చిత్తూరు (టౌన్) : జిల్లాలోని కేవీబీ పురం, బీ.కొత్తకోట, తిరుపతి రూరల్ ఎంపీపీల ఎన్నికపై ఆయా మండలాలకు చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తమకు నివేదికను సమర్పించాలంటూ జెడ్పీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి కథనం మేరకు..ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవీబీ పురం మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యూరు.
వీరిలో ఇద్దరు వైఎస్‌ఆర్ సీపీ, మిగిలిన 10 మంది టీడీపీకి చెందినవారు. అయితే ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ టీడీపీకి చెందిన పదిమంది సభ్యులు గెలిచినా ఎస్టీకి చెందిన మహిళా అభ్యర్థి ఓడిపోవడంతో రాజ్యాంగం ప్రకారం పార్టీలతో నిమిత్తం లేకుండా వైఎస్‌ఆర్ సీపీకి చెందిన తుపాకుల సులోచనను ఎంపీపీ పదవి వరించింది. అయితే ఇది చెల్లదంటూ టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ కోర్టును ఆశ్రయించారు.
అనర్హత వేటు చెల్లదంటూ...
తమపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూ తిరుపతి రూరల్ మండల టీడీపీ ఎంపీటీసీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రూరల్‌లో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలుండగా 21 స్థానాల్లో టీడీపీ,14 స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ, ఒక స్థానంలో సీపీఎం అభ్యర్థులు, 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే టీడీపీకి ఎంపీపీ అయ్యేందుకు అవసరమైన మెజారిటీ ఉన్నా ఇతరుల మద్దతుతో శెట్టిపల్లె-5 ఎంపీటీసీ సభ్యుడు మునికృష్ణ ఎంపీపీ అయ్యారు. దానికి సాయినగర్-3 ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి, పద్మావతిపురం-2 ఎంపీటీసీ సభ్యురాలు ఉష మద్దతిచ్చారు. దీంతో ఆ ముగ్గురిపై విప్ ధిక్కారం కింద అనర్హత వేటు ఇటీవలే పడింది. దీంతో ఆ ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించారు.
అధిక సంతానంవల్ల అనర్హుడిగా ప్రకటించండి
బీ.కొత్తకోట ఎంపీపీ ఖలీల్ అహమ్మద్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానమని, అతనిని అనర్హుడిగా ప్రకటించాలని బీ.కొత్తకోట-6 ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
జిల్లాలో ముగ్గురు ఎంపీపీల ఎన్నిక చెల్లదని పిటిషన్లు
Published Sat, Oct 18 2014 3:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement