పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ జంట. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె జీవితం పూర్తి నిరాసక్తతతో కూడిన చీకటి ఆవరించింది. కనీసం పిల్లలైన కలిగిన వారిలో తన భర్తను చూసుకునేదాన్ని కదా! అన్న బాధ ఆమెను తొలిచేసింది. మరోవైపు భర్త దూరమయ్యాక అత్తింటి వారెవ్వరూ ఆమెను చేరదీయలేదు. ఒంటరి జీవితం వెళ్లదీస్తున్న ఆమెకు తన భర్త ఉండగా పిల్లల కోసం తాము ఎంచుకున్న ఐవీఎఫ్ పద్ధతి గుర్తుకొచ్చింది. దీంతో తామప్పుడూ సంప్రదించి వైద్యులను సంప్రదించి తల్లి అయ్యి తన కోరికను నెరవేర్చుకుంది. పైగా ఆమె కారణంగా వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది.
బెంగాల్‌లోని బీర్భూమ్‌కి చెందిన సంగీతా కేశారి, ఆమె భర్త అరుణ్ ప్రసాద్ కేశారి రెండేళ్లుగా గర్భం దాల్చడంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరిగా వారు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 2021లో భర్త స్పెర్మ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేయడం జరిగింది. అయితే అంతలోనే ఆమె భర్త కరోనా మహమ్మారికి బలైయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైన పిల్లలను కనాలి తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనపాలనలో గడపాలని గట్టిగా కోరుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పిల్లల్లో తన భర్తను చూసుకోవాలని ఆరాటపడింది.
ఎందుకంటే..? ఆమె భర్త దూరమయ్యాక కనీసం అత్తింటి వారు ఆమెను చేరదీయలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటిరిగానే జీవితం కొనసాగిస్తోంది. తన భర్త నడిపే కిరాణ దుకాణాన్ని ఆమె నడుపుతూ జీవిస్తోంది. సరిగ్గా అప్పడే తన భర్త ఉండగా సంప్రదించిన ఆస్పత్రి గుర్తుకొచ్చింది. అక్కడ భర్త స్పెర్మ్ దాచిన సంగతి జ్ఞప్తికి వచ్చి పిల్లలను కనడం సాధ్యమవుతుందా? తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా? అని ఆ ఆస్పత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
అయితే ఆ మహిళకు 48 ఏళ్లు పిల్లలను కనగలిగే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ పద్ధతి కాస్త రిస్క్ అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆమె సంకల్పానికి తగ్గట్టుగానే ఆ పద్ధతి విజయవంతమై పూర్తి ఆరోగ్యంతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు వైద్యుడు పలాష్ దాస్ మాట్లాడుతూ..ఆ మహిళ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యిందని అన్నారు. ఆమె పిల్లలను కనే వయసు ముగిసే సమయానికి ఆమె శుక్రకణాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. ఇక్కడ ఆమె తల్లి కావాలనే తాప్రత్రయంతో కనడం అనేది ఆమెకు రిస్క్ అయినా లెక్కచేయకుండా డేర్ చేసిన తీరు ప్రశంసంచదగ్గ విషయమని అన్నారు. నిజంగా ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిదేనని అన్నారు.
(చదవండి: మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!)
Comments
Please login to add a commentAdd a comment