రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ బాలాపూర్ లో పేకాట స్థావరాలపై బుధవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.
హైదరాబాద్/ఒంగోలు: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ బాలాపూర్ లో పేకాట స్థావరాలపై బుధవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మంది ప్రముఖులు ఉన్నట్టు సమాచారం.
ప్రకాశం జిల్లాలోనూ పేకాటరాయుళ్ల పని పట్టారు పోలీసులు. ముండ్లమూయ మండలం ఉల్లగల్లు గ్రామ శివారులో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 11,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలంలోనూ 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు.