
మంచిర్యాల క్రైం: చిత్రంలో చూస్తుంటే.. పోలీసులు ఏదో అవగాహన కల్పిస్తున్నట్టు.. దానికి వీరంతా హాజరైనట్టు ఉంది కదూ..! కానీ, వీరంతా పేకాట ఆడుతూ పట్టుబడితే పోలీసులు ఇదిగో ఇలా వరుసగా కూర్చోబెట్టి వివరాలు ఆరా తీశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు కొన్ని రోజులుగా పేకాట స్థావరాలపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో తాండూర్ పోలీస్‌స్టేషన్ పరిధి రేపల్లెవాడ అటవీ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా.. 57 మంది అంతర్‌జిల్లా పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వారి నుంచి 6 లక్షల రూపాయల నగదు, 18 కార్లు, 63 సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు రామగుండం సీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment