జెంట్స్‌ బ్యూటీపార్లర్‌ ముసుగులో... | Four held for playing cards inside gents beauty parlour | Sakshi
Sakshi News home page

జెంట్స్‌ బ్యూటీపార్లర్‌ ముసుగులో...

Published Wed, Jul 26 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

జెంట్స్‌ బ్యూటీపార్లర్‌ ముసుగులో...

జెంట్స్‌ బ్యూటీపార్లర్‌ ముసుగులో...

హైదరాబాద్‌: ఎస్సార్‌ నగర్‌ పరిధిలో బ్యూటీపార్లర్‌ పేరుతో నిర్వహిస్తున్న పేకాట స్థావరం గుట్టురట్టయింది. స్థానిక ధరంకరం రోడ్డులో ఉన్న పురుషుల బ్యూటీ పార్లర్ పై బుధవారం సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పార్లర్‌లో ఒక రహస్య గదిని ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నారు.

పోలీసులను గమనించి ఇద్దరు పేకాట రాయుళ్లు జారుకోగా నలుగురు పట్టుబడ్డారు. వారివద్ద కొంతమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, పార్లర్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ప్రసాద్‌.. వాటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేశాడు. దీంతో అపరిచితులు, పోలీసులు ఎవరైనా లోపలికి వచ్చిన వెంటనే తెలిసిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement