పేకాట వివాదంతో యువకుడి దారుణ హత్య | Youth killed over dispute while playing cards | Sakshi
Sakshi News home page

పేకాట వివాదంతో యువకుడి దారుణ హత్య

Published Mon, Jan 11 2016 4:21 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

Youth killed over dispute while playing cards

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. పొందూరు మండలం ఖాజీపేట శివార్లలోని మామిడితోటలో ఆటోడ్రైవర్ అన్యపు రమేష్(26)ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి హత్యచేశారు.

గత కొంతకాలంగా పరిసర గ్రామాల్లో పేకాట జోరుగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి రమేష్ ఇక్కడ మరికొందరితో కలసి పేకాట ఆడినట్లు తెలుస్తుంది. పేకాట వివాదమే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తలపై, చెవి భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రమేష్ మృతిచెందాడు. సోమవారం ఉదయం మామిడి తోటలో శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement