
జూదం శిబిరంపై పోలీసుల దాడి
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూదం శిబిరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో దాడి జరిపారు.
ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 9 సెల్‌ఫోన్లు, రూ.33,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి పోలీస్స్టేషన్‌కు తరలించారు.