పదవి భార్యది.. పెత్తనం భర్తది | MPP Husband Attend In RDO Meeting Guntur | Sakshi
Sakshi News home page

పదవి భార్యది.. పెత్తనం భర్తది

Published Fri, Jul 13 2018 1:10 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

MPP Husband Attend In RDO Meeting Guntur - Sakshi

సమావేశంలో ఆర్డీవోకు ఎడమ పక్కన కూర్చున్న ఎంపీపీ భర్త

గురజాల: పదవి భార్యది పెత్తనం మాత్రం భర్తది. మహిళలు మహారాణులు అంటారు కానీ మన దగ్గర మాత్రం మహిళలకు ఆ స్థానం లేదు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ఆర్డీవో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీకి బదులుగా ఆమె భర్త సీట్లో దర్జాగా కూర్చొన్నారు. ఎన్నికల ఒప్పందంలో భాగంగా రెండో ఎంపీపీగా ఈ నెల ఐదో తేదీ సగిలా సరితాదేవి ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే జరిగిన సమావేశంలో భర్త బాల కోటిరెడ్డి సమావేశాల్లో ఎంపీపీగా కూర్చుంటున్నారు. అధికారికంగా జరుగుతున్న మీటింగ్‌లో ఆర్డీవో పక్కన ఎంపీపీ భర్త సగిల బాల కోటిరెడ్డి కూర్చోవడం  ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారిక సమావేశంలో ఎంపీపీ భర్త దర్జాగా కూర్చోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement