపీతో పాటు ప్రాదేశిక పోరులో గట్టి పోటీనిచ్చిన వైఎస్సార్సీపీ కూడా తమతమ ఎంపీటీసీ సభ్యులు చేజారిపోకుండా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అలాగే మున్సిపల్ పోరులో బలాబలాలు సమానంగా ఉన్న ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. కొందరిని పర్యాటక ప్రాంతాలకు, మరికొందరిని పుణ్యక్షేత్రాలకు తరలించారు. గత నెలలో జరిగిన స్థానిక, ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ పైచేయి సాధించింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీ చెరిసగం సీట్లను దక్కించుకున్నాయి. ఏలేశ్వరంలో టీడీపీకి ఎక్కువ స్థానాలు లభించినా ఆ పార్టీకి రిజర్వ్డ్ చైర్పర్సన్ అభ్యర్థి లేని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముమ్మిడివరంలో ఇండిపెండెంట్లతో గట్టెక్కేందుకు టీడీపీ సిద్ధమవుతుండగా ఏలేశ్వరం, గొల్లప్రోలుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి, కాగా ప్రాదేశికపోరులో 57 జెడ్పీటీసీలకు 43 స్థానాలను, 1063 ఎంపీటీసీలకు 608 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 40 మండలపరిషత్‌లలో టీడీపీకి, 12 మండలాల్లో వైఎస్సార్ సీపీకీ మెజారిటీ స్థానాలు లభించాయి. నాలుగుమండలాల్లో ఇరుపార్టీలకు చెరి సగం సీట్లు వచ్చాయి. ఏలేశ్వరం నగర పంచాయతీ మాదిరే మండల పరిషత్‌లో కూడా టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కినా రిజర్వుడు చైర్మన్ అభ్యర్థి లేని అగమ్యగోచర పరిస్థితి తప్పలేదు. మెజారిటీ ఎంపీపీ పదవులు సొంతమయ్యే బలం ఉన్నా అభద్రతా భావం పీడిస్తున్నందునే టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఎంపీటీసీ సభ్యులను క్యాంపులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు మాత్రమే ఉన్న పలు మండలాల్లో తమ వారు చేజారిపోతారేమోనన్న భయం వారిని వెన్నాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఫలితాల కోసం నెలరోజులు, ప్రమాణ స్వీకారం కోసం మరో నెలరోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారానికి, స్థానిక సంస్థల్లో కొత్తపాలక వర్గాలు కొలువు దీరేందుకు ఎన్నికల కమిషన్ లంకె పెట్టింది. అపాయింట్మెంట్ డే(జూన్-2) తర్వాత కానీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కుటుంబాలతో సహా వేసవి వినోదం ప్రధానంగా పోరు హోరాహోరీగా జరిగిన మండలాల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులను క్యాంపులకు తరలించారు. సఖినేటిపల్లి, రాజోలు, ఆత్రేయపురం, గోకవరం, బిక్కవోలు, తొండంగి, పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి లేదా రెండుస్థానాలు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అలాగే మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి రెండు స్థానాలు మాత్రమే తక్కువ వచ్చిన ఏలేశ్వరం, అయినవిల్లి, కాట్రేనికోన వంటి మండలాలతో పాటు వైఎస్సార్ సీపీతో చెరిసగం సీట్లు సాధించిన కాజులూరు, యు.కొత్తపల్లి, రౌతులపూడి మండలాల పరిధిలోని ఎంపీటీసీలను కూడా కాపాడుకునే పనిలో టీడీపీ నిమగ్నమైంది. వీరితో పాటు మిగిలిన మండలాల పరిధిలో కూడా గోడ దూకుతారన్న అనుమానం ఉన్న ఎంపీటీసీలను కూడా శిబిరాలకు తరలించారు. అలాగే ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడి వరం నగరపంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులను కూడా క్యాంపులకు తీసుకువెళ్లారు. అవసరం లేని మండలాల్లోనూ ఉబలాటపడుతున్న సభ్యులను కూడా క్యాంపులకు తీసుకు వెళ్లక తప్పలేదు. వేసవి సెలవులను ఆస్వాదించేందుకు ఇదో అవకాశంగా చాలా మంది ఎంపీటీసీలు కుటుంబ సభ్యులతో క్యాంపులకు తరలారు. శిబిర నిర్వాహకులు వీరి వద్ద ఉన్న పర్సనల్ సిమ్‌లను స్వాధీనం చేసుకొని కొత్త సిమ్కార్డులందజేశారు. వారిపై నిఘా ఉంచారు. మందుబాబులకు తాగి నంత మద్యం, షడ్రుచులతో కూడిన భోజనాలు, వినోద కార్యక్రమాలతో వారిని కదలకుండా చేస్తున్నారు. ఎక్కువమంది సభ్యులను అరకు, విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరు హాయ్‌లాండ్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించగా, కొంత మందిని కుటుంబసభ్యులతో తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు తరలించారు. కచ్చితమైన ఆధిక్యతను కనపర్చిన మండలాల పరిధిలోని ఎంపీటీసీల నుంచి కూడా ఒత్తిడి వస్తుండడంతో వారిని కూడా విహార యాత్రలకు తరలించాల్సిన పరిస్థితి టీడీపీకి తప్పడం లేదు. ఖర్చు తడిసిమోపెడు నగర పంచాయతీలతో పాటు మండల పరిషత్‌లు చేజిక్కించుకునే అవకాశం ఉన్న మండలాల పరిధిలోని తమ సభ్యులను వైఎస్సార్ సీపీ స్థానిక నాయకత్వం కూడా విశాఖ, అరకు వంటి ప్రాంతాలకు తరలించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో మూడు వారాలకు పైగా క్యాంపులను నిర్వహించే పరిస్థితి ఏర్పడడంతో చైర్మన్, ఎంపీపీ పదవులను ఆశిస్తున్న వారికి తడిసి మోపెడు ఖర్చవుతోంది. పేరుకు స్థానిక, ప్రాదేశిక ఎన్నికలే అయినా సార్వత్రిక ఎన్నికలతో సమానంగా ఖర్చయిందని, ఇప్పుడు అదనపు భారం మోసేదెలా అని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. జూన్ రెండో వారంలో కానీ వీటి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం లేనందున అప్పటి వరకు క్యాంపులను నిర్వహించక తప్పదని వాపోతున్నారు. -
ఎంపీపీ పదవుల కోసం హంగ్‌లారుస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రాదేశిక ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చిన మండల పరిషత్‌లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రలోభాలకు తెరలేపారు. ఆయా మండలాల్లో కీలకంగా మారిన ఇతర పార్టీల ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు నడుపుతున్న వారు తమకు మద్దతు పలికితే వైస్ ఎంపీపీ పదవులతో పాటు కార్లు, ఇళ్లు, భూ ములు, పెద్ద ఎత్తున డబ్బు నజరానా ఇచ్చేందుకు సిద్ధపడు తున్నట్టు తెలిసింది. అయితే అందరికీ ఒకే రకమైన ఆఫర్లు ఇస్తుండడంతో అసలు ఎవరికి వైస్ ఎంపీపీ పదవులు కట్టబెడతారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 12 మండలాల్లో కీలకం కానున్న టీడీపీయేతర ఎంపీటీసీలు జిల్లాలో 34 మండలాలు ఉండగా, ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 12 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది. బాడంగి, బలిజి పేట, భోగాపురం, దత్తిరాజేరు, గుర్ల, మక్కువ, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పార్వతీపురం, రామభద్రపు రం, సాలూరు మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. దీంతో అక్క డ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆయా మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు టీడీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులతో పాటు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, గెలుపొందిన అభ్యర్థులు కీలకంగా మారారు. బంపర్ ఆఫర్లు.... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఎలాగైనా జిల్లాలో పట్టు సాధించేందుకు హంగ్ ఏర్పడిన మండలాల్లో ఎంపీపీ పదవులకు దక్కించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ మేరకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గెలిచిన స్వతంత్రులను ఇప్పటికే రహ స్య ప్రదేశాలకు తరలించారు. వారిలో కొందరిని విహార యాత్రల పేరుతో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, సిమ్లా, షిర్డీ వంటి సూదూర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. అయితే స్వతంత్రులు వచ్చినా కలిసి రాని మండలాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి స్వతంత్రుల కన్నా భారీ ఎత్తు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా మండల ఉపాధ్యక్ష పదవితో మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఒకే మండలంలో ఇద్దరు ముగ్గురికి ఇదే తరహాలో ఆఫర్లు ఇస్తుండడంతో చివరికి ఆ పదవిని ఎవరికి కట్టబెడతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాజకీయాలను గమనిస్తున్న మరికొంతమంది గెలుపు వీరులు భారీ మొత్తంలో నజరానాలు ఆశిస్తుండడంతో వారి కోర్కెల చిట్టా తీర్చేందుకు స్థానిక నాయకులు జేబులు చింపుకోవాల్సి వస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
ఎంపీపీ పీఠానికి త్రిముఖ పోటీ!
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్ : మహిళకు కేటాయించిన ఆమదాలవలస మండలాధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారే ఈ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్‌టీవాడ ఎంపీటీసీ సభ్యురాలు కొరుకొండ ఇందుమతి, కొర్లకోట సభ్యురాలు సువ్వారి రూపవతి, చీమలవలస సభ్యురాలు సనపల పద్మావతి ఎంపీపీ పీఠం కోసం పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని అధిక ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. కలివరం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన తమ్మినేని ఇందువతమ్మని తొలుత ఎంపీపీ అభ్యర్థిగా సూచాయగా ప్రకటించారు. అయితే ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం, ఇందువతమ్మ ఓటమి పాలవడంతో మిగిలిన సభ్యుల్లో ఎంపీపీ పదవిపై ఆశలు రేకెత్తాయి. కోరుకొండ ఇందుమతి కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె భర్త జీకేవలస సర్పంచ్ రమణ మాజీమంత్రి తమ్మినేని అనుచరుడు కావడంతో ఎంపీపీ పదవి ఇందుమతికి దక్కే అవకాశం ఉందనే గురగుసలు వినిపిస్తున్నాయి. అలాగే జెడ్పీటీసీ సభ్యురాలు బంధువుగా, సీతారాంకు కష్టకాలంలో అండగా ఉంటూ.. కొర్లకోట ఎంపీటీసీ స్థానంలో గెలుపొందిన సువ్వారి రూపవతికి కూడా పదవి దక్కే అవకాశం మెండగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరితోపాటు చీమలవలస సర్పంచ్ జి. శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో తమ్మినేని చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటున్నారు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు పద్మవతికి ఎంపీపీ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజులు వేచి చూడాలి. -
దటీజ్ తమ్మినేని
ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలను గంపగుత్తగా దక్కించుకోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుత మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో దాన్ని సాధ్యం చేసిన ఏకైక నేతగా తమ్మినేని సీతారాం తన ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లాలోని ఆమదాలవలస మినహా ఏ ఇతర నియోజకవర్గంలోనూ అన్ని మండలాలు టీడీపీకిగాని, వైఎస్ఆర్సీపీగాని లభించలేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాల వలస మున్సిపాలిటీతోపాటు నాలుగు మం డలాల(ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి) ఎంపీపీలు, మూడు జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరాయి. వైఎస్ఆర్సీపీలో ఆలస్యంగా చేరిన తమ్మినేని.. అతితక్కువ కాలంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను పార్టీ వైపు ఆకర్షించారు. నగరభేరి పేరుతో మున్సిపాలిటీలో సమస్యలు గుర్తించి అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. స్థానిక సమస్యలపైనే కాకుండా థర్మల్, అణువిద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జిల్లాలో జరుగుతున్న ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు పరిశ్రమల్లో కార్మిక సమస్యలపైనా కార్మికుల పక్షాన పోరాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామ్ స్థానిక ఎన్నికల ఫలి తాలు ముందస్తు నజరానాగా లభించాయి. కాగా నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అభిమానులు తమ్మినేనిని కలిశారు ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపారు. -
ఎంపీపీలుగా.. జెడ్పీటీసీలుగా..
హాలియా, న్యూస్‌లైన్ : ఎంపీపీగా పనిచేసి.. ఆ తర్వాతి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలిచారు సాగర్ నియోజకవర్గ నేతలిద్దరు. పెద్దవూర మండలానికి చెందిన కర్నాటి లింగారెడ్డి, త్రిపురారం మండలానికి చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్‌లు గతంలో ఆయా మండలాల్లో ఎంపీపీలుగా పనిచేయడంతో పాటు జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేశారు. రెండు సార్లు ఎంపీపీగా.. పెద్దవూర మండల కేంద్రానికి చెందిన కర్నాటి లింగారెడ్డి 1983లోరాజకీయ జీవితం ప్రారంభించారు. 1983-86 వరకు ఆప్కాబ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత 1987-92 వరకు మొదటిసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06 వరకు పనిచేశారు. 2005-11 వరకు రెండు పర్యాయాలు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరల ఎంపీటీసీగా ఎన్నికై 2006-11 వరకు రెండోసారి పెద్దవూర ఎంపీపీగా పనిచేశారు. ఈసారి కూడా పెద్దవూర జెడ్పీటీసీ జనరల్ కావడంతో ఆయన జెడ్పీటీసీగా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒకసారి ఎంపీపీగా.. త్రిపురారం మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ రాంచందర్ నాయక్, 1987లో సీపీఎం నుంచి ఎంపీటీసీగా ఎన్నికై త్రిపురారం ఎంపీపీగా పని చేశారు. ఆ తరువాత 1998లో సీపీఎం (బీఎన్‌రెడ్డి పార్టీ ) తరఫున మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేశారు. 2001లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున త్రిపురారం జెడ్పీటీసీగా ఎన్నికై 2001-06వరకు జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు. ఆ తరువాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2010 జూలైలో కాంగ్రెస్‌లో చేరారు. -
ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో అచ్చెన్న డ్రామా
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మితోపాటు తిలారు సర్పంచ్ తర్రా రామకృష్ణ ఆశిస్తున్నారు. దీంతో అచ్చెన్న తెరవెనుక రాజకీయానికి తెరతీశారు. రామకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అచ్చెన్న ప్రకటిస్తే విజయలక్ష్మికే మద్దతని అచ్చెన్న సోదరుడు ప్రసాద్ అంటున్నారు. ఎంపీపీగా రామకృష్ణ పేరును బుధవారమే ప్రకటించిన అచ్చెన్న ఆ విషయాన్ని విజయలక్ష్మికి చెప్పి బరిలోంచి తప్పుకోవాలన్నారు. దీంతో నామినేషన్ వే సేందుకు సిద్ధమైన ఆమె నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆమె మరో ఆరుగురితో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడుతానని రామకృష్ణ హెచ్చరించడంతో అచ్చెన్న సీను నుంచి తాను తప్పుకుని మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌ను పంపించి తర్రాకే మద్దతిస్తున్నట్లు చెప్పించారు. మరోవైపు విజయలక్ష్మికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చేలా సోదరుడు ప్రసాద్ ద్వారా కబురు పంపించి గురువారం ఆమె చేత నామినేషన్ వేయించారు. దీనివెనుక లోగుట్టు పరిశీలించిన రామకృష్ణ తన తల్లి దమయంతితో హడావుడిగా నామినేషన్ వేయించారు. దీంతో అచ్చెన్న వ్యూహం బెడిసికొట్టింది. అయినప్పటికీ గురువారం బయటకు రాకుండా కథ నడిపించే యత్నం చేశారు. తర్రా వంటి సీనియర్ నేత వేరే పార్టీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంపీపీ ఆశ చూపించారని, ఏదిఏమైనా అచ్చెన్నకు సన్నిహితురాలైన విజయలక్ష్మికే ఆయన ఎంపీపీ ఇప్పిస్తారని ఆయన స్వభావం తెలిసిన వారు అంటున్నారు. దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వం రాకపోతే తర్రా బృందం పార్టీని వీడేందుకు వీలుగా గురువారం రాత్రి తిలారులో సమావేశమయ్యారు. ఏక్షణంలోనైనా అచ్చెన్న తన నిర్ణయం మార్చుకుంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. ఇదే తీరులో అటు విజయలక్ష్మి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. -
మహిళలు..మహారాణులు
అలంపూర్, న్యూస్‌లైన్: రిజర్వేషన్లతో అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూరుతోంది. ఈ సారి మహిళలకు రాజకీయాల్లో సగం రిజర్వేషన్లు కల్పిం చిన విషయం తెలిసిందే. దీంతో అలంపూర్ ని యోజకవర్గంలో మహిళా మణుల ప్రాముఖ్యత పెరిగింది. కేటాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో అతివలకే అధిక ప్రాధాన్యం ద క్కింది. అలంపూర్, ఇటిక్యాల, వడ్డేపల్లి, మానవపాడు, అయిజ మండలాల్లో 79 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. వీరిలో జనరల్ మహిళలకు13, బీసీ మహిళకు16, ఎస్సీ మహిళకు11 స్థానాలకు మొత్తంగా మహిళలకు 40 ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. అలంపూర్ మండలంలో 13 ఎంపీటీసీలకు ఏడు, అయిజ మండలంలో16కు 8, ఇటిక్యాల మండలంలోని 15 స్థానాలకు ఏడు, మానవపాడు మండలంలోని 15 స్థానాలకు 8, వడ్డేపల్లి మండలంలోని 20 స్థానాలకు 10 స్థానాల్లో మహిళలు పోటీచేసి ఆ స్థానాల్లో ఎంపికకానున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లోనూ మహిళలకే అధికస్థానాలు దక్కాయి. ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ముగ్గురు మహిళలు, ఎంపీపీ స్థానాల్లో ముగ్గురు మహిళ ప్రతినిధులు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆయా స్థానాల్లో 83 మంది పోటీకి సిద్ధపడుతుండగా వారిలో 40 మంది పురుషులు, 43 మంది మహిళలే ఉన్నారు. ఈ లెక్కన ఈసారి ఎన్నికల తర్వాత ఆయా స్థానాలనుంచి 46 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజాపాలనలో కొలువుదీరనున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదోశక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ అమ్మవారి ఐదోశక్తి పీఠక్షేత్రంలో ఇటీవల కొలువుదీరిన నూతన ఆలయ పాలక మండలికి తొలిసారిగా మహిళా చైర్మన్‌గా లక్ష్మిదేవమ్మకు అవకాశం దక్కింది. అంతేకాకుండా ధర్మకర్తల సభ్యులుగా 10 మందిని ఎంపికచేస్తే..వారిలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. జోగుళాంబ క్షేత్రంగా కీర్తిగడించిన అలంపూర్ ప్రాంతంలో మహిళల ప్రాధాన్యం పెరగడంతో మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తోంది.