playing cards
-
టేప్, జిగురు లేకుండా ప్లేయింగ్ కార్డు స్ట్రక్చర్‌తో రికార్డు సృష్టించాడు!
కోల్‌కతాకు చెందిన పదిహేను సంవత్సరాల అర్నవ్ దాగ ప్రపంచంలోనే పెద్దదైన ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. కోల్‌కత్తాలోని ప్రసిద్ధ నిర్మాణాలు రైటర్ బిల్డింగ్, షాహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ ఆధారంగా చేసుకొని ఈ నిర్మాణం చేశాడు. పని ప్రారంభించడానికి ముందు ఈ నాలుగు నిర్మాణాల దగ్గరకు వెళ్లి వాటి ఆర్కిటెక్చర్‌ను పరిశీలించాడు. ఈ స్ట్రక్చర్ కోసం 143,000 ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించాడు. టేప్, జిగురు ఉపయోగించకుండానే 40 అడుగుల ఎత్తుతో ఈ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. దీనికోసం 41 రోజుల పాటు కష్టపడ్డాడు. ‘పూర్తయి పోయింది అనుకున్న నిర్మాణం కొన్నిసార్లు హఠాత్తుగా కుప్పకూలిపోయేది. మళ్లీ మొదటి నుంచి పని మొదలు పెట్టాల్సి వచ్చేది. విసుగ్గా అనిపించేది. అయినా సరే కష్టపడేవాడిని’ అంటున్నాడు అర్నవ్. గతంలో బ్రియాన్ బెర్గ్ అనే వ్యక్తి 34 అడుగుల ఎత్తుతో ఉండే ప్లేకార్డ్ స్ట్రక్చర్‌ను సృష్టించాడు. బెర్గ్ రికార్డ్‌ను అర్నవ్ బ్రేక్ చేశాడు. (చదవండి: స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్! వీడియో వైరల్) -
Video: ప్లేయింగ్ కార్డ్స్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..
కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చంటారు. కష్టపడేతత్వం ఉంటే ఎంతటి లక్ష్యాలను అయినా సాధించగలం. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు 15 ఏళ్ల బాలుడు నిదర్శనంగా నిలిచాడు. తన అసాధారణ ప్రతిభతో ఏకంగా వరల్డ్ రికార్డునే కొల్లగొట్టాడు. కోల్‌కతాకు చెందిన అర్నవ్ దగ అనే 15 ఏళ్ల బాలుడు ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఎలాంటి టేపు, గమ్ సాయం లేకుండా ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం. దీని పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలతో ప్రాజెక్టును నిర్మించాడు. దీంతో అర్నవ్ రూపొందిన ఈ కట్టడం గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం’గా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తమ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది. బ్రయాన్బెర్గ్ మూడో హోటళ్లను 34 అడుగుల 1 అంగుళం పొడవుతో, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో నిర్మించాడు . తన ప్రాజెక్ట్ గురించి అర్నవ్ మాట్లాడుతూ.. ప్లేయింగ్ కార్డ్స్‌తో నిర్మాణాన్ని చేపట్టేందుముందు నాలుగు ప్రఖ్యాతి ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపాడు. వాటి నిర్మాణం, పని, ఆర్కిటెక్చర్ అన్నీంటిని అధ్యయం చేసినట్లు చెప్పాడు.‘ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్ కార్డ్స్‌తో చిన్న చిన్న మేడలు కట్టడం మొదలుపెట్టానని తెలిపాడు. లాక్డౌన్ సమయంలో దీనిపై మరింత కసరత్తు చేశా. దీంతో మూడేళ్లు శ్రమించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాధింనని అర్నవ్ తెలిపాడు. -
మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు..
ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీది ప్రత్యేక స్థానం. మైదానంలో తన ఆటతో అభిమానులను మాయ చేయగల సత్తా అతని సొంతం. గతేడాది ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను అన్నీ తానై నడిపించిన మెస్సీ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందిన మెస్సీ ఎట్టకేలకు తన ఫిఫా వరల్డ్‌కప్ కలను సాకారం చేసుకున్నాడు. అలాంటి మెస్సీనే తెలివిగా బోల్తా కొట్టించాడు మెజీషియన్. కార్డ్ ట్రిక్ ప్లేతో తన మ్యాజిక్‌ను చూపించి మెస్సీనే మెస్మరైజ్ చేశాడు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి పీఎస్జీ ప్లేయర్స్‌కు పారిస్‌లో ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెస్సీ సహా ఇతర పీఎస్జీ ప్లేయర్లు హాజరయ్యారు. ఇదే పార్టీకి జూలిస్ డెయిన్ అనే మెజీషియన్ కూడా వచ్చాడు. మెస్సీ దగ్గరికి వచ్చి కార్డ్ ట్రిక్ ప్లే మ్యాజిక్ షో చూపిస్తానన్నాడు. మెస్సీని ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలని.. కానీ అది ఏ కార్డు అనేది తనకు చూపించొద్దన్నాడు. అలా మెస్సీ ఏస్(A) కార్డును సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్ ట్రిక్‌తో మెస్సీ ఏంచుకున్న కార్డును మెజీషియన్ కరెక్టుగా చూపించడంతో పాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సీ భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది. ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సీ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ అందించిన తర్వాత ఆటకు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరికొన్ని రోజులు తన ఆటను కొనసాగిస్తానని మెస్సీ మనసులో మాటను చెప్పాడు. కానీ గత రెండురోజులుగా మెస్సీ త్వరలోనే రిటైర్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మెస్సీ కూడా అర్జెంటీనా జెర్సీని పట్టుకొని.. 'ఇక ముగిసింది' అన్నట్లుగా హింట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. 35 ఏళ్ల మెస్సీ.. లీగ్-1లో భాగంగా మోంట్పిల్లీర్తో మ్యాచ్‌లో గోల్ చేయగా.. 3-1తో పీఎస్జీ విజయం సాధించింది. View this post on Instagram A post shared by Julius Dein (@juliusdein) చదవండి: వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ -
పార్టీ యాక్టివ్‌గా లేకపోయేసరికి వేరే యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతున్నార్సార్!
పార్టీ యాక్టివ్‌గా లేకపోయేసరికి వేరే యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతున్నార్సార్! -
భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్లైన్లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్‌నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా ప్రారంభించాడు. దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్లైన్లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ముంబై కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అభయ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు. చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే.. లాభాల పంపకంలో ఉండగా.. 2019లో బెట్టింగ్ నేరంపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్‌లో తిరిగి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్లైన్లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమచేశాడు. చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్‌లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో రెండు, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్ ఇంటికి రాగా, కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా.. -
ఏపీ టీడీపీ నేతలతో గుత్త సుమన్ చౌదరి కి సంబంధాలు
-
పేకాట కేసులో 30 మంది నిందితులకు రిమాండ్
-
ప్రాణం తీసిన పేకాట: మద్యంమత్తులో బండరాయితో మోది..
జగిత్యాల క్రైం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవగా మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం సమ్మయ్య గత నెల 28వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం తాటిపల్లి పెద్ద చెరువులో సమ్మయ్య మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీయించారు. (చదవండి: ట్రాఫిక్ చలాన్ ఎలా వేస్తారని సర్పంచ్ హల్చల్) స్థానికుడితోపాటు కోరుట్లకు చెందిన మరో వ్యక్తితో కలిసి సమ్మయ్య పెద్దచెరువు సమీపంలో పేకాడి, మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పేకాట విషయంలో తలెత్తిన వివాదంతో మిగతా ఇద్దరు బండరాయితో అతని తలపై మోది హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి సోదరుడు నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు) -
పోలీసుల ముందున్నది 57 మంది ‘ఆటగాళ్లు’..
మంచిర్యాల క్రైం: చిత్రంలో చూస్తుంటే.. పోలీసులు ఏదో అవగాహన కల్పిస్తున్నట్టు.. దానికి వీరంతా హాజరైనట్టు ఉంది కదూ..! కానీ, వీరంతా పేకాట ఆడుతూ పట్టుబడితే పోలీసులు ఇదిగో ఇలా వరుసగా కూర్చోబెట్టి వివరాలు ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు కొన్ని రోజులుగా పేకాట స్థావరాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తాండూర్ పోలీస్‌స్టేషన్ పరిధి రేపల్లెవాడ అటవీ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా.. 57 మంది అంతర్జిల్లా పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి 6 లక్షల రూపాయల నగదు, 18 కార్లు, 63 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు రామగుండం సీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. -
పోలీస్ స్టేషన్లో పేకాట..!
సాక్షి, తుమకూరు: పేకాట ఆడటం నేరమని తెలిసినా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పేకాట ఆడిన నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. తాలూకాలోని గ్రామీణ నియోజకవర్గంలోని హెబ్బూరు పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ రామచంద్రప్ప, కానిస్టేబుళ్లు మహేశ్, చెలువరాజు, సంతోష్‌లు పేకాట ఆడుకుంటూ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపరచుకుని ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కోన వంశీ కృష్ణ నలుగురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా స్టేషన్లోనే పేకాట ఆడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. చదవండి: అనుకున్నట్లే ఏకగ్రీవం -
లాక్డౌన్లో టీడీపీ పేకాట శిబిరం
సాక్షి, ఏలూరు: లాక్‌డౌన్‌ను కూడా ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు టీడీపీ నాయకులు. నల్లజర్ల ప్రాంతంలో ఉన్న రిజర్వ్‌ఫారెస్ట్‌లోని జీడిమామిడి తోటలను వేదికగా చేసుకున్నారు. అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకుని పేకాట కేంద్రాన్ని నడుపుతున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి తాడేపల్లిగూడెం రూరల్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ట్రైనీ డీఎస్పీ సునీల్‌కుమార్ నేతృత్వంలో చేసిన దాడిలో 16 మంది పట్టుబడ్డారు. వీరిలో జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సోదరుడు, దగ్గర బంధువులు ఉండటం గమనార్హం. చదవండి: పేకాడుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్సీ! గతంలో నల్లజర్లలోని పేకాట శిబిరంపై దాడి చేసినందుకు అప్పటి రూరల్ సీఐగా పనిచేసిన రాజశేఖర్‌పై సస్పెన్షన్ వేటు వేయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో పేకాట శిబిరాలను మూయించేసింది. దీంతో రిజర్వ్‌ఫారెస్ట్‌లో జీడిమామిడి తోటలను వేదికగా చేసుకుని ఈ శిబిరాలు నడుస్తున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షెడ్లలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు పెట్టుకుని రాత్రింబవళ్లు ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం. చదవండి: ప్రేమను నిరాకరించిందని.. రూ.3 లక్షలతో హత్యకు డీల్ 16 మంది అరెస్ట్ పోలీసులు జరిపిన దాడిలో 16 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వీరిపై ఎపీ గేమింగ్ యాక్ట్‌తో పాటు కోవిడ్ సందర్భంగా జిల్లాలో ఉన్న 144 సెక్షన్ ఉల్లంఘన, కోవిడ్‌ను స్ప్రెడ్ చేసే అవకాశం ఉండటంతో ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బాపిరాజు తమ్ముడు ముళ్లపూడి సత్య సురేంద్ర, ఆయన దగ్గర బంధువు ముళ్లపూడి కృష్ణమూర్తితో పాటు, కొండేపూడి నిరంజన్‌కుమార్, కోడూరి నారాయణరావు, కూచిపూడి శివరామకృష్ణ, గంటా భీమేశ్వరరావు, చింతా శ్రీకృష్ణ చైతన్య, వేగి ప్రతాప్, చుండ్రు సురేష్, బోడేపూడి శ్రీనివాస్, వక్కలపూడి సత్యనారాయణ, గుంటుముక్కల వేణు, మల్లిపూడి కృష్ణమూర్తి, చిక్కా శ్రీనివాసరావు, నాదెళ్ల శ్రీనివాస్, చుండ్రు ధర్మారావు, నాదెళ్ల సురేంద్ర ఉన్నారు. వీరి నుంచి 1,06,810 రూపాయలు, ఐదు కార్లు, పది సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. చదవండి: నాగబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
పండుగ పూట పత్తాలాట!
బిచ్కుంద(జుక్కల్): పండుగ పూట పత్తాలాట జోరందుకుంది..! ఇందుకోసం ప్రత్యేక స్థావరాలు వెలిశాయి. పండుగకు ముంద రోజు నుంచి మరుసటి రోజు వరకు రూ.లక్షల్లో నగదు చేతులు మారుతుంది.. వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ వేళ పత్తాలాట కారణంగా కొందరు అప్పుల పాలవుతున్నారు. ఈ జూదం ఆడేవారు అత్యాశకు పోయి సర్వం కోల్పోతున్నారు. దీపావళి పండగ వస్తుందంటే కొందరు ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటు చేసి, పేకాట నిర్వహిస్తున్నారు. పేకాటలో కీటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. జిల్లాలో ప్రధానంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో దీపావళికి జోరుగా పేకాట ఆడతారు. రమ్మి, త్రీ కార్డు, పరేల్, కట్పత్తా (అందర్ బహర్) ఇలా పేర్లతో జూదం ఆడుతుంటారు. గతేడాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1900 మందిని పొలీసులు అరెస్టు చేసి రూ.38,69,705 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కామారెడ్డి జిల్లాలో 250 కేసులు నమోదు కాగా, రూ.7,02,820 నగదును పట్టుకున్నారు. దీంతో ఇక్కడి పొలీసులు అంతగా పట్టించుకోరనే ధీమాతో మెదక్, కంగీ్ట, బిదర్, ఔరాద్, దెగ్లూర్, నర్సీ ప్రాంతాల నుంచి పేకాట ఆడడానికి వస్తారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా స్వస్థలాలకు వచి్చ, పేకాట స్థావరాలకు వెళ్తుంటారు. జూదంలో మొదటి రోజు పోయిన డబ్బులను తిరిగి సంపాదించుకుందామని తర్వాతి రెండ్రోజులు పేకాడుతుంటారు. ఇలా సర్వం కోల్పోయిన వారెందరో ఉన్నారు. గతేడాది పెద్దకొడప్గల్, జుక్కల్, బీర్కూర్, బిచ్కుందలో రహస్యంగా పేకాట స్ధావరాలు వెలిశాయి. రూ.లక్షల్లో పేకాట సాగింది. పొలీసులు దాడులు చేయకుండా నిర్వాహకులు జూదారులకు అన్ని వసతులు కలి్పంచారు. ఈసారి కూడా ఆయా మండలాల్లో జూదం అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు ఉన్న గ్రామాల జూదరులకు అడ్డా నిర్వాహకులు ఫోన్లు చేసి పొలీసులు దాడులు చేయరని ధీమా ఇస్తున్నట్లు సమాచారం. పంటలు విక్రయించిన డబ్బులు.. ప్రస్తుతం వరి, సోయా, పెసర, మినుము పంటలు విక్రయించిన డబ్బులు రైతుల వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేకాట స్థావరాల వైపు పోలీసులు రాకుండా చూసుకుంటామని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, పోలీసులు సైతం ఇలాంటి అడ్డాల వైపు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పేకాడితే కేసులు.. పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తాం. పేకాట ని యంత్రించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో నిరంతరం తనిఖీలు కొ నసాగుతాయి. అవసరాన్ని బట్టి ఆయా మండలాలకు ఎక్కువగా బృందాలను పం పిస్తాం. పేకాట ఆడితే గ్రామస్తులు పొలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
పేక ముక్కల్ని కత్తుల్లా..
బీజింగ్ : చేతిలో పేక ముక్కలు ఉంటే ఏం చేస్తాం?.. ఓ ఒకర్నిద్దర్ని తోడు చేసుకుని పేకాట ఆడుతాం. కానీ, చైనాకు చెందిన ఆ అబ్బాయి మాత్రం వాటితో తన ఎదుట ఉన్న వస్తువులను చీల్చి చండాడుతాడు. పేక ముక్కల్ని కత్తుల్లా వాటిలోకి దింపేస్తాడు. వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెన్ఝౌకు చెందిన వాంగ్ కాయ్ అనే 11 ఏళ్ల కుర్రాడు ‘‘ఫ్రమ్ వేగాస్ టు మకావ్’’ అనే సినిమా చూసి స్ఫూర్తి పొందాడు. అందులోలా పేక ముక్కలతో విన్యాసాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ప్రతి నిత్యం అభ్యాసం చేసి అరుదైన నైపుణ్యాన్ని సంపాదించాడు. పేక ముక్కల్ని కత్తుల్లా ఎదుట ఉన్న వస్తువుల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తున్నాడు. పుచ్చకాయ, యాపిల్, దోసకాయ వంటి వాటిలోనే కాకుండా చెక్క పలకలోకి, కోక్ టిన్నుల్లోకి సైతం వాటిని దింపేస్తున్నాడు. వాంగ్ నైపుణ్యాన్ని చిత్రీకరిస్తూ తీసిన వీడియోలు గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. -
పేక ముక్కల్ని కత్తుల్లా దింపేస్తాడు..
-
ఇళ్ల మధ్యలో గుట్టుగా..
సాక్షి, నెల్లూరు: ఇళ్ల మధ్యలో గుట్టుగా పేకాట కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి తొమ్మిది మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి జూదరుల వివరాలను వెల్లడించారు. పడారుపల్లికి చెందిన కె.వసుంధర్రెడ్డి క్రాంతినగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులను తీసుకువచ్చి పేకాట ఆడిస్తున్నాడు. వారి నుంచి ఆటకు రూ.5 వేలు వసూలు చేయసాగాడు. పేకాట కేంద్రంపై పోలీసు అధికారులకు సమాచారం అందింది. దర్గామిట్ట, చిన్నబజారు పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు ఎం.నాగేశ్వరమ్మ, ఐ.శ్రీనివాసన్‌లు తమ సిబ్బందితో కలిసి ఇంటిపై నిఘా ఉంచారు. నిందితుల్లో స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం రాత్రి పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. నిర్వాహకుడు వసుంధరరెడ్డితోపాటు పేకాట ఆడుతున్న పడారుపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి, ఏసీనగర్కి చెందిన రామలింగారెడ్డి, మినీబైపాస్‌కు చెందిన రఘు, కోటమిట్టకు చెందిన అఫ్రోజ్, ఏకేనగర్కు చెందిన నాగరాజు, బుజబుజనెల్లూరుకు చెందిన చంద్రబాబు, స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్స్ మహేష్, శ్రీహరిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,05,100 నగదు, మూడు మోటార్‌బైక్‌లు, 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిర్వాహకుడిపై గతంలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలిపారు. జూదరులను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్లతోపాటు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ ఎస్సై షేక్ జిలానీబాషా, చిన్నబజారు ఏఎస్ఐ హరి, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.ప్రసాద్, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్‌రెడ్డి, పురుషోత్తం తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. సమాచారం ఇవ్వండి ప్రజలు తమ ప్రాంతాల్లో ఏక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో చిన్నబజారు, దర్గామిట్ట ఇన్స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, మిద్దె నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అలగానిపాడు పొలాల్లో.. విడవలూరు: మండలంలోని అలగానిపాడు పొలాల్లో గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై విడవలూరు పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగబాబు మాట్లాడుతూ అలగానిపాడు పొలాల్లో వారంరోజులుగా పేకాట జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. దీంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేసినట్టుగా తెలిపారు. పోలీసుల రాకను పసిగట్టిన జూదరులు అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. అదే ప్రాంతంలో డైమండ్ డబ్బా ఆడుతున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మండలంలో జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
గార్ల: పేకాట స్థావరంపై పోలీసులు దాడులు జరిపి 15 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.23 లక్షల నగదు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఘటన మానుకోట జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామ పంచాయతీ పరిధిలోని కనకమ్మతండాలో చోటు చేసుకుంది. బయ్యారం సీఐ రమేశ్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా, ఇల్లెందు, డోర్నకల్, గార్ల మండలాలకు చెందిన వ్యక్తులు కొంతకాలంగా అడ్డాలు మారుస్తూ ఈ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. మంగళవారం గార్ల మండలం కనకమ్మతండాలోని ఓ ఇంట్లో పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న కావిటి నాగరాజు, కునారపు సురేశ్, కత్తుల నరేశ్, బానోత్ పాండుకుమార్, బొడ్ల వసంతరావు, చెరుకూరి శ్రీనివాస్, బచ్చల ఉమేశ్, వి.అంజిరావు, జి.రమేశ్, ఆకుల అర్జున్, వీరబోయిన భద్రం, కర్నేటి రామారావు, మెరుగు వెంకటేశ్వర్లు, పోటు రాములు, ఉమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,23,000 నగదు, 11 సెల్ ఫోన్లు, 5 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇల్లెందు కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది వీరబాబు, గోపాల్, రవి, రమేశ్, కిషన్‌కు మానుకోట జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి రివార్డు ప్రకటించినట్లు సీఐ పేర్కొన్నారు. -
తాడిపత్రిలో ఏం జరుగుతోంది..?
రామసుబ్బారెడ్డి వైఎస్సార్ జిల్లా కోడూరు వాసి. ఐదేళ్ల కిందట తాడిపత్రికి వచ్చి స్థిరపడిన కొంతకాలానికే పేకాటకు బానిసయ్యాడు. మిగిలిన ఆస్తులతో పాటు ఇల్లుసైతం అమ్మేసి అద్దె ఇంట్లోకి మారాడు. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. భార్య పేరుపై ఉన్న కొద్దిపాటి పొలం అమ్మడానికి సిద్ధమైతే ఆమె అంగీకరించలేదు. అప్పులోళ్ల ఒత్తిడికి తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలను గతేడాది హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు తాడిపత్రి ప్రజల జీవితాలను జూదం ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో తెలుసుకోవడానికి. సాక్షి, ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో అభివృద్ధి మాటెలా ఉన్నా జూద క్రీడకు తాడిపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు నిత్యం తాడిపత్రికి వస్తుంటారు. రోజూ లక్షల్లో ఆటలు సాగుతుంటాయి. మున్సిపాలిటీ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి ఇంట్లోనే జూదం సాగుతుంది. అనంతపురం జిల్లాలో జరిగే క్రికెట్ బెట్టింగ్ సైతం తాడిపత్రి కేంద్రంగానే నడుస్తోంది. తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహిస్తున్నదెవరో? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే విషయం పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు ఉండవు. కాదంటే తాడిపత్రిలోని ఓ పెద్దమనిషి నుంచి ఫోన్లు వస్తాయి. దారికొస్తే నెలనెలా మామూళ్లు.. లేదంటే బదిలీ బహుమానంగా ఇస్తారు. దీంతోనే ఇక్కడ వ్యసనాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. వేల కుటుంబాలు వ్యసనాలకు బానిసలైపోయారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకునేవారు.. హత్యలకు గురయ్యేవారూ ఉన్నారు. ఆస్తులు పొగొట్టుకుని, పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఈ వ్యసనాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా పోలీసుశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మట్కా అడ్డాగా తాడిపత్రి తాడిపత్రి మట్కాకు అడ్డాగా మారింది. ముంబయి నుంచి నడిచే మట్కాతో పాటు తాడిపత్రిలోని కొందరు స్వతంత్రంగా కంపెనీలు ఏర్పాటు చేసి మట్కా నడుపుతున్నారు. వీరికి అధికారపార్టీ నేతల మద్దతు ఉండటంతో తాడిపత్రిలో మట్కారాయుళ్లు బలంగా స్థిరపడిపోయారు. గతంలో రతనాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. వీటికి నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా తాడిపత్రిలోని కొందరు ప్రైవేటు వ్యక్తులు మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, రాత్రి 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. స్థానిక మట్కా నంబర్లు వీటికి గంట ముందే రిలీజ్ చేస్తారు. మట్కాలో భారీగా మోసం మట్కా రెగ్యులర్‌గా రాసేవారి పేర్లను మట్కారాయుళ్లు ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పొందుపరిచారు. ప్రాంతాల వారీగా ఈ పేర్లు విడదీస్తారు. రోజువారీ ఎవరు ఏ నంబర్‌పై పందెం కాశారో ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో పొందుపరుస్తారు. దీంతో కేంద్రాల వారీగా ఏ నంబర్లపై ఎక్కువ మంది కాశారు? ఏ నంబర్లపై తక్కువ పందెం కట్టారు? అనేది నిర్వాహకులకు క్షణాల్లో స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా తక్కువ మంది కట్టిన నంబర్లను ప్రకటిస్తున్నారు. దీంతో మట్కారాయుళ్లు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ ఊబిలో కూరుకుపోయి వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మూన్నాళ్ల ముచ్చటే మట్కా, పేకాట, బెట్టింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మంది కానిస్టేబుళ్లపై అప్పటి ఎస్పీ రాజశేఖరబాబు వేటు వేశారు. కొందరు సీఐలను కూడా డీఐజీ ప్రభాకర్‌రావు వీఆర్‌కు పంపారు. ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత 76 మంది మట్కా రాయుళ్లను తాడిపత్రి దాటించారు. అయితే రెండు నెలలకే వారంతా తిరిగి తాడిపత్రిలో మకాం వేశారు. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా ‘పెద్దలు’ జోక్యం చేసుకోవడంతో యథేచ్ఛగా పేకాట, మట్కా నడుపుతున్నారు. -
కాయ్ రాజా కాయ్
రాజు(పేరు మార్చాం). అతను రోజు వారీ కూలి. రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరు వందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో ఇంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా మూడుముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిందంతా ఇలా తగలబెట్టడం.. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం అతని నిత్యకృత్యం. రోజులు గడిచాయి. అప్పులు పెరిగాయి. తీర్చేదారి లేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సదాశివపేట(సంగారెడ్డి): కాయ్ రాజా కాయ్ కాస్తే ఉంది.. చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి మెట్లు, క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్ తిలక్ జూదం గురించి రాసిన ఓ కవిత ఇది. సదాశివపేట మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది పరిస్థితి ముక్క కలిస్తే అదృష్టం తమదే అని ఆశపడుతున్నారు కొందరు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేరులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. జూదమే వారి ధ్యాస.. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువకులు జూదానికి బానిసవుతున్నారు. కష్టపడి సంపాదించినదంతా పేకాటలో పోగోట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ ప్రాంతంలో కొందరి యువకుల జీవనశైలిగా మారింది. ముఖ్యంగ సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వాటర్ప్లాంట్లు, పంక్షన్ హాళ్లు, ఇళ్లు ఇందుకు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్నం, నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమవుతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది. నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు.. సదాశివపేట పట్టణంలోని నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోయింది. పట్టణంలోని ఫంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఇళ్లలో కొందరు రాజకీయ, మీడియా ప్రతినిధులు పేకాట ఆడుతుంటారనేది బహిరంగ రహస్యం. సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పంక్షన్ హాళ్లు, టెంట్‌హౌజ్‌లు, ఫాంహౌజ్‌లు, వాటర్ ప్లాంటుతో పాటు నివాస గృహలు, బహిరంగ ప్రదేశాల్లో చాల ప్రాంతాల్లో నిత్యం పేకాట యథేచ్ఛగా సాగుతోంది. కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు పేకాట అడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేధన వర్ణనాతీతం. కొన్ని ఇళ్లల్లో అర్థరాత్రి వరకు నిత్యం పేకాట అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు.. పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా వదిలిపెట్టం. రాజకీయ వత్తిళ్లకు తలొగ్గం. పేకాట అడుతున్న స్థవరాలను ఇప్పటికే గుర్తించాం. అదును చూసి దాడులు చేస్తాం. ప్రజలు సైతం పేకాట స్థావరాలపై సమాచారం అందించాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి -
పేకాట ఆడుతూ చిక్కిన గాజువాక సహాయ కమిషనర్
విశాఖపట్నం : జీవీఎంసీ గాజువాక జోనల్ సహాయ కమిషనర్ (రెవెన్యూ) పైడిరాజుపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక జోనల్ కార్యాలయంలోని తన చాంబర్లో గల కంప్యూటర్లో ఆయన పేకాట ఆడుతున్న వీడియోను ఒక వ్యక్తి కమిషనర్‌కు వాట్సాప్ ద్వారా పోస్టు చేశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారిని వివరణ అడిగినట్టు తెలిసింది. ఆఫీసు పని వేళల్లో పేకాట ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు వివరణ పంపించాలని ఆదేశించినట్టు జీవీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ కూడా పైడిరాజును వివరణ అడిగినట్టు తెలిసింది. అయితే తెలియని కమాండ్ నొక్కడం వల్ల ఈ గేమ్ ఓపెన్ అయిందని ఆయన జోనల్ కమిషనర్‌కు చెప్పినట్టు జోనల్ వర్గాలు పేర్కొన్నాయి. -
భర్త పేకాటలో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడని..
చిత్తూరు : చిత్తూరు నగరంలో ఒక వ్యక్తి పేకాటలో రూ.40 లక్షలు పోగొట్టాడు. ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కలత చెందిన భార్య శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. వన్‌టౌన్ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. లాలూగార్డెన్‌కు చెందిన సురేష్ (45) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుజాత (40) ఓ కొడుకు ఉన్నారు. పేకాటకు బానిసైన సురేష్ రెండేళ్లుగా తమిళనాడులోని పరదరామి వద్ద పేకాట ఆడి రూ.40 లక్షలు పోగొట్టాడు. చిత్తూరు లాలూగార్డెన్లో ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు రాయించుకున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శుక్రవారం పురుగుల తాగి మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు చిత్తూరుకు చెందిన ఏకే రవి, పీజే బాబు, సుబ్రమణ్యం, వేలూరుకు చెందిన హరినాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేకాట క్లబ్‌లపై పోలీసుల దాడులు - ప్రముఖుల అరెస్టు
-
పేకాట క్లబ్‌లపై పోలీసుల దాడులు - ప్రముఖుల అరెస్టు
సాక్షి, ఏలూరు : అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌లపై ఏలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే పక్కాసమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు జరిపారు. ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలతో డీఎస్పీ ఈశ్వర రావు ఈ దాడులు నిర్వహించారు. టీడీపీ నేతల అండదండలతో ఈపేకాట క్లబ్ సాగుతున్నట్లు సమాచారం. ఈదాడుల్లో 16 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండుగంటలపాటు తలుపులు మూసి సోదాలు సాగినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే తెలుగుదేశం నాయకుల ఒత్తిడి మేరకు ప్రముఖులను తప్పించే యత్నం జరుగుతోంది. అయితే సమాచారం అందుకున్న విలేకరులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారం అడగ్గా పోలీసులు నిరాకరించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆడిందే ఆట, చెప్పిందే చట్టం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయం పేకాట డెన్‌గా మారిందని దుయ్యబట్టారు. ఇక్కడ రోజుకు రూ. 12 కోట్ల వ్యాపారం జరుగుతోందని, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. తమకు ప్రత్యేక రాజ్యాంగం ఉందన్నట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. చంద్రబాబు సర్కారు అక్రమార్కులకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. విజయవాడ సెక్స్ రాకెట్, ఎంపీ ఇంట్లో పేకాట, దుర్గమ్మ ఆలయ భూముల కబ్జా, రోడ్ల వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చివేయడం, సదావర్తి భూములను కాజేసేందుకు ప్రయత్నం.. వీటన్నింటికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచిందని ధ్వజమెత్తారు. దౌర్జన్యాలకు దిగిన టీడీపీ నాయకులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు ఎటువంటి శిక్షలు లేవన్నారు. న్యాయం, ధర్మం తమకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అతి దుర్మార్గం ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని వాపోయారు. దళితులపై దాడుల, రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కొందరిని టీడీపీలో చేర్చుకుని అధికార పదవుల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై వాస్తవ పరిస్థితులను గ్రహించి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న దోపిడీ విధానాన్ని అరికట్టాలన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనను అంతమొందించాలని బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. -
ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం
-
పింగాణీ కాదు.. పేక ముక్కలు
సాధారణంగా చైనాలో పింగాణీ గిన్నెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న పాత్రలు మాత్రం పింగాణీవే అనుకుంటే పొరపాటే.. ఆ ఫొటోను తీక్షణంగా చూస్తే మీకే అర్థం అవుతుంది.. వీటిని పేక ముక్కలతో తయారు చేశారు. ఇది కొత్తేమీ కాదుకానీ.. మనిషి ఎత్తులో, సహజత్వం ఉట్టిపడేలా పాత్రలను తయారుచేయడం మాత్రం ఇది మొదలు. వీటి రూపకర్త 65 ఏళ్ల జాంగ్ కెహువా. ఈ పాత్రలు అచ్చం పోర్సిలిన్‌తో తయారైన పింగాణీ పాత్రల్లా కనిపించడం అతనికి మరింత పేరు తెచ్చిపెట్టింది. మేస్త్రీ అయిన వాంగ్‌కు కొన్నేళ్ల క్రితం ఒక పాప వీధిలో ప్లేయింగ్ కార్డులను చిన్నచిన్న త్రిభుజాకారంగా చుడుతోంది. అది చూసిన వాంగ్... ఆ టెక్నిక్‌ను ఉపయోగించుకుని వివిధ ఆకారాల్లో వస్తువులను ఎందుకు తయారుచేయకూడదు అని అనుకున్నాడు. దీంతో తొలిసారిగా అతనికి కలిగిన ఆ ఆలోచనతో పింగాణీ పాత్రల ఆకారాలను తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇతను చేసిన ఒక పాత్ర 106 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. అందుకు 5 వేల కార్డులు ఉపయోగించి ఒక వారం రోజుల్లో పూర్తి చేశాడు. -
జెంట్స్ బ్యూటీపార్లర్ ముసుగులో...
హైదరాబాద్: ఎస్సార్ నగర్ పరిధిలో బ్యూటీపార్లర్ పేరుతో నిర్వహిస్తున్న పేకాట స్థావరం గుట్టురట్టయింది. స్థానిక ధరంకరం రోడ్డులో ఉన్న పురుషుల బ్యూటీ పార్లర్ పై బుధవారం సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పార్లర్లో ఒక రహస్య గదిని ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నారు. పోలీసులను గమనించి ఇద్దరు పేకాట రాయుళ్లు జారుకోగా నలుగురు పట్టుబడ్డారు. వారివద్ద కొంతమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, పార్లర్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ప్రసాద్.. వాటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాడు. దీంతో అపరిచితులు, పోలీసులు ఎవరైనా లోపలికి వచ్చిన వెంటనే తెలిసిపోతుంది. -
క్లబ్‌ల మూత.. అద్దె ఇళ్ల వేట
జిల్లాలోని క్లబ్‌లలో పేకాట బంద్ నిర్వాహకుల్లో స్థావరాల కలవరం నివాస గృహాల్లో జూద శిబిరాలు రోజుకు రూ.1.50 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్న వైనం పోలీసుల దాడులకూ వెరవని జూదరులు భీమవరం: జిల్లాలోని క్లబ్‌లు మూతపడటంలో జూద నిర్వాహకులు అద్దె ఇళ్ల వేటలో పడ్డారు. దీంతో నివాస గృహాలు పేకాట స్థావరాలుగా మారుతున్నాయి. పేకాటపై పోలీసులు దాడులు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని జూదగాళ్లు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లబ్‌లు మూసివేసిన నేపథ్యంలో నివాస గృహాలు, రెస్ట్‌హౌస్‌ల్లో పేకాట ఆడుకునేందుకు రోజుకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 15 వరకు అనుమతి పొందిన క్లబ్‌లు జిల్లాలో భీమవరం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నారాయణపురం తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అనుమతి పొందిన రిక్రియేషన్ క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల బెట్టింగ్‌లు లేకుండా పేకాట ఆడుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. అలాగే క్లబ్‌ల్లో వివిధ రకాల స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు. కొన్ని క్లబ్‌ల్లో డైరెక్ట్‌గా నగదు పెట్టి పేకాట ఆడకపోయినా క్వాయిన్స్ను ఉపయోగించి బెట్టింగ్‌లు నిర్వహించి అనంతరం సాయంత్రం క్లబ్‌లు మూసివేసే సమయంలో కౌంటర్ నుంచి సొమ్ములు తీసుకుని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. క్లబ్‌ల్లో పేకాట వంటి జూదంతోపాటు మద్యం సేవించడం సర్వసాధారణమైంది. కొత్త ఎస్పీ రాకతో పేకాట బంద్ జిల్లా ఎస్పీగా రవిప్రకాష్ గతనెలలో బాధ్యతలు స్వీకరించప్పటి నుంచి క్లబ్‌ల్లో పేకాట బంద్ అయింది. దీంతో అర్ధరాత్రి వరకు తెరచి ఉంచే క్లబ్‌లు రాత్రి 8 గంటలకే మూతపడుతున్నాయి. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జూద శిబిరాలపై దాడులు చేసి లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకోవడమేగాక పేకాటరాయుళ్లును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీనిలో భాగంగానే భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కొమరాడ గ్రామంలో పేకాట శిబిరంపై దాడిచేసి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం, ఏలూరులో రెవెన్యూ అధికారులను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారడంతో క్లబ్‌ల నిర్వహకులు తాత్కాలికంగా క్లబ్బుల్లో పేకాట నిలిపివేశారు. ఎలాగైనా ఎస్పీని ప్రసన్నం చేసుకుని గతంలో మాదిరిగా క్లబ్‌ల్లో పేకాటలు నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో అద్దె చెల్లింపు క్లబ్‌ల్లో పేకాట కార్యకలాపాలు నిలిచిపోవడంతో కొందరు నిర్వాహకులు పట్టణాలు, గ్రామాల్లో సైతం విశాలమైన భవనాలను అద్దెకు తీసుకుని పేకాట స్థావరాలుగా మారుస్తున్నారు. భీమవరం వంటి పట్టణంలో ఇల్లు లేదా రెస్ట్హౌస్లకు రోజుకు అద్దె రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుండటంతో అద్దె చెల్లించడానికి వెనుకంజ వేయడం లేదని సమాచారం. రహస్యంగా నిర్వహించే ఇటువంటి స్థావరాల నిర్వహణపై పోలీసు సిబ్బంది ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారులు, డాక్టర్లు వంటి ఉన్నత వర్గాల వారు పేకాట శిబిరాలను తెరవెనుక నుంచి నడిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్పీ రవిప్రకాష్ ఇటువంటి స్థావరాల నిర్వహణపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
యునైటెడ్ క్లబ్‌పై పోలీసులు దాడి
– 49 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ – రూ.1,57,020 నగదు స్వాధీనం కర్నూలు: జిల్లా కోర్టు ఎదుటనున్న యునైటెడ్ క్లబ్‌పై పోలీసులు దాడి చేసి 49 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,57,020 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్లో పేకాట జరుగుతున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు అందడంతో శనివారం సాయంత్రం ఆయన పర్యవేక్షణలో సీఐలు నాగరాజరావు, నాగరాజు యాదవ్, కృష్ణయ్య, ఎస్ఐలు తిరుపాలు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డి, మల్లికార్జున నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. నిబంధనల ప్రకారం వారి దగ్గర ఉన్న డబ్బును కౌంటర్లో డిపాజిట్ చేసి టోకెన్లతో మాత్రమే ఆట కొనసాగించాలి. అయితే సభ్యులు కాని వారు కూడా క్లబ్లో కూర్చొని పెద్ద ఎత్తున టేబుళ్లపై నగదు పెట్టి పేకాట సాగిస్తున్నట్లు గుర్తించారు. పేకాటరాయుళ్లు రాచమల్లు జోగిరెడ్డి, అయ్యన్న, నాగరాజు, శేషగిరి రావు, నారాయణమూర్తి, వెంకటేష్, మహేశ్వరరెడ్డి, నాగరాజుతో పాటు మరో 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సివిల్ పోలీసులు, కొంతమంది ఎక్సైజ్ పోలీసులు తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. 49 మందిని స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
పేకాట ఆడుతున్న 30 మంది అరెస్టు
కడప క్రైం: కడప వన్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక కడప డీఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎసైలు నాగరాజు, రాజేశ్వరరెడ్డి, అమరనాధరెడ్డి, కుల్లాయప్ప, సిబ్బంది దాడి చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన పై వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు ఆఫీసర్స్ క్లబ్‌పై దాడి చేశామని, ఇందులో 30 మంది పేకాడుతుండగా పట్టుకుని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.51,830 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ నిర్వహకులు మాత్రం తమకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని ఆ మేరకే రిక్రియేషన్ కోసం 13 ముక్కల ఆటను ఆడుకుంటున్నామని తెలిపారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ హార్డ్ డిస్కలను సీజ్ చేశారు. ఈ సమయంలో క్లబ్ సభ్యులైన టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్ పోలీసులతో చర్చించేందుకు అక్కడికి వచ్చారు. -
పేకాటాడుతున్న ఆరుగురి అరెస్ట్
కొమరోలు: పేకాటశిబిరంపై దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కొమరోలు మండలం అయ్యవారిపాలెంలో పేకాట శిబిరంపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో రూ. 71 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
‘బావర్చి’ లో పేకాట.. హోటల్ సీజ్!
హయాత్‌నగర్: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రహస్యంగా పేకాట ఆడుతూ జల్సా చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లలోని హయత్‌నగర్‌లో ఉన్న ‘బావర్చి’ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గురువారం రట్టు చేశారు. పేకాట ఆడుతున్న 16మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ. 2.37 లక్షల నగదుతో పాటు 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ’బావర్చి’ హోటల్లో రహస్యంగా పేకాట తంతు కొనసాగుతోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గుట్టును రట్టు చేసినట్టు తెలుస్తోంది. పేకాట బాగోతం నేపథ్యంలో ’బావర్చి’ హోటల్‌ను సీజ్ చేయాలని పోలీసులు రెవెన్యూ అధికారులకు నివేదించారు. -
జూదం శిబిరంపై పోలీసుల దాడి
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూదం శిబిరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో దాడి జరిపారు. ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 9 సెల్ఫోన్లు, రూ.33,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
9 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా పాలకొండ పేకాట స్థావరంపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. గోపాలపురం గ్రామంలోని నాగవల్లి నదీ తీరంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, 3 ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
పేకాట వివాదంతో యువకుడి దారుణ హత్య
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. పొందూరు మండలం ఖాజీపేట శివార్లలోని మామిడితోటలో ఆటోడ్రైవర్ అన్యపు రమేష్(26)ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి హత్యచేశారు. గత కొంతకాలంగా పరిసర గ్రామాల్లో పేకాట జోరుగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి రమేష్ ఇక్కడ మరికొందరితో కలసి పేకాట ఆడినట్లు తెలుస్తుంది. పేకాట వివాదమే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తలపై, చెవి భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రమేష్ మృతిచెందాడు. సోమవారం ఉదయం మామిడి తోటలో శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’
ఏలూరులో బరితెగించిన తెలుగు తమ్ముళ్లు ముక్కలాట రూ. కోటిపైనే ఏలూరు : అక్కడో... ఇక్కడో... ఎక్కడో ఎందుకు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుడి ఇంట్లోనే పేకాట ఆడుకుంటే పోలీస్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడదు. ఇదే ప్లాన్‌ను ఏలూరులో పక్కాగా అమలు చేయాలని టీడీపీ నేతలు, బడాబాబులు భావించారు. బడా పేకాటరాయుళ్లు అనుకున్నదే తడవుగా నగరంలోని ఓ సీనియర్ టీడీపీ నేత వీరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నగర నడిబొడ్డున ఉన్న తన ఇంట్లోనే విచ్చలవిడిగా పేకాట ఆడుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఊరికే కాదండోయ్.. ఇందుకు రోజుకు రూ.50 వేలు చెల్లించుకోండని ఓ రేటు కూడా నిర్ణయించారు. నగరంలో ఇంకెక్కడ పేకాట ఆడినా పోలీసులకు ఎంతోకొంత మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆ మొత్తమే సదరు నేతకు ఇచ్చుకుంటే ‘ఫుల్ సెక్యూరిటీ’ అని భావించిన పేకాటరాయుళ్లు ఆ డీల్‌కు ఒప్పుకుని ఎంచక్కా పేకాటలో మునిగితేలుతున్నారు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఏలూరు నగర నడిబొడ్డున కొద్దినెలలుగా ఓ టీడీపీ నేత ఇంట్లో పేకాట దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు, ఆర్ఆర్ పేటలోని ఓ వస్త్ర దుకాణం యజమాని, ఏలూరులో ప్రభుత్వాసుపత్రికి చెందిన ఓ కాంట్రాక్టర్, మాదేపల్లికి చెందిన చేపల చెరువుల యజమాని, కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ఓ ఆరుగురు బడా వ్యాపారవేత్తలు.. ఇలా 20నుంచి 25మంది వరకు ‘బిగ్ షాట్స్’ ఆ నేత ఇంట్లో నిత్యం పేకాటలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవనంపై ప్రత్యేకంగా ఓ పోర్షన్‌ను సదరు ప్రజా ప్రతినిధి ఈ జూదానికి కేటాయించినట్టు సమాచారం. ‘ఆడుకోండి.. నేను చూసుకుంటా’ ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ఇంట్లో పేకాట ఆడుకున్నందుకు గాను రోజుకు రూ.అర లక్ష చొప్పున ఇస్తున్న పేకాటరాయుళ్లు ఇటీవల కాలంలో రూ.కోటి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యన కొందరు ఆటగాళ్లు.. వామ్మో కోటి ఇచ్చామా అని లెక్క వేసుకుని కొద్దిరోజులు అక్కడ ‘ఆట’ ఎత్తేశారట. దాంతో సదరు నేత ఫోన్‌చేసి ‘ఏమిటి రావడం లేదు. రూ.50 వేలు ఎక్కువనుకుంటే.. రూ.40 వేలు ఇవ్వండి. అదీకాదంటే రూ.30 వేలు ఇచ్చి ఆడుకోండి’ అని ‘డిస్కౌంట్’ ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో అక్కడ జూదక్రీడ మళ్లీ జోరుగా సాగుతోందని అంటున్నారు. ముందుగా రూ.15 లక్షల వరకు కోత ఆట (కోసాట), ఆ తర్వాతే ఓకులాట ఆడతారని, మొత్తంగా రోజుకు రూ.కోటిపైనే చేతులు మారతాయని సమాచారం. ఆ టీడీపీ నేత ఊళ్లో ఉన్నా లేకున్నా ఆట మాత్రం నిర్విరామంగా కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్టు చెబుతు న్నారు. వాస్తవానికి ఇక్కడ పెద్దమొత్తంలో పేకాట నడుస్తోందనే విషయం నగరంలోని కొంతమంది పోలీసులకు తెలిసినా దాడులు చేసే సాహసం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొలాలు, కాలువ గట్లపై పేకాట ఆడే వాళ్లను కాళ్లు చేతులు విరిగేట్టు చితకబాదే పోలీసులు నగరంలో నడిబొడ్డున రూ.కోట్లలో విచ్చలవిడిగా సాగుతున్న పేకాట శిబిరంవైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల రిమాండ్
కందుకూరు (రంగారెడ్డి) : ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని నేదునూరు గ్రామ శివార్లలో శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,220 స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. -
పేకాడుతున్న ఏడుగురు మహిళల అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వివిధ జిల్లాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం విశేషం. కర్నూలు: కర్నూలు జిల్లాలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓబుళాచారి రోడ్డులో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. పాండురంగస్వామి గుడి సమీపంలో పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.15,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం: ఏడుగురు మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండడం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. పట్టుబడిన వారి నుంచి నగదు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట స్థావరాలపై దాడి:16 మంది అరెస్ట్
-
అవుటర్ పక్కనే పేకాట.. ఆరుగురి అరెస్ట్
ఆదిభట్ల (రంగారెడ్డి): పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను మంగళవారం సాయంత్రం ఆదిభట్ల పోలీసులు ఆరెస్టు చెశారు. సీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇబ్రహీంపట్నం మండలం బోంగ్లూర్ అవుటర్‌రింగ్ రోడ్డు పక్కనే పేకాట ఆడుతున్నారు. ప్రేటోలింగ్ చేస్తున్న పోలీసుల కంట పడడంతో ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3,400 నగదు, ఆరు సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
పేకాడుతూ పట్టుబడ్డ ఎంపీపీ, కానిస్టేబుల్
కామేపల్లి: బాధ్యతాయుతంగా ఉండాల్సిన మండలాధ్యక్షుడు ఓ కానిస్టేబుల్‌తో కలిసి పేకాట ఆడుతూ అడ్డంగా పట్టుబడ్డాడు. కామేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్నట్టు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న కామేపల్లి ఎంపీపీ మాలోతు సరిరాం నాయక్, స్పెషల్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ భరద్వాజ శివకుమార్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. -
జూదగృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి: 10 మంది అరెస్ట్
అబిడ్స్(హైదరాబాద్): ఓ జూదగృహంపై నగర వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 11 మందిని అరెస్టుచేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పంజాగుట్ట అమృత విల్లే అపార్ట్మెంట్స్లోని ప్లాట్ నంబర్ 62లో కొన్ని రోజులుగా జూదం(త్రీ కార్డ్స్ గ్యాబ్లింగ్) ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 65 వేల నగదు, 13 సెల్ఫోన్లను స్వాధీన పర్చుకున్నారు. జూదగృహం నిర్వహిస్తున్న బిట్ట మురళీకృష్ణ (43)తో పాటు మరో పదిమందిని అరెస్టు చేశారు. అరెస్ట్‌చేసిన 11 మందితో పాటు నగదును, సెల్ఫోన్లను కేసు దర్యాప్తు చేసేందుకు పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ ఎల్. రాజవెంకట్‌రెడ్డి, ఎసై ్సలు జలంధర్‌రెడ్డి, వెంకటేశ్వర్గౌడ్లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పేకాడుతున్న13మంది మహిళల అరెస్ట్
-
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నర్సరావుపేట (గుంటూరు జిల్లా): పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 18మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని లలితానగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. లలితానగర్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో గుంటూరు ప్రత్యేక పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో టీడీపీ నేతలున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట క్లబ్‌పై దాడి : 25 మంది టీడీపీ నేతల అరెస్ట్
చిత్తూరు: అధికార టీడీపీ వర్గానికి చెందిన కొందరు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో జరిగింది. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోగల మండీ క్లబ్‌పై గురువారం సాయంత్రం వన్ టౌన్ సీఐ నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 25మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పేకాడుతూ పట్టుపడ్డ సినీనటి
పేకాడుతూ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం రాత్రి వనస్థలిపురం పరిధిలోని జహంగీర్‌కాలనీలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓ అపార్ట్మెంట్లో పేకాడుతున్న సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణితోపాటు 11మందిని అరెస్ట్‌చేశారు. కాగా పోలీసుల్ని చూసి జూదగాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా, వారిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. పేకాట స్థావరంలో రూ. 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా తనను కావాలనే ఇరికించారని కల్యాణి వాపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు 52 మంది అరెస్టు దొరికిన వారిలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు రూ. 12 లక్షలు, 60 సెల్ఫోన్లు స్వాధీనం కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే పీఏ పర్యవేక్షణలో వ్యవహారం! హైదరాబాద్: ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట వ్యసనాలు రాజ్యమేలుతున్నాయి.. ఎమ్మెల్యేలు నివాసముండే చోట విచ్చలవిడి ‘వ్యవహారాలు’ సాగిపోతున్నాయి. ఇప్పటికే ‘మందు’ బాబులకు అడ్డాగా మారిం దనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... తాజాగా పేకాట కేంద్రంగా మారింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి చేసిన ఆకస్మిక దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రిక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కింద మూసివేసింది. దీంతో ఈ జూదానికి అలవాటు పడినవారు కొత్త కొత్త అడ్డాలను వెతుక్కుంటున్నారు. కొందరైతే ఏకంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్లలో పేకాట ఆడుతున్న 52 మందిని పట్టుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఫర్నిచర్‌ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, కేశవరెడ్డి అనే వ్యక్తుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో... పేకాట నడిపిస్తున్నారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు. -
25 మంది ప్రముఖుల అరెస్ట్
హైదరాబాద్/ఒంగోలు: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ బాలాపూర్ లో పేకాట స్థావరాలపై బుధవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మంది ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోనూ పేకాటరాయుళ్ల పని పట్టారు పోలీసులు. ముండ్లమూయ మండలం ఉల్లగల్లు గ్రామ శివారులో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 11,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలంలోనూ 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. -
పేకాట అడ్డా గుటురట్టు
-
పేకాడుతూ దొరికిన మౌంట్ ఒపెరా ఎండీ
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో పేకాటస్థావరంపై సైబరాబాద్ ఎన్వోటీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ముగ్గురు మహిళల సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో మౌంట్ ఒపెరా ఎండీ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారని అని పోలీసులు తెలిపారు. -
పేకాటరాయుళ్ల ఆట కట్టు
హైదరాబాద్/కొవ్వూరు: పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. సోమవారం పలుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 8 వేల నగదు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాట ఆడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే
కరీంనగర్: పేకాట ఆడుతూ ఓ మాజీ ఎమ్మెల్యే పోలీసులకు దొరికిపోయారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి శివారులో పేకాట స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే బండి పులయ్య సహా ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 19,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లో పేకాట క్లబ్బులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మూయించారు. పేకాట క్లబ్బులను తెరిపించేందుకు నిర్వాహకులు ఎంత ఒత్తితెచ్చినా ఆయన వెనకడుగు వేయడం లేదు. -
51 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
మెదక్: మెదక్ జిల్లా తుప్రాన్లోని ఓ ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి... 51 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లతోపాటు రూ. 65 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తుప్రాన్‌లో పేకాట రాయుళ్ల ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తరచుగా పలు నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. -
యథేచ్ఛగా పేకాట ఆడేసుకుంటున్నారిలా..!
-
కాయ్ రాజా.. కాయ్..
* ప్రవేశం ఇలా.. *పేకాట ఆడాలనకునే వ్యక్తి ముందుగా రూ.2వేలు చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంది. *ఎంత డబ్బుతో ఆడగలడో దానికి సంబంధించి టోకెన్‌ను తీసుకుని టేబుల్‌పై కూర్చుని ఆడాలి. *ఆటలో గెలిచిన వ్యక్తి తన వద్ద ఉన్న టోకెన్లు గుడివాడ ఆటోనగర్‌లోని 5వ నంబరు రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఇచ్చి ఆ మేరకు సొమ్ము తీసుకోవాల్సి ఉంటుంది. గుడివాడ అర్బన్ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి జూదరులు తరలివస్తున్నారు. రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఈ జూద శిబిరాలు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరైనా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరోవైపు కొందరు పోలీసులు కూడా ముడుపులు పుచ్చుకుని జూద శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడ ఆడుతున్నారంటే.. పట్టణ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఏకకాలంలో కాకుండా ప్రతి రోజు ప్రాంతాలు మారుస్తూ ఉంటారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జూదరులకు తెలియజేస్తూ పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపాన ఓ ప్రైవేటు కార్యాలయం, మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న కాలువగట్టుపై ఓ బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్నారు. బొమ్ములూరు గోదాముల వద్ద, పామర్రు రోడ్డులోని రైల్వేగేటు సమీపంలోని ఓ ఐరన్ దుకాణం వద్ద, రామనపూడి నుంచి నూజెళ్లకు వెళ్లే రోడ్డులో కాలువగట్టుపై పాకలో, ఇదే రోడ్డులో రొయ్యిల చెరువు వద్ద జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ రెండు పోలీసు స్టేషన్లకు సరిహద్దులో ఉండటం వల్లే వాటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఫోన్ చేసి పేకాట గురించి సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదు.. అంటూ బదులిస్తున్నారు. చివరికి ఏ స్టేషన్ వారు వెళ్లాలని నిర్ణయించుకునేలోపు జూదరులు జారుకుంటున్నారు. సూత్రధారి అధికార పార్టీ నేత! గతంలో పేకాట క్లబ్బులు నడిపిన అనుభవం ఉన్న టీడీపీ నాయకుడు ఒకరు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తన చేతికి పని చెప్పారు. కొందరు పోలీసులకు మామూళ్లు రుచిచూపి తన దందాను కొనసాగిస్తున్నాడు. దాదాపు 120మందికిపైగా ఈ ఆటలో పాల్గొంటారని తెలుస్తుంది. పేకాట ఆడే ప్రదేశాన్ని ముందుగానే ఫోన్ ద్వారా జూదరులకు సమాచారం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10గంటల వరకు 13ముక్కల ఆట, రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3గంటల వరకు లోనా-బయటా(కోసు)లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల్లో కోవర్టులు పేకాట ఆడుతున్నారనే సమాచారాన్ని ఇటీవల ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేశాడు. ఆ సమాచారం జూద శిబిరాల నిర్వాహకుడికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి అందింది. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డారు. గత శుక్రవారం గుడ్లవల్లేరు శ్మశానవాటిక, గుడివాడ మార్కెట్ యార్డుల వద్ద జూదశిబిరాలపై పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుని, అతి తక్కువ లభించినట్లు వెల్లడించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుడిపై కేసులు లేకుండా చేసేందుకు గాను రూ.40వేలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వ్యక్తి గతంలో జూద శిబిరాలు నిర్వహిస్తుండగా అప్పటి ఎస్పీ జయలక్ష్మి తీవ్రంగా హెచ్చరించడంతో కొంతకాలం జూదక్రీడకు తెరపడింది. -
ఆఫీస్‌నే క్లబ్‌గా మర్చిన అధికారులు
-
పేకాట ఆడుతూ దొరికిపోయిన ఓ పార్టీ నేత
హైదరాబాద్: బాలానగర్ జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై చేస్తున్న దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న కండ్లకోయలోని గోదాములో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసిన ఘటన మరువక ముందే తాజాగా బుధవారం దేవరయాంజాల్‌లో ఓ ఫామ్ హౌస్‌లో కొంపల్లికి చెందిన ఓ పార్టీ నేత ఆదిరెడ్డి మోహన్‌రెడ్డి, మేడ్చల్‌కు చెందిన రామిరెడ్డి, జగన్ రెడ్డిలతో పాటు మరికొంత మంది పేకాట ఆడుతున్న విషయం జోనల్ టాస్క్‌ఫోర్స్ బృందానికి సమాచారం అందింది. దీంతో బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ సీఐ ప్రవీందర్‌రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. అప్పటికే పోలీసులు రాకను గమనించిన కొంతమంది పరారు కాగా మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, జగన్‌రెడ్డిలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 26 వేల నగదు, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌కు తీసుకువచ్చిన ఆ ముగ్గురినీ పలువురు పత్రికా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండంటూ పోలీసుల ముందే వారు అనడం గమనార్హం. -
ప్రాణం తీసిన పేకాట!
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఓ గని కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపేశారు. పేకాట ఆడే సమయంలో డబ్బుల విషయమై తలెత్తిన గొడవ హత్యకు దారి తీసి ఉండొచ్చని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు, రూరల్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హుస్సేన్(26) స్థానికంగా ఉన్న ఓ నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బుధవారం హుస్సేన్ తండ్రి బషీర్మియా అతడి ఆచూకీ కోసం గాలించసాగాడు. ఈ క్రమంలో కొడుకు తరచూ జూదం ఆడే గ్రామ శివారులోని ఓ గది వద్దకు వెళ్లాడు. సమీపంలోని ఓ గుంతలో బండరాళ్ల కింద ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. హతుడి దుస్తుల ఆధారంగా అతడు తన కుమారుడు హుస్సేనేనని బషీర్మియా గుర్తించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలంలో పెద్దఎత్తున గుమిగూడారు. రూరల్ సీఐ రవి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హుస్సేన్ కుడి కన్ను, కణత, తల భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. బండరాళ్లతో మోదిన ఆనవాళ్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సమీపంలోని ఓ గదిలో పేక ముక్కలు, మద్యం సీసాలు పడిఉన్నాయి. పోలీసులు హైదరాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్ ను రప్పించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి గ్రామంలోని భవానీనగర్‌లోని ఓ కిరాణం దుకాణం వద్దకు, అక్కడి నుంచి సంగెంకాలన్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వడిచర్ల మొగులప్ప హోటల్ వరకు వెళ్లి ఆగింది. వికారాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. హతుడి తండ్రి బషీర్ మియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. తల్లికి అనారోగ్యం.. తండ్రి అనంతలోకాలకు హతుడు హుస్సేన్‌కు భార్య బిస్మిల్లా, కూతురు ఇసాత్(7), కుమారుడు, పాష(2) ఉన్నారు. అనారోగ్యంతో బిస్మిల్లా కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు నాయనమ్మ మొగులన్బీ వద్ద ఉంటున్నారు. తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవడం, తండ్రి హత్యకు గురవడంతో పిల్లలు అనాథలయ్యారు. హుస్సేన్ మృతితో తల్లిదండ్రులు, పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.