
చిత్తూరు : చిత్తూరు నగరంలో ఒక వ్యక్తి పేకాటలో రూ.40 లక్షలు పోగొట్టాడు. ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కలత చెందిన భార్య శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. వన్‌టౌన్ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. లాలూగార్డెన్‌కు చెందిన సురేష్ (45) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుజాత (40) ఓ కొడుకు ఉన్నారు. పేకాటకు బానిసైన సురేష్ రెండేళ్లుగా తమిళనాడులోని పరదరామి వద్ద పేకాట ఆడి రూ.40 లక్షలు పోగొట్టాడు.
చిత్తూరు లాలూగార్డెన్‌లో ఉన్న ఇంటిని సైతం అప్పుల వారు రాయించుకున్నారు. ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుజాత శుక్రవారం పురుగుల తాగి మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు చిత్తూరుకు చెందిన ఏకే రవి, పీజే బాబు, సుబ్రమణ్యం, వేలూరుకు చెందిన హరినాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment