పండుగ పూట పత్తాలాట!  | Cases on Card Players: Kamareddy SP | Sakshi
Sakshi News home page

పండుగ పూట పత్తాలాట! 

Published Sun, Oct 27 2019 10:24 AM | Last Updated on Sun, Oct 27 2019 10:25 AM

Cases on Card Players: Kamareddy SP - Sakshi

బిచ్కుంద(జుక్కల్‌): పండుగ పూట పత్తాలాట జోరందుకుంది..! ఇందుకోసం ప్రత్యేక స్థావరాలు వెలిశాయి. పండుగకు ముంద రోజు నుంచి మరుసటి రోజు వరకు రూ.లక్షల్లో నగదు చేతులు మారుతుంది.. వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ వేళ పత్తాలాట కారణంగా కొందరు అప్పుల పాలవుతున్నారు. ఈ జూదం ఆడేవారు అత్యాశకు పోయి సర్వం కోల్పోతున్నారు. దీపావళి పండగ వస్తుందంటే కొందరు ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటు చేసి, పేకాట నిర్వహిస్తున్నారు. పేకాటలో కీటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. జిల్లాలో ప్రధానంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్‌గల్, పిట్లం, బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో దీపావళికి జోరుగా పేకాట ఆడతారు. రమ్మి, త్రీ కార్డు, పరేల్, కట్‌పత్తా (అందర్‌ బహర్‌) ఇలా పేర్లతో జూదం ఆడుతుంటారు.

గతేడాది ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 1900 మందిని పొలీసులు అరెస్టు చేసి రూ.38,69,705 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కామారెడ్డి జిల్లాలో 250 కేసులు నమోదు కాగా, రూ.7,02,820 నగదును పట్టుకున్నారు. దీంతో ఇక్కడి పొలీసులు అంతగా పట్టించుకోరనే ధీమాతో మెదక్, కంగీ్ట, బిదర్, ఔరాద్, దెగ్లూర్, నర్సీ ప్రాంతాల నుంచి పేకాట ఆడడానికి వస్తారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా స్వస్థలాలకు వచి్చ, పేకాట స్థావరాలకు వెళ్తుంటారు. జూదంలో మొదటి రోజు పోయిన డబ్బులను తిరిగి సంపాదించుకుందామని తర్వాతి రెండ్రోజులు పేకాడుతుంటారు. ఇలా సర్వం కోల్పోయిన వారెందరో ఉన్నారు.  

గతేడాది పెద్దకొడప్‌గల్, జుక్కల్, బీర్కూర్, బిచ్కుందలో రహస్యంగా పేకాట స్ధావరాలు వెలిశాయి. రూ.లక్షల్లో పేకాట సాగింది. పొలీసులు దాడులు చేయకుండా నిర్వాహకులు జూదారులకు అన్ని వసతులు కలి్పంచారు. ఈసారి కూడా ఆయా మండలాల్లో జూదం అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. జుక్కల్‌ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులు ఉన్న గ్రామాల జూదరులకు అడ్డా నిర్వాహకులు ఫోన్లు చేసి పొలీసులు దాడులు చేయరని ధీమా ఇస్తున్నట్లు సమాచారం. 

పంటలు విక్రయించిన డబ్బులు.. 
ప్రస్తుతం వరి, సోయా, పెసర, మినుము పంటలు విక్రయించిన డబ్బులు రైతుల వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేకాట స్థావరాల వైపు పోలీసులు రాకుండా చూసుకుంటామని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, పోలీసులు సైతం ఇలాంటి అడ్డాల వైపు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. 

పేకాడితే కేసులు.. 
పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తాం. పేకాట ని యంత్రించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో నిరంతరం తనిఖీలు కొ నసాగుతాయి. అవసరాన్ని బట్టి ఆయా మండలాలకు ఎక్కువగా బృందాలను పం పిస్తాం. పేకాట ఆడితే గ్రామస్తులు పొలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.  –  శ్వేత, కామారెడ్డి ఎస్పీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement