
పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్
కామేపల్లి: బాధ్యతాయుతంగా ఉండాల్సిన మండలాధ్యక్షుడు ఓ కానిస్టేబుల్తో కలిసి పేకాట ఆడుతూ అడ్డంగా పట్టుబడ్డాడు. కామేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న కామేపల్లి ఎంపీపీ మాలోతు సరిరాం నాయక్, స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ భరద్వాజ శివకుమార్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.