చిత్తూరు జిల్లాలోని బైపాస్ రోడ్డులోగల మండీ క్లబ్‌పై గురువారం సాయంత్రం వన్ టౌన్ సీఐ నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.
చిత్తూరు: అధికార టీడీపీ వర్గానికి చెందిన కొందరు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో జరిగింది. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోగల మండీ క్లబ్‌పై గురువారం సాయంత్రం వన్ టౌన్ సీఐ నిరంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 25మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.