పరిటాల సునీతకు ఎదురుదెబ్బ? | Raptadu TDP Local Leaders Fires On Paritala Sunitha Brother Involvement | Sakshi
Sakshi News home page

పరిటాల సునీతకు ఎదురుదెబ్బ?

Published Thu, Nov 29 2018 3:26 PM | Last Updated on Fri, Nov 30 2018 7:57 AM

Raptadu TDP Local Leaders Fires On Paritala Sunitha Brother Involvement - Sakshi

సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళిపై రాప్తాడు మండల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఆయన ఆధిపత్యం చెలాయించడమేమిటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలాధ్యక్షుడు దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఇవ్వకుండా గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించమని మురళి ఎలా చెప్తారంటూ ఆందోళనకు దిగారు. కాగా మురళి ఆదేశాల మేరకు బండమీదపల్లిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంతో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ విషయమై పరిటాల వర్గంలో చర్చ మొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement