యునైటెడ్‌ క్లబ్‌పై పోలీసులు దాడి | police attacks on united club | Sakshi
Sakshi News home page

యునైటెడ్‌ క్లబ్‌పై పోలీసులు దాడి

Published Sat, Jun 3 2017 10:58 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

police attacks on united club

– 49 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్‌ 
– రూ.1,57,020 నగదు స్వాధీనం
 
కర్నూలు: జిల్లా కోర్టు ఎదుటనున్న యునైటెడ్‌ క్లబ్‌పై పోలీసులు దాడి చేసి 49 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,57,020 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్‌లో పేకాట జరుగుతున్నట్లు కర్నూలు డీఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు అందడంతో శనివారం సాయంత్రం ఆయన పర్యవేక్షణలో సీఐలు నాగరాజరావు, నాగరాజు యాదవ్, కృష్ణయ్య, ఎస్‌ఐలు తిరుపాలు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌ కిషోర్‌ రెడ్డి, మల్లికార్జున నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. నిబంధనల ప్రకారం వారి దగ్గర ఉన్న డబ్బును కౌంటర్‌లో డిపాజిట్‌ చేసి టోకెన్లతో మాత్రమే ఆట కొనసాగించాలి. అయితే సభ్యులు కాని వారు కూడా క్లబ్‌లో కూర్చొని పెద్ద ఎత్తున టేబుళ్లపై నగదు పెట్టి పేకాట సాగిస్తున్నట్లు గుర్తించారు. పేకాటరాయుళ్లు రాచమల్లు జోగిరెడ్డి, అయ్యన్న, నాగరాజు, శేషగిరి రావు, నారాయణమూర్తి, వెంకటేష్, మహేశ్వరరెడ్డి, నాగరాజుతో పాటు మరో 41 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సివిల్‌ పోలీసులు, కొంతమంది ఎక్సైజ్‌ పోలీసులు తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. 49 మందిని స్టేషన్‌కు తీసుకొచ్చి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement