ten members
-
ఎన్ఐఏ కస్టడీకి పీఎఫ్ఐ సభ్యులు
సాక్షి, చెన్నై: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఐసిస్‌కు అనుకూలంగా, దేశంలో మైనారిటీ పాలనే లక్ష్యంగా పీఎఫ్ఐ సాగిస్తున్న ప్రయత్నాలపై అనుమానంతో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి తమిళనాడుకు చెందిన 10 మంది సహా దేశ వ్యాప్తంగా 106 మందిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా చెన్నై, మదురై, దిండుగల్, తేనిలకు చెందిన అయిదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. -
జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు
చంచల్‌గూడ: ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన పేరుతో విధ్వంసం సృష్టించిన కేసులో ఆందోళనకారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్ యోగేష్, బమన్ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్ తుకారామ్ ఉన్నారు. కారుతో మైనర్ బాలుడి బీభత్సం సైదాబాద్: మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..బుధవారం సాయంత్రం చంపాపేట రహదారిపై చింతల్‌బస్తీకి వెళ్లే రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అలాగే ముందుకు వెళుతూ అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయాడు. ఆ సమయంలో అక్క డ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. (చదవండి: తూటా రూట్ మారెన్) -
కరోనా ‘ఆట’ మొదలైంది!
ఐపీఎల్ భారత్‌లో లేట్ అయినా... యూఏఈలో లేటెస్ట్గా మొదలవుతుందిలే అనుకుంటే మాయదారి మహమ్మారే అక్కడా మొదలైంది. మూడు సార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ మెడకు కోవిడ్ చుట్టుకుంది. జట్టు బృందంలో భాగమైన పది మందికి కరోనా సోకింది. సీఎస్కే టీమ్‌నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా... వీరిలో పేసర్ దీపక్ చహర్ ఉన్నట్లు సమాచారం. లీగ్ ప్రారంభానికి తగినంత సమయం ఉన్నా... తొలిసారి లీగ్‌కు చెందిన క్రికెటర్ కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. మున్ముందు ఇది ఎంత వరకు వెళుతుందనే ఆందోళన కూడా కనిపిస్తోంది. అబుదాబీ: చెన్నై సూపర్‌కింగ్స్‌ను మహమ్మారి చుట్టేసింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో... ఇక ప్రాక్టీస్, మైదానంలో మెరుపులే తరువాయి అనుకుంటున్న దశలో... ఇక్కడి యూఏఈ వర్గాలు, భారత్‌లోని బీసీసీఐ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేసే పిడుగు వచ్చి పడింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్ చహర్‌కు కరోనా సోకడం లీగ్‌కు ముప్పు లేకపోయినా కాస్త ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఆటగాళ్ల క్వారంటైన్ రోజుల్ని పెంచారు. చెన్నై కోవిడ్ కేసులపై బయటకు తెలిసిపోయినా... సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. గురువారం పరీక్షా ఫలితాలు వచ్చినా మిన్నకుండిపోయింది. ఎంతమందికి వైరస్ సోకింది.... ఎవరా సభ్యులు అనే విషయాలేవీ తెలపకుండా తాత్సారం చేసింది. దీంతో అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియలేదు. అయితే ఇక్కడి వర్గాల సమాచారం మేరకు 10 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులున్నట్లు తెలిసింది. ఒకరు ఆటగాడైతే మిగతావారంతా జట్టు సహాయ సభ్యులేనని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో బాధితులున్నప్పటికీ ఆటగాడు ఒక్కడే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఈ 10 మంది ఇంకెంత మందికి అంటించారోననే బెంగ బీసీసీఐని ఆందోళన పరుస్తోంది. చెన్నై ఫ్రాంచైజీ ఇప్పుడు ప్రాక్టీస్‌కు కాకుండా హోటల్ గదులకే పూర్తిగా పరిమితం కానుంది. ధోని సహా ఆటగాళ్లంతా సెప్టెంబర్ మొదటి వారంలోనే నెట్స్‌కు వెళ్లే అవకాశముంది. లీగ్ 19న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కిం కర్తవ్యం? ఐపీఎల్ టోర్నీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) ప్రకారం పాజిటివ్ బాధితులంతా వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలి. అలాగే వాళ్లతో కాంటాక్టు అయిన వ్యక్తుల్ని గుర్తించి వారిని కూడా క్వారంటైన్లో ఉంచాలి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో ఉన్న వారిని బయో సెక్యూర్ (జీవ రక్షణ బుడగ) నుంచి రెండు వారాల పాటు వెలుపలే వుంచి చికిత్స అందజేస్తారు. ఈ సమయంలో మిగతా ఆటగాళ్లను, ఐపీఎల్, ఫ్రాంచైజీ వర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవరాదు. లక్షణాలున్న బాధితుల్ని టోర్నమెంట్ అనుబంధ ఆసుపత్రికి తరలిస్తారు. ఇక లక్షణాలు లేకపోయినా సరే ప్రాక్టీస్‌కు అనుమతించరు. 14 రోజుల పాటు పూర్తిగా గదులకే పరిమితం కావాలి. ఈ ఐసోలేషన్ సమయం పూర్తయ్యాక రెండు సార్లు వరుస పరీక్షల్లో అది కూడా పీసీఆర్ టెస్టుల్లోనే (ర్యాపిడ్ కిట్ టెస్టు కాకుండా) నెగెటివ్ రిపోర్ట్ రావాలి. అప్పుడే బుడగ లోపలికి తీసుకుంటారు. ఇక ఎవరికి వారే.. తాజా ఉదంతంతో బీసీసీఐ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఐసోలేషన్‌లో ఉన్నవారెవరూ ఒకరితో ఒకరు మాట్లాడేందుకు కూడా ఇక మీదట అనుమతించరు. కాంటాక్టు అయ్యేవారి వివరాల్ని పక్కగా నిక్షిప్తం చేస్తారు. దీంతో మహమ్మారి బారిన పడిన వారి కాంటాక్టు వ్యక్తుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించే అవకాశముంటుంది. రిస్కు రేటు తగ్గించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కృషి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ అధికారగణం నిర్ణయించుకుంది. -
చెట్టును ఢీకొన్న డీసీఎం
చేగుంట: పెళ్లి విందుకు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన సంఘటనలో 10 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బాగిర్తిపలికి చెందిన ఎర్రగుంట మల్లేశం కూతురు వివాహం గురువారం జరిగింది. శుక్రవారం వధువు బంధువులు వరుడి గ్రామమైన తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో విందుకు డీసీఎం వ్యాన్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో జప్తిశివునూర్ శివారులోకి రాగానే వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎర్రగుంట మల్లేశంతో పాటు లక్ష్మి, బక్క మల్లేశం, రాజన్నగారి శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలు కావడంతో వారిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. -
పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
మహబూబాబాద్ : క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈనెల 9న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ‘రాష్ట్రపతి ఎట్ హోం’ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వా తంత్య్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణ రా ష్ట్రానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం లభించిందని అఖిల భారత స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగు రమేష్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమో దీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారన్నా రు. జిల్లా నుంచి రాయపర్తి యాదగిరి, మ హంకాళ బాల పాపిరెడ్డి, బీరి అడవ య్య, జక్కని వెంకటయ్య, ఖమ్మం జిల్లా నుం చి కొమ్మినేని రంగారావు, అయితం వెంకటేశ్వ ర్లు, కరీంనగర్ జిల్లా నుంచి కళ్లెం నారాయణ, పోతు ఆదిరెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి బాచి పల్లి రామకృష్ణారావు, బండ పుల్లారెడ్డిలు స న్మానం పొందినట్లు పేర్కొన్నారు. -
జూదం శిబిరంపై పోలీసుల దాడి
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూదం శిబిరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో దాడి జరిపారు. ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 9 సెల్ఫోన్లు, రూ.33,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ప్రాణంమీదికి తెచ్చిన కారు డ్రైవింగ్