కందుకూరు (రంగారెడ్డి) : ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని నేదునూరు గ్రామ శివార్లలో శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,220 స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు.